Month: May 2022

జోక్ – కాలాలు 

జోక్ - కాలాలు    భార్య : భూత, భవిష్యత్, వర్తమాన కాలాలంటె..? భర్త : భూత కాలం అంటే జరిగిపోయిన కాలం. నా ముందు నీవున్నావనుకో మన గొడవలు భూతం లాగా కనిపిస్తాయి. భవిష్యత్ కాలం అంటే జరగబోయేకాలం. ఇక ముందేం జరగపోతోందో తెలిసిపోతుంది. వర్తమానం కాలం. జరుగుతున్నకాలం. అందుకే ఇప్పుడేం జరుగుతుందో అని భయపడ్తున్నాను. - రమణ బొమ్మకంటి 
Read More

మా బాల్యం

మా బాల్యం మా బాల్యం, కౌమార్యాలు అయోమయంగా గడిచిపోయాయి. తుంటరి ఇంటరు వయసు దాటి మొత్తానికి కాస్తంత నిబద్ధతకు ఆలవాలమైన మెడికల్ కాలేజీలో అడుగుపెట్టాం. కొత్తగా రెక్కలొచ్చిన ఉత్సాహంలో ఉన్నాం మేమంతా...! యవ్వనం నవ్వుతోంది అందరిలోనూ. గోరువెచ్చని ఊసులు చెప్పుకుంటూ, ఆకుపచ్చని ఆశలు చిగుర్చుకుంటూ అందరం నునులేత మావిళ్లలా మిసమిసలాడుతున్నాం. అంతవరకూ ప్రౌఢల్లా, మా బయోకెమిస్ట్రీ మేడమ్‌లా మరీ మనోహరంగా కనబడిన వేటూరి పాటల్లో పదాలన్నీ మాకు వాటిపై గౌరవాన్నే కలిగించాయి. అందుకని చర్చలకందని పదాల్ని పక్కనబడేసి, మిర్చీల్లాంటి పాదాలనే రుచి చూసేవాళ్లం. అప్పుడు జరిగిందది... మాకు సైతం చేతనైన పదాలతో, సినిమా పాటకి సీమంతం చెయ్యడానికి ఒకాయనొచ్చాడని తెలిసింది. గుడిగోపురాల మీద నర్తకీమణుల మూర్తుల్ని ‘రాళ్లే జవరాళ్లై నాట్యాలాడతాయిక్కడ’ అంటూ వింతగా వర్ణించాడు. అంతవరకూ చిక్కటి మేఘం అలుముకున్న ప్రతిసారీ ఏ పిడుగు పడుతుందోనని భయపడే మాకు ‘కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడం’టూ దేవుణ్ణి నిందాస్తుతి…
Read More

నిఖత్ జరీన్ ఎవరు?

నిఖత్ జరీన్ ఎవరు? నిఖత్ జరీన్ ఎవరు? మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారతదేశానికి చెందిన నిఖత్ జరీన్ స్వర్ణాన్ని అందుకుంది, ఆమె వయస్సు, వృత్తి, కుటుంబ వృత్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిఖత్ జరీన్ జీవిత చరిత్ర: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి చెందిన నిఖత్ జరీన్ 52 కిలోల కేటగిరీ లో బంగారు పతకం సాధించింది. గురువారం టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ఫ్లైవెయిట్ బౌట్‌లో నిఖత్ థాయ్‌లాండ్‌కు చెందిన జిట్‌పాంగ్ జుటామాస్‌ను ఓడించారు. ఈ అద్భుతమైన విజయం తర్వాత, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్ మరియు లేఖా కెసిల తర్వాత నిఖత్ ఐదవ భారతీయ మహిళల ప్రత్యర్థిగా నిలిచారు. మేము నిఖత్ జరీన్ జీవిత చరిత్ర: ప్రారంభ జీవితం, వయస్సు మరియు నేపథ్యం నిఖత్ జూన్ 14, 1996 న తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించారు. ఆమె వయస్సు 25…
Read More

