kota

విజయము

విజయము ఆ.వె 1) అంతులేని సంద్రమంతు చూడగ నెంచి     ముందుకొచ్చెనరుడు ముప్పు వున్న     సాహసించినాడు సంద్రాన్నిగెలువగా     సాటి మిత్రులింత సాయపడగ ఆ.వె. 2) ఓడ చిన్నదైన. ఒడ్డుకు చేరచ్చు      ఐకమత్యమున్న అందు జయము      ఊతమున్న మేలు. ఓటమి కలుగదు      జట్టుగ పయనించు జయము మీదె ఆ.వె. 3) లంగరెత్తి నావ నడిపించు సంద్రాన      చతికిల బడకుండ సాహసించు      ధైర్యలక్ష్మివున్న దరిజేరు విజయము      కడలి అంచుదాక కదలి పొమ్ము ఆ.వె 4) తెగువ జూపినావు తెడ్డూత కర్రగా      కడలి అంతుజూడ కదలినావు      భయము లేక చిన్న పడవపై మానవా      సాహసించి చూడు జయము నీకు ఆ.వె. 5) నీళ్ళ అంతుజూడ నీవల్ల నేమగు?      కడలి మధ్య…
Read More

అలలు

అలలు ఆ.వె. సంద్రమందు అలలు సంతోష పరచును యెల్ల దాట చేయు వల్లకాడు కన్న కలలు చెదరి కలతలు రేపును హద్దు దాటకుంటె ముద్దు గుండు - కోట
Read More

గ్రంథాలయం

గ్రంథాలయం ఆ.వె. 1) ఆది నుండి మనిషి అనభవాలన్నిటీ     పొత్తములుగజేసి పేర్చినాడు     పూర్వ అనుభవములు పుస్తకాలై యొప్పె     స్ఫూర్తి దాతలు మన పుస్తకాలు ఆ.వె. 2) తాత తండ్రులంత తాము అనుభవించి      కష్టనష్టములను కడకు నెట్టి      సులభ మార్గములను సూచించి పోయిరి      వాస్తవాలు మనకు పుస్తకాలు ఆ.వె. 3) క్రాంతి దాతలు మన గ్రంథాలయమ్ములు      వేలవేల పుస్తకాల వెలుగు      పుస్తకములు మనకు మస్తకాలై తోడు       నిలిచి మేలు కూర్చు నిజముగా ను - కోట
Read More

ఆహారం

ఆహారం ఆ.వె 1) అన్నము దినునపుడు అడుగుట మంచిది     సిగ్గు పడిన యెడల చేటు వచ్చు     పుష్టి కలిగినట్టి పౌష్టికాహారమే    పెరుగు తినుటవల్ల మేథపెరుగు ఆ.వె. 2) ఎన్ని వున్నగాని యింకