aksharalipi

3275 Posts

నా జీవితం

నా జీవితం నా జీవితం లో అధిక భాగం, నేను ప్రవహిస్తూ, నిన్ను కనువిందు చేస్తాను. కొంతకాలం గడ్డకట్టి కఠిన శిల మాదిరిగా కనిపిస్తాను. నీవు ఎలా ఉన్నవో అలానే ఉండు. నన్ను చూసి జాలిపడి నీరై కారకు ! ఇది, నా జీవితం. - వాసు
Read More

నా వేదన

నా వేదన చుట్టూ పదిమంది ఉన్నా, చూడలేకపోతున్నా, చుట్టూ మాటలు మాట్లాడుతున్నా, మాట్లాడలేకపోతున్నా, ఎండలో మాడిపోతున్న, చెట్టు నీడ కోసం వెళ్లలేక పోతున్నా, ఈ కాంక్రీటు ఇళ్లల్లో మగ్గిపోతున్నా, గుక్కెడు నీళ్ల కోసం వెతుకుతున్న, గుండె మంటతో గొంతెండి పోతున్నా, ఎవరిని అడగాలో తెలియక అల్లాడి పోతున్నా, ఎవరిని ఎవరూ పట్టించుకోకుండా, ఎవరి పనులకు వారు వెల్లుతున్నా, ఒక్కరూ ఒక్కరూ అయినా ఆగక పోతారా, నన్ను చూడక పోతారా, నా ఆర్తీ ని తీర్చలేక పోతారా, అని నాలో నేను, నాతో నేను, మదన పడుతున్నా, కానీ నా లాంటి చిన్న జీవిని, పట్టించుకునే నాథుడే కరువయ్యారు, ఈ లోకంలో, ఈ జన జీవన స్రవంతి లో.... -భవ్య చారు
Read More

నువ్వే దేవుడివి

నువ్వే దేవుడివి మనకి వచ్చిన కష్టం ఎదుటి వారికి రాకూడదు అని ఎప్పుడు అయితే నువ్వు అనుకొన్నావో.. నువ్వే దేవుడివి.. సర్వం శివోహం... - మల్లి 
Read More

ఈ రాత్రి

ఈ రాత్రి   చుక్కలన్నీ నా చెంత చేరి నీ ఊసులు అడుగుతుంది చిరుగాలి నా వెంట నడచి నీ తలపులని గుర్తుచేస్తుంది చల్లని వెన్నెల నీ చెలికాడు ఎక్కడ అని ప్రశ్నిస్తుంది ఎదురుచూసి చూసి అలసిన మనసు నీ జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాయి నువ్వు నాతో ఉన్న ఆ వెన్నెల రాత్రుళ్ళు మనలో ఎంతకీ తీరని కోరికలు నువ్వు నాపై కురిపించే ఆ ప్రేమలో ఎంతకీ తీరని ఆశలు నువ్వు నన్ను హత్తుకున్న ఆ కౌగిలింతలో ఎంతకీ తీరని ముద్దులు నువ్వు నాకై వెంటబడే ఆ దోబూచులాటలో ఎంతకీ తీరని మలుపులు నువ్వు నాలో పెంచే గుండె దడలో ఎంతకీ తీరని మది సవ్వడులు ఈ వెన్నెల రాత్రి ఇలా వెలవెల బోతోంది నీ జాడలేక నీ ప్రేమలేక నీ స్పర్శలేక ఇలా నేను నా మైకంలో నీ పేరునే కలవరించి స్వప్నంలోనే నిదురించాను - హిమ
Read More

ఓ వెన్నెలమ్మా…

ఓ వెన్నెలమ్మా... ఓ వెన్నెలమ్మా వెన్నెల రాత్రులు, ఏ రోజైనా, ఎన్ని కాలాలు మారినా, యుగాలు  గడిచినా, వన్నె తరగని కాంతి నిచ్చే వెన్నెలను, నిండు చందమామకు వన్నె తెచ్చే వెలుగును, తారలు  మిల మిల మెరిపించే తళుకులను, గగనాన్ని చూసి మురిసిపోయే సమయాలను, జగాన  వెలుగుల విరజిమ్మే వేళలను, ప్రేమికుల మనసులు మెరిసిపోయే అందమైన క్షణాలను, కవుల మనసుల్లో భావాన్ని పుట్టించే రేయివిగా, జాబిలమ్మను అందించే వెలుగులు రాతిరిగా,  పూలకొమ్మలకు, వెన్నెలమ్మను ఆభరణంగా  అలంకరించే నడిరేయిగా, సర్వజగత్తుకు వెలుగును పంచే అద్భుతమైన రాత్రివి, అందమైన మనసుల్లగా, చల్లని  వెలుగుల వెన్నెలమ్మను అందించే జామురాతిరివి. తొలిరేయి అనుభవాన్ని, వెన్నల రాత్రి  అరుదైన అనుభూతిని, ఎన్ని మనసులైనా ఆస్వాదించేలా చేసే మైమరపు సమయాలను నింపుకున్నావు. ఆలుమగలు  వలపులతో అల్లుకుపోతున్న వేళలను, రాతిరిని రేయిగా మలిచే వెన్నెలను నింపుతున్నావు. నింపుకున్నావు. వెన్నెలరాత్రివి నువ్వు.  వర్ణనకు అద్భుతమైన ఆలోచనలు పంచే అధ్బుతానివి నీవు.... -బి. రాధిక
Read More

