Month: July 2022

పదహారు – నూరు

పదహారు - నూరు వెనక్కి చూస్తే పదహారు ముందుకు చూస్తే నూరు కళ్ళముందు రంగుల ప్రపంచం భవిష్యత్తుపై ఎంతో ఆశ వర్తమానంలో తెలియని ఆవేశం గమ్యం,ఎన్నో ఊహల దూరం రక రకాల రంగుల మార్గాలు ప్రకృతి నేర్పే శారీరక భాషలు ఏవేవో తెలియని ఊహలు జీవిత భాగస్వాముల వెతుక్కొనే తపన తనకాళ్ళ మీద నిలబడే ఆలోచన, చదువు,సంపాదన,ముందుచూపు ఆలోచన,ఎన్నో కోర్కెలు ఎందరో మిత్రులు కట్టు బాట్లు సమాజం ఎన్నెన్నో కట్టిపడేసే చూపులు, భావాలు అన్నిటిని అధిగమించి ప్రపంచమంతా భాగస్వామే అనుకొనే ఒక మానసిక,శారీరిక,భావావేశాల కూడలి ఈ పదహారు. - రమణ బొమ్మకంటి
Read More

పదహారేళ్ల వయసు

పదహారేళ్ల వయసు పట్టుమని పదహారేళ్ల వయస్సు మొదలగును విచిత్ర భావాల కదలికలు తెలిసీ తెలియని వయసు రమణీయత లో ప్రపంచం అంతా బహు సుందరం అలంకరణలో మునుగుతూ అందరికన్నా అందాలచంద్ర బింబ మనుకుందురు ఆ వయసులో నవయవ్వన అంకుర దశలో ఉయ్యాల లూగును మది గదిలో మాట వినదు కదా మంచి ఏదో చెడు ఏదో బాల్య ప్రాయం ముగిసి సంఘర్షణల సమరం మొదలు అంతరంగం ఆ వయసులోనే సహచరుల తీపి కబుర్లు సంగతితెలియనిచదువులు మధుర ఊహల జగతిని మనసారా ఆస్వాదనకు స్వేచ్ఛా వాయువుల కోసం ఆరాటపుఆశలసయ్యాటలు పదహారేళ్ల వయసులో పదునైన ఆలోచనలతో నిండుగా మెండుగా అను క్షణం.......? - జి జయ
Read More

ప్రేమ విలువ

ప్రేమ విలువ ప్రేమ విలువ దూరంలో తెలుస్తుంది కన్నీటి విలువ నిజాయితీ లో వుంటుంది అంటారు వెలకట్టలేనిదిఈప్రపంచంలో వున్నది అంటే అది నిజమైన ప్రేమ మాత్రమే బంధాల నడుమ ప్రేమ బహు రూపాల్లో కనిపించును కొలువలేని విలువ కు పాత్రలే లేవు కొనలేనిప్రేమకు హద్దులు లేవు అర్హత చూడని ప్రేమ అందలం లాంటిది నమ్మకాల ముడులతో బందీ అవుతుంది ప్రేమ ఏమీ ఆశించని ప్రేమ వేటిని శాసించని ప్రేమ అన్నిటినీ మించినది రోజులతో పాటు మారుతున్న ప్రేమ విలువలు వికటిస్తే విషతుల్యం పంచి చూస్తే తెలుస్తుంది దాని పరమార్థం ఇంకా దానివిలువ అమృతతుల్యము అదే మనిషి మనస్సు కు ఇచ్చిన గొప్ప వరం......? - జి జయ
Read More

వెతుకులాట

వెతుకులాట అసంతృప్త ద్రావణంలా మనసు మరుగుతోంది ఖైదు చేసినట్టు ఆలోచనలు మేకులు కొట్టేసినట్టు మౌనం వహించిన మాటతో నిరాశల నిషాలో నేనిప్పుడు కనుచూపులో ఆశేలేక కంటి చూపు మందగించింది అడుగేసే పాదం అడుసులో చిక్కినట్లు చుట్టూ దిగ్బంధం విడిపించి నడిపించే అక్షరం ఎటుపోయిందా అని వెతుకుతున్నాను - సి. యస్. రాంబాబు
Read More

అన్నం – వృధా?

అన్నం - వృధా?   అన్నం తినేటప్పుడు బ్రహ్మార్పణం అంటాం.మనం తినగా మిగిలిన అన్నాన్ని బయట అడుక్కొనే వాళ్ళకెవరికన్నా పెడతాం.వాళ్ళకి ప్రాప్తం అనుకొంటాం. ఇంకా మిగిలితే జంతువులకు పెడతాం. కృష్ణార్పణం అంటాం. మిగతాది పారేస్తాం వృధా అంటాం.దానిని చీమలు మొ:కీటకాలు తింటాయి. అది కూడా కృష్ణార్పణమేగా!రోగాలు రాకుండా, చెత్త కాల్చేస్తాం. అగ్నికి అర్పణం అంటాం. వంటలు చేసేటప్పుడు అంచనాలు వేస్తాము.ఎక్కువ తక్కువలు ఔతాయి. అనుకున్నంత మంది రాకపోతే మిగిలిపోతుది.ఇది సహజం. ఎవరూ కావాలని చెయ్యరుగదా! పైగా బ్రహ్మకి కృష్ణునికి,అగ్నికి అర్పించింది వృధా అయినట్టు కాదుకదా!,అని అనుకొంటే ఏ విచారముఉండదుగదా!అని నా అభిప్రాయం **** - రమణ బొమ్మకంటి
Read More

