Family Stories

గుడ్డు ఇగురు

గుడ్డు ఇగురు రుచి ఎక్కువ, శ్రమ తక్కవతో ఈరోజు మంచి వంటకం మీకు పరిచయం చేస్తాను. ఎప్పుడూ తినే గుడ్డు వేపుడు, గుడ్డు బుర్జి, గుడ్డు పులుసు కాకుండా నువ్వులు వేసి గుడ్డు ఇగురు ఎలా చేయ్యోలో  తెలుసుకుని చేసేద్దాం రండి.... ముందుగా దీనికి కావాల్సిన పదార్ధాలు ఏంటో చూద్దాం కావలసిన పదార్థాలు:- గుడ్లు - 4 నూనె - 2 టేబుల్ స్పూన్ లు. ఉల్లిపాయలు - 4 (మీడియం సైజ్) పచ్చి మిరప కాయలు - 4 (పెద్దవి) నువ్వులు - 4 టేబుల్ స్పూన్ లు. ధనియాలు - 1 టేబుల్ స్పూన్ లు. లవంగాలు - 4 ఉప్పు - సరిపడినంత పసుపు - 1/2 టేబుల్ స్పూన్ లు కారం - 2 టేబుల్ స్పూన్ లు. నీళ్ళు - అరగ్లాసు కొత్తిమీర - పావు కట్ట... ఇవన్ని మన నిత్యవసర వస్తువులే, అందువల్ల తయారి విధానం కూడా చాలా…
Read More

పుష్కలంగా పుష్కరం

పుష్కలంగా పుష్కరం అవి 2003 గోదావరి పుష్కరాలు జరుగుతున్న రోజులు. మేము హైదరాబాదు నుంచి రాజమండ్రి పుష్కర స్నానాలు చేయాలని బయల్దేరాము. హైదరాబాదు నుంచి మా కుటుంబం, అన్నయ్య, స్నేహితులు ఇద్దరు మాతోపాటు బయల్దేరారు. మధ్యలో గుంటూరులో మరి కొందరు స్నేహితులు కూడా మాతో పాటు పుష్కర స్నానానికి రావాలనుకున్నారు. వారికోసం హైదరాబాదు నుంచి గుంటూరుకు ఉదయం రైలు ఎక్కాము. గుంటూరు చేరేసరికి మధ్యహ్నం అయ్యింది, తెలిసిన వాళ్ళ ఇంటిలో భోజనాలు చేశాం. సాయంత్రం నాలుగు, అయిదు గంటలకు వచ్చే వాళ్ళు అందరూ గుంటూరు బస్టాండ్ లో కలుద్దామని ముందే అనుకున్నాం. నా డిగ్రీ అక్కడే పూర్తి చెయ్యటం, స్నేహితులు అందరూ గుంటూరు వారే అవ్వడం, నేను వాళ్ళని కలిసి నేరుగా బస్టాండ్ కి వస్తానని నన్ను కలవటానికి వచ్చిన ఇద్దరి స్నేహితురాళ్ళతో వెళ్తానని అమ్మకు చెప్పి బయటపడ్డాం. గుంటూరులో ఉన్న ఇంకో ముగ్గురిని కలిసి వచ్చేసరికి సాయంత్రం ఆరు అయ్యింది. బస్టాండ్…
Read More

జోక్ – నవ్వోస్తేనే నవ్వండి

జోక్ - నవ్వోస్తేనే నవ్వండి వధువు తరపు వాళ్ళు : టిఫిన్ చేసి వెల్దురుగాని వుండండి! వరుని తరపు వాళ్ళు : ఆ!ఎందుకు లెండి కతికితే అతకదంటారు! వధువు తరపు వాళ్ళు : అందుకేగా టిఫిన్ చేసి వెళ్ళమనేది! - రమణ బొమ్మకంటి  
Read More

నాన్నతో నా ప్రయాణం

నాన్నతో నా ప్రయాణం నేను ఆరో తరగతిలో ఉండగా జరిగిన ఒక సంఘటన ఇది. మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఆయన పని చేసే చోట ఒక లెక్కల మాస్టారు కొత్తగా స్కూటర్ కొన్నారు. అయితే మా నాన్నగారికి ఎప్పటి  నుండో స్కూటర్ నడపాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో ఆ మాస్టారు ను ఒక్కసారి స్కూటర్ ను ఇవ్వండి. కాసేపు నడిపి ఇస్తాను అని అడిగారు. కానీ ఆయన ఛత్ వీల్లేదు, అసలు నీకు బండి నడపడం వస్తుందా, నీకు బండి గురించి ఏం తెలుసు అంటూ అవమానించేసరికి నాన్నారి లో ఆవేశం కట్టలు తెంచుకుంది. దాంతో అవమాన భారంతో ఇంటికి వచ్చేసి, చాలా రోజులుగా దాచుకున్న డబ్బు కొంత, అక్కడా, ఇక్కడా అప్పులు చేసి మరికొంత డబ్బు పెట్టేసి, వారంరోజుల్లో ఒక కొత్త బండి కొనేసేసారు. ఇక దాంతో తెల్లారు ఝామున లేచి గ్రౌండ్ కి వెళ్లి పట్టుబట్టి…
Read More