తీరని కోరిక

తీరని కోరిక జీవితమైదానంలో అలుపెరుగని ఆటలో ఆశ, కోరిక, అనే రెండు పదాల పందెంలో సృష్టి కర్త జగన్నాటకం లోప్రతిమనిషికి తీరని కోరికలు వుంటావని అనుకుందాము. అవి మనిషిప్రయత్నపూర్వకంగా సాధించుకునేవికొన్నిఅయితే సాధనకానివికొన్నిఉంటాయి "జీవితంలో ఒకేఒక్క సారి చేయాలనుకున్నాచెయ్యలేని ప్రయత్నించినా కానివి కొన్ని" వయస్సుతెచ్చేమార్పులు సమయం సందర్భం లేకపోవడము కొన్ని నేర్చు కోవాలి అనే ఉత్సాహం లేక కాలం ఒడిలో కనుమరుగు అవ్వడం. అమెరికా అధ్యక్షుడు బైడ న్ కి ట్రైన్ లో వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని వుండే నట కాని భద్రత వల్ల కుదరదు . పురాణాల్లో కథ ప్రకారం దేవుడు వరం అడిగి తే నాకు అష్ట ఐశ్వర్యాలు కావాలని అడిగాడట ఒక మనిషి అదిఅనుభవించాక కొన్నాళ్ళకు అన్ని వున్నాయి కాని తృప్తి లేదు అన్నాడట చివరకు ఏమికావాలో కోరుకో అంటే ఏమివద్దు దేవుడా తృప్తి నివ్వుచాలుఅన్నాడట కొందరికి తీరని కోరికలు చాలా విచిత్రంగావుంటాయి కొందరికిసాధారణంగా వుంటాయి కాని…
Read More

మా ధ్యేయం!

మా ధ్యేయం!   హయ్! నేను చీకటి. నేనంటే మీకు భయం. వెలుగంటే నాకు భయం. నా సంచారం రాత్రి. దానిసంచారం పగలు. సూర్యుడు నా విరోధి. చంద్రుడు సూర్యుని స్నేహితుడే. కానీ నాకు అంత విరోధి కాడు.                 అమావాస్యనాడు అయిపు లేకుండా పోతాడు. పౌర్ణమికి చల్లటి పార్టీ ఇస్తాడు.               మా ఇద్దరి స్నేహం మీకు. చల్లటి బ్లాక్ కాఫీ అనుభూతి.                                                వెలుగుకి నాకు చుక్కెదురు. దాని పరిధి దాటితేనే నాకు ఉపాధి. అయినా మేము ప్రాణ స్నేహితులం. చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటాం. మీరు చేసిన దీపాలు కొన్ని నాలో వెలిగిస్తారు.దానికి నాకు పోట్లాట పెడుతూ ఉంటారు. కొంతదూరం అవి నన్ను తరిమికొడతాయి . అయినా   మీమీద ప్రేమతో నేను మౌనంగా ఉంటా. మీ కనురెప్పలు నాకు ముసుగులు. మీరు రెప్పలు మూస్తే నేనే.              నాలో వెలుగు ఉంది. కా‌‍‌ని దానిలో నేను లేను. ఇది మా ఇద్దరికీ తెలుసు. పైకి…
Read More

ఓటమి- గెలుపు

ఓటమి- గెలుపు నీ గమ్యానికి చేరువలో ఓటమి ఎదురైతే... ఓర్పును కోల్పోయి నిరాశా పడుతున్నవా...?? లేదా సమయం నీకు ముందరున్న విజయాన్ని పొందుటకు...? రాదా కాలం నీవైపు ఎక్కడో ఉన్న గమ్యం చూపుటకు..! ఇబ్బందులు, ఇక్కట్లు ఉన్నాయని .. గడిచే సమయం ఆగిపోయినట్లు, ఉన్నచోటే ఉండి చూస్తున్నావా...? దైర్యాన్ని కూడబెట్టి , నరాలు బిగించి సత్తువ చూపించి ఎదుర్కొ వచ్చే అవరోధాల్ని ఉన్నత ఆశయంతో...  దేబ్బలేవో తగిలయని దిగులు పడితే ఎలా... ? దైర్యం తో ముందుకెళితే ముందుండేది ఔషదమే.. ఆగి ఆగి గమనించు అడ్డుకట్టలు ఉండే ఉంటాయ్.. ఆలోచనతో ముందుకెళితే అవే నీకు ఆనకట్టలు ... ఆశయం తో ఉన్నప్పుడు ఆవేశ పడమాకు..! సూక్ష్మదృష్టితో చూడు చిన్న గా ఉన్న సుడిగుండాలను...! వేసే అడుగుకి, చుసే చూపుకి ,నీలో ప్రవహించే రక్తానికి ఒకటే చెప్పుకో... ఓటమే నీ గమ్యానికి మార్గం అని విజయానికి కారణం అని...   - కుమార్…
Read More

