Month: January 2023

శిధిల జ్ఞాపకాలు

శిధిల జ్ఞాపకాలు కనికరంలేని కాలం... కానుకగా ఇచ్చిన... విధి వంచితమైన చిధ్రిత బ్రతుకు చిత్రంలో వివర్ణమైపోయిన నా కోటి ఆశల కుసుమాల శిధిల జ్ఞాపకాలు.. చిత్రవధ చేస్తూ అనుక్షణం వేధిస్తూ.. మది మందిరాన్ని.. ముళ్ళ పొదళ్ళా చుట్టుకొని.. ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. చిరకాలపు వేదనలకు చరమగీతం పాడాలని ఉన్నా.. నిరతం నీ ధ్యాసలో... నీ రాక కోసం వేచి చూస్తూ.. నిను చేరే క్షణం కోసం... పరితపిస్తూ... మోడులా జీవితాన్ని.. నడిపిస్తూనే ఉన్నా.. ఎందుకంటే... అనివార్యమైన ... ఈ బతుకు నాటకాన్ని... చివరికంటా.. అభినయించి వెల్లాలని... చిద్రితము: నలిగిపోయిన వివర్ణము : రంగులు వెలిసిపోయిన - మామిడాల శైలజ
Read More

యువత- పరుగెత్తు

యువత- పరుగెత్తు యువతలో ఉత్తేజం మొలకెత్తు అలుపెరుగక పరుగెత్తు ఊహలు జింక పిల్లలై ఉరకలెత్తు శ్రమిస్తే సుఖాలు నీ సొత్తు కష్టాలు తొలగి కోట్లకు పడగెత్తు - భరద్వాజ్
Read More

లంగరెత్తుదాం

లంగరెత్తుదాం ఉక్కపోత బంధనాలను ఛేదించి మనిషిని ఆలింగనం చేసుకోవాలి మానవత్వానికి ఊపిరులూది జీవుడే దైవమని చాటాలి! మూఢనమ్మకాల గోడలను పెకలించి మూకమనస్తత్వాలను బానిస ధోరణులను సంస్కారయజ్ఞంలో సమిధలను చేసి నూతన సమాజానికి పునాదులేద్దాం! జీవిత పాఠాన్ని నెమరేసి ముసురు మబ్బును తొలగించి చిగురించే వేకువలో వినిపించే రాగమై లంగరెత్తుదాం! - సి. యస్. రాంబాబు
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 7

డిటెక్టివ్ ఎపిసోడ్ 7 నేలంతా దుమ్ము కొట్టుకుపోయి వుంది.. లోపలికి అడుగుపెట్టి అన్నాడు కాస్త భయపడుతూనే జేమ్స్ "మనకు జేమ్స్ సీక్రెట్ గా దాచిపెట్టిన సాక్ష్యం కావాలి. అది ఓ పెన్ డ్రైవ్ లో ఉన్నట్టు సమాచారం" అన్నాడు సిద్ధార్థ "ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో ఎలా కనిపెట్టడం? జేమ్స్ అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ జేమ్స్ వైపు చూసి చెప్పాడు చిరునవ్వుతో "చనిపోయిన మీ ఫ్రెండ్ డేవిడ్ ను అడుగు" జేమ్స్ ఉలిక్కి పడ్డాడు.. డేవిడ్ ను తను అడగడమే? సిద్ధార్థ జోక్ చేస్తున్నాడా? "అడుగు భయ్యా.. నువ్వడిగితే తప్పకండా చెబుతాడు... "నింపాదిగా అన్నాడు సిద్ధార్థ జేమ్స్ కళ్ళు మూసుకున్నాడు... అడుగుతున్నావా? అడుగు..." అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ మనసులోనే డేవిడ్ ను అడిగిన ఫీలింగ్ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి షాకయ్యాడు.. డేవిడ్ నడుస్తున్నాడు.. అతని అడుగుజాడలు దుమ్ము మీద ముద్రలుగా పడుతున్నాయి. ఒక్కక్షణం నమ్మశక్యం కానట్టు నేలవైపు చూసాడు. దుమ్ములో…
Read More

