kota aksharalipi

మాతృ దినోత్సవము

మాతృ దినోత్సవము 1) చిన్న నాట అమ్మ చీదరించుకొనక      కడిగి.ముత్యము వలె కాటుకెట్టి      దిష్టి తగలకుండ దిష్టి చుక్కను బెట్టి      ఊయలందు వేసి ఊపుచుండు 2) అమ్మ చెంతనున్న ఆటాడుకుందును      అమ్మ ఒడిన నున్న అంత హాయి      అమ్మ పెట్టు బువ్వ కమ్మగా ఉండును      అమ్మ కన్న నాకు అధికులెవరు 3) అమ్మ గోరుముద్ద అమృత సమముండు      అమ్మ ముద్దులన్ని కమ్మగుండు      అమ్మ హత్తుకొనిన బొమ్మ లక్కరలేదు      అమ్మ దేవతగద అవనియందు 4) అలసటెరుగకుండ అన్ని పనులు చేయు      విశ్రమించనట్టి విమల మనసు      అమ్మ సేవలందు అణువంత చేయము      అమ్మ ఋణము దీర్చ నలవిగాదు 5) స్వార్థ మెరుగనట్టి సేవలు చేసెడి      తల్లి ఋణము…
Read More

నీటి బొట్టు

నీటి బొట్టు ఆటవెలది: మొయిలు దాచె నంట మదిలోన మృదువుగా ధరణి పైన పంట దరికి పిలిచె పరుగు పరుగు నొచ్చె పొలముకై చిరువాన నేల తడిపె నటులె నీటి బొట్టు తేటగీతి: కలువ పైనున్న నినుచూడ కనుల పంట విలువ నీకన్న అధికము కలుగరెవరు చెలియ కన్నులో నీవుంటె చెడ్డ భయమె మునిగు ఆల్చిప్ప యదలోకి ముత్యమునుగు - కోట
Read More

నీటిబొట్టు

నీటిబొట్టు ఆటవెలదులు 1) పట్టు నీటి బొట్టు ప్రాణాలు నిలబెట్టు     ఇంకుగుంట ఉంటె జంకులేదు     ఊరికొక్క చెరువు ఊరంతకందము     నీరు లేక ఎవరు నీల్గవలదు 2) నాగరికతలన్ని నగరాలలో వెలిగె      నాటి వైభవమ్ము నేడు కరువు      వేల యేళ్ళనుండి వెలిగిన నరుడిలా      నీరు లేక నేడు నీల్గుచుండె 3) వాననీరు మిగుల వరదలై పోకుండ      ఇంకుగుంటయందు యిమడ జేయి      పుచ్చకాయ రీతి పుడమిలో జలమున్న      నీల్గు ప్రాణి జీవి నిలుచు నిజము 4) పుడమి గర్భమందు బుడగ నీరుండిన      హరితదనము అవని నావహించు      నింగి నేల వాలి నీరంత మడుగులై      పాడి. పంట తోడ పల్లవించు 5) వేదకాలమందు విలసిల్లు జలముల      పరిమితముగ వాడి…
Read More

పిడుగు

పిడుగు 1) ఉక్కపోత పోసి ఉరుములు మెరుపులు     పిక్కటిల్లి పగలు పిడుగు రాలె     పిడుగు పాటు వల్ల పిల్లజెల్లా జచ్చె     చెలకలోన ఎడ్లు చేష్ట లుడిగె 2) ఆక్సిడెంట్ వల్ల అయిన వారూ పోతె     హాస్పిటలున చేర్చిరపరిచితులు     ఫోను చేసి చెప్పె పోయిన వార్తను     పిడుగు వార్తను విని పీనుగయ్యె 3) పంచభూతములను బాధించు మనిషిని      పట్టు బట్టి పిడుగు మట్టుబెట్టె      పిడుగు వార్త విన్న పిల్లలు పెద్దలు      గుండెపోటు వచ్చి గుటుకు మనిరి - కోట
Read More

అలలు

అలలు ఆ.వె. సంద్రమందు అలలు సంతోష పరచును యెల్ల దాట చేయు వల్లకాడు కన్న కలలు చెదరి కలతలు రేపును హద్దు దాటకుంటె ముద్దు గుండు - కోట
Read More

గ్రంథాలయం

గ్రంథాలయం ఆ.వె. 1) ఆది నుండి మనిషి అనభవాలన్నిటీ     పొత్తములుగజేసి పేర్చినాడు     పూర్వ అనుభవములు పుస్తకాలై యొప్పె     స్ఫూర్తి దాతలు మన పుస్తకాలు ఆ.వె. 2) తాత తండ్రులంత తాము అనుభవించి      కష్టనష్టములను కడకు నెట్టి      సులభ మార్గములను సూచించి పోయిరి      వాస్తవాలు మనకు పుస్తకాలు ఆ.వె. 3) క్రాంతి దాతలు మన గ్రంథాలయమ్ములు      వేలవేల పుస్తకాల వెలుగు      పుస్తకములు మనకు మస్తకాలై తోడు       నిలిచి మేలు కూర్చు నిజముగా ను - కోట
Read More

ఆహారం

ఆహారం ఆ.వె 1) అన్నము దినునపుడు అడుగుట మంచిది     సిగ్గు పడిన యెడల చేటు వచ్చు     పుష్టి కలిగినట్టి పౌష్టికాహారమే    పెరుగు తినుటవల్ల మేథపెరుగు ఆ.వె. 2) ఎన్ని వున్నగాని యింకగావలెనంద్రు      అన్నమింత దిన్న అధికమంద్రు      అన్నమన్ననేమి బ్రహ్మ స్వరూపంబు      వ్యర్థపుచ్చరాదు వేదవాక్కు - కోట
Read More

డైరీ

డైరీ ఆ.వె. 1) నిద్ర లేచి తిరిగి నిద్రించు దినములో     చేసినట్టి పనులు చెదరకుండ     దినదినమున రాయు దీర్ఘమైపోకుండ     చేయు కార్యము దినచర్య "డైరి" ఆ.వె. 2) సమయము సరిపోక సతమతమవుతుంటె      పొదుపుగా నడిపెడి పాదుడైరి      ఆనవాళ్ళు దెలుపు ఆయవ్యయమ్ముల     పనులు అన్ని సర్దుబాటు "డైరి" - కోట
Read More

చిత్రం

చిత్రం 1) లోకమందు ఎన్ని లొసుగులున్నను గాని రాజ్యముల చరితలు,రణములన్ని చరిత కానవాళ్ళు చిత్రమే(మై) చూపును రాతిపైన చరిత రాసియున్న 2) చిత్రము కథచెప్పు జీవిత గాథల ప్రకృతి నడకలన్ని పారజూపు కష్టసుఖములన్ని కనులముందుంచును చిత్రమేగ మనిషి జీవితమ్ము - కోట
Read More

చంద్రవదన

చంద్రవదన చంద్రవదన నిన్ను చూడగా బ్రహ్మయ్య పుట్టునపుడె పసిడి పుటము బెట్టె తేనె లొలుకు అచ్చ తెలుగు అమ్మాయిగా వెలుగుతున్న మోము వేగుచుక్క - కోట
Read More