Month: January 2023

ఎవరు పార్ట్ 14

ఎవరు పార్ట్ 14 జట్కా బండి శరవేగంగా కదులుతుంది. చీకటిలో దారి కనబడటం కష్టంగా ఉండటంతో అలీ ఏకాగ్రతతో బండి నడుపుతున్నాడు. నా పక్కనే స్నేహితుడిగా ఉన్న అలీ గురించి నాకు తెలియలేదు. అసలు ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎవరు నియమించారు? సందేహాలకు సమాధానం కోసం అలీని ప్రశ్నించటం మొదలుపెట్టాను. “అలీ, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? ఈ కేసులో నిన్ను ఎవరు నియమించారు?” “ఇంకా అడగట్లేదు ఏంటి అని అనుకుంటున్నా మనసులో, అడిగావు.” “సరే, కనిపెట్టడం నీ వృత్తే కదా!, అసలు విషయం చెప్పు.” “నేను లండన్ లో ‘వెపన్ ఎవల్యూషన్ అండ్ డిజైనింగ్’ అనే కోర్స్ చేస్తుండగా అదే కోర్స్ చదువుతున్న లక్ష్మిగారు పరిచయం అయ్యారు. ఆ తరువాత కూడా తరుచూ కలుస్తుండే వాళ్లము. నేను డిటెక్టివ్ గా మా కంపెనీలో మొదటి కేసు సాల్వ్ చేసాక ఒక రోజు లక్ష్మిగారు నన్ను కలిసి, వాళ్ళ తాతగారు,…
Read More

అమ్మాయి జీవితం

అమ్మాయి జీవితం అమ్మాయి పుడితే పూర్వకాలం లో మహా లక్ష్మి అనేవారు. కాలం మారుతున్న కొద్ది అమ్మాయిలు పుట్టడం భారంగా అనుకున్నారు. తర్వాత కాలం లో ఆడపిల్ల అంటే ఆడ పిల్లే ఇడ పిల్ల కాదనే ఒక నమ్మకం లోకి వచ్ఛారు. తర్వాత కాలం లో ఆడపిల్ల అనగానే కడుపులోనే చంపడం చేశారు. ఇంకా కాలం మారుతున్న కొద్దీ ఆడపిల్లను చదివించడం, చదివించిన వారికి తగిన సంభంధాలు చూడడం భారంగా భావించారు. అందుకే అమ్మాయిలను ఇంటి వరకే పరిమితం చేశారు. కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో ఆలోచనలు కొత్త దారులు వెతికాయి. దీనికి కారణం అమ్మాయిలను తక్కువ అంచనా వేసిన తర్వాత అమ్మాయిలు సాధించిన విజయాలు చూసిన వారు అమ్మాయిల గురించి అలోచించి వారిని చదివించడం, తర్వాత ఉద్యోగానికి పంపడం చేశారు. వారికి స్వేచ్చని ఇస్తున్నాం అంటున్నారు. కొడుకుతో పాటు చూస్తున్నాం అని అనుకుంటూ నలుగురికీ చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక…
Read More

చిధ్రమైన బతుకులు

చిధ్రమైన బతుకులు అమీర్ పేట లో రోడ్డు పక్కన బట్టలు, చెప్పులు, బ్యాగులు అమ్ముకుంటూ ఉంటారు చాలా మంది చిరు వ్యాపారులు. పొద్దంతా అలాగే నిలబడుతూ, గిరాకీ అయితే చాలని, ఆ డబ్బుతో కుటుంబాల్ని పోషించాలి అనుకుంటూ వ్యాపారం చేసేవారు చాలామంది. అయితే ఇందులో కొందరు అలా వ్యాపారం చేస్తూ వడ్డీలకు కూడా ఇస్తే మరి కొందరు మాత్రం వచ్చిన డబ్బు తో రాత్రిళ్ళు ఆ మెట్రో కింద ఉన్న స్థలంలో చిన్నచిన్న ఇటుకరాలను పేర్చి వండుకొని తిని అక్కడే నిద్రపోతారు. వాళ్లు ఎక్కడి నుంచో బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు కాబట్టి ఇల్లు లేని వారు చాలామంది ఉంటారు అలాంటి వారే ఎక్కడ వండుకొని అక్కడే పడుకో అక్కడే పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆరోజు కూడా అలాగే వ్యాపారాన్ని ముగించుకున్న ఆ జనాలు చివరికి తమ గుళ్ళ కిందికి చేరి ఉన్నదేదో వండుకొని తిని పొద్దటి నుంచి నిలబడి నిలబడి…
Read More