‘అ’ నుబంధం లో ‘ఆ’ నందం

'అ' నుబంధం లో 'ఆ' నందం అక్షరం అంటే అమ్మ! ఆడపిల్ల అంటే ఆదిశక్తి! అండ అంటే అన్న! ఆదర్శం అంటే నాన్న! అహం అంటే శత్రువు! ఆధారం అంటే మిత్రుడు! అభివృద్ధి అంటే వెలుగు! ఆగిపోవటం అంటే చీకటి! అన్నిటినీ, అందరినీ సమానం అనుకుంటే! సంయవనంతో, సహృదయంతో స్వీకరిస్తే, అందమైన భవిష్యత్తు. ఆది, అంత్యం, అన్ని కాలాలను ఒకేలాగా ఆస్వాదిస్తే, అదే సంతృప్తికరమైన జీవితం. - బి రాధిక
Read More

వెన్నెల రాత్రి

వెన్నెల రాత్రి   భగ భగ మండే సూర్యుడు ఇచ్చే వెలుగు రేఖలను చల్లని వెన్నెల జల్లుగా మారుస్తాడెలా చంద్రుడు? కష్టాల కొలిమిలో భగ్గుమంటున్న జీవితం కూడా ఓ సూర్యని వలె కాదా? అది పుట్టించే ప్రచండ కాంతులను వేడి సెగలను తట్టుకుని నిలబడే చంద్రులు.. నిండు పున్నమి నాడు జాబిలి చిలికే వెన్నెల రాత్రులుగా మలచగలరు!! - సుస్మిత
Read More

వెలిగే రంగు

వెలిగే రంగు రంగులన్నీ కలిసిపోయేది నలుపులోనే. రంగులన్నీ వెలిసిపోతే మిగిలేది తెలుపే. రోజు ముగిసినా, ఊపిరి ఆగినా! మిగిలేది చీకటే. బుద్ధి వికసించినా, బుద్ధితో నేర్చుకున్నా, వెలిగేది జ్ఞాన దీపమే! -బి రాధిక
Read More

పంచాంగము 03.02.2022

పంచాంగము 03.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *విదియ* ఉ8.38వరకు వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *శతభిషం* రా7.29వరకు యోగం: *పరిఘము* రా12.23 వరకు కరణం: *కౌలువ* ఉ8.38 & *తైతుల* రా8.09 వర్జ్యం: *రా1.50 - 3.26* దుర్ముహూర్తం : *ఉ10.21 - 11.06* & *మ2.51 - 3.36* అమృతకాలం: *మ12.26 - 2.00* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *మ6.00 - 7.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *కుంభం* సూర్యోదయం: *6.36* సూర్యాస్తమయం: *5.51* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

ఈ వేళ

ఈ వేళ ఈ..వేళా...నాతో  పకృతి జత కట్టి నాతో సహజీవిస్తూ నాలో మమేకమై నన్ను తన గాఢ పరిష్వంగనా కౌగిలిలో అలుముకుంది నాతో శుభ సాయంత్రమునా ఏవో ఊసులు కొన్ని చెప్పుకుంటూ తన వడిలో సేద తీర్చింది అలా ఊహల్లో తెలుతూ గగనం వైపు అలా చూస్తున్న నాకు చల్లని వింజామర గాలులతో కాస్త నిద్ర పుచ్చింది స్వప్నంలో పచ్చని చీర కట్టి నాకు స్వాగతమిచ్చింది నాకు ఎన్నో మధురానుభూతులు ఈ వేళా శుభ సాయంత్రాన మిగిలించింది...!! శుభ సాయంత్రం మిత్రులారా - సైదాచారి మండోజు
Read More