c s rambabu

సాయి చరితము

సాయి చరితము పల్లవి దర్శనమీయవ సాయి మనసును శుభ్రము చేయగ దర్శనమీయవ సాయి జీవిత పాఠము నేర్పగ దర్శనమీయవ సాయి ఈ జగతిని మార్చివేయగ చరణం కలలెన్నో కంటామయ్యా అవి తీరక దుఃఖం కలిగితే చిరునవ్వును కానుకచేసి విజయాన్నే మాకుచూపి ధైర్యాన్నే తోడుగ నిలిపి బాటంతా మల్లెలు పరిచి నిరాశల వెన్ను విరిచి మము నడిపే గురువువు నీవు చరణం నీవైపే అడుగే వేస్తే భయమంతా తొలగగ మేము అభయాన్నే పొందుతాము అనుకున్నది సాధించేందుకు మావెంటే నీవు ఉంటావు మా తనువు మనసు నీది నీ నామము ప్రాణము మాకు నిన్నే నమ్మిన మాకు నీ చరితము మార్గము చూపు - సి.యస్.రాంబాబు
Read More

అమ్మ పాట

అమ్మ పాట పల్లవి అమ్మే దైవమని నమ్మితివా కలగవింక ఆపదలు ఎన్నడూ అమ్మే సర్వమని తెలిసినచో బంధాలకు అర్థము తెలియునుగా చరణం నీవే లోకమనుచు బతుకునుగా నీ సుఖమే తనసుఖమని తలచునుగా నీ తప్పటడుగే తనకు ముద్దుగా నీ బోసినవ్వే తనకు వెన్నెల చరణం అమ్మంటే త్యాగమని తెలిసినచో జీవితానికర్థమూ తెలియునుగా తన ఆకలినే దాచుకొనునుగా నీ ఆకలికే తల్లడిల్లుగా చరణం విజయపథమునే నీవు నడిచితే మురిసిపోవునది అమ్మ ఒక్కటే అమ్మ బాటను విడువవద్దురా అమ్మ మాటను మరువవద్దురా చరణం స్వచ్చమైనది నిత్యమైనది అఖిలజగమున అమ్మ ప్రేమరా బతుకు లోగిలిలో నీకు అండరా తనకు ఎప్పుడూ గొడుగు పట్టరా - సి.యస్.రాంబాబు
Read More

కలలు కనకు

కలలు కనకు కులాల గోడల్ని దూకావో జీవితాల్ని కూల్చేస్తారు మతాల సరిహద్దుల్ని దాటావో మాడిపోతావు! ఇది ఆధునిక భారతం సౌశీల్యం సౌహార్ద్రతలు ఇంకిపోతున్న ఎడారిలో మానవతా ఒయాసిస్సులకు దిక్కెక్కడ! మనుషులు ద్వీపాలై మనసులు కొడిగట్టిన దీపాలవుతుంటే ప్రేమానురాగాలన్ని ఘనీభవిస్తున్నాయి భక్తి పన్ను కట్టేశామా పాపాల భయముండదు కోరికలు,కాంక్షల కళ్ళకు కన్నీటి కరుణ తెలియదు అక్షరాలు దిద్దిన చేతులకు ఆత్మీయ స్పర్శ తెలియదు ప్రవహించే కాలం ప్రవక్తలా మారి బోధిస్తే బావుండు బండబారిన సమాజానికి బాధ్యత తెలుస్తుందని కలలు కనటమే మిగిలిందిక - సి.యస్.రాంబాబు
Read More

