Month: January 2023

నేను.. నా సంక్రాంతి

నేను.. నా సంక్రాంతి అచ్చమైన తెలుగు పండుగ.. అందరూ జరుపుకోవాలి నిండుగ.. తెలుగు భాష అభివృద్ధి చెందాలి మెండుగ.. అద్భుతమైన సంక్రాంతి.. ప్రతి ఇంటా వెల్లి విరిసెను ఆనందాల కాంతి.. మూగబోయిన పల్లెకు మైకులతో మాటలు . డూ డూ బసవన్నల డాన్సులు.. రంగురంగుల రంగవల్లులు.. చుక్కలను తాకేంతగా గాలిపటాల పోటీలు.. ముద్దుకే ముద్దొచ్చే అతివల అలంకరణలు.. పిండి వంటల ఘుమఘుమలు.. భూజనంబులు మెచ్చు భోజనములు. మైమరిపించే ఆతీథ్యాలు. ప్రేమానురాగాలు పంచే ఆత్మీయతలు.. పల్లెల శోభ అనిర్వచనీయం.. బంధువుల కలయిక ఆనందనీయం చిన్నపిల్లల ఆటపాటల కేరింతలు.. అవి చూసి పెద్దవాళ్ల మనసులో కలిగిన హాయి పులకింతలు.. అలుముకున్న వసుదైక కుటుంబ ఛాయలు.. నా ఊరు అని మదిలో కలిగిన భావనలు.. ఎంతో గొప్పవి మన పండుగలు మరెంతో గొప్పవి మన సాంప్రదాయాలు.. అందుకే సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవించు వేద శాస్త్ర సారాలను అనునయించు మంచి మనిషిగా జీవించు.. భారతీయుని గా గర్వించు..…
Read More

అన్వేషణ ఎపిసోడ్ 1

అన్వేషణ ఎపిసోడ్ 1 ఆ రోజు ఆదివారం, సుమారు అర్ధరాత్రి ఒంటిగంట ఆ ప్రాంతంలో జూబ్లీహిల్స్ పరిధిలోనున్న పోలీస్ స్టేషన్ కి ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చింది. "హలో..! సార్ ..! సార్..! జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ ఆ అండి ! హా.. అవునయ్య (ఆ రాత్రి డ్యూటీలోనున్న కానిస్టేబుల్ బదులిచ్చాడు) "ఇక్కడ ... ఇక్కడ... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, లక్ష్మి విలాస్ అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 333 (అడ్రస్ కల్పితం) లో ఒకావిడని అతి దారుణంగా చంపేశారు సార్! మీరు త్వరగా ర్ర.. ర్ర.. ర్రండి సార్! (కొంచెం కంగారు పడుతూ తడబడుతున్న స్వరంతో)" అంటూ విషయం చెప్పి సడెన్గా కాల్ కట్ చేశాడు ఆ అజ్ఞాత వ్యక్తి. అది విన్న కానిస్టేబుల్ తన పై అధికారులకు సమాచారమివ్వడంతో, హుటాహుటిన ఆ అజ్ఞాత చెప్పిన అడ్రెస్స్ కి బయలుదేరి వెళ్ళారు ఆ పోలీసు వారంతా. వాళ్ళు అక్కడికి చేరుకునే…
Read More

అనుకోని ప్రయాణం సమీక్ష

అనుకోని ప్రయాణం సమీక్ష అనుకోని ప్రయాణం అంటే ఏదో మామూలు సినిమా నేమో అని అనుకున్నాను కానీ ఇది మనసుకు హత్తుకునే సినిమా అని మొదలైన కాసేపట్లోనే అర్థమైంది. ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ఊర్లో నుంచి భువనేశ్వర్ కి వలస కార్మికులుగా వచ్చిన కొందరి జీవిత కథనే అనుకోని ప్రయాణం. ఈ అనుకోని ప్రయాణంలో మొదటగా మనకి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు, ధన్ రాజులను చూపిస్తూ వారి జీవితంలో ఉన్న ఎత్తుపల్లాలను మనసుకు కదిలించేటట్లు చూపించారు. నరసింహారాజు, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ స్నేహితులు. ఒకే గదిలో ఉంటూ భువన కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు వాళ్లంతా ఒక కాలనీలోని వివిధ గదుల్లో నివాసం ఉంటారు అయితే రాజేంద్రప్రసాద్ కి పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఉండదు కానీ నరసింహ రాజుకు మాత్రం కుటుంబం ఉంటుంది ఒక కూతురు ఉంటుంది ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నట్లుగా చూపిస్తారు.  ఆమె…
Read More