పేరు లేని బంధం

పేరు లేని బంధం పేరు లేని బంధాలకు కూడా ప్రేమ అనే రుణ బంధమే! మన కోసమై వెచ్చించిన సమయం ఎదుటివారితో వేరుపడని బంధమే కదా! మరొకరితో మృదు భాషనైనా చేయు సేవ అయినా మనకు ఉపశమనమే ! కొన్ని బాధ్యతలు పేరు లేని బంధాలను మోసుకొస్తాయి పెంపుడు జంతువులు విశ్వాసనీయ సహచరులు ఏకాంతపు చీకటిలను తొలగించే సహవాసకులు ఇది పేరు లేని బంధమే! ఒంటరితనాన్ని తెలియకుండా చేసే వ్యవసాయ క్షేత్రాలు బంధమై నిలిచేను ! అణువణువు నా అభిమానాన్ని నింపుకుంటూ నివసిస్తున్న గృహం ఉత్తమమైన బంధం! నలిగే మనసుకు నాలుగు దిక్కులే తోడుగా అందించే అందమైన బంధం! కాల క్షేపం కోసం సంతోషాన్ని ఇచ్చే మీడియా సాధనాలు అన్ని బోధపడే బంధాలే! ప్రేమకు వారదులుగా నిలిచి మానవతను నింపే ప్రతిఒక్కటి మనిషి మైత్రీవనంలో పేరు లేని బంధాలుగా మిగులుతాయి.....? - జి జయ
Read More

చీకటి ప్రపంచం

చీకటి ప్రపంచం చీకటి అనేది అందరిలో ఉంటుంది కానీ నేను మొదట్లో ఉన్నప్పుడు నేను చాలా బాధ పడ్డాను. రోజులు గడిచే కొద్ది అలవాటు అయిపొయింది... గమ్యం లేని మనిషిగా బ్రతికాను... నాలో మార్పు కోసం ఎదురు చూస్తూ నా గమ్యం ఏంటో తెలుసుకొని చీకటి ఉన్న వెలుగుని చూస్తూ బ్రతుకుతున్నాను... నాకు ఎలాంటి కోరికలు, ఆశలు కానీ లేవు... కొత్త విషయాలను తెలుసుకుంటూ కొత్త స్నేహాలతో ఇప్పుడిప్పుడే పువ్వు పుడుతూ నవ్వడం మొదలు పెట్టుతుంది... గతంలో తాను ఉన్న ప్రపంచం వేరు ఇప్పుడు ఉంటున్న ప్రపంచం వేరు... అసలు అనుకోలేదు తను చీకటి ప్రపంచంలో ఉంటుందని ఇప్పుడు మాత్రం ఆ చీకటి చూసి భయపడక ఒక పేరు లేని బంధం లేకుండా బ్రతుకుతుంది... అప్పుడప్పుడు కన్నీళ్లకు చెప్పలేను కదా... అవి వస్తూనే ఉంటాయి.. ⁠- మాధవి కాళ్ల
Read More

డిటెక్టివ్ ఎపిసోడ్ 6

డిటెక్టివ్ ఎపిసోడ్ 6 నీతో జోకులేస్తానా జేమ్స్.. ఎంతకాదన్నా నన్ను ఎయిర్ పోర్ట్ నుంచి తీసుకువచ్చావు..." అన్నాడు సిద్దార్ధ "ముందు కూర్చోండి సర్ వేడివేడిగా కాఫీ తీసుకువస్తాను" అంటూ కిచెన్ వైపు కదలబోతుండగా అన్నాడు సిద్దార్థ "జేమ్స్ ఓసారి మీ ఫ్రెండ్ డేవిడ్ ను కలవాలి" "ఇప్పుడా? ఈ టైం లోనా? ఏమనాలో తోచక అన్నాడు... జేమ్స్ లో భయం మొదలైంది.. కంగారు ఆందోళన మొదలయ్యాయి ఒక ప్రశ్న వెనుక మరో ప్రశ్న... ఒక అనుమానం వెనుక మరో అనుమానం... అసలు ఏం  జరుగుతుంది? డిటెక్టివ్ సిద్దార్దకు చనిపోయిన డేవిడ్ తో ఏం పని? ఇప్పుడు తనేం చేయాలి? జరిగినదంతా డిటెక్టివ్ సిద్దార్ధకు చెప్పాలి. ఆ నిర్ణయం అతని మనసులోకి రావడంతో మనసు తేలికపడింది. "సర్ ఒకసారి ఇలా రండి.." అంటూ బయటకు తీసుకువెళ్లాడు. ఇంటి ముందు నిలబడి వున్నారిద్దరూ.... "సర్ నాకు అంత అయోమయంగా వుంది. మిమ్మల్ని నా క్యాబ్…
Read More