లౌక్యమూ లేక -కథానిక

లౌక్యమూ లేక -కథానిక "శంకరంగారూ గారు ఒకసారి వస్తారా" ఫోన్ లో అపార్ట్మెంట్స్ సెక్రటరీ రామకృష్ణ అభ్యర్థనకు నేనూ, వెంకట్, సాల్మన్ స్పందించి కదిలాం. జంటనగరాలలోని అనేక మధ్యతరగతి అపార్ట్మెంట్లలో మాదీ ఒకటి. దానికి తోడు మేముండేది మాస్ ఏరియా. ప్రతీదీ పండగలా జరుపుకోవటం అనే సంప్రదాయం ఎప్పటినుంచో వస్తోంది ఇక్కడ. బోనాలయినా, బక్రీదయినా, క్రిస్మస్ అయినా సందడికి లోటులేదు. ఇప్పుడు రామకృష్ణ ఎందుకు పిలిచాడో ఊహించలేనిదేమీ కాదు. ఏ అపార్ట్మెంట్ కయినా వాచ్మెన్ కీలకం. మంచి వాచ్మెన్ ఉంటే ఆ అపార్ట్మెంట్ శాంతితో నిండుంటుంది. కొంచెం వాదులాడే వాచ్మెన్ జంటుంటే వేరే మంట అక్కర్లేదు. ఈ ఉపోద్ఘాతంతో మేమేదో కాపలాదారు(వాచ్మెన్) సమస్యలో ఉన్నామని మీరు భావిస్తే అవును, కాదు అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మా వాచ్మెన్ తంపులు పెట్టి మాకేమీ తెగతంపుల సమస్య తేవటం లేదు కానీ,వాళ్ళు మాత్రం ఊరెళ్ళొస్తామన్నారంటే  మాపని అయిపోయినట్టే.అదేదో ప్రపంచయాత్ర చేస్తామన్నట్టుగా వినిపిస్తుంది మాకు. వీళ్ళు…
Read More

కలలమేడలు

కలలమేడలు అల్పజీవులు బడుగుజీవులు అర్ధాయుష్కులు వారు బుక్కెడు బువ్వ జానెడు చోటుకు నోచుకోనివారు ఆకాశం నీడలో నిద్రించేవారికి స్వప్నలోకాలేముంటాయి లాఠీతోడుగా నాట్యం చేసే రక్షకభటుల కర్కశమైన మాటతో రోజు మొదలు భుక్తేలేనివారికి హక్కులేముంటాయి విసిరేసిన విస్తరిలాంటి జీవితాలు కదా నేడిక్కడ రేపెక్కడో అన్న నిట్టుర్పులే ఉంటాయి ఫ్లైఓవర్లు, పేవ్మెంట్లు,దించిన షట్టర్లు ఈ చీకటి బతుకుల కథలకు మౌనశ్రోతలు..కనిపించని దేవుడికి విన్నపాలు చేస్తాయేమో తెలీదు అసమానతల ప్రపంచంలో ఆరని మంటల్లో సమిధలై వీరంతా కాలిపోతూనే ఉంటారు 'మేడే' లు బాగుచేయని బతుకులు వీరివి మేడల్లో ఉండే మనకు ఇవేమీ కనబడని దృశ్యాలు కావు మనసు గోడలను కోరికలతో కాంక్షలతో తాపడం చేశాం కదా..ఏ దుఃఖమూ దరిచేరదు.. రాత ఆ దేవుడు రాశాడోలేదో కానీ కొందరి రాతలను మాత్రం డబ్బు ప్రపంచం రాస్తుంటుంది ఏమీచేయలేని వారేమో రాజుకున్న చైతన్యం అగ్గిలా ఎప్పుడో అంటుకోక మానదని ఇలా అక్షరాలతో కలల మేడలు కడుతుంటారు - సి.యస్.రాంబాబు
Read More

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీచూపేగా మాకు వేదము నీరూపేగా ఎంతో అందము నీ తలపేమో ఎంతో మధురము నీవేనయ్యా మాకు దైవము చరణం నినుకొలిచినచో భయమే ఉండదు కష్టమునందున వెంటే ఉండి వేదనతీర్చీ వేడుకచూపే దత్తగురువువు నీవయ్యా కాలము మాపై పగబడుతుంటే నీ నామముతో గెలిచేమయ్య సద్గురుసేవే కాపాడునుగా నిత్యము మమ్ము చరణం పేదా గొప్ప తేడాలొదిలి మనిషిగ బతుకు అనిచెప్పితివి కులము మతము భేదములొద్దని బోధించితివి ఎన్నడో నీవు నీపై నమ్మిక ఉంచిన చాలు అదియే మాకు ఎంతో మేలు దైవము ఒకడే మార్గాలెన్నో బాటలు ఎన్నో గమ్యము ఒకటే చరణం సాయిని వేడితే సాధ్యము అన్నీ ఆకలిదప్పులు అసలే ఉండవు తన చరితమునే చదివితిమంటే మనసుకు కలుగును ఎంతో హాయి మమతల పందిరి వేయును సాయి అందరి హృదిలో నిండెను సాయి సాయి తత్వమే తెలిసిన నాడు కోపము క్రౌర్యము వీడును చూడు - సి.యస్.రాంబాబు
Read More