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి... ఎందరో చిద్రమైన బ్రతుకులు నాశనం అయిపోయాయి.. వాళ్ళకి తోడుగా ఎవరి అండ లేదు..  వాళ్ళు పిల్లలతో ఎన్నో బాధ పడ్డారు.. తీవ్రమైన వడగాల్పులు, చలిగాలులను ప్రకృతి విపత్తులుగా భావించి నష్టపరిహారం ఇచ్చే అవకాశంలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.. ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం. అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాల బారిన పడతాయి... కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్రమత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు, ఆహార పదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేయాలి... ⁠- మాధవి కాళ్ల
Read More

నాలాగా కాకూడదు

నాలాగా కాకూడదు ప్రేమిస్తున్నాను అని చెప్తే చాలు అది నిజమో అబద్దమో తెలుసుకోకుండా వాళ్ళని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకోవడం తర్వాత వాడి నిజస్వరూపాన్ని తెలిసి అవాక్కయ్యాను.. ఎవరి మాటలు వినకుండా నమ్మి మోసపోయాను. ఇప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఎవరు కోసం నేను ఉండాలి? నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతకాలి.. పిల్లలు కోసం ఉండాలి.. వాళ్ళని బాగా చూసుకొని మురిసిపోతూ వాళ్లకి మంచి బాటలు వేయాలి.. ప్రతి అమ్మాయి జీవితమే నాలా కాకూడదు.. నాలాగా ఏ అమ్మాయి జీవితం పాడు చేసుకోకూడదు. ⁠- మాధవి కాళ్ల
Read More

అబద్ధం, నిజం

అబద్ధం, నిజం ఒకరికొకరు బాగా పరిచయం. ఈ బావిలో నీళ్ళు చాలా బాగున్నాయి కలిసి స్నానం చేద్దామా అని అడిగింది అబద్ధం, నిజంతో అలా ఇద్దరూ కలిసి బావిలో దిగారు, స్నానం చేశారు. అకస్మాత్తుగా హడావుడిగా స్నానం ముగించుకొని అబద్ధం బావి నుంచి బయటపడి పరుగు తీసింది నిజం బట్టలేసుకుని ! నిజానికి బాగా కోపం వచ్చేసింది. మెట్లెక్కి బావి బయటకు వచ్చేసింది. నిజానికి తన బట్టలు కనిపించలేదు. అలాగే నిజం వీధుల్లోకి వచ్చింది. నిజాన్ని అలా చూసిన ప్రపంచానికి కోపమొచ్చింది. అసహ్యమేసింది, దాన్ని చూడలేక మొహం తిప్పేసుకుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేని నిజం, నిస్సహాయంగా మళ్ళీ బావిలోకి దిగిపోయి శాశ్వతంగా కనపడకుండా అదృశ్యమైంది. ఇది జరిగినప్పటినుంచి, అబద్ధం, నిజం యొక్క బట్టలేసుకుని, తన్నుతాను సింగారించుకుని ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. దాన్ని చూసి సమాజం కూడా మహా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ప్రపంచానికి సత్యాన్ని తెలుసుకోవడంపై ఎలాగు ఆసక్తి లేదు కాబట్టి.. -…
Read More

చీకటి లోకం – ఇది కథ కాదు ఒకరి జీవితం

చీకటి లోకం - ఇది కథ కాదు ఒకరి జీవితం నా పేరు శ్రావణి. నేను హై స్కూల్ లో చదివేటప్పుడు మా ఎదురింటి చరణ్ అనే వ్యక్తిని ప్రేమిమించాను. 3 సంవత్సరాల తరువాత మా ఇంట్లో ప్రేమ విషయం చెప్పాను మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. నేను, చరణ్ పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పెళ్ళి చేసుకున్నాము. నన్ను కని, పెంచిన తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వ్యక్తితో జీవితం బాగుంటుంది అనుకున్నాను. 2 సంవత్సరాల తర్వాత మాకు ఒక పాప పుట్టింది. తన పేరు రాధిక. చాలా అందంగా వుంటుంది, బాగా అల్లరి కూడా చేస్తుంది. కొన్ని రోజుల తరువాత చరణ్ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఎప్పుడూ నాతో కోపంగా వుంటున్నాడు. నన్ను దూరం పెడుతున్నాడు. ఎందుకు ఆలా చూస్తున్నాడో నాకు తెలియడం లేదు. కొద్ది రోజులకి నేను అడిగాను ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అని. ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తరువాత తెలిసింది…
Read More

