Month: January 2023

అక్షరలిపి

అక్షరలిపి అక్షరమునే వలలా అల్లి పదములకే పంతము నేర్పి రచయితలను జల్లెడ పట్టి అక్షరలిపి అనే మాలను అల్లి పూలలా కథలను అల్లి కవితల సుగందాలను జల్లి పాఠకులను తేనీగలా ఆకర్షించి తేనెల తీపిని చిమ్మెను అక్షరలిపి అంతర్గమున, బహిర్గమున శిల్పాలు ఉలి దెబ్బను ఓర్చునట్టుగ ఆశల అలలు తీరము చేరక అలుపెరుగని ఆరాటమే అక్షరలిపి ఏకాంతము ఏకాకి చేసిన ఆశ్రువుల ఊట ఇంకిపోయిన కదలిక లేకుండ కూలబడిన అలక్ష్యం చేయదు అక్షరలిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్షరలిపి సంఘానికి - హనుమంత
Read More

ఆంగ్ల సంవత్సరం-2023

ఆంగ్ల సంవత్సరం-2023 మందు బాబులంత చిందులు వేయుచూ బార్లముందు పెద్ద బారు నిలిచి దూరముండు మనగ దురుసుగా మాటాడి గుంపు గూడి మంద గోలజేసె బారు తెరవగానె బారుగా నిలుచుండి నాకు ముందు మందు నాకుయంటు వంతువారిగ గొని వాంతులు జేసిరి బారు ముందు మందు బాబులంత జనవరి ఒకటనుచు జంకు గొంకూ లేక మందుబాబులంత చిందులేస్తు బాటలన్ని తిరిగి బాగుగా అరచుచూ బార్ల ముందు కొచ్చి బోర్లబడిరి - కోట
Read More

పునర్జన్మ

పునర్జన్మ దివారాత్రాలు విరామమెరుగక.. నన్ను వెంటాడి వేధిస్తున్న... విచ్చుకత్తుల్లాంటి ఆలోచనలు.. నా మది మందిరాన్ని... విచ్చిన్నం చేస్తూనే ఉన్నాయి.. ఇక అలుపొచ్చి .. ఆగిపోయాయేమో అనుకున్నా.. వేదనతో మరణించిన... అంతరంగ భావనలు.. ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడే.. అక్షరాలుగా పునర్జన్మ పొందాయి.. - మామిడాల శైలజ
Read More

గతం ఉత్తేజితమా పరాభవమా

గతం ఉత్తేజితమా పరాభవమా గతమంతా మంచేనా ఇప్పుడు జరిగేది మంచిగా గతంలో పాఠాలు నేర్పింది ఒక లక్ష్యాన్ని ఏర్పరిచింది కొన్ని గాయాలు చేస్తే కొన్నిటిని కొందరిని కొన్ని కలలను ఆశలను అన్నిటిని కోల్పోయేలా చేసింది గతమంతా మంచిది కాదు అలాగని చెడు కాదు పోయిన సంవత్సరం ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలు అనుభవించేలా చేసింది. గత ఏడాది అనుకున్న కలలు ఆశలు ఏవి నెరవేరకుండానే సగంలోనే మాయమైపోయాయి. జీవితం అందంగా ఉంటుందని ఎంతో ఆశించాను కానీ ఆ జీవితం అంధకారమవుతుందని ఊహించలేకపోయాను ఊహించనివి జరగడమే జీవితం అని అప్పుడే పాఠాలు నేర్చుకున్నాము. అనుకున్నది జరగదు కోరుకున్నది రాదు. చేసి చేయగలిగేది చేయలేము అనుకున్నది సాధించలేము అని నిరాశ పడుతున్న సమయంలో ఎక్కడో ఒక చోట చిన్నగా ఆశ అనేది మొదలైంది ఆ చిన్న దీప కాంతి మెల్లిగా పెరుగుతూ పెరుగుతూ పెద్దదయింది ఆ ఆశ తీరాలి ఆ లక్ష్యం నెరవేరాలి అనుకుంటూ…
Read More

ఎవరు పార్ట్ 9

ఎవరు పార్ట్ 9 అబద్ధం కాస్త ఘాటుగా ముక్కుకి పొగాకు వాసన తెలుస్తుంది. కళ్ళు తెరవగానే పొగ, ఏంటా అని చూస్తే పోలీస్ ఆఫీసర్ పొగాకు కాలుస్తూ ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నారు. మండుతున్న కళ్ళను నలుపుకుంటూ వెళ్లి మొహం కడుక్కుని వచ్చాను. “నా పేరు కేశవ, కనుమూరి కేశవ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్” ఆ పేరు, వృత్తి రెండు కొత్తగానే అనిపించాయి. “నా పేరు ....” “తెలుసు, నిన్ను కలవటానికి ఒక రోజు పట్టింది. మైకం వదిలిందా?” “అది... కాస్త మందు..” “తెలుసు మద్యం ఎక్కువైంది అని, అందుకే ఇప్పుడు వచ్చా... చెప్పు” “ఏమి చెప్పాలి?” “ఇంకా ఏమి చెబుతావు, మహేష్ గారిని ఆఖరిసారిగా చూసింది నువ్వే, దాని గురించి వివరాలు చెప్పు?” “ఓ అదా..” పోలీసు, కళ్ళు కాస్త చిన్నవి చేసి “వేరే ఏదైనా ఉందా?” నేను కాస్త ఆగి “ఆహా, లేదు” “ఆ రోజు ఏమైంది…
Read More

