Month: December 2022

నీ నవ్వు వెలుగవ్వు

నీ నవ్వు వెలుగవ్వు జ్ఞాపకాల శిశిరానికి చోటివ్వు వసంతాల చెలిమికి మాటివ్వు మాటవినని లోకం బాధవ్వు పంచదా ఆనందం నీ నవ్వు అలుపులేని సంతోషపు బాటవ్వు వేడుకల జీవితము వీలవ్వు తనూలతకు ఓదార్పుల పలుకవ్వు మురిపాల కోటకే వెలుగివ్వు సంబరమై మనసంతా దారివ్వు రివ్వుమంటూ ఎగరదా చిరునవ్వు ముస్తాబైన ముచ్చట్ల పలుకవ్వు అనుభూతులిక తలదువ్వు కలల కాంతుల కేకవ్వు కోటిరాగాల కోనవ్వు వెలుగు పూల తోటవ్వు పరవశాల నీ నవ్వు పాటవ్వు - సి.యస్.రాంబాబు
Read More

అనురాగ సంగమం

అనురాగ సంగమం జగములోన ప్రేమకు లోటు లేదు మురిపించ వచ్చు అనురాగాల ఒడిలో ప్రణయ గీతాల జడిలో పారవశ్యపు మదిలో తనువున తనువై బ్రతుకు జతయై తోడు నీడలా మనసిచ్చిన మనువుతో మదిమెచ్చిన ఊహతో అనుబంధాలఅంత్యాక్షరి ఎడబాటు లేక సరాగాల సవ్వడిలో వెన్నెల పల్లకీలో జతయై చేరిన పొదరింట్లో సంతోషాల సంగమంలో దూరమెరుగని మమతను ఆపేక్షల అంతరంగం లో సమస్తం మరచి నిర్మలత్వపు సొగసులతో సంసార సాగరంలో ప్రియమైన వారితో అనురాగ సంగమంలా ఉబలాట పడుతూ జీవన తరంగాల లో మురిసి మెరవాలి అన్నీ వారై ఉంటారనుకుని అదే జగత్తు గమ్మత్తు.....? - జి జయ
Read More

చెరగని చిరునవ్వు సాక్షిగా

చెరగని చిరునవ్వు సాక్షిగా ఓ శర్వరి! నా బాధను పంచుకునేందుకు అంతటి ప్రభుద్దులు లేరు ఇచట ఖేదం దాల్చిన హృదయం తోడ అశ్రువులు నిండిన కన్నుల తోడ ఏకాకినై నిల్చిన తరుణం కడ సకుటుంబ సపరివార సమేతంగా నన్ను ఓదార్చ వచ్చినవా ఏల ఆహ్వానింతు నిన్ను ఎట్లు నా దరిచేరనింతు నిన్ను మేము ఆధునిక జీవన వాసులం ఆదివాసీ లకంటే హీనులం మేము నిషుద్దులం మేము అసుర సంతతి వారసులం ఆది నుండి అత్యాచారం ప్రభుద్దులం అంగాంగ వర్ణనతో అమూల్య బిరుదులు కాజేసం మేము కీచకుని వారసులం మైధునం ఖేలి విళాశాలకు సొంగలు కారుస్తూ ఉంటాం మేము పురాణాలూ పఠిస్తాం కావ్యాలను తీరాగేస్తాం వేదాలను వల్లిస్తాం యత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవతః అని సూక్తులు ప్రభోదిస్తాం ఓ సోదరి... మేము అంటరాని వాళ్ళం మా అభ్యున్నతి ఖండంతరాలు వ్యాపించాలని ఆశిస్తాం మా సంస్కృతిలో స్త్రీ కి ఒక స్థానం ప్రచురించాం…
Read More

