Month: December 2022

మానవుడు

మానవుడు సమస్తజీవజాతులు నిర్భయముగా మానవజాతి యన్నది స్వార్థంబుతో ఎదిగినా, ఒదిగిన ఓర్వలేక నిండినది అసూయాద్వేషంబుతో నమ్మబలికిన మనుజుడే నడి నిశీధిలో అఘాయిత్యంబుచే పగ ప్రతికారంబుతో మోసంచేసే అసూయా ద్వేషముతో నిండి - హనుమంత
Read More

ఆకతాయి జీవితం

ఆకతాయి జీవితం తెలియని తపనల్లా తొలివెలుగులదో ఆశ మూసిన కన్నుల మూగభాషలా మనసుదో అయోమయం వెలుగచుక్క నేలపై గీతలతో నవ్వుతుంది ఆరని కుంపటిలా ఆకతాయి జీవితం ఆదేశాలు జారీచేస్తుంటే ఆపదలన్నీ అటక దిగుతాయి మంచి మిత్రుడి మాటను గుటకేసి ఆవాహన చేయటంతో మనసు అయోమయం ముక్కలవుతుంది.. తపనలన్నీ తన్మయత్వాలవుతాయి కాలం ఉపిరి.. జ్ఞాపకాల సిరి కలల రాతిరి.. వెతల ఉరి పడిలేచే కెరటంలా మనుషులను చుట్టేయమంటూ తొలివెలుగు వళ్ళంతా పాకుతుంది - సి. యస్ .రాంబాబు
Read More

స్నేహితురాలి కథ

స్నేహితురాలి కథ అమ్మ అమ్మ ఆకలి వేస్తోంది అన్నం పెట్టమ్మా అంది సిరి. ఛీ ఛీ ఎప్పుడూ తిండి గోలేనా కాస్త ప్రశాంతంగా ఉండనివ్వవా అని విసుక్కుంది వాణి. అబ్బా అమ్మా చాలా ఆకలిగా ఉంది అమ్మ తినడానికి ఏదైనా పెట్టు అంటూ ఏడుస్తుంది సిరి. అబ్బా ఆగవే కాస్త ఫోన్ మాట్లాడుతున్నా కొద్దిసేపు ఆగు పెడతాను అని కసిరింది. అన్నం కావాలి అని ఏడవసాగింది సిరి. రెండు దెబ్బలు వేసి, తిరిగి ఫోన్లో మాట్లాడసాగింది వాణి. సిరి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి కింద నే పడుకుండి పోయింది అలాగే నిద్ర పోయింది. వాణి ఫోన్ మాట్లాడడం రెండు గంటలు సాగింది. ఇంతలో భర్త రావడంతో ఫోన్ ఆపేసి సిరిని జాగ్రత్తగా సోఫాలో పడుకోబెట్టింది. అదేంటి సిరి సోఫాలో పడుకుంది ఏంటి అడిగాడు రాజేష్ ఏం లేదండి నూడుల్స్ కావాలని ఏడ్చింది నూడుల్స్ తింటే హెల్త్ పాడవుతుంది అని చెప్పినా వినకుండా…
Read More

మార్పు

మార్పు అనుకోకుండా ఒకరోజు నాలోని కవిత్వం పత్రికలో ముద్రితమైతే!... అనుకోకుండా ఒకరోజు ఆ పత్రిక నువ్వ తిరగేస్తే!.. అనుకోకుండా ఒకరోజు భావాలు నీ మనసుని తాకితే!... దొంగకు బంగారం దొరికి నట్లే వేటగాడి ఆహారం దొరికినట్లే గాలంలో చేపలు పడినట్లే అనుకోకుండా ఒకరోజు ఆ కవిత్వం నుండి ప్రేరణ పొందితే!... అనుకోకుండా ఒకరోజు ప్రేరణ ఆచరణలో పెడితే!... అనుకోకుండా ఒకరోజు మునుపటి కన్నా ఉత్తమం అనిపిస్తే!.... ప్రపంచానికి నువ్వు పరిచయం అయినట్లే నీ వాళ్లకు నువ్వు దగ్గరైనట్లే విజయకేతనం ఎగర వేసినట్లే - హనుమంత
Read More

