Month: January 2023

Happy new year

Happy new year కొత్త ఆశల వేదికలుగా సరికొత్త సన్నాహాల సమీరంగా మార్పుకు ఆహ్వానం పలుకుతూ మదిలో సంతోషాలు నింపుకొని కొత్త ఉత్సాహంతో సరికొత్త నిర్ణయాలతో సాగమటోంది కొత్త సంవత్సరం నిన్నటి రోజు అనుభవాలతో మది తొలిచే సందేహాలతో ఆశయాల అడుగులలో విజయాల బాటలో ఆరోగ్యం చెదరనీయక చిట్టి కోరికల చిట్టాలతో కొత్త వెలుగుల కోణాల్లో కొత్తదనాల ప్రపంచంలో ఆశల రెక్కలు విప్పుకొని లక్ష్యాల లాంఛనాలు పూర్తి చేసుకోవాలి శాంతి సౌఖ్యాలతో వెలుగొందాలి కొత్త సంవత్సరం ప్రారంభతో ప్రపంచమంతా....? - జి జయ
Read More

ఆడపిల్ల

ఆడపిల్ల నీ ఒడిలో చేరే ఆడపిల్ల నీ చూపుల చెరలో చిక్కే చంటిపిల్ల నీ చర్య కి చలించిపోయి చిన్నపిల్ల నీ అఘాయిత్యాలకు అక్రందనతో విలవిలలాడే ఆడపిల్ల నీ మరణం కోసం మరణశాసనం రాసే ప్రతి మహిళ.. - సూర్యక్షరాలు
Read More

ఎవరు పార్ట్ 8

ఎవరు పార్ట్ 8 “లక్ష్మి, ఏంటి అలా మౌనంగా ఉన్నావు?” “మౌనం ఏమి ఉంది, పని చేస్కుంటున్నా, రేపే మహేష్ గారి పుట్టిన రోజు, చాలా పనులు ఉన్నాయి.” “లేదు. ఎందుకో కోపంగా ఉన్నావు” “మీ మీదా?” అవును అన్నట్టు తల ఆడించాను. “మీ మీద నాకు ఎందుకు కోపం” “కోపం లేకపోతే మొహం ఎందుకు చాటేస్తావు?” “రాయుడు గారు, నా పని నన్ను చేసుకోనివ్వండి. మీరు ఇక్కడ అధికారి, అధికారం చూపిస్తే అందంగా ఉంటుంది, అలా కాకుండా ఇలా అమ్మాయిలు మీద అనురాగాలు కురిపిస్తే ఉన్న పని, పనితో పాటు పరువు రెండూ పోతాయి.” కాస్త ఘాటుగానే మాట్లాడింది. “కనీసం ఇది అనురాగం అని అర్ధం అయ్యింది, లేకపోయి ఉంటే ఇంకా ఎన్ని అనే దానివో. వస్తాను” అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న నాకు అద్దంలో నన్ను తను చూస్తున్నట్టు కనిపించింది. ఈ అమ్మాయి అర్థం కాదు. ఎందుకు ఇలా…
Read More

నూతన సంవత్సరం

నూతన సంవత్సరం రోజులు మారుతున్నాయి... కాలం ఆగకుండా పరుగెత్తుతూ ఉంది.. నిమిషాలు గంటలు అయ్యాయి గంటలు రోజులు అయ్యాయి.... రోజులు కాస్త సంవత్సరం కూడా అయ్యింది... కానీ మన జీవితాల్లో మార్పు రాలేదు...  ఈ సంవత్సరం పోతుంది అని బాధ పడలా.. ఇంకో సంవత్సరం వస్తుందని సంతోషించాలో.. తెలియడం లేదు... ఒక్కో రోజు కాలం ఒక్కో పాఠం నేర్పుతుంది. ఈ జీవన ప్రయాణం లో.. అలాంటి ఒక సంవత్సరం ఎన్ని నేర్పించి ఉంటుంది... ఎన్ని తీపి గురుతులు... ఎన్ని చేదు అనుభవాలు... ఎన్నో ఎన్నెన్నో ఇచ్చింది... అన్నిటినీ ఈ సంవత్సరం చివరి రోజు అయ్యో వెళ్ళిపోతుంది.... మళ్ళీ ఆ జ్ఞాపకాలు తిరిగి రాలేవే.... చేదు అనుభవాలు అయ్యో అలా చేశామే... ఆ రోజు ఇలా జరిగిందే అని ఈ రోజు బాధపడిన... సంవత్సరం అంకె మారుతుంది క్యాలెండర్ లో అంతే ఇంకా అంతకు మించి జరిగేది ఏమి లేదు... కానీ బాగా…
Read More