నేనూ నా కాశీ యాత్ర

నేనూ నా కాశీ యాత్ర 2019 అక్టోబర్ నెల నా పుట్టిన రోజున మావారు ఒక కొత్త ప్రతిపాదన తెచ్చారు. అదేంటంటే కాశీకి వెళ్దాం అని ఆయన అలా అనగానే నాకు వింత గానూ, కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా వయసు అయ్యాక  కాశీ ని చూడాలని, అక్కడ మోక్షం పొందాలని అనుకుంటారు. ఈయనేంటి ఇలా అంటున్నారు అనే ఆశ్చర్యం తో పాటూ, ఎప్పుడూ పూజలు అంటూ విరామం లేకుండా తిరిగే ఇయన గుడి, పూజలు వదిలేసి వెళ్ళాలనుకోవడం వింతగా అనిపించింది. మా వారి తో, ఇప్పుడేం కాశి యాత్ర అండి, దానికి ఇంకా చాలా సమయం ఉంది. మెల్లిగా వెళ్లొచ్చు, అసలే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి.. ఇప్పుడు ఈ చలికాలంలో అంతదూరం వెళ్లడం అవసరమా అంటూ ఆయన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేశాను. ఎందుకంటే అప్పటికే మేము గానుగాపూర్, శ్రీశైలం, తిరుపతి, మంత్రాలయం, వంటి యాత్రలకు ఎన్నో సార్లు వెళ్లివచ్చాం.…
Read More

అతి సర్వత్రా…

అతి సర్వత్రా... మంచితనం వల్ల కొందరు సమస్యలు కొని తెచ్చుకుంటారు. మంచితనం వల్ల కొందరు మొహమాటానికి పోయి తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటన లు జరుగుతున్నాయి. మచ్చుకు ఒక సంఘటన చెప్తాను. మా నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. తన పని ఏదో తాను చేసుకుంటూ నలుగురికి సాయం చేస్తూ ఉండేవారు. అయితే మాకు దూరపు బంధువులు మా పక్కూర్లోనే ఉన్నారని మా అత్తయ్యకు వాళ్ళు ఆడపడుచు వరస బంధువులు అని తెలిసి సంతోషించారు. వారి వల్ల మా అత్తయ్య క్షేమ సమాచారాలు తెలుస్తాయి అనే ఒకే ఒక్క చిన్న కారణం వారి ఇంటికి వెళ్లేలా చేసింది. రాక పోకలు మొదలయ్యాయి. ఆయన కూతురు కూడా నాతో పాటు కాలేజీలో చదువుతుంది అని తెలిసి రోజు కలిసి వెళ్ళవచ్చు అని అనుకున్నాం. అలాగే వెళ్తున్నాం కూడా. అలా రోజులు గడిచిపోతూ వుండగా ఒక ఆదివారం నాడు ఆయన పెద్ద అబ్బాయి మా…
Read More

నవ్వు- నవ్వించు

నవ్వు- నవ్వించు ఉదయాన్నే నిద్ర లేచి టైం చూస్తే 8 గంటలు చూపుతుంది. గుండెల్లో రాయి పడినట్టయ్యింది. ఆఫీసుకు సమయానికి రాకపొతే ఛీఫ్ మేనేజర్ గారు తిట్టే తిట్లకు ఆత్మహత్య చేసుకోవడమే నయం అనిపిస్తుంది.. ఆ ఛండాలునికి చిన్న, పెద్దా, వయసు కూడా చూసి ఛావడు.. 10 గంటలకల్లా ఆఫీసులొ ఉండాలి. సిటీ ట్రాఫిక్ లో ఆఫీసును చేరుకోడానికి ఎంతలేదన్నా గంట పావు అవుతుంది.. అందులో ఇన్స్పెక్షన్ రోజులు.. ఇంత మొద్దు నిద్ర పోయినందుకు తన మీద తనకే చెప్పలేనంత కోపం వచ్చింది. గబ, గబా లేచి బాత్ రూమ్ కు వెళ్ళి బ్రష్ చేయడం, స్నానం చేయడం కానిచ్చేసి వంటిపై తడి ఆరకుండానే షర్ట్, ప్యాంట్ వేసుకుని ఏమేవ్! క్యారియర్ రెడీ చేసావా? అని కేకేసేను.. నా భార్య నుండి ఎటువంటి బదులు రాలేదు.. ఏంటా అని చూస్తే పూజగది లో పూజ చేస్తుంది. అర్ధమైంది. పూజగది లో ఉంటే…
Read More

