Month: November 2022

నక్షత్ర మాల

నక్షత్ర మాల అందమైన ఆకాశంలో అలజడులు రేపుతూ వెచ్చని కిరణాల తాకిడి తో మేనంతా కవ్విస్తూoటే మది సరికొత్త రాగాలు ఆలపిస్తుంది మనసంతా మరో రేయి నీ కోరుతుంటుంది  నీ వెచ్చని శ్వాస తగులుతూంది హృదయమoతా భారమౌతుంటే సుమాలమాలలు గుండెల్లో గునపాలై గుచ్చుతాయి ఎద లోతుల్లో ప్రేమనంతా దాచుకోలేక నక్షత్రమాలను మెళ్ళో అలంకరించుకుని  చిలిపిగా చూస్తున్న నీ దరికి చేరలేక విరహపు బాధను తాళలేక నీ సతిని నేనై నా పతివి నీవై అందరాని ఆ సుదూర తీరాలను చేరేదెన్నడో నీ ప్రేమ సామ్రజ్యాన్ని ఏలేదెన్నడో... - భవ్య చారు
Read More

చేవ్రాలు

చేవ్రాలు ఎడారిలో కోయిలలా కాంక్రీటు రోడ్డు పై ఆత్మీయతను నాటినట్లున్న ఆ మొక్క నా కుశలమడుగుతుంది జాలి దయలేని కాలం కాటేసిందనో అవమానాల విపణిలో నను వేలం వేసిందనో కప్పిపుచ్చుకుంటుండగా పచ్చని చూపును నాపై ప్రసరిస్తుంది తన తనువంతా గాయాలే లేపనం పూసేవారే లేరని తెలిసినా గుర్తించని నేను నా మేనంతా మోసాల పుండేనంటాను సంతోషాల 'మేనా'లో కూచోపెడతావాని వెటకరిస్తాను పూల శరీరం పచ్చని నవ్వై ప్రకాశిస్తుండగా బుద్ధభగవానుడిలా చూస్తుంది అప్పుడు వెలిగిన నా బుద్ధి కొంచెం సిగ్గుపడుతుంటుంది దారంతా రాళ్ళున్నా దీవించే మెత్తని ఇసుకా ఉన్నట్టే మట్టిలో కలిసేముందు కాస్త మానవీయ స్పర్శను వళ్ళంతా హత్తుకోవాలి బట్వాడా అవుతున్న భావాలు ఆ మొక్క చేవ్రాలని తెలుస్తుంటే నా కళ్ళువాలిపోతున్నాయి మనసు సోలిపోతోంది - సి. యస్. రాంబాబు
Read More

పాలమీగడ

పాలమీగడ నీవు పక్కనుంటే పాల మీగడల వాసనలు కమ్మగా నీ తనువు మీదుగా ముక్కుపుటాలను అలరిస్తుంటాయి... నీ మేని ఛాయను చూస్తుంటే దేవతలిలానే ఉంటారేమో నాకోసం దిగివచ్చిన దేవతవు నీవే అనుకుంటాను తళతళలాడే మెరుపుతో నాకోసం దిగివచ్చిన అప్సరవై కనులముందు కదలాడుతుంటే నను నేనే మైమరచిపోతుంటా... ఎంత పొగిడినా ఎంతెంత పొంగిపోయినా చివరకు చిక్కి శల్యమై నశించే మేని ఛాయకి నేనెందుకు ఇలా ఆకర్షింపబడుతున్నానో... ఎంత వైరాగ్యం ఆవహించినా మరెంత నైరాశ్యం నిండుకున్నా ప్రేమలో మునిగిన పిపాసినిగా తనువు మనసు నీకప్పగించా‌ ఎలా చూసుకుంటావో మరి ప్రియా! - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ఊపిరి

