Month: September 2022

ప్రశ్నించే తత్వం

ప్రశ్నించే తత్వం ఏమౌతుందో తెలీదు లోకంలో ఎవరికివారన్నట్టు అందరూ మనకెందుకన్నట్టూ ఎవరేమైతే నాకేంటన్నట్టూ ఎవరిలోకంలో వారు చరిస్తూ పోతుంటే... అన్యాయం జరిగిన అసమర్ధుడు అసమానతలపాలైన అభాగ్యుడు వర్గపోరులో సర్వం కోల్పోయిన ధీనుడు చదువుండి బీదవాడై ఒంటరైన నిరుద్యోగీ కాలం కసిరితే ధనహంకారానికి లోబడిన బీదవాడు లోలోపల ప్రశ్నలతో మగ్గుతూ ఏకాకికిగా గొంతు విప్పలేక పెగిలిన గొంతు శాస్వతంగా ముగిసే చర్యలకి‌ జడిసి ఒంటరులైన ధీనులకి నేడు తోడెవరని అసమానతలకి అలవాటుపడి బ్రతికేసే మనం ఎవరికివారంటూ బ్రతికేస్తుంటే... అన్యాయాలని ప్రశ్నించేదేనాడనీ నాయకులచే సుపరిపాలన చేయించెదెపుడనీ మనసులో మాటలు పెగలనీయని అసమర్ధతలో ప్రశ్నించే తత్వం ఎక్కడుందనీ... ఇకనైనా మారుదామా నేస్తాలూ... ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ పెరిగిన ధరలకి ... చుట్టూ జరుగుతున్న అన్యాయాలకీ... గూండారాజ్యంగా మారిన సంఘాన్ని... ఆడవారిపై జరిగే అత్యాచారాలనీ... మదిలో దాచుకుని కుమిలిపోక ప్రశ్నిద్దామా??? నిగ్గదీసి అడిగి అన్యాయానికి ఎదురెళదామా??? - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

తలపుల్లో

తలపుల్లో కాలం ఒక్కసారిగా వెనక్కి మళ్ళిన క్షణాన... పరిచయపుటల్లో జ్ఞాపకాల సందళ్ళు మొదలు... అల్లరి చేస్తూ ఆదమరచి గడపిన రోజులు... యాతనలెరుగక నవ్వులతో కరిగిన కాలగతులు... వెనువెంట మనసంతా మధురోహాల స్మృతులు నిండిపోవగా... పరిచయపుటల్లో జ్ఞాపకాల సందళ్ళు మొదలు... హద్దులెరుగని చెలిమిలో గడిచిన క్షణాలు... వీడిమనలేని ఎదతడిలోని సంబరాలు..... ఎన్నని చెప్పినా తరగని గనివంటి నిధులు... మాటే వినని అల్లరి తుంటరులు... వెంటపడి వెంటపడి వేధించిన ఆ రోజులు... పెదవంచున దగిన ముసిముసి నవ్వుల సిగ్గు మొగ్గలు... ఎంత చెప్పినా నేటికీ చెదరని చెరగని అనుభూతలు... పెరిగే వయసుకి నిండే ప్రాయానికి... మౌనం వీడిన పదాల జాతరలు.... తరగని అలనాటి మధురోహల చిత్తరువుల చిద్విలాసములు... ఎవరెటు వెళ్ళినా గురుతుగా మిగిలిన దొంతరలు... కాలగమనంలో కనుమరుగవ్వని గ్రంధాలు... కసిరేకాలంలో ముసిరిన చీకట్లలో... దిక్సూచై దారిచూపు తలపుల్లో దాగిన స్నేహ హస్తాల వీచికలు... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి శేషాద్రి కొండపై కొలువైనవాడా కళ్ళేమో కలువలై వేచి ఉన్నాయి కన్నీరు కాలువై పారుతున్నాది మనసేమో నీకై వెతుకుతున్నాది చరణం నీ దివ్య రూపమును కనినంత చాలు నీ భవ్యనామమ్ము పలికితే మేలు తుళ్లిపడుతూ గుండె కీర్తనగ ఉప్పొంగు చరణం బంగారు వాకిలిలో నవ్వుతుంటావు బతుకింక నీదని మురిసిపోతుంటాము బాధలు బాధ్యతలు నీవంచు తలచి నీ బాట నీ మాట మాదనుచు సాగేము చరణం నీ నవ్వు మా స్ఫూర్తి నీ చూపు మా కీర్తి నినుచూడ వచ్చేలా ఏడుకొండలెక్కేలా వరమీయవయ్యా మా శ్రీనివాసా చరణం నినుచూసినంతనే మాటేమో రాదు నీ తలపుతోనే దినమంత గడుచు నీ పిలుపుకై మేము వేచేము స్వామి నిన్నెపుడు వీడము ఇది మా హామీ - సి. యస్. రాంబాబు
Read More

