స్నేహం నిన్ను మెప్పించేలా మాట్లాడితే స్నేహం చేయటం, వారు నమ్మింది మాట్లాడితే స్నేహం చేయకపోవటం రెండు నీకే చేటు. స్నేహం కి నమ్మకం ముఖ్యం అది లేనిచోట స్నేహం ఉండదు. - సూర్యాక్షరాలు
విలువ లేని భావాలు అనుభవానికి మించిన ఆలోచన శక్తి కి మించిన బరువు వివరణ లేని సుఖం అర్ధం లేని ప్రేమ స్వచ్ఛత లేని నవ్వు నలుగురు లేని చావు ఇవి జీవితానికి ఒక విలువ లేని భావాలు. - సూర్యాక్షరాలు
గమ్యం నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో... నీ గమ్యం చేరలేవు. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. - సూర్యాక్షరాలు