ఊపిరి నా ఉనికి తను. నా మనికి తను. మట్టిలో కలిసే వరకు చెరగని చిరునామా తను. ఉదయకాల సమీరం శుభోదయ సుప్రభాతం. ప్రకృతిలో పయనించిన ప్రతిసారి నను మరిపించే చెట్ల ఊసులతో పలకరింపుల పరిమళం. చల్లని సాయంత్రం చిరునవ్వుల కబురులతో మైపూతల చందనం. పండు వెన్నెలలో నిండుగ తోడైన సహవాసం. శిశిర సాయంత్రాన కృత్రిమ యంత్రాలను తలదన్ను శీతల తుషారం. సాగర తీరాన తన కౌగిలిలో మనసు ఎగురుతున్న స్వేచ్ఛా విహంగం బాధలో వేడి నిట్టూర్పు తను. ఆనందంలో ఉచ్ఛ్వాసల ఆస్వాధం తను. నాలో తను. తనలో నేను. నా చుట్టూ రక్షణ కవచమై అల్లుకున్న అనురాగబంధం. విడదీయలేని అనుబంధం. తను లేని మరుక్షణం నా తనువు ప్రేమించిన వారికి సైతం దుర్గంధ భూయిష్ఠం. అనాదిగా అనుక్షణం నాకై తాపత్రయపడే నేస్తమా! నా ప్రియ నిచ్చెలీ చిరుగాలి, మానవాళికి నువ్వు ఒక దివ్యమైన వరం. నీ సేవకు వెల కట్టడం…
Read More

తనువు

తనువు తనువు తనువు ఏకమై పూల పోదరింటిలో కాపురముంటూ నీ ప్రేమలో మమేకమై పోతూ మనింటికి యజమానినవుతూ ఇద్దరం ఒక్కటిగా మారుతూ ఒకరినొకరం అర్దం చేసుకుంటూ ప్రేమ లో మునిగితేలుతూ బాధ్యతలను పంచుకుంటూ ఓదార్పునై నీ ఇంటి ఇల్లాలునై నీ కంటి పాపగా మారి వంశాన్ని వృద్ది చేసిన క్షణానా నా తనువు మనసు పులకరించి పోతూ ఆనందాన్ని పంచుకొంటూ కొత్త బాసలు చేసుకుంటూ జీవన పయనం సాగిద్దాం.... - భవ్య చారు
Read More

కాడి ఎద్దులు

కాడి ఎద్దులు ఊరికి చివరన చిన్నపాక, పిల్లలంతా కేరింతలతో ఆడుకుంటున్నారు తనతోటివారు, పెద్దవారు చింతచెట్టు అరుగుమీద కూర్చున్నారు. ఆ శబ్దాలు అతనికి  విసుగుపుట్టిస్తున్నాయి. అయినా తనకు కుడివైపున కొద్దిగ దూరంలో ఏవో పెద్దగా అరుపులు అవి అతనికి పరిపరి విధాల ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. చుట్టుపక్కలందరిని అడిగినా ఎవరు పలకడంలేదు. చేతిలో రుమాలు తీసుకుని గడపదాటి అడుగుముందుకేసి రుమాలు తలకు చుట్టి, కిర్రుచెప్పులేసుకుని అరుపులు వినబడుతున్న వైపు పోతున్నాడు. ఎప్పుడు చూడని వ్యక్తిలా వింతగా చూస్తూ వెంట వెళ్తున్నారు అరుగుమీద ఉన్నవారంతా. అతను వెళ్ళేసరికి కాడిఎద్దులు కాలువ నీటిలో ఇరుక్కునుంటాయి. ఎదో మూలనుండి అదేపనిగా అన్నట్టు "చేతగాకపోయినా సూడనికి వచ్చినాడు"అని అంటాడు. ఏదీ పట్టనట్టుగా కాలువలోకి దిగి పొలుగు సరిచేసి వాటితో ఎదో మాట్లడి నట్లుగా వెళ్లి చెక్కబండి మీద కూర్చున్నాడు దిక్కులుపిక్కటిల్లేలా రంకెలేసుకుని, చూసేవారు నివ్వెరపోయేలా, కాలువగట్టు నుండి బయటికి వచ్చేస్తాయి. మరోపక్క నుంచి "పులిని బంధించినంత మాత్రాన స్వభావం మారదు…
Read More

పయనం

పయనం పయనమై వచ్చారు మనుషులు ఈ లోకంలోకి పరుగు పందెంలా చేసుకున్నారు జీవితాన్ని ప్రతిదీ పొందాలని కోరికతో నలుగుతున్నాడు మనిషి ప్రతీసారి కాలాన్ని ఆపలేమని తెలిసినా చక్రబంధాల మధ్యన చేరి విలువైన కాలంతో పోటీపడుతూ విజ్ఞానపు అంచులను తాకి అంతుచిక్కని ఆనందాలను వెతుకుతూ అద్భుతాల సృష్టిలో అన్నీ తెలుసుకోవాలనే తపనలో జీవిత బాటసారి పయనం మలుపుల గెలుపులతో ప్రతీక్షణం పయనంలో భాగమే అనునిత్యం అడుగు ముందుకు ఆశ నిరాశల ఫలితమే ......? - జి జయ
Read More

నేస్తమా ఎవరు నువ్వు?