ఆ ఇద్దరు

ఆ ఇద్దరు "శేఖర్ గారా? " "అవునండీ!" "మీరొకసారి చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు వస్తారా!" "దేనికండీ" "మీరొస్తే చెబుతాం " "అక్కడ ఎవరిని కలవాలి " "ఇన్స్పెక్టర్ శంకర్ అని అడగండి. మా వాళ్ళు గైడ్ చేస్తారు " "ఓకే.. రేపొస్తానండీ" ఫోన్ డిస్కనెక్ట్ అయింది. కానీ శేఖరం ఆలోచనలను డిస్కనెక్ట్ చేయలేకపోయాడు. ఎందుకు రమ్మనుంటాడు.. ఎంత బుర్ర పగలకొట్టుకున్నా క్లూ ఏమీ దొరకలేదు.. భార్యకు ఈ విషయం చెప్పాడు. "మీకెవరితోనయినా గొడవ పడ్డారా" అనుమానంగా అడిగింది. "నాకంత సీనుందా.. లోపల్లోపల ఉడికిపోవటమే కానీ గట్టిగా అన్నదెక్కడ " హెల్ప్ లెస్ గా అన్నాడు. "మీరు తప్పు చేయనప్పుడు భయం దేనికి.. ఏమీ కాదు ధైర్యంగా వెళ్లిరండి" గీతలో కృష్ణుడిలా ఆప్తవచనం పలికింది లక్ష్మి. అయినా శేఖరం నెర్వస్ గానే ఉన్నాడు. రాత్రంతా నిద్రపట్టలేదు తనకు ****** తెల్లారింది.. రోజూ ఉత్సాహాన్నిచ్చే భానుడు ఆరోజు శేఖరం మూడ్ ని అర్థం…
Read More