సంక్రాంతి సంబరం

సంక్రాంతి సంబరం రంగు రంగులుగా ఎగిరిన గాలిపటాలు.. చెంగు చెంగున చిందులేసిన ఆడపడుచులు.. హరి హరి అని హరిదాసుల సంకీర్తనలు.. వీధి వీధి లో తిరిగిన రథాల రంగవల్లులు.. గుమగుమలాడిన రుచికరమైన పిండివంటలు.. గడప గడపలో నర్తించిన ఆనందాలు.. ఇంటింటా జరిగింది కదా సరదాల సంక్రాంతి సంబరం..! - అక్షిత
Read More

తళతళలు

తళతళలు హేమంతంలో ఘనీభవించిన జ్ఞాపకాల తుషారం నిషా కనుల నిశీధి విడిదిని ఖాళీ చేస్తుంది! వేడుకై ప్రభాతం మనసుకు ముచ్చట్ల చద్దిమూట విప్పుతుంది! బాసలుచేసిన వెచ్చని వెలుగుల చెలికాడు వెంటే ఉండి ఆశల ఆశ్వాసాల ఊపిరిలద్దుతుంటాడు! ఊరుకోని పాదాలు ఊరికి ప్రదక్షిణ చేస్తూ ఉత్తరాయణ అర్చన చేస్తుంటాయి! కాలం కొమ్మమీద వర్తమాన కోయిల రొదచేస్తూ ఉంటుంది కలం పొదిగిన అక్షరాలన్నీ నీరెండలా తళతళమంటాయి - సి. యస్ .రాంబాబు
Read More

సంక్రాంతి ఉదయం

సంక్రాంతి ఉదయం ప్రకృతి ప్రేమ లో పరువళ్ళు త్రోక్కుతూ మకర సంక్రాంతి మసక వన్నెల్లో మనసు మంత్ర ముగ్ద మైన ముగ్గుల రంగుల్లో... వెచ్చని పచ్చని ఉదయం స్వాగతం చెప్పిన వేళలో వసంత గాలి, తాటి చప్పుళ్ళు బసవన్న అమాయకపు ఎదురు చూపు... ఏదో ఇస్తూ.... తీసుకుంటూ.... మౌనంగా మాట్లాడుతుంటే సత్యమే శివమైతే.... అదే సుందరం... కదా... మంచు పొగల్లో.... మెత్తగా మకరాదిత్య కిరణాలు హృద్యంగా పలకరించే.... వసుధ్యేక కుటుంబం లో కల కాలం సుఖ సంతోషాలతో కలిసిఉండాలని దీవిస్తూ.... చిగురించే కొత్త విజయాలను సాధించి ఆస్వాదించాలని ప్రసాధించే ఉదయం... మకర సంక్రాంతి ఉదయం అందుకే పూజ్యులు, పెద్దలు, పిన్నలు స్నేహితులు అందరికి పేరు పేరున మకర సంక్రాంతి హృదయ పూర్వక శుభాకాంక్షలు. - అల్లావుద్దీన్
Read More

సైనికుడు

సైనికుడు సైనికుడా!... మండే ఎండకు కరిగే మంచుకు చీల్చే తూటాకు ఎదురేనా నీ పయనం... అడుగడుగునా సుడిగుండం అవనికై సాగు పోరాటం అమ్మేగా ఈ భారతం ఆప్తులే ఈ జనమంతా.... ఏ పొగడ్త సాటి నీకు ఏ గౌరవం సరి తూగదు నీకు ఎగిరే పతాకమే నీ పొగరు పొంగే లావా నీ నెత్తురు..... ఆకలితో అలమటించినా గాయాలతో బరువనిపించినా శ్వాసే అలసిపోయినా వెనుదిరగని బాణం నువ్వు.... - హనుమంత
Read More