వెన్నెల తో మాట

వెన్నెల తో మాట గువ్వనే నేను గూటి లో దాగి నింగి లో వెన్నెల తో మాట కలిపాను సైభీరియా లో స్నేహితుల మంచి మంచు ముంచు సుఖమేనా అని ఎడారి లో ఇసుక ను అడిగావా చందమామ చల్లని వెన్నెల చిన్న పాపలకు చిరు నవ్వు నిచ్చిందా అని అమెజాన్ అడవుల్ని కదల్చి తట్టి మరీ అడిగావా తల్లి దరిత్రి కి స్వచ్ఛమైన శ్వాస నీలా మెల్లగా మెల్లగా వెదజల్లావ అని.... నేనే.... వెన్నెల్లో గూటి గువ్వను చీకట్లో నే ...కాని నా కంటి చూపుకాంతి వెన్నెల్లో విశ్వ శాంతిని చూసింది మరి పగలే వెన్నెల వెలుగు అయితే విశ్వ కాంతిని కంటి చూపుగాచేసి ఓ వన్నెల వెన్నెలా... నీలో నేనై విహారిస్తా - అల్లావుద్దీన్
Read More

పగలే వెన్నెల

పగలే వెన్నెల పరిణతి చెందిన విలువలకే వన్నెతెచ్చే అణువుల అనుభూతుల సరిగమలు వెన్నెల ఉత్సాహాల ఊరట హృదయానికి చెవులుంటే మనసుతెలిపేమధురగీతoచల్లనివెన్నలవుతుంది మదిలోనమమత మెదిలినా కనుల మబ్బుల్లో జడివాన ఆనందాల హాయి కాదా గలగలమనిమాటల లయలు ఒలికినా పరిమళాలవేనీల హారాలు అవే అందినదాన్ని ఆరాధిస్తే విరియును వెన్నెలవలే కలువలై గుభాళించినఅనుభూతులు పంచుకుంటే ముంగిట వాలిన పూజాఫలం కాదా ఈ జగమంతా.....? - జి జయ
Read More

మాటిచ్చాను

మాటిచ్చాను మబ్బులన్నీ భేటీ అయాయి మనుషుల మనసుల మల్లే! మల్లెలను చినుకుల్లా రాల్చాయి కునుకు పానుపును సాఫు చేశామని భ్రమ పడుతున్నాయి! పహరా కాస్తూ రాత్రి మనసు తలుపులను తెరిచింది ! జ్ఞాపకాలను దులిపి చిలిపిగా నవ్వినా గతం గాయమై సలుపుతోంది! కలహం, ప్రణయాల చిరునామాల కాలం కిసుక్కుమంటోంది! జారిపోయే క్షణాలను దాచుకోక గతం రహదారులకు బాధను పూస్తావే అని చికాకు పడుతోంది ! ఉలిక్కిపడి బుద్ధినో కొలిక్కి తెచ్చాను! వర్తమానం రుచికి గతం తీపిని జతచేయాలనుకుని చినుకు మల్లెలను దోసిట పోశాను ! మబ్బుల భేటీకి మనోయానం చేసి మన్నించమన్నాను! కునుకు పానుపు పై భవిష్యత్తు కలలు పరచి గతం గులాబీలతో అలంకరిస్తానని మాటిచ్చాను! - సి. యస్. రాంబాబు
Read More

పగటి వెన్నెల

పగటి వెన్నెల వెన్నెల ఎంతో చల్లన అది చంద్రుడు తెచ్చు మెల్లన పౌర్ణిమిరోజు పూర్తిగ వచ్చు పునఃదర్శనం పక్షం పట్టు అందాకా నే వేచె దెట్లు ఓ!నా ప్రియ సరసు నీవు నా సరసనె వుంటె పగలే కాయద పండు వెన్నెల. - రమణ బొమ్మకంటి
Read More

ముద్దులోలికే అందాలతో

ముద్దులోలికే అందాలతో అలవమాకు రెక్కల సవ్వడులు చేసి. నాకు తెలియనిదా, అవి ప్రకాశించును తీక్షణ కాంతులతో, ముద్దులోలికే అందాలతో! నా హృదయాన్ని దొంగవై దోచ ఇది కాదే నీకు సరి! చడులు మాని సుతిమెత్తని అడుగులతో. నను చేరి వేయవే నా హృదయానికి కన్నం....! - వాసు
Read More