తీపిరుచి

తీపిరుచి తరగని మోహంలా సంధ్యారాగం ఆశల్ని ఆలపిస్తుంటుంది చీకటిలో మెరిసే వెలుగురేఖోదే దీవెనల దారిని తలపిస్తుంటుంది తబ్బిబ్బైన క్షణాలను జేబులో వేసుకుంటావు ఊసులను మూటగట్టే వేణుగానమేదో మలిన మనసును మార్చేస్తుంటుంది గజిబిజి గందరగోళాల మేళం రసకందాయంలో నీరసాల తాళంతో జీవితం ఉస్సురంటున్నవేళ ముఖచిత్రమై వెలిగే రాతిరి మానసానికో తీపిరుచుల పందిరి - సి.యస్.రాంబాబు
Read More

సాగాల్సిందే

సాగాల్సిందే ఆశలన్ని ఆవిరవుతున్నా గమ్యం చేరాల్సిందే గెలుపు గుర్రం చతికిలబడినా బుజ్జగించి ముందుకు సాగాల్సిందే పోరాటమంటేనే జీవితంతో కలబడి నిలబడటం పగలూ రేయి వలయంలో చిక్కుబడక పయనం సాగాలి అలసట బాటలో జ్ఞాపకాలను గుబాళించనీ పారేనదిలా ఉరకలెత్తావంటే స్నేహపరిమళాలను పంచుతావు కదంతొక్కుతూ పదం పాడవోయ్ కదిలే ఉత్సాహమై కదిపే తరంగమై వెరుపేలేని వీరుడవై స్ఫూర్తిని పంచుతావు - సి.యస్.రాంబాబు
Read More

చైత్ర వెన్నెల

చైత్ర వెన్నెల కొన్నిరోజులుగా నిఖిల్ ఎక్కువగా మాట్లాడ్డం లేదు. కారణం తెలుసుకుందామంటే మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు రామారావుకి, సీతకి. ఇంతకీ సీతా, రామారావులు నిఖిల్ తల్లిదండ్రులు. నిఖిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. బ్రైట్ స్టూడెంట్. మధ్యతరగతి కుటుంబాల్లో పేరెంట్స్ ఆశలన్నీ పెద్దపిల్లాడి మీదే ఉంటాయి. కుటుంబాన్ని ఆదుకుంటాడనో, తర్వాతి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాడనో... ఇలా అనేక కారణాలున్నట్టే రామారావుకు నిఖిల్ మీద ఎన్నో ఆశలున్నాయి. నిఖిల్ కు ఒక చెల్లెలు కూడా ఉంది. తన పేరు నీల. ఇంటర్మీడియెట్ చదువుతోంది. డాక్టర్ని చేయాలని సీతా, రామారావులు కలకన్నా అంతకన్నా ముందే నిఖిల్ నీలకు ఆ కలను ఎక్కించేశాడు. ఇంట్లో అయినా, కాలేజీలో అయినా నిఖిల్ చాలా యాక్టివ్. అలాంటి నిఖిల్ కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయాడు. ఎప్పుడూ తలుపేసుకునుంటాడు. ఏం చేస్తున్నాడో చెప్పడు. ముందుగా ఈ విషయాన్ని గమనించింది సీత. కీడు శంకిస్తూ విషయాన్ని భర్తకు చెప్పింది. ముందు భార్య…
Read More

సాయిచరితము

సాయిచరితము *పల్లవి* నీ దివ్యరూపము గాంచిన కనులది ఎంతటి భాగ్యము నీ దివ్యనామము పలికే పెదవుల దెంతటి పుణ్యము *చరణం* ఆకలిదప్పులు మరచిన మాకు నీ తలపులతో నిండెను మేను నేను,మేము భావన లేదు నిను కీర్తిస్తూ గడిపెదమయ్యా *చరణం* నిను సేవించే సేవే చాలు నీ దీవెనతో కాలము కదులు ఎన్నడు మమ్ము వీడకు సాయి కలలోనైనా మా తలపే నీవు *చరణం* జీవితమంటే భయమే వలదని సకల జీవులను ప్రేమించమని బోధనచేసి దారిని చూపి భవసాగరమును దాటిస్తావు *చరణం* నీ కృపతోటి నడిచెదమయ్యా లీలలు నీవి చదివిన చాలు బెంగేలేదు భయమూ లేదు బతుకే మారును దాహము తీరగ - సి.యస్.రాంబాబు
Read More