bhavya charu

ప్రేమలోకం

ప్రేమ లోకం  నా ప్రేమ లోకం లో నువ్వొక అక్షరానివి నా ప్రేమ లోకం లో నిలువెత్తు నిదర్శనం నువ్వు నా ప్రేమ లోకం లో నువ్వొక ఊహావు నా ప్రేమ లోకం లో నువ్వొక కలికి తురాయివి నా ప్రేమ లోకం నువ్వొక ఆశవి నా ప్రేమ లోకం లో నా భవిష్యత్తువి నా ప్రేమ లోకం లో నువ్వొక అద్రుష్టానివి  నా ప్రేమ లోకం లో నువ్వొక తారవి నా ప్రేమ లోకం లో నువ్వొక ఆశా కిరణానివి నా ప్రేమ లోకం లో ఉదయించే కిరణం నువ్వు నా ప్రేమ లోకం లో ఊపిరి నువ్వు నా ప్రేమ లోకం లో శ్వాస నువ్వు నా ప్రేమ లోకం లో నువ్వొక మహరాజువు నీ ప్రేమ లోకంలోకి నీ రాణిలా నన్ను ఆహ్వానిస్తావా  ప్రియా..... - భవ్య చారు  
Read More

తేనెలొలుకు తెలుగు

తేనెలొలుకు తెలుగు తెలుగంటే అవకాయ తెలుగంటే అమ్మ ప్రేమ తెలుగంటే నాన్న బాధ్యత తెలుగంటే సోదరుల ఆప్యాయత తెలుగంటే అనురాగం తెలుగంటే ఆత్మీయత తెలుగంటే ప్రేమలో కం తెలుగంటే తోబుట్టువు తెలుగంటే అందమయిన లోకం తెలుగంటే తీయని కోయిల పలుకు తెలుగంటే పంచదార పాకం తెలుగంటే జానపదం తెలుగంటే వేమన పద్యం తెలుగంటే భారతం తెలుగంటే తేజం తెలుగంటే కమ్మని పాట తెలుగంటే సప్త వర్ణాలు తెలుగంటే సప్తపదులు తెలుగంటే శంఖరాభరణం తెలుగంటే స్వర్ణ కమలం తెలుగంటే రామాయణం తెలుగంటే వేద వేదాంగాలు తెలుగంటే అష్టపదులు తెలుగంటే అష్ట దిక్పాలకులు తెలుగంటే అష్ట కవులు తెలుగంటే కమ్మని కావ్యాలు తెలుగంటే దేశదేశాలు తెలుగంటే ప్రగతి తెలుగంటే వెన్నెలలో గోదారి తెలుగంటే వెన్నెల రాత్రి తెలుగంటే మానసికోల్లాసం  తెలుగంటే సంప్రదాయం తెలుగంటే శాస్త్రీయత తెలుగంటే భారతం తెలుగంటే బంగారం తెలుగంటే జాతర తెలుగంటే గౌరవం తెలుగంటే ప్రకృతి తెలుగంటే దారి చూపే వెలుగు…
Read More

ధరణి కో లేఖ

ధరణి కో లేఖ అమ్మ మమ్మల్ని భరిస్తూ ,మా బరువంతా మోస్తూ, మేము నిన్ను ఎంత బాధ పెట్టినా సహనం గా ఉంటూ ,మా తప్పులన్నీ కాస్తూ, మేము చేసే పిచ్చి పిచ్చి పనులను చిరునవ్వుతో చూస్తూ ,కర్రలతో బాధిస్తున్నా, మేకులతో నీ తలను చిధ్రం చేస్తున్నా , నీ పై బరువు నుంచి నిన్ను అణగ ద్రొక్కుతున్నా, పాపాలు చేస్తూ నీలో కలుపుతున్నా , హత్యలు మానభంగాలు నీ ముందే చేస్తూ, ఆ వికృత చేష్టలు గమనిస్తున్నా , చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తూ చంపుతున్నా , రూపాయికి, వందకు మర్డర్లు జరుగుతున్నా,  ఈ పాప భారాన్ని నీ తలపై మోస్తూ, ఓపికతో, సహనముతో, మంచితనంతో, ఎవరినీ నొప్పించకుండా భరిస్తున్న నిన్ను ఏమనాలి తల్లి. తల్లిగా పిల్లల్ని క్షమిస్తూ, క్షమయా ధరిత్రి  అన్న పేరును సార్థకం చేసుకుంటూ , ఇన్ని కోట్ల మంది పాపాలను చూస్తూ కూడా ఎంత సహనంగా…
Read More

ఆత్మ నా?