చిద్రిత హృదయం

చిద్రిత హృదయం మాటిమాటికి దారి తప్పిపోతున్నా... అంతు పట్టని ఈ నిర్జన ఎడారిలో.. వెళ్లే దారిలో ఎన్నెన్నో కంటకాలు.. ఎద ఎదకూ ఎన్నెన్ని వ్యధలను పంచాయో.. ఎన్ని గుండెలు గాయాలపాలయ్యాయో... ఎన్ని సుకుమార హృదయ సుమాలు... నలిగిపోయి నలిబిలి అయ్యాయో... నాకు తెలియని మార్గాలు అనేకం అని... ఇప్పుడిప్పుడే ఎరుకలోకి వచ్చి ఏడిపిస్తున్నాయి.. నాకు సర్వం తేటతెల్లమే అన్న భావన... భ్రమే అని వెక్కిరిస్తూ వేధిస్తోంది.. నాకు సర్వం అవగతమే అన్న అభిజాత్యం... అహంభావమే అని తేటతెల్లమై.... ఆశనిపాతంలా మారి.. అంకుశంలా గుచ్చుతోంది... మది మదిని కలచివేసే... మహోత్పతాల గాయాల తాకిడికి.. ముక్కలవని మనసు లేదు.. చిధ్రమవని చిత్తము లేదు.. సమస్తమూ సమిధలై పోతున్న.. ఈ విధి విలాసంలో.. నేనెంత? నా హృదయం ఎంత? - మామిడాల శైలజ
Read More

వాలకం

వాలకం నిరర్థక ఆస్తుల్లా అర్థం లేని జీవితం చికాకుల కడలిలో చిక్కుకుపోయింది చిటుక్కుమనే చీమ టప్పుమనే వానచుక్క లగెత్తే గేదె జీవితకాశంలో తారలు గిరిగీసుకుంటూ జీవితాన్ని ఆడిపోసుకుంటున్నాడొకడు లోపలికి పోయిన డొక్కలు చుట్టు వీడని చిక్కులు లోకమే అంత లోలకమై ఊగిసలాడమంటుంది వాలకం చూస్తే వాతాపి జీర్ణం అంటున్నట్టుంది - సి. యస్ రాంబాబు
Read More

ఎవరు పార్ట్ 13

ఎవరు పార్ట్ 13 వేసిన ముసుగు తీసేసరికి గూడెంలో ఉన్నాను. గుడెసె లోనుండి బయటకి రానివ్వలేదు. లక్ష్మి గారి గురించి అడిగినా సమాధానం లేదు. ప్రశ్న అర్థం కాలేదో లేక మౌనం వహిస్తున్నారో తెలియలేదు కానీ సమాధానం మాత్రం రాలేదు. అడిగి అడిగి అలిసిపోయాను తప్ప వారిలో ఉలుకు పలుకు లేదు. రాత్రి ఏదో తింటానికి తెచ్చి పడేసారు, కాల్చిన మాంసంలా ఉంది, తినబుద్ధి కాలేదు. పదే పదే లక్ష్మి గారిని ఆఖరి సారిగా కన్నీటితో చూసిన మోమే గుర్తుకు వస్తూ నిద్ర కూడా పట్టలేదు. తెల్లారగానే ఇద్దరు వచ్చి నన్ను రమ్మని సైగ చేసారు, వారి వెనుక వెళ్తుండగా గూడెం అంచున ఊరి జనం కనిపించారు. చాల మంది రైతులు, వారి చేతిలో కర్రలు, అందరూ ఆందోళనగా గూడెం మధ్య ఉన్న నాయకుడు గృహము వైపు చూస్తున్నారు. మేము ఆ గృహము దగ్గరికి వెళ్ళే కొద్దీ పెద్ద పెద్ద అరుపులు…
Read More