Month: May 2022

మానసిక తత్వం!!

మానసిక తత్వం!! నీ బానిసను, దొరా, నీ బానిసను అయ్యా.... ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. తెలంగాణ పరిభాషలో ఈ వ్యక్తాన్ని నీ బాంచన్ దొర, నీ బాంచన్ అయ్యా అంటారు. ఈ మాటల్ని ఉచ్చరించే వ్యక్తి, దీన్ని ఒక సమ్మోహనాస్త్రం గా ఉపయోగిస్తాడు. యజమానిని కూలీ డబ్బులు అడగడానికో, లేదా కొంత మొత్తం అప్పుగా అడగడానికో, లేదా తన స్థాయిని మించి ఏదైనా అవసరాన్ని కోరడానికో, నీ బాంచన్ దొరా అనడం అందరి అనుభవంలో వినే ఉంటారు. బానిసత్వాన్ని ఈ కోణం నుంచి చూస్తే, దాని పరిధి చాలా సంకుచితం అవుతుంది. నీ బాంచన్ అయ్యా అని ఉచ్చరించే జనాలు, ఎక్కువ శాతం నిరక్షరాస్యతతో, పేదరికంతో బాధపడుతూ ఉంటారు. ఈ పదాన్ని వీరికే పరిమితం చేస్తే పరిధి మరి సంకుచితమే........! బానిసత్వం అనేది ఒక మానసిక తత్వం. దీన్ని ఈ కోణం నుంచి ఆలోచిస్తే దీని పరిధి…
Read More

ఆకలని కేకేస్తే

ఆకలని కేకేస్తే ఆకలని కేకేస్తే అమ్మ అనినే అరుస్తే ఆ అరుపులో నా ఆకలి ఆర్తనాదం శివయ్య ఢమరుకంలా తాండవిస్తే ప్రతి ధ్వనిస్తే ప్రజ్వలిస్తే బోరున విలపిస్తే అమ్మ అమ్మా అంటూ శోక సంద్రంలో మునిగితే రామయ్య విరిచిన శివధనుస్సులా భారతంలో కర్ణుడు రథచక్రంలా నొప్పిగా డొక్కలు వంగి ఎండి విరిగి కూలి కుమిలి ఏడుస్తుంటే...? కిర్రు కర్రు మంటూ సర సర విలవిలలాడుతుంటే పరిగెడుతుంటే ఆకలి పరుగులు తీస్తుంటే..? సద్ది మెతుకుల బిక్షాటన శకుని సేకరణల ఒక బిడ్డ కడుపు నింపడానికై తీర్చిదిద్దడానికి ఎదగడానికి ఓ తల్లి ఆరాట ప్రయత్నం వీధికేక్కితే....? ఓ అపరాత్రి పరిమళించిన ఆ యవ్వన అనాధ తల్లి ఆకలి స్వరగానం ఆలాపన చేస్తూ.. బ్రతుకు పోరుకై బజార్ కెళ్తే చేరదీశారు చెరిపివేసారు కొన్ని వేల మంది కౌరవులకు వెల కట్టించి వేశ్యగా దాసిగా అవసరాలు తీర్చే అంగడి వస్తువుగా మార్చేశారు....? మరి ఏ రాత్రి పుట్టకో…
Read More

పంచాంగము 15.05.2022

పంచాంగము 15.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - శుక్ల పక్షం* తిధి : *చతుర్ధశి* ఉ11.56 తదుపరి పౌర్ణమి వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *స్వాతి* మ3.11 తదుపరి విశాఖ యోగం: *వ్యతీపాతం* ఉ9.26 తదుపరి వరీయాన్ కరణం: *వణిజ* ఉ11.56 వరకు తదుపరి *విష్ఠి* రా11.02 వరకు వర్జ్యం: *రా8.32 - 10.03* దుర్ముహూర్తం : *సా4.36 - 5.27* అమృతకాలం: *ఉ6.40 - 8.13* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *తుల* సూర్యోదయం: *5.32* సూర్యాస్తమయం: *6.19* *శ్రీకూర్మ జయంతి* *వృషభ సంక్రమణం* ఉ9.08 నుండి సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