పేరు లేని బంధం

పేరు లేని బంధం ఒంటరిగా ఉన్న నాకు తోడుగా వచ్చావు.. కన్నీటిగా మారిని నా కళ్ళకు ఆనందాన్ని పరిచయం చేశావు.. నాలోని బాధను పంచుకోగా వచ్చావు... ఎవరు లేని నాకు నేనున్నా అనే బరోసానిచ్చావు.. నీకు నేనున్నా అని నా చేయి పట్టుకుని నడిపించావు... ఎన్నో కలలు కనే నా కళ్ళకు తోడై నిలిచావు.. నాకు సంతోషాన్ని పరిచయం చేశావు.. కన్నీళ్లను తరిమేసావు.. ఒంటరిగా ఉన్న నా ఈ జీవితంలో అడుగు పెట్టిన నీకు ఏ పేరు పెట్టను..? ఏ రక్తం సంబంధం ఉందని నాకు ఇవ్వన్నీ చేశావు..? ఏ జన్మ బంధానివి నువ్వు..? ఈ జన్మకు నాకు ఇలా తోడుంటున్నవు.. నీతో ఉన్న పరిచయానికి, ఒక పేరంటూ నేను పెట్టలేను... ఏ పేరు లేని బంధంగా... నిలిచిన మన ఈ పరిచయానికి కాలమే తగిన పేరు నిర్ణయిస్తుంది అని భావిస్తున్నాను.. - వనిత రెడ్డీ
Read More

అర్థ నారిశ్వర తత్వం

అర్థ నారిశ్వర తత్వం అర్ధనారీశ్వర తత్వం అంటే శివపార్వతులను చూపిస్తాం ఎందుకంటే వారు ఒకరిలో ఒకరు ఇద్దరిలో ఒకరై నిలిచారు ప్రతి జంటకు ఆదర్శంగా వారిద్దరిని చూపిస్తాం. తన భర్తను గౌరవించ లేదని తనకు తానే భస్మం అయిన భార్యను తనలో అర్ధనారిశ్వరీ శక్తి గా మార్చుకున్నాడు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్యా భర్తలు. పిల్లలు ఎవరి స్వార్థం లో వారున్నారు. ప్రేమ అంటూ అవసరాలు తీర్చుకోవడానికి వాడుకుంటూ, భార్య భర్తల బంధాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తూ అసలు తత్వాన్ని మరిచిపోయి కొన్ని సందర్భాల్లో తమను తాము హిందించుకుంటూ మరికొన్ని సందర్భాల్లో అవతలి వారిని సైతం హింసిస్తూ స్వార్థం కోసం ప్రాణాలు సైతం తీస్తున్నారు. అసలు భార్యా భర్త అనే పదాలకు అర్ధనారీశ్వర తత్వానికి అర్థం మారిపోయింది. గత పదేళ్ల క్రితం భార్య, భర్త, పిల్లలు ఈ బంధం అనేది ఎంతో అందంగా కనిపించేది. నాకు తెలిసిన ఒక…
Read More

మనిషికి మరో గ్రహంలో చోటు దొరుకుతే

మనిషికి మరో గ్రహంలో చోటు దొరుకుతే భూమాత రుణం తీర్చకముందే మనిషి మరో గ్రహం లో సంచరించాలని సాధన మొదలుపెట్టాడు? సృష్టిలోని జనన మరణరహస్యం చేదించాలని మనిషి పరితపన ! మనిషి మీద సుతో మరో లోకం కోసం ఆరాటం చంద్రమండలంలో చోటు కోసం కొత్త ఆలోచనలు అంగారకునిపై కంచెలు వేయాలని ఉత్సాహం అంతరిక్ష శోధన చేసి గ్రహాల్లో కాలు మోపాలని గ్రహాంతరవాసుల ఉనికి తేల్చాలని అన్వేషణ సృష్టికి ప్రతి సృష్టి చేయాలని నక్షత్రాలకు కూడా నామకరణం చేసి నయా దునియాను నిర్మించాలని! ఏ గ్రహంలోనైనా జీవం ఉండడానికి అనుకూలమేనా అని అంతరిక్ష శోధనలు ఉంటే మాత్రం ఆలస్యం లేకుండా ప్రయాణించాలని మనిషి ఉబలాటం అది తీరితే గ్రహాంతర బాట మరో గ్రహంలో మనిషి సంచారం కాగలుగునోమరి....? - జి జయ
Read More