ఆత్మ నా? అవి బతుకమ్మ పండగ రోజులు... నేను, నా స్నేహితులు కలిసి చిన్న బతుకమ్మలు చేస్తూ, రోజూ ఆడుకుంటూ కాలువలో నిమజ్జనం చేసేవాళ్ళం. అలా రోజు బతుకమ్మను పేర్చుకుంటూ సంతోషంగా సాయంత్రం కాగానే ఇంటి ముందు ముగ్గులు వేసుకుని కాసేపు అడుకుని కాలువకు ప్రసాదాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం. అమ్మ రోజు ఏదో ఒక ప్రసాదం చేసి ఇచ్చేది. నా స్నేహితులకు అమ్మ చేసే ప్రసాదం అంటే చాలా ఇష్టం. బతుకమ్మ వేయడం ఆలస్యం నా ప్రసాదం మొత్తం వాళ్ళే లాక్కుని మరి తినేవాళ్ళు. నాకు మిగల్చకుండా.. అలా ఒకరోజు బతుకమ్మ ఆడుకుని కాలువలో నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు, మా వెనకాలే ఎవరో వస్తున్నట్టు అనిపించింది. కానీ మేము వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. మామూలుగా కాలువ సైడ్ సాయంత్రం పూట ఎవరు ఉండరు. దూరంగా పశువులను ఇళ్లకు తోలుకొస్తూ ఎవరో ఒకరు కనిపిస్తారు. కాని దగ్గరగా రారు. అక్కడ…
Read More

నాన్నగారి కథలు

నాన్నగారి కథలు మా నాన్నగారి గురించి చాలా చెప్పాలి అని ఉంది. అందుకే ఒక్కొక్క కథ మీకు చెప్తాను. ఈ శీర్షిక ద్వారా మీరు కూడా మీ నాన్నగారి గురించి నాకు చెప్పండీ.. మరి మనం మా నాన్నగారి కథ లోకి వెళ్దామా... అవి మా నాన్న గారి చిన్నప్పటి రోజులు అన్నమాట. ఒక రోజు మా నాన్నగారు వాళ్ళ అక్కగారింటికి వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా బయలు దేరారు. మా నాన్నగారు వెళ్తున్నారని తెలిసి మా నానమ్మ గారు తన కూతురి కోసం దసరా పండగకు చేసిన అప్పాలు, మురుకులు లాంటివి ఒక మూట గా కట్టి ఇచ్చారు. మరి ఉత్త చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది కదా అందుకని పిండి వంటలు కట్టి ఇచ్చారు. ఆ మూటను మా నాన్నగారు అద్దె సైకిల్ పైన కట్టుకున్నారు. మరి ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువ అయితే ఎడ్ల బండి…
Read More

అతి సర్వత్రా…

అతి సర్వత్రా... మంచితనం వల్ల కొందరు సమస్యలు కొని తెచ్చుకుంటారు. మంచితనం వల్ల కొందరు మొహమాటానికి పోయి తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటన లు జరుగుతున్నాయి. మచ్చుకు ఒక సంఘటన చెప్తాను. మా నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. తన పని ఏదో తాను చేసుకుంటూ నలుగురికి సాయం చేస్తూ ఉండేవారు. అయితే మాకు దూరపు బంధువులు మా పక్కూర్లోనే ఉన్నారని మా అత్తయ్యకు వాళ్ళు ఆడపడుచు వరస బంధువులు అని తెలిసి సంతోషించారు. వారి వల్ల మా అత్తయ్య క్షేమ సమాచారాలు తెలుస్తాయి అనే ఒకే ఒక్క చిన్న కారణం వారి ఇంటికి వెళ్లేలా చేసింది. రాక పోకలు మొదలయ్యాయి. ఆయన కూతురు కూడా నాతో పాటు కాలేజీలో చదువుతుంది అని తెలిసి రోజు కలిసి వెళ్ళవచ్చు అని అనుకున్నాం. అలాగే వెళ్తున్నాం కూడా. అలా రోజులు గడిచిపోతూ వుండగా ఒక ఆదివారం నాడు ఆయన పెద్ద అబ్బాయి మా…
Read More

సంఘజీవి

సంఘజీవి నా ఇష్టం నేను నా లాగానే ఉంటాను. ఎవర్నీ పట్టించుకోను నాకు నచ్చినట్టు చేస్తాను. నేను చేసిందే కరెక్ట్, నాకన్నా తోపు ఎవరు లేరు నేనే అన్ని... నాకు తెలిసిందే న్యాయం, నేను చెప్పిందే వేదం అంటూ కొందరు తెగ వాగుతూ ఉంటారు. ఈ మధ్య ఇది ఇంకా చాలా ఎక్కువ అయ్యింది. సోషల్ మీడియాలో కొందరు ఇలాగే ప్రవర్తిస్తూ తమ మాటలతో, చేతలతో జనాలను పిచ్చి ఎక్కిస్తున్నారు. తాము చేసిన చేస్తున్న పని అందరికీ చూపిస్తూ, అశ్లీల వీడియోలు జనాల పైకి వదులుతున్నారు. అయితే వీళ్ళు ఇలా చేయడానికి కారణం ఏమిటి వాళ్లకు వాళ్లు సెలబ్రిటీలు అని ఫీల్ అవ్వడమే అంటాను నేను. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా చేయరు. కానీ మధ్యలో వచ్చిన పేరు వల్ల వీళ్ళు ఇలా తయారు అయ్యారు. టిక్ టాక్ వల్ల ఫేమస్ అయిన కొందరు తమ ఫ్యాన్స్ ను ఫాలోవర్స్…
Read More