విజ్ఞానం -వివేకం

విజ్ఞానం -వివేకం "ఏ పుస్తకం నీ జీవితంలో ఏ సమయంలో నీ ప్రపంచాన్ని కుదిపివేసి నువ్వు అంతకుముందెన్నడూ ఊహించని మార్గాలలో నువ్వు అభివృద్ధి అయ్యేందుకు ఉత్తేజపరుస్తుందో నీకు ఎన్నటికీ తెలియదు.."అన్నారు వర్క్ హెడ్జెస్. పుస్తకం యొక్క గొప్పతనం చెప్పాలంటే మనము చదివిన అందులోని ఒకే ఒక వాక్యం మన జీవితాన్ని మార్చగలదు. అక్షరానికి ఉన్న శక్తి అవధులు లేనిది. అనంతమైనది. అది ఒక్కోసారి మనల్ని మన మార్గంలో ఆగేలా చేసి మన జీవిత ప్రయాణ దిశను పూర్తిగా మార్చివేయవచ్చు. మనం వెళుతున్న దారి సరైనది కాదు అని చెప్పవచ్చు. మనల్ని జీవిత పర్యంతం వేధిస్తున్న సమస్యలకు ఒక్క వాక్యం ద్వారా పరిష్కారం చూపించవచ్చు. మన రంగంలో మనం ఇంకా ఉన్నతంగా ఎదగడానికి సోపానాలను నిర్మించవచ్చు. మనమున్న రంగంలో చేయబోయే పొరపాట్లు మన కంటే ముందే ఆ మార్గంలో నడిచినవారు చేసేసి వుంటారు. అందుకే మనం పుస్తకాలు చదవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న…
Read More

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి నీ చరణములే కోరితిమయ్యా నీ శరణమునే వేడితిమయ్యా మా వేదనయే తెలిసిన నీవు మార్గము చూపి కాపాడవయా చరణం నిను చూసినచో అలుపేలేదు నీ తలపొకటే చాలును మాకు అది కలిగించును ఎంతో హాయి మా నీడవు నీవే అండవు నీవే చరణం ఏడుకొండలను చూసినచాలు బతుకే మారును ఆ వేడుకతోటి కలియుగమందున అంతా మాయే నీ చూపొకటే సత్యము స్వామీ చరణం కాలినడకన నిను చేరాలని కోరిక కలిగెను తీర్చవ స్వామీ తప్పులు ఎన్నో చేసిన మాకు నిను దర్శించుటయే విరుగుడు స్వామీ చరణం కలలోనైనా కనిపించవయా మనసుకు కలుగును ఎంతో శాంతి గోవిందాయని పిలిచెదమయ్యా మా గుండెలలో నిలవాలనుచు - సి. యస్ రాంబాబు
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 9

డిటెక్టివ్ ఎపిసోడ్ 9 హాలులో అటూ ఇటూ పచార్లు చేస్తున్న సిద్ధార్థ అడుగుల శబ్దం విని తలెత్తి అలాగే వుండిపోయాడు. పింక్ కలర్ శారీ లో సుగాత్రి చాలా అందంగా వుంది. ఆలస్యమైనా అందంగా తనకళ్ల ముందుకు వచ్చిన ఐదడుగుల నాలుగంగుళాల అందాన్ని అలానే చూస్తూ వుండిపోయాడు. సుగాత్రికి ఆ చూపులు సిగ్గును పుట్టించాయి, ఒంట్లో వెచ్చని ఆవిర్లు సృష్టించాయి.  "ఎక్కడో ఓ సరసమైన కథలో చదివాను..గుప్పెడు స్లీపింగ్ వేసుకున్నా నిద్రపట్టనివ్వని అందం" అని నిజంగా చాలా మందంగా చ చ చాలా అందంగా చెప్పాడు రచయిత...." మనఃస్ఫూర్తిగా అన్నాడు సిద్ధార్థ. "పరాయి అమ్మాయిలని ఇలా ఓపెన్ గా పొగడ్డం మర్యాదస్తుల లక్షణం కాదు" చిరుకోపంగా అంది సుగాత్రి. "మరి మనం మర్యాదస్థులం అని ఎవరు చెప్పారు.. పక్కా మాస్.. జులాయి.. దేశముదురు... ఇడియట్.. నేనింతే..." నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. "తను మాటల్లో సిద్ధార్థను ఏమార్చలేనన్న విషయం ఆమెకు ఎప్పుడో తెలుసు..…
Read More