ఆకలి కేక

ఆకలి కేక సమయం రాత్రి ఏడుగంటల అవుతుంది చిన్న పెంకుటిల్లు నుంచి రెండు సంవత్సరాల పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎంతకి ఆపడం లేదు ఆ ఇంట్లోకి వచ్చే వారు రావడం లేదు వెళ్లడం లేదు ఎంతగా ఎదురు చూస్తున్నాయి. ఆ కళ్ళు అయిన ఎవరూ కూడా చూడడం లేదు. పిల్లాడు ఏడుస్తున్నా, ఎవరూ పట్టించుకోవడo లేదు. ఎవరు కూడా రావడం లేదు. ఎందుకు ఎవరికీ పట్టింపు లేదు. వర్షం రావడం వల్ల ఎవరికి వారే, వారి ఇంట్లో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు అలా చేస్తేనే, ఏ అర్ధ రాత్రో వాళ్లు, కడుపునిండా తింటారు. అందరి ఇళ్ళ లోకి జనాలు వెళ్లడం చూసి, తన ఇంట్లోకి ఎవరూ రాకపోవడం, చూసి, వైదేహి బయటకు వచ్చింది. ఇక లాభం లేదని ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చింది. పిల్ల వాడి ఏడుపు పట్టించుకోక, ఆ పిల్లవాడి ఏడుపు ఆపాలంటే, కడుపునిండా అన్నం పెట్టాలి. అది పెట్టడానికి తన…
Read More

శివరాత్రి

శివరాత్రి వైకుంఠ ఏకాదశి పొద్దున్నే పనులన్నీ చేసుకుని, అందరం ఉపవాసం కాబట్టి పిల్లలకు మాత్రం ఉప్మా చేసేసి, బాక్స్ లలో పెట్టేసి నేను కూడా తయారయ్యి, బడికి బయలుదేరాను. ఎప్పటిలా క్లాస్ లన్ని చెప్పేసేసి, లంచ్ లేదు కాబట్టి నేను రాయకుండా వదిలేసిన అసైన్ మెంట్స్ రాసుకున్నా, సాయంత్రం బడి అయ్యాక, ఇంటికి వచ్చేసి, కాళ్ళు చేతులు కడుక్కుని ట్యూషన్ కి వచ్చిన పిల్లలని కూర్చోబెట్టి నేను మా పిల్లలకు హోం వర్క్ చేయించడం మొదలు పెట్టాను. అదయ్యేసరికి రాత్రి ఎనిమిదిన్నర అవడంతో మాకు టిఫిన్, అలాగే పిల్లల కోసం ఏదైనా చేయాలని అనుకున్నా, అందరికీ కలిపి సేమ్యా ఉప్మా చేశాను. పిల్లలకు పెట్టాను. నేను మళ్ళీ దేవుడికి దీపం పెట్టేసి అమ్మకు, నాకు ఉప్మా పెట్టాలని అనుకునే సమయంలో హఠాత్తుగా మణికొండ లో ఉండే మా పెద్ద తమ్ముడు వచ్చాడు. రావడం తోనే ఏం చేస్తున్నారు అంటే ఉపవాసం కదా…
Read More

అమ్మ నవ్వింది

అమ్మ నవ్వింది అమ్మ అనే కమ్మనైన పిలుపు కన్నా తియ్యని పిలుపు ఏది లేదీ లోకం లో, అమ్మ అనే పదానికి ఎంతో శక్తి ఉంది. అమ్మ అనే పదానికి ఎంతో ప్రేమ, మమకారం, ఆప్యాయత అనురాగం కలగలిపిన ప్రతి రూపం అమ్మ. కన్న తల్లిని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ఒక వేళ మర్చిపోయారు అంటే వాళ్ళ కంటే నికృష్టులు ఎవరూ ఉండరు. అమ్మను కష్టపెట్టే వాడు అసలు మనిషే కాదు. కొందరు తల్లిని అనాధ శరణాలయం లో వదిలేస్తారు. నవమాసాలు మోసి, కని, మల ముత్రాలు తీసేసిన తల్లిని కాదనుకుంటారు. కానీ ఆ తల్లి మాత్రం తన పిల్లలు బాగుండాలి అని కోరుకుంటుంది. అలాంటి వాళ్ళు నా దృష్టిలో నికృష్ట హీనులు. కుక్క కంటే కూడా హీనమైన వారు. అంత నికృష్టులు అయినా ఆ తల్లి మాత్రం నా పిల్లలు బంగారం అనే అంటుంది తప్ప వాళ్ళు వెధవలు అని…
Read More