అనురాగం

అనురాగం అమ్మా నేనోచ్చేసాను అంటూ లోపలికి అడుగు పెట్టిన ప్రీతి అక్కడ ఇంట్లో ఉన్న కొత్తవారిని చూసి ఆగిపోయింది. ఏంటమ్మా అలా ఆగిపోయావు. పర్లేదు రా లోపలికి వీళ్ళు మన దూరపు బంధువులే అమ్మా, అంటూ తండ్రి దశరథ్ ప్రీతి దగ్గరగా వచ్చాడు భుజం పై చేయి వేసి ఇదిగోరా నరేందర్ ఇదే నా ఒక్కగానొక్క కూతురు ప్రీతి, ఇక్కడే కాలేజీ లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది అంటూ అమల అమ్మాయిని తీసుకుని వెళ్ళు అన్నాడు. రామ్మా ప్రీతీ అంటూ తల్లి అమల ప్రీతి ని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆ కాసేపట్లోనే ప్రీతికి అర్థమైంది అవి పెళ్లిచూపులు అని. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని డిగ్రీ అయిపోయి ఏదైనా ఉద్యోగం చేస్తాను అని తల్లితో ఎప్పుడో చెప్పింది అయినా మళ్ళీ ఇలా పెళ్లి చూపులు ఎందుకు అరేంజ్ చేశారో నాన్నగారు అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్లి తల్లితో ఏంటమ్మా…
Read More

ధనం

ధనం పరుల పైన అసూయా తనకంటే ఎక్కువ సంపద ఉందని తోటి స్నేహితుల పైన ద్వేషం తనకన్నా మార్కులు ఎక్కువ వచ్చాయని. తోడబుట్టిన వారి పైన కోపాలు ఆస్తులు ఎక్కువ పంచుకున్నారు అని తల్లి పై ఆక్రోశం తనకన్నా తమ్ముడిని ముద్దు చేస్తుందని తండ్రి పై కోపం అన్నను బాగా చదివించారని ఎవరికో ఆస్తులు ఉన్నాయని, మరెవరో వేరే దేశం వెళ్తున్నారని, వాడు అన్నిటిలో ముందున్నాడు అని, తాము లేమని వాడి కన్నా ఎక్కువ సంపాదించాలని భార్య బిడ్డలను వదిలి దూర దేశాలకు వలసలు వెళ్తూ ఉన్న ఊరును, కన్నవారిని మరిచి కాసులకై రెక్కలు ముక్కలు చేసుకుంటూ జీవితం అంటే డబ్బే ప్రధానంగా, డబ్బే లోకంగా బతికే బతుకు ఒక బతుకేనా తన తల్లిదండ్రుల ప్రేమ, తన పిల్లల బోసి నవ్వులు తన భార్య చూపించే ఆదరణ ఇవన్నీ వదిలేసి క్షణ భంగురమైన జీవితం కోసం ఎన్నో వందల మైళ్లు ప్రయాణించి,…
Read More

క్షణ భంగురం ఈ జీవితం

క్షణ భంగురం ఈ జీవితం మదిలోమెదిలే క్షణముకొక కోర్కె సాదింపవలయునన్న ఆర్బాటమున కోల్పోయేనే ఆనందాల హరివిల్లును ఎరుగవా జీవితం క్షణ భంగురమని అంతులేని ఐశ్వర్యమునకై అనంత విద్యలు నేర్చి ఆశల సౌధాన్ని పర్చదవే క్షణ భంగురమైన జీవితానికి జననమరణ కార్యములు పుణ్యఫలములు నీలిఖితమై క్షణభంగుర జీవితమున కీలుబొమ్మను జేస్తివా ప్రభూ! - హనుమంత
Read More

ఆశల బాణం

ఆశల బాణం ఉదయమో ఆశల పల్లకి ఉదయమో వేణుగాన పల్లవి కష్టాల చిత్తడిలో కూరుకుంటే చేయిచాస్తూ కిరణం చిరునవ్వవుతుంది చిత్తభ్రమలు చాపల్యాలు వైఫల్యాలు విషాదాల పెనంపై నిను తిరగేస్తుంటే తిరగబడని మౌనం చిన్నబుచ్చుకుని చీకటితెరలలో బందీ కాగా శ్వాసందించేకు వస్తాడు భానుడు ఊరుకోని సమాజం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది కరుకు మనుషులతో బతుకు దారంతా గతుకులే కాగా దిక్కుతోచనివేళ కాస్తన్నా ఊరటనిచ్చే ఉదయపు వెలుగుతో సాగావనుకో మనోవీధిలో దీపాలు వెలగొచ్చు మనుషులున్నచోట మాటలున్నట్టే మాటలున్నచోట భేదాలు విభేదాలుంటాయి మొలిచే గోడలతో ఒంటరి ద్వీపమవుతుంటే ఉదయాన్ని ఆసరాచేసుకో వెలుగుకిరణాల నిచ్చెనపై ముందు గోడలు దాటొచ్చు క్రమేణా కూల్చొచ్చు ఎవరేమన్నా వినకుండా అర్థించే జీవితాన్ని ఉదయంతో ప్రార్థించు పరవశం ప్రవహించొచ్చు పాట ప్రాణం పోసుకోవచ్చు ఏతావాతా ఉదయంలో నీ ఉనికి స్వప్నాలను నేలకు దింపి ఆకాశంలోకి ఆశల బాణమేసినట్టు - సి.యస్.రాంబాబు
Read More