శరత్ జ్యోత్స్న

శరత్ జ్యోత్స్న వినీలాకాశాన పిండారబోసినట్లు శ్వేత వర్ణమేదో గగనాన ఒలికి పారినట్లు వినీలాకాశాన రాశిగా మిణుగురులన్నీ చేరినట్లు నీ చల్లని దరహాసాన నిండిన స్వచ్ఛతలా... వీచే పవనాలు మోసే నీ మేని గుభాళింపులా... తలలో మురిసి మెరిసే మత్తెక్కించు మల్లెల్లా... పసిపాప బోసితనపు చిరునగవులా... అమ్మ ప్రేమలోని కమ్మదనపు అమృతంలా... ననువీడిపోలేని నీ మనసున దాగిన శరత్ చంద్రికలుగా ఒకరికొకరమని చాటిన కాలమే సాక్ష్యంగా.... ఎన్నటికీ విడివడని బంధమే మనదిగా.... ఆ నీలి గగనాన పున్నమి రేతిరి రేరాజు ప్రకాశించే శరత్ జ్యోత్స్నలా.... ప్రకాసించిపోదాము అనురాగ సీమలో అలకల లోగిలిలో.... మమతలెరిగిన మంచి బంధముగా... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీ పదములతో గడువగ బతుకు నీ పాదములను చేరెను మనసు నీ మార్గమునే నడుచుట తోటి జీవితార్థమే తెలియును కాదా చరణం దానము దయలే మనిషికి ముఖ్యము తెచ్చును ఎంతో అవి సఖ్యమును ఈ సత్యమునే తెలిపినవాడవు మా కన్నులనే తెరిచినవాడవు చరణం నీ దయతోటే సాగేమయ్యా నీ కృపతోటే కదిలేమయ్యా నినుగాంచినచో సమయము తెలియదు చిత్తము అంతా ఎంతో శాంతి చరణం నీ పలుకులనే తెలియని వారము నిను కొలుచుటయే తెలిసినవారము నీ తత్వమునే బోధించమని నిత్యము నిన్నే వేడెదమయ్యా చరణం జీవనతత్వము తెలిపెడివాడు తెగులే పట్టిన మనుషులకేమో ప్రేమను చూపే సద్గురుసాయిని విడువక ఎన్నడు సాగెదమండీ - సి.యస్ .రాంబాబు
Read More

బక్కపలచటి కుర్రాడు -కథానిక

బక్కపలచటి కుర్రాడు -కథానిక మియాపూర్ మెట్రో పార్కింగ్ లో 'ఆర్మ్ డి' పార్కింగ్ కొంచెం విసిరేసినట్టుంటుంది. తక్కువ మంది పార్కింగ్ చేస్తారు. అక్కడ ఆ కుర్రాడిని తరచూ చూస్తుంటాను. తనేమిటో తన పనేమిటో అన్నట్టుంటాడు. చేతిలో ఓ పుస్తకం తప్పనిసరిగా ఉంటుంది. బక్కపలచగా నల్లగా ఉంటాడు. నేను పార్కింగ్ మోటార్ సైకిల్ పెడుతుంటే ఎవరో వ్యక్తి తన బండి తీస్తూ అతనితో వాదిస్తూ కనిపించాడు. నెమ్మదిగా ఉండే కుర్రాడిపై అతనెందుకు ఇంత మండిపడిపోతున్నాడు అనుకుంటూ దగ్గరకు వెళ్ళాను. "నువ్వెవరివి నా ఫోన్ నంబర్ అడగటానికి" ఆ అపరిచిత వ్యక్తి అరుస్తున్నాడు. "ఏమయింది సార్" కొంచెం కూల్ చేద్దామని అడిగాను. "నా బండి నిన్న పార్క్ చేశాను. ఇవాళ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఎంత కట్టాలో చెప్పు. కడత అన్న. మధ్యలో ఫోన్ నంబర్ చెప్పమంటున్నాడు. నా నంబరెందుకు చెప్పాలి సర్..మీరు చెప్పండి" అర్థమయింది. తన్నుమానిస్తున్నాడని ఆ వ్యక్తికి కోపం వచ్చింది. "సార్, నిన్ననే…
Read More