జోక్ – మతి మరపు

జోక్ - మతి మరపు భర్త : నీ మతి మరపుతో ఛస్తున్నా! నా బుర్ర తింటున్నావు. భార్య : మతిమరపు బుర్ర తింటే మతి మరపు రాకేం చేస్తుంది మరి!   - రమణ బొమ్మకంటి
Read More

అనుభవాలు

అనుభవాలు కొందరికి అనుభవాలు నిర్ణయాలు జ్ఞాపకాలు లక్ష్యాలు వృత్తి పరమైనవి వ్యక్తిగతమైన వి సాధించే వి స్వస్థలాలు కుటుంబం ప్రకృతిలో చూడదగ్గవి మనుషులతో పంచుకునేవి అంకితం చేసే పనులు ఎందరో మహానుభావులు కూడా తీరని కోరికలతో వెళ్లి పోతున్నారు. కలలాగా మిగలకుండా విసుగు లేకుండా ప్రయత్నం మదిలో తీరని కోరికలు గా వున్నా తీరే కోరికలు కోరడం మిన్న అవే అపురూపంగా మార్చుకొని మనసారా జీవించాలి అందరు. - జి జయ
Read More

ఓటు – నీవెటు

ఓటు - నీవెటు మానవుడు వేసే అతి పవిత్రమైన ఓటు.. అరాచక రాజకీయాలకు వేయాలి వేటు.. నిరంకుశ పాలకులకు అది పేదవాని కాటు.. అప్రజాస్వామ్యానికది సాధారణ మానవుని బల్లెం పోటు.. క్షణికావేశంలో, అస్పస్టతతో వేసే ఓటు.. కుల మత వర్గ స్వార్ధాలతో వేసే ఓటు.. మద్యం మత్తులో, ధన దాహంలో వేసే ఓటు.. వేయునా. మన బ్రతుకు గండికి మాటు.. అది తీర్చునా సమస్యల పరిష్కారాల లోటు.. అందుకే..ఆలోచించు రవ్వంతపాటు.. మంచి నాయకుణ్ణి చేయండీ ఈ సమ సమాజానికి సామ్రాట్టు.. అందుకనే అందరం వేయాలి ఓటు.. మన కలల తీరేట్టు.. భావి భారతం బాగు పడేటట్టు.. - కిరీటి పుత్ర రామకూరి
Read More

సాయి చరితము

సాయి చరితము పల్లవి నీ సేవయే మా భాగ్యము నీ చరితము మాకు అండ నిను కొలిచే భాగ్యము నిరతమూ ఇయ్యవయ్య లోకాలను గెలిచేటి శక్తివయ్య నీవు పాపాలను కడిగేటి భుక్తినివ్వు మాకు చరణం సకల జీవులందు ప్రేమ పంచుతావు ప్రేమతో మాకేమో దారిచూపుతావు అల్పులమూ మేమయ్యా మన్నించు సాయి నీ బాట నడవలేని లేమి బాధనున్నాము చరణం గురువుబాట మరచినచో బాగుపడడు ఎవ్వడు ఈ సత్యము తెలుపుటకు లీలలెన్నో చూపితివి మాన్యుడు సామాన్యుడు అన్న భేదమసలె లేదు అందరొకటె దైవానికి అన్నమాట నీదయ్యా చరణం ఆపదలో మేముంటే తోడు మాకు నీవయ్యా నీ నామస్మరణతో కలతలన్ని తీరిపోవు దేహచింత వదిలి మేము దైవబాట సాగేందుకు ధైర్యమివ్వు సాయి మావెంటవుండవోయి - సి. యస్. రాంబాబు
Read More