పంచాంగం

🕉️ పంచాంగము 🌗 14.05.2022 విక్రమ సంవత్సరం: 2079 రాక్షస శక సంవత్సరం: 1944 శుభకృత్ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: వసంత మాసం: వైశాఖ పక్షం: శుక్ల-శుద్ద తిథి: త్రయోదశి ప.01:49 వరకు తదుపరి చతుర్దశి వారం- శనివారం-మంధవాసరే నక్షత్రం: చిత్ర సా.04:22 వరకు తదుపరి స్వాతి యోగం: సిధ్ధి ప‌.12:58 వరకు తదుపరి వ్యతీపాత కరణం: తైతిల ప‌.01:49 వరకు తదుపరి గరజ‌ రా.01: 34 వరకు తదుపరి వణిజ‌ వర్జ్యం: రా.09:48 - 11:21 వరకు దుర్ముహూర్తం: ఉ.05:44 - 07:21 రాహు కాలం: ఉ‌.08:58 - 10:35 గుళిక కాలం: ఉ‌.05:44 - 07:21 యమ గండం: ప.01:49 - 03:26 అభిజిత్: 11:47 - 12:37 సూర్యోదయం: 05:44 సూర్యాస్తమయం: 06:40 చంద్రోదయం: సా.04:56 చంద్రాస్తమయం: రా.తె.04:09: సూర్య సంచార రాశి: మేషం చంద్ర సంచార రాశి: కన్య దిశ శూల: తూర్పు చంద్ర నివాసం:…
Read More

వలసకూలీలు

వలసకూలీలు ఆటవెలదులు 1) ఉన్న ఊరిలోన ఉద్యోగమేలేక     వలస బాటపట్టి వచ్చినారు     కన్నవారినివిడి కానని దూరాల     బుక్కెడన్నమునకు బుగ్గి యగుచు 2) బతుకు తెరువు మిగుల భారమై తలకెక్క     శాంతి గూర్చు సంతు చంకనెక్కె     నడవరాని కొడుకు నడిచె చేయందించ     భర్త మోసె మిగత భారమంత 3) చేసినంత పనికి చేయిచ్చి యజమాని     మమ్ము బుజ్జగించి మాయజేసె     మరలవచ్చినపుడు మరవకిచ్చెదనని     సగము జీతమిచ్చి సాగనంపె 4) భోజనమ్ము కరువు భుజముపైన బరువు      గమనమాగదాయె గడియయైన      కాళ్ళు కందిపోయె గమ్యము కనరాదు      వలస జీవి బతుకు వంచనాయె 5) చెప్పులు తెగిపోయె చెమటలు ధారలై      కాళ్ళు బొబ్బలెక్కి కదలవాయె     నోరుయెండిపోయె ఊరు చేరువగాదు…
Read More

వలస కూలీలు

వలస కూలీలు పనులపరుగులాటతో పల్లె వొదిలి పరుగు తీసే సాగిపోయే నిత్య శ్రామీకు లే వలస కూలీలు? కూటికోసం కూలి చేస్తూ నగరాల చాటున చితికిన బతుకులు వలసకూలీలు ఉపాధి అవకాశాలను ఎక్కడా అని రెక్కల కష్టం నమ్ముకొని బతుకుతున్న భారజీవులు వలస కూలీలు చిత్ర విచిత్రాల సీమలో భాష తెలియని వేషమైనా ఫ్యాక్టరీల పొగలలో పోరు పడుతూ పోరాటమే చేస్తున్నది వలస కూలీలు గుంతలు పూడ్చినా మార్గాలే కాని జీవితపు రహదారి లేని జీవితాలు వలస కూలీలు బండలెత్తి బరువు లెత్తి కండ కరిగిన సాములైన వెతల జీవుల కథలు మారని మనుషులే వలస కూలీలు కాలం కలిసిరాక కరువు పీడించిన ఆకలి కడుపుల కేకలు సొంతవూరు దాటిన అభాగ్యులు వలస కూలీలు నడకేనమ్ముకొనిపట్టువదలని విక్రమార్కుడిలా అలసి సొలసి కన్నీటి వ్యధల గాలి మేడల చూపులు వారే వలస కూలీలు తల్లడిల్లిన ప్రాణమైన తనవారికోసం తపన వదలక భానిసత్వపు బాధ…
Read More

