Daily Quotes

ఆనందం కోసం ఎక్కడ వెతకాలి?

ఆనందం కోసం ఎక్కడ వెతకాలి? ఆనందం, సంతోషం కోసం ఎక్కడెక్కడో వేతకనవసరం లేదు... నిజమైన ఆనందం స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు దోరుకుతుంది... అరిటాకులో ఉపవాసం రోజు భోజనం చేసినప్పుడు దోరుకుతుంది... ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు దోరుకుతుంది... దైవ సన్నిదిలో ఉన్నప్పుడు దోరుకుతుంది... ఒక మంచి పని చేసినప్పుడు దోరుకుతుంది... దోరికిన వస్తువు తిరిగి ఇచ్చినప్పుడు దోరుకుతుంది... ఇతరులకు ఒక చిన్న సహయం చేసినప్పుడు దోరుకుతుంది... ఇతరుల సమస్యకు పరిస్కారం చూపినప్పుడు దోరుకుతుంది...
Read More

మరణాన్ని ఆపగలమా

    ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు...(సాధ్యమయ్యిందా ?) కానీ... ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు. మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు. తాను తినే ఆహారం ముందుగా లాబరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది. ఆయన పదుకొనె మంచం ఆయన పీల్చుకొనే ప్రాణవాయు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది. ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి. ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో/ కోరికతో జీవనం సాగించారు. అయ్యో, ఆయన విఫలమయ్యాడే! 50 సంవత్సరాల వయస్సులో, 2009 సం,…
Read More

ప్రేమ లేఖల పోటీ

ప్రేమ లేఖల పోటీ ప్రేమ అందమైన పదం, అందమైన భావం, జీవితంలో ఒక్కసారి అయినా ప్రేమలో పడాలని అనుకోనిది ఎవరు? మొదటి ప్రేమ, రెండో ప్రేమ అంటూ రకరకాల ప్రేమలో పడతాం, ప్రేమంటే ప్రేమికుల మధ్య ప్రేమనే కాదు తల్లి, తండ్రి, సోదరుల ప్రేమ కూడా.... అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమలో ఇలా చెప్తూ పోతే బోలెడు ప్రేమలు. ప్రేమికుల పై ఎంత ప్రేమ ఉందో చెప్పొచ్చు, కానీ మిగిలిన వారి పై ఎంత ప్రేమ ఉందని చెప్పలేక పోవచ్చు. అసలు ఆ సందర్భం రాకపోవచ్చు. వారికి తమ ప్రేమను చెప్పలేక పోయాను అనే బాధ ఉండొచ్చు. అలాంటి ప్రేమను లేఖల ద్వారా చెప్పండి.  మీ ప్రేమ అక్షరాలను మాలలుగా కూర్చి పంపండి. అక్షర దోషాలు లేకుండా అందంగా మీ ప్రేమను తెలియచేయండి.. లేఖలు పంపిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుంది. షరతులు వర్తిస్తాయి. రచనలు తిరిగి…
Read More

స్నేహం

స్నేహం ఎక్కడో  పుట్టాము ఇక్కడ కలిసాము, స్నేహం అన్నావు  కలిసి ఉందాం అన్నావు , కలగానే మిగిలావు, కమ్మని ఉసులూ చెప్పావు , కబుర్లతో కాలాన్ని మరిపించావు, కవితలెన్నో అల్లావు,   కళ్ళలో నిలిచావు , హట్టాత్తుగా , అర్దాంతరంగా  కనుమరుగు అయ్యావు, ఏమయ్యిందని అడిగితే  సమయం లేదన్నావు  కాలం కలిసి రాలేదన్నావు  కబుర్లు లేవన్నావు,  కవితలు మరిచావు , ఆప్పుడర్ధమయ్యింది , కలిసి రానిది కాలం కాదని  కలవాలంటే కలిమితో  లేని నేనని , నిజమే  పేదవాడి స్నేహం లాభం కాదని నీ మాటల వల్లె  తెలిసింది, ఈ రోజుల్లో స్వచ్చమైన స్నేహం  ఎడారి ఒయాసిస్సు  అని  తెలుసుకోలేక పోవడం ముమ్మాటికి  నా తప్పే అందుకే తప్పుకుంటున్నాను  మిత్రమా స్నేహం అంటే లాభాల బేరీజు కాదని  అదొక తీయని అనుభూతని నీవు  తెలుసుకున్న  రోజే మన స్నేహానికి ఒక అర్ధం పరమార్ధం ....  నువ్వెక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకునే నీ …
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు అక్షరలిపి  పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అక్షరలిపి యాజమాన్యం తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో విలసిల్లాలని మీ లక్ష్యాలు, కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది మీ అక్షరలిపి టీం...
Read More

అక్షరలిపి సంక్రాంత్రి కథల పోటి (గడువు పొడిగించడం జరిగింది)