మార్పు

మార్పు ఇంకా ఎన్ని ఏళ్లు దాటిన వారిలో మార్పు వస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు నిన్ను వాళ్ళకి నచ్చినట్టు ఇబ్బంది పెడుతున్నారు.. నీలో ఎప్పుడు మార్పు వస్తుందో నాకు మాత్రం అర్దం కావడం లేదు.. వాళ్ళలో మార్పు రావాలంటే ముందు నీలో చైతన్యం రావాలి అని నేను తనకి చెప్పాను.. ఒక రోజు తనలో చైతన్యం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.. తనలో చైతన్యం రావడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను.. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి నాకు ముందే బుద్ది చెప్పింది.. ⁠- మాధవి కాళ్ల
Read More

పరువు లేఖ

పరువు లేఖ పరువు లేఖ పంతం తెలియదు కానీ పరమార్థం మాత్రం ఒక్కటే! పరువుల పలకపై పంతాల అక్షరాలై జీవితాన్ని చిన్నాభిన్నం చేసి పరుగు పెట్టించి పోయిన పరువును కాపాడడానికి ప్రాణాలను హరిస్తూ సమాజపు సందేశాలను సహనంగా చూసి సర్దుకుంటే భవితకు పునాది అవుతుంది లేనిచో పరువు లేఖల పంచాంగంగా మారి ఇతరుల కోసం ఇష్టాలు చంపుకుని సమాజానికి తలవొగ్గి మానవత్వం మంటకలిసి మనుషుల ప్రవర్తనప్రాణం కన్నా పరువుముఖ్యమని తోచినట్టు చేయడం కాకుండా కాల నిర్ణయానికి కట్టుబడకుండా సాహసంచేసిచావుచెంతకు చేరడానికి ప్రయాణం పరువు లేఖల ప్రస్థానం నిరోధించి తీరాలి నిజాయితీగా నిలబడి గెలవాలి జీవితంలో.....? - జి జయ
Read More

పరువు లేఖ

పరువు లేఖ అమ్మ పావని బంగారు తల్లి ఎలా ఉన్నావ్ అమ్మా. అప్పుడే నువ్వు వెళ్లి వారం రోజులు దాటింది అయినా నువ్వు కళ్ళముందు తిరుగుతున్నట్లే ఉంది. నాన్న నాన్న అంటూ నా వెనకాలే తిరుగుతూ ఎప్పుడూ నన్ను ఆటపట్టించే నీ చిలిపి అల్లరితనం నాకు చాలా గుర్తొస్తున్నాయమ్మా... ఇక మీ అమ్మ అయితే నిన్ను తలవని క్షణం లేదు పావని కి ఆ కూర అంటే ఇష్టం ఈ కూర అంటే ఇష్టం అంటూ ఎన్నో రకాలుగా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఒక్కగానొక్క కూతురివని అల్లార ముద్దుగా పెంచాను నువ్వు అడిగిందల్లా నీకు కొనిచ్చాను నాన్న ఫోన్ కావాలంటే ఫోను, సిస్టం కావాలంటే సిస్టం నీకు నచ్చిన బట్టలు, బంగారం ఏదైనా నాకు తలకు మించిన భారమైన నిన్ను బాధ పెట్టకూడదని నా ఒక్కగానొక్క కూతురి కోరికలన్నీ తీర్చాలని అనుకున్నాను ఏ లోటు రానివ్వకూడదని నిన్ను నిలువెత్తు బంగారంలా…
Read More

నీ రాక

నీ రాక నిన్ను ప్రేమించే ఒక మనిషి ఇక్కడ ఉంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావా... నీ రాక ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా.. మనం కలిసి ఉన్నంత కాలం గొడవలు పడుతూ కాలాన్ని మార్చిపోయాము.. కారణాలు ఏవి అయిన నువ్వు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు.. నీకై నా ఎదురు చూసే నీ నేను గా నీ జీవితంలో మిగిలిపోతాను... ⁠- మాధవి కాళ్ల
Read More