పరాయీకరణ

పరాయీకరణ చెమటను చిందించిన చేతులు భవనాన్ని నిర్మిస్తే బతుకుపోరంటావు ఔటర్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేసి మేధోమధనమంటావు అనాదిగా కష్టించే కార్మికులు ఈ దేశంలో సెకండ్, థర్డ్ దాటి కిందకు వెళితే కనిపించే క్లాస్ కు చెందుతారు వారు ఆశ్చర్యం పడాల్సిందేమీలేదు సామూహికంగా అలవాటుచేసుకున్న సానుభూతి చాటున విసుగు వినయాన్ని ప్రదర్శిస్తోంది వారిని తలుచుకో ఒక్కసారి... పునాదులు తీస్తారు ఇటుకపై ఇటుక పేరుస్తారు అంతస్తుపై అంతస్తుకట్టి తథాస్తు దేవతల్లా దీవిస్తారు ఓటుబ్యాంకు కాదు కాబట్టి మరో మజిలీకి మారిపోతుంటారు అద్దె గర్భాన్ని మోసిన తల్లుల్లా కన్నీటితో వీడ్కోలు పలుకుతారా పోనీ జ్ఞాపకాలను కన్నీటిని చేస్తారా గాంభీర్యం అన్నింటిని కప్పేస్తుంది ఆకలితోసహా... ప్రజలూ గొప్పవారే కట్టినవాడు హక్కుదారుడు కాదు హుష్ కాకి అంటే మరో చోటును వెతుక్కుంటూ అలుపెరగని బాటసారిలా సాగిపోతాడు అన్న నిజం తెలిసినవారు కదా ఆకాశంలో పొడిచిన చుక్కలాంటి హర్మ్యమే కావాలి వ్యాపార మర్మం తెలిసిన బలవంతుడిదే కదా విజయమని…
Read More

పంచాంగము 12.05.2022

పంచాంగము 12.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - శుక్ల పక్షం* తిధి : *ఏకాదశి* మ3.11 తదుపరి ద్వాదశి వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *ఉత్తర* సా4.21 తదుపరి హస్త యోగం: *హర్షణం* మ3.07 తదుపరి వజ్రం కరణం: *భద్ర* మ3.11 వరకు తదుపరి *బవ* రా2.52 వరకు వర్జ్యం: *రా12.46 - 2.22* దుర్ముహూర్తం : *ఉ9.48 - 10.39* & *మ2.54 - 3.45* అమృతకాలం: *ఉ8.59 - 10.37* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *5.32* సూర్యాస్తమయం: *6.19*  *అన్నవరం శీ సత్యదేవ కళ్యాణం* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

పోరాటం

పోరాటం బ్రతకడం కోసం పోరాటం విరామం లేని జీవితం శ్రమని నమ్ముకుని బ్రతికే కర్షకులు ఋతువులతో పనిలేని వీరులు... కష్టాలకి ఓదార్పు కరువు సంతోషం అనేదే లేదు.. కుటుంబం కొరకు కూలి ఎప్పుడూ ఏదో ఒక పని గుండెల్లో రోజూ ప్రళయం దిక్కు లేదు, ఉన్నదోకటే కష్టం పని ఉంటే భుక్తి లేకుంటే పస్తు అయినా వాళ్ళు గుర్తుకొస్తే కన్నీళ్లు తప్పదు వాళ్ల కోసం ఈ పాటులు సంపాదన చూసి సంతోషం ఏదో సాధించాను అనే గర్వం ఇంత అత్యంత దౌర్భ్యాగ్యపు స్తితి లో మనిషి మనుగడ సాగుతున్నా చూస్తూ విధి అనుకుంటున్నాం ప్రభుత్వ పథకాల కరువు ఇలాంటి సామాన్య కూలీలకి పెద్ద బరువు... ఎప్పటికీ మారునో ఈ వైనం... - కుమార్ రాజా
Read More

సాయి చరితము

సాయి చరితము పల్లవి దర్శనమీయవ సాయి మనసును శుభ్రము చేయగ దర్శనమీయవ సాయి జీవిత పాఠము నేర్పగ దర్శనమీయవ సాయి ఈ జగతిని మార్చివేయగ చరణం కలలెన్నో కంటామయ్యా అవి తీరక దుఃఖం కలిగితే చిరునవ్వును కానుకచేసి విజయాన్నే మాకుచూపి ధైర్యాన్నే తోడుగ నిలిపి బాటంతా మల్లెలు పరిచి నిరాశల వెన్ను విరిచి మము నడిపే గురువువు నీవు చరణం నీవైపే అడుగే వేస్తే భయమంతా తొలగగ మేము అభయాన్నే పొందుతాము అనుకున్నది సాధించేందుకు మావెంటే నీవు ఉంటావు మా తనువు మనసు నీది నీ నామము ప్రాణము మాకు నిన్నే నమ్మిన మాకు నీ చరితము మార్గము చూపు - సి.యస్.రాంబాబు
Read More