నాలో మార్పు

నాలో మార్పు ఎన్నో ఆశలు మరిఎన్నో కోరికలు కాలం అనే గడియారంలో నేను ఎటు వైపు వెళుతున్నానో నాకే అర్దం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు కథలు చదవడానికి ఇష్టం పెంచుకున్న అదే సమయంలో కొత్త వాళ్లతో పరిచయాలు అయ్యాయి... ఇంట్లో జరిగే మొదటి శుభకార్యానికి నేను వెళ్ళలేకపోతున్నా అనే బాధలో ఉండగా బాధ తెలియకుండా నన్ను ఆనందంగా ఉండేలా చేశారు... వాళ్ళతో గడిపిన రోజులను నేను ఎప్పటికీ మర్చిపోలేను... కథలు రాయమని ప్రోత్సహించారు.. నేను కూడా అందరిలా రోజు మొత్తం బిజీగా ఉండేదాన్ని... బాధ, సంతోషం, గొడవలు అన్ని రకాలు అనుభవించాను... నాలో మార్పు కారణం చాలా మంది ఉన్నారు.. నన్ను కొన్ని విషయాలలో వెనక్కి తగ్గేలా చేశారు.. ఎంత బాధ పడినా ఒదార్పి లేని మనిషిగా మిగిలిపోయాను... ఇప్పుడిప్పుడే భవిష్యత్తు మీద నమ్మకం కలుగుతుంది.. నాలో మార్పు కారణం ఒకటి అని చెప్పలేను... చాలా ఉన్నాయి.. చిరునవ్వుతూ కొత్త సంవత్సరానికి…
Read More

పెళ్ళి చూపులు

పెళ్ళి చూపులు "ఏమే సుజాత టి తీసుకునిరా" "ఆ తెస్తున్నానండి. ఏమిటి ఈ రోజు తొందరగా వచ్చారు?" "ఆ బ్యాగు ఇటు ఇయ్యి టైమ్ కి వస్తా" "వద్దులెండి" "ఏమిటి లోపల గుసగుసలు." "పక్కింటి సుబ్బారావు గారికి పెళ్ళి చూపులపుడు జరిగిన సంఘటనలు అండి". మొదటి పెళ్ళి చూపులపుడు పెళ్ళి కూతురు తన గదిలోకి తీసుకెళ్ళి బాయ్ ప్రెండ్ తో దిగిన ఫోటోలు చూపించిందట. రెండో పెళ్లి చూపులపుడు పాటలు పాడటం వచ్చా అని అడిగితే "ఉ" అన్నదట, తన పేరు అడిగినపుడు కూడా "ఉ" అన్నదట, నీకు మాటలు రావా అని అడిగినపుడు "ఉ, ఊ" అన్నదట. మూడో పెళ్ళి చూపులపుడు వంట చేయడం వచ్చా అని అడిగితే నవ్వుతూ వాళ్ళ అమ్మ వైపు చూస్తే ఆమె బాగా చేస్తుంది అన్నది, ఎంత వరకూ చదువు కున్నావు అని అడిగినపుడు కూడా వాళ్ళ అమ్మ వైపు చూసింది, ఆమె డిగ్రీ…
Read More

నీ స్నేహం

నీ స్నేహం మన ఆట పాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహ బంధం. స్నేహమంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు, మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాని చెప్పటం. కులమత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. గాయపడిన మనసుని సరిచేసేందుకు, స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. నీగురించి అన్నీ తెలిసిన వ్యక్తి, కలవలేక పోయినా నీతో ఇంకోసారి సహవాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే. విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది, స్నేహితుడి విలువ. నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ, నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం నీకున్నాం…
Read More

మనసుకి బాధ

మనసుకి బాధ మనసుకి బాధ అనిపించిన్నప్పుడు కన్నీళ్లు ఉప్పొంగిన గోదారి లా ఆగకుండా ఉప్పొంగుతుంటాయి.. మనసుకి బాధ కలగకుండా ఉండేందుకు నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏదో ఒక సందర్భంలో మనసు బాధ పడేలా జరుగుతుంది.. కానీ ఒకటి నిజం మనసుకి నచ్చిన వాళ్ళతో ఉండే ఆ బాధన్ని మర్చిపోయే మార్గం ఒక్కటే.. మనసుకి బాధ కలిగితే ఉప్పొంగిన గోదారి లా వస్తే మాత్రం అప్పుకోవడం చాలా కష్టం ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి.. ⁠- మాధవి కాళ్ల
Read More

మార్పు

మార్పు ఎన్నో ఆశలతో... కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన నాకు... దేవుడు నిజంగానే... చాలా కొత్తగా నా జీవితాన్ని మలిచాడు అనిపించింది.... కానీ ఎన్నో ఒడుదుడుకులు ఎదురుకుంటూ... ఈ సంవత్సరాన్ని పూర్తి చేశాను రోజులు చాలా అందంగా గడుస్తున్నాయి.... అలా నాలుగు నెలలు గడిచాయి... ఆరోజు నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది...  ఏప్రిల్ 30 ఆదివారం సాయంత్రం 3:10 గంటలు...  నేను నా ఆఫీస్ వర్క్ ఉంది అని ఆరోజు ఆఫీస్ కి వెళ్ళాను.... ఆఫీస్ వర్క్ పూర్తి చేసి.. కాసేపు మా ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు కాకరకాయలు చెప్పుకుంటున్నా... ఇంకా ఇంటికి వెళ్ళాలి అని వాళ్ళకి బై చెప్పి మెట్రో స్టేషన్ కి వెళ్లాను మాదాపూర్ మెట్రో స్టేషన్: నేను మెట్రో కోసం వెయిట్ చేస్తున్న... 3 గంటలకి మెట్రో వచ్చింది.. నేను మెట్రో ఎక్కి కూర్చున్నా.. నెక్స్ట్ స్టాప్ లో తను మెట్రో ఎక్కాడు... తనని చూడగానే…
Read More