అక్షరలిపి సంక్రాంత్రి కథల పోటి (గడువు పొడిగించడం జరిగింది)     ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందాలతో ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగ విశేషాలను, మీ ఊర్లోని వింతలను తెలియ చెప్తూ కవితలు, కథలు రాయండి. ప్రతి కవితకి, కథకు ప్రశంసాపత్రం ఇవ్వబడును. మీ కవితలు కథలు పంపవలసిన ఆఖరు తేది 13/ 12/2021 నుండి 13/1/2022 కి మార్చడం జరిగింది. కవిత కానీ, కథ కానీ ఆరువందల పదాలకు మించకుండా అక్షర దోషాలు లేకుండా, సరళ మైన బాషలో ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఒకరు ఎన్ని కథలు, కవితలు అయినా పంపవచ్చు. కవితలు కథలు తిరిగి పంపబడవు, వచ్చిన వాటిని అన్నిటినీ ప్రచురిస్తాం. తిరిగి కోరే వారు పంపవద్దని మనవి. ఇందులో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఎక్కడ ప్రచురించలేదు అని హామీ పత్రం తప్పని సరి. షరతులు వర్తిస్తాయి. దయచేసి కాపీ కంటెంట్ పంపకండి.…
Read More

ఈరోజు అంశం:- ఒంటరి బతుకు

ఈరోజు అంశం:- ఒంటరి బతుకు పది మందిలో బతికినా కూడా చాలా మంది ఒంటరి తనంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఫీల్ అవడం లో వాళ్ళు కోల్పోతున్న దాన్ని గుర్తించలేరు. అలాగే వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారో కూడా వాళ్లకు ఒక స్పష్టత ఉండదు. అలా పది మందిలో ఉన్నా ఒంటరి జీవితాన్ని ఆస్వాదించ లేని అశక్తులు వాళ్ళు , వారికి ఒక లక్ష్యం , ఆశయం లాంటివి ఉండవు. యెప్పుడూ నిర్లిప్తత గా ఉంటూ ఉంటారు. ఎవరితో కలవకుండా మాట్లాడకుండా మనసు విప్పకుండా ఉంటారు. వారిని చూస్తున్న ఎదుటి వారికి కూడా విరక్తి భావం వస్తుంటుంది.. కానీ అంత మంది లో ఉండి కూడా ఒంటరి జీవితాన్ని అనుభవించకుండా ఉన్న వారికంటే, ఎవరూ లేని వారి జీవితం. ఏలా ఉంటుందో అని గమనించాలి. ఒంటరి జీవితం అంటే ఎవరూ లేని వాళ్ళు కాదు. అందరిలో ఉన్నా కూడా ఒంటరిగా…
Read More

ఈరోజు అంశం:- కొత్త జీవితం

ఈరోజు అంశం:- కొత్త జీవితం రాబోయేది నూతన సంవత్సరం మన జీవితంలో పాత సంవత్సరంలో ఎన్నో అనుభూతులు అనుభవాలు ఉంటాయి. పాత అనుభవాలను మరిచిపోయి, కొత్త సంవత్సరంలో కొత్తగా జీవితాన్ని అందంగా మలుచుకోవడం కోసం మనం పాత విషయాలను అన్నిటినీ మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. అందమైన జీవితం లో మధురమైన వాటిని గుర్తు పెట్టుకుని, చేదు అనుభవాలు మరచి పోయి, చేసిన పొరపాట్లను మళ్లీ చేయకుండా, గతం ఒక జ్ఞ్యాపకంగా కాకుండా ఒక పాఠంగా గుర్తు పెట్టుకుని అవి మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. మరి కొత్త జీవితానికి మీరు పాటించాలి అని అనుకుంటున్న పది సూత్రాల గురించి వ్రాయండి. 
Read More

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?

ఈరోజు అంశం:- సోషల్ మీడియాలో లేకపోతే?   సోషల్ మీడియాలో లేకపోతే జనావాసాలకు దూరంగా ఉన్నట్టా లేనట్టా? నా అభిప్రాయం. అవును చాలా మంది సోషల్ మీడియానే తమ లోకంగా బతుకుతూ లైక్ ల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం వాటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అలాంటి వారిని చూస్తూ మిగిలిన వాళ్ళు మీరు లోకానికి దూరంగా ఉంటున్నారని ఎద్దేవా చేయడం ఎంత వరకు సమంజసం చెప్పండి? లోకం లో సోషల్ మీడియా కన్న చాలా విషయాలు తెలుసుకో దగినవి చాలా ఉన్నాయి అని మిగిలిన వారు తెలుసుకోలేకపోతున్నారు. లైక్ షేర్ ల కోసం కాకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఇవ్వన్నీ వాడకుండా ఉండటమే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.     
Read More