నేస్తమా ఎవరు నువ్వు? నా స్నేహ బంధానివా? చిన్ననాటి జ్ఞాపకానివా? పూర్వజన్మ సుకృతానివా? ఆత్మీయత ఆలంబనవా? నేస్తమా ఎవరు నువ్వు? ఆలోచనల్లో ఎంతో అంతరం మనసుకు లేదుగ ఈ దూరం నీ ఊహలే నిరంతరం పెంచావు నా తలపుల భారం నేస్తమా ఎవరు నువ్వు? ఈ ఒడిదుడుకుల జీవనసమరం సుడిగుండాల గాలి దుమారం నీ స్నేహ వాసంత సమీరం నా మనసుకు చందన హారం నేస్తమా ఎవరు నువ్వు? నీ మాటలు వింటే తెలియదు కాలం నీ తలపే మదిలో కలగించును మోదం అందించావు ఆత్మీయపు స్నేహం నన్ను నాకు పరిచయం చేసావు చిత్రం అందుకేనేమో నువ్వే నా ప్రయనేస్తం!! నా మదికి నీ ఆగమనం వెయ్యి ఏనుగుల బలం నా కన్నయ్య మురళీ గానం ఈ రాధకు వేయి జన్మల ఫలం నీ కను పాపను చేరిన క్షణం ఎత్తినాను మరొక జన్మం నీ పాదాల దూళి పరాగం నా…
Read More

ప్రతి జన్మకు కోరనా!

ప్రతి జన్మకు కోరనా! ఊసులన్నీ చెవిలో తేనెలు నింపుతుంటే మెదడుకు చేరిన మధురిమను ఆస్వాధిస్తుంటాను.. చూపులన్నీ ఎదలో బాణాలు వేస్తుంటే మన్మధబాణపు తీయని‌బాధను మరిమరి‌కోరుకుంటాను.. మనసంతా నీ తలపులు నిండితే ఓలలాడనా జతకూడిన మధురోహలలో బంధము లతలా పెనవేసుకుని జన్మజన్మలకి నీతోడు కోరుకుంటూ ప్రతి జన్మకు నీ జతనే కోరనా..!   - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

ఆ పయనానికి వందనం.!

ఆ పయనానికి వందనం.! పచ్చని పొలాల మట్టిలో సాగెను రైతు పయనం ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు వందనం పరిశ్రమల్లో యంత్రాలతో సాగెను కార్మికుని పయనం వాడే ప్రతి వస్తువునూ అందించే శ్రామికునికి వందనం తరగతి గదిలో పుస్తకాలతో సాగెను గురువు పయనం పిల్లలకు జ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయులకు వందనం సమాజంలోని చెడుతోనే సాగెను పోలీసుల పయనం నేరస్థుల నుంచి ప్రజలను రక్షించే ఖాకీలకు వందనం ఆసుపత్రిలో రోగుల‌ మధ్య సాగెను వైద్యుల పయనం ఎందరో ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలకు వందనం కోర్టులో కేసులు..సెక్షన్లతో సాగెను లాయర్ల‌ పయనం బాధితులకు అండయ్యే న్యాయవాదులకు వందనం కార్యాలయాల్లో ఫైళ్లతో సాగెను అధికారుల‌‌ పయనం సమస్యల‌ పరిష్కారం, అభివృద్ధి చేసేవారికి వందనం చట్టసభల్లో చర్చల నడుమ సాగెను నేతల పయనం ప్రజలకు సంక్షేమ పాలనందించే పాలకులకు వందనం బతుకు నిత్యసమరమై సాగెను సామాన్యుల పయనం కుటుంబమే లోకంగా త్యాగాలు చేసే వారికి వందనం.!…
Read More