దిక్సూచి

దిక్సూచి ఈరోజున విశాఖజిల్లాలో జన్మించెను ఓ చిన్నవాడు ఎదిగి ఒదిగి మెలిగినాడు ఆ కోరమీసపు చిన్నోడు తల ఒంచుకుపోతాననక తల ఎత్తి ప్రశ్నించెనతడు శరములవలె సంధించెను రచనల ప్రశ్నలను ఆయుధముగ మలచుకొనెను సాహిత్యమును ఉత్తేజమును నింపెను దేశమంటె మనుషులంటూ ఒట్టిమాటలు కట్టిపెట్టండంటూ నుడివెను గట్టి మేలును తలపెట్టండని చాటెను సంఘములో దాగున్న అరాచక సంస్కృతులకి ఎదురుతిరిగి ఆడవారికి అండదండగా నిలిచిన ధీరుడు కన్యాశుల్కమను దురాచారమును రూపుమాపగ రచన చేసి చైతన్యపరచెను స్త్రీ జనోద్ధారకుడై ముత్యాల సరాల ఛందమును సృష్టించినారు పుత్తడి బొమ్మ పూర్ణమ్మను తీర్చిదిద్దుతూ సమాజాన స్త్రీకి స్వేచ్ఛకావలెననెను కోటలు పేటలు కూలిపోవగ మిగిలిపోయెను మంచిచెడులని చాటెను ఏళ్ళు కరగిపోయినా నేటికీ నిలిచెను కన్యాశుల్కము ఈనాటికీ పాఠ్యాంశమాయెను ఆంగ్లమాధ్యమమున అడుగుజాడలలోన గురజాడ నిలిచినాడు సాహితీలోకమున ఛత్రముగా నిలిచినాడు ఆనాటికీ...నేటికీ...భవితకీ... దిక్సూచి అతడు మన గురజాడ కాక ఇంకెవ్వరతడు ....... - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

వన్ సైడ్ లవ్

వన్ సైడ్ లవ్ అభి:- రేయ్ ఇంకా అన్నీ రోజులు అని ఇలా తాగుతూ ఉంటావు రా. రేపు కాలేజ్ కి వెళ్ళాలి కదరా ముందే ఎంబిఏ (MBA) లో ఫస్ట్ క్లాస్ అస్సలు మిస్ అవ్వొద్దు అని చాల చెప్పారు కదరా సాయి:- పదరా వెళ్దాం మరుసటి రోజు నెక్స్ట్ డే అభి:- ఇంకా ఎన్ని రోజులు ఇలా తాగుతూ ఉంటావు? ముందు ఎంత బాగా ఉండేవాడివి రా ఇప్పుడెందుకు ఇలా తయారు అయ్యావు? సాయి:- రేయ ఆపరా నీ నస. పదా త్వరగా కాలేజ్ కి వెళ్దాం. అభి:- పద ఫాస్ట్ గా సాయి: సరే రా కాలేజ్ లో అభి:- సర్ న్యూ గా జాయిన్ అయ్యాము. ఫస్అట్య్యో ఇయర్ము బ్లోలాక్ ఎక్కడ? సర్:- అదిగో ఆ బిడ్లింగ్ ఏ ఫస్ట్ ఇయర్ బ్లాక్. అని ఒక బిల్డింగ్ ని చూపిస్తూ చెప్పాడు. అభి:- సరే సార్…
Read More

అదృష్టం 

అదృష్టం  లావణ్య ఒకసారి మనసులో గట్టిగా దేవుడికి దణ్ణం పెట్టుకుని లోపలికి అడుగులు వేసింది. ఆమె ఒక ఇంటర్వూకి వెళ్తుంది. చేసేది పెద్ద ఉద్యోగం కాకపోయినా ఆమెకు ఇప్పుడు అదే పెద్దగా అనిపిస్తుంది. లాక్ డౌన్ లో ఉన్న ఉద్యోగం పోయింది. అదిగో అప్పుడే తన భర్త కూడా తనను వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఇప్పటికీ జాడ లేదు. ఎంతో వెతికింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ఫలితం శూన్యం. ఎం చేయాలో అర్థం కాలేదు. పైగా చుట్టూ ప్రక్కల ఉన్నవారు మాటలతో హింసించారు. నువ్వే ఏమన్నావో అందుకే వెళ్ళిపోయాడు అంటూ కాకుల్లా పొడిచారు. అలా వెతుకుతూ ఆరునెలలు ఇట్టే గడిచిపోయాయి. అతని జాడ కనిపించలేదు. ఇంట్లో ఉన్న, దాచుకున్న డబ్బులు కూడా అయిపోయి, తిండికి కూడా లేని పరిస్థితి. ఏం చేయాలో తెలియక ఎందరినో పని కోసం అడిగింది. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఎందుకంటే…
Read More