అనుకోకుండా ఒక రోజు

అనుకోకుండా ఒక రోజు పిల్లగాలి చల్లగా వీస్తుంటే... ఆమె కురులు ఆ కారు మబ్బులను తలపిస్తుంటే... ఆమె కళ్ళు సంద్రానికి.... అసలేమీ తక్కువ కాదు అన్నట్టుగా.... వర్షిస్తున్నాయి... అప్పుడు ఎక్కడినుండి వచ్చాడో తెలీదు కానీ ఆరు అడుగుల ఆజానుబాహుడు... చక్కటి మేని ఛాయతో... కత్తుల లాంటి కళ్ళతో.. ఆమె ఎదురుగా వచ్చి నిల్చున్నాడు.... అతడిని చూసి ఆమె కళ్లు... రెప్ప వేయడం కూడా మర్చిపోయి.. అతడినే చూస్తున్నాయి... రెప్ప వేస్తే అతను మళ్ళీ ఆమెను వంటరిని చేస్తాడేమో అని.... అతను ఆమె మనసులో జరుగుతున్న సంఘర్షణ తెలుసుకున్నవాడు వలె ఆమెను అతని కౌగిల్లో బంధించి... ఆమెకు నేను ఉన్నా అన్న దైర్యన్ని ఇచ్చాడు.... అలా వాళ్ళిద్దరూ... ఈలోకంతో సంబంధం లేకుండా ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు..... ఆమె పేరు అంజలి అతని పేరు అక్షిత్ ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు గా కలిసి మెలిసి పెరిగారు...పై చదువులు కోసం అక్షిత్…
Read More

అనుకోకుండా ఒక రోజు

అనుకోకుండా ఒక రోజు చలికి తాళలేక ఊరంతా అరింటికే సద్దుమునిగింది. ఎడవుతుండగా వేడి వేడి అన్నం తినేసి, రగ్గులు కప్పుకుని మునగధీసుకున్నారు ఊర్లోని జనం. దాదాపు అందరు పొద్దున్నే లేచేవారు కాబట్టి అలసిపోయి నిద్దర్లోకి జారిపోయారు. నాకు కూడా బాగా చలిగా అనిపించడం తో రగ్గు తీసుకుని కప్పుకున్నా, బస్సు మెల్లిగా వెళ్తుంది. ఇక ఇదే ఆఖరు స్టేజ్ కావడంతో నేను ఒక్కడినే బస్సు లో ఉన్నాను. అదే చివరి బస్సు కూడా మా ఊరికి. అనుకోకుండా ఎబివిపి బంద్ కు పిలుపునివ్వడంతో ఆ నాలుగు రోజులు హాస్టల్ లో ఉండలేక ఇంటి మీద బెంగ తో అలాగే హాస్టల్ ఆహారం తిని కడుపు ఎలాగో ఉండడం వల్ల అమ్మ చేతి వంట తినొచ్చు అనే ఉద్దేశ్యంతో సాయంత్రం ప్రయాణం అయ్యాను. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని నా చిలిపి ఆలోచన. ఇంతలో బస్ ఆగింది. కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ…
Read More

జీవితం

జీవితం ఆశలు, ఆరాటాలే తప్పా గెలుపెలేని జీవితం.... నచ్చినపని చేయక నచ్చని బ్రతుకులే జీవితం.... పాక నుండి మేడను చూసి ఆలినీ కసిరే జీవితం... గొప్పగా కలలు కన్నా పేకమేడల్లా కూలిపోయే జీవితం... హంగులు, ఆర్బాటాలంటూ సాయంత్రానికి పస్తులుండే జీవితం... ఆలుమోగుడుల అనర్థాలు వీదిన పడిన బాలల జీవితం... ఏ చీకటి అమావాస్య కమ్మిందో కూసింత వెలుగులేనీ జీవితాన్ని.... అక్షరమక్షరం పదంగా మలిచినా అతకని చితికిన బతుకులు... చితికిన బతుకులకు అతుకుల వేసి వెలిగిద్దాం నవ జీవితాన్ని - హనుమంత
Read More