లిప్తకాల జీవితం

లిప్తకాల జీవితం ఈ అనంత చరాచర సృష్టిలో.. అణువణువు నీ హస్తగతమే... అమేయమైన ఈ ప్రకృతిలో... ప్రతిపదార్థము నీ పాదక్రాంతమే... సమస్త విశ్వాన్ని గుప్పిట బంధించి.. సకల జీవకోటిని.. పోషించి ఆక్షేపించి నిర్దేశించే... జగన్నాటక సూత్రధారివి.. జగద్రచనా అధ్యక్షుడివి.. అనివార్యమైన జనన మరణ చక్రంలో... అధ్యంతాలే గోచరించని నీ అద్భుతమైన యోగ మాయలో.. నేను ఒక పాత్రధారిని. నా ప్రమేయం లేకుండానే అందిన.. ఈ చిరు ఉనికికి ఆశల పుప్పడి అద్దుకొని.. ఆత్మీయ రాగాలను ఆలపించాలని.. ఆత్రపడే గాత్రధారిని.. అలాంటి ఈ అర్బకురాలిపైన.. ఎందుకు నీ శీతకన్ను..? నీవు బిక్షగా ప్రసాదించిన లిప్తకాల జీవితంలో కూడా... ఆనందాలను విలుప్తం చేసి... నా బతుకు ఆటను ముగించాలనే.. వికృత క్రీడా వినోదం నీకేలా? - మామిడాల శైలజ
Read More

క్షణ భంగురమీ జీవితం

క్షణ భంగురమీ జీవితం తనువు వికసించే క్షణ కాలంబున.. మనస్సు పరితపించే క్షణ సుఖంబుకై.. జీవితంబు పరుగులు తీసే అశాశ్వత జీవనముకై. జ్ఞానమెరిగి క్షణ భంగురమి జీవితమని.. తెలియునా తర్కమేరుగని ఈ తుచ్ఛమానవ జీవితగమనంబున... - సూర్యాక్షరాలు
Read More

సాక్షిగా….

సాక్షిగా.... హాయ్ వినూత ఎం చేస్తున్నావు అంటూ వచ్చాడు అభి. హా మా ముద్దుల ఆయనగారికి పకోడీలు వేస్తున్నా అంది వినూత. అబ్బా ఏం పకోడీలు... తర్వాత వేసుకుందాం గానీ పద పద తొందరగా తయారవ్వు సినిమాకు సమయం అవుతుంది అంటూ తొందర చేశాడు అభి. ఏంటండీ అంత తొందరా... అయినా ముందుగా చెప్పొచ్చు కదా నేను రెడీగా ఉండేదాన్ని ఇప్పుడు వచ్చి కంగారు పెడతారేంటి అంది కినుకగా వినూత. నేను ముందే చెప్పేవాడిని కానీ టికెట్లు దొరుకుతాయో లేదో అనే సందేహంతో ముందు చెప్పలేకపోయాను లక్కీగా దొరికాయి అందుకే ఇంకా పది నిమిషాల సమయం ఉంది ఈ పది నిమిషాల్లో దేవి గారు తొందరగా రెడీ అయితే అదే పది వేలు అంటూ స్టవ్ ఆర్పేసి తనని తోసుకుంటూ బెడ్రూంలోని బాత్రూంలోకి పంపించాడు అభి. మీకు అన్నిటికీ తొందర ఎక్కువే అంటూ విసుక్కుంది లోపల ఫ్రెష్ అవుతూ వినూత. అవునవును…
Read More