ఆకలి కేక

ఆకలి కేక సమయం రాత్రి ఏడుగంటల అవుతుంది చిన్న పెంకుటిల్లు నుంచి రెండు సంవత్సరాల పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎంతకి ఆపడం లేదు ఆ ఇంట్లోకి వచ్చే వారు రావడం లేదు వెళ్లడం లేదు ఎంతగా ఎదురు చూస్తున్నాయి. ఆ కళ్ళు అయిన ఎవరూ కూడా చూడడం లేదు. పిల్లాడు ఏడుస్తున్నా, ఎవరూ పట్టించుకోవడo లేదు. ఎవరు కూడా రావడం లేదు. ఎందుకు ఎవరికీ పట్టింపు లేదు. వర్షం రావడం వల్ల ఎవరికి వారే, వారి ఇంట్లో పని చేసుకుంటున్నారు. ఇప్పుడు అలా చేస్తేనే, ఏ అర్ధ రాత్రో వాళ్లు, కడుపునిండా తింటారు. అందరి ఇళ్ళ లోకి జనాలు వెళ్లడం చూసి, తన ఇంట్లోకి ఎవరూ రాకపోవడం, చూసి, వైదేహి బయటకు వచ్చింది. ఇక లాభం లేదని ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చింది. పిల్ల వాడి ఏడుపు పట్టించుకోక, ఆ పిల్లవాడి ఏడుపు ఆపాలంటే, కడుపునిండా అన్నం పెట్టాలి. అది పెట్టడానికి తన…
Read More

నా వేదన

నా వేదన చుట్టూ పదిమంది ఉన్నా, చూడలేకపోతున్నా, చుట్టూ మాటలు మాట్లాడుతున్నా, మాట్లాడలేకపోతున్నా, ఎండలో మాడిపోతున్న, చెట్టు నీడ కోసం వెళ్లలేక పోతున్నా, ఈ కాంక్రీటు ఇళ్లల్లో మగ్గిపోతున్నా, గుక్కెడు నీళ్ల కోసం వెతుకుతున్న, గుండె మంటతో గొంతెండి పోతున్నా, ఎవరిని అడగాలో తెలియక అల్లాడి పోతున్నా, ఎవరిని ఎవరూ పట్టించుకోకుండా, ఎవరి పనులకు వారు వెల్లుతున్నా, ఒక్కరూ ఒక్కరూ అయినా ఆగక పోతారా, నన్ను చూడక పోతారా, నా ఆర్తీ ని తీర్చలేక పోతారా, అని నాలో నేను, నాతో నేను, మదన పడుతున్నా, కానీ నా లాంటి చిన్న జీవిని, పట్టించుకునే నాథుడే కరువయ్యారు, ఈ లోకంలో, ఈ జన జీవన స్రవంతి లో.... -భవ్య చారు
Read More

బంధం

బంధం బంధం ఏదైనా నమ్మకం ముఖ్యం నమ్మకం లేని బంధం ఏదైనా వృధానే... ఒరేయ్ అన్నయ్య నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది నువ్వు నాతో వస్తావా అంటూ అడిగింది లత. నేను ఎందుకే నీతో అవసరం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్లిరా, నేను రావడం ఎందుకు? అయినా నా బాబాయ్ ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఎగ్జామ్ రాయడం ఎందుకే మరోసారి రాసుకోవచ్చులే ఎంత చదివినా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళే దానివి కదా ఇప్పుడు చదువు అవసరమా అన్నాడు నిష్టూరంగా మురళి. ఇదిగో చూడు అన్నయ్య నువ్వు ఇలా అంటే నాకు ఎక్కడో మండుతుంది. ఎంత వేరే ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్ళేవాళ్ళం అయినా మా కాళ్ళ మీద మేము నిలబడాలని మాకు మాత్రం ఉంటుంది. చదువుకుంటే తప్పేంటి ఆయన నీ సన్నిధిలో తీసుకు వెళ్తున్నట్టు ఆ మాటలు ఏంటి నేను నాకు వచ్చిన స్కాలర్షిప్ తోనే చదువుకుంటున్నాను నాకు…
Read More