చితికిన బతుకులు

చితికిన బతుకులు చితికిన బతుకులు చిరిగిన బట్టలు బతికిన బతుకులు చింపిన విస్తర్లు అలసిన కనులు విసిగిన మనసులు తగిలిన గాయాలు మరువవులే ఈ వ్యధలు చలించని ఈ గుండెలు వ్యర్థములే మొసలి ఏడుపులు! అణగారిన ఈ బ్రతుకులు అందరికీ కనువిప్పులు మేలుకోవోయ్ నీకివే నా పిలుపులు! అందరి కళ్ళుకు కనిపించాలి నీలో నిప్పు కణికలు! - గాయత్రీ భాస్కర్ 
Read More

జనం

జనం జనం, జనం ఎటూ చూసినా జనం. కనుచూపు మేరా జనం, కాలు పెట్టే సందు కూడా లేని జనం. అబ్బబ్బ ఇసుక వేస్తే రాలనంత జనం. బస్సులు, రైళ్లు, కార్లు, మోటారు సైకిళ్లు ఇలా ఎన్నో ఉన్నా ఇంకా చాలని జనం. నిమిషానికి ఒక బస్సు వేసినా నిలబడే సందు లేని జనం. ఇంత మంది జనాలు ఎక్కడి నుండి వచ్చారు? అసలెందుకు వచ్చారు అని ఒక్క సారి వెనక్కి వెళ్లి ఆలోచిస్తే, ఎక్కడెక్కడ నుంచో వలస వచ్చిన వారే ఈ జనం ఎందుకు వలస వచ్చారు అసలు ఎందుకు ఇంత మంది జనాలు ఉన్నారు అని ఆలోచిస్తే పల్లెలో పనులు లేక పంటలు సరిగ్గా పండక, బోర్లు వేసినా నీళ్లు పడక పంట గిట్టుబాటు అవని రైతు కుటుంబాలన్నీ జీవనాధారం వెతుకుతూ పట్నానికి వలస వచ్చాయి. అందుకే ఇంత జనాభా ఒక హైదరాబాదులోనే కనిపిస్తుంది ఇక్కడ ఎంతోమంది బ్రతకడానికి…
Read More

జీవన్ముక్తుడు – కథానిక

జీవన్ముక్తుడు - కథానిక ఆదివారం కావటం వలన మియాపూర్ మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. సీనియర్ సిటిజన్లందరూ ఒకచోట నిలబడ్డారు సీనియర్ సిటిజన్ సీటు కోసం. సీతారాముడు ఎప్పటిలానే హడావిడిగా వచ్చాడు. సెక్యూరిటీ స్టాఫ్ విజిల్ వేస్తున్నారు వెనక్కి జరగండంటూ.... శీతకాలం బద్ధకాన్ని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడులా ఉన్నాడు సూరీడు. పరధ్యానంగా ఉన్న ఆకాశంలో వెలుగు రేఖలు మసకేశాయి. సీతారాముడు సీనియర్ సిటిజన్ సీట్లో సెటిలయ్యాడు. పక్కనే నిజమైన సీనియర్ సిటిజన్లు ఇద్దరు కూచోనున్నారు. రమారమి డెబ్బైఐదుంటాయేమో వాళ్ళిద్దరికీ  అనుకున్నాడు. పక్కవాడితో మాట్లాడేవాళ్ళకన్నా ఫోన్లో మాటాడేవాళ్లే ఎక్కువ. అదీ తారాస్థాయిలో మాట్లాడుతున్నారు. కొంతమంది వీడియోలు చూస్తున్నారు, కొంతమంది యాత్ గేమ్స్ లో మునిగి తేలుతున్నారు. సీతారాముడు పక్కనున్న ఇద్దరూ మాత్రం నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. కుతూహలంగా చూశాడు వారివంక అనుకోకుండా సీతారాముడి చెవిలో వారి మాటలు వినిపించసాగాయి. "శంకర్ ఇద్దరం ఎనభై దగ్గరకు వస్తున్నాము. ముందు నువ్వో, నేనే వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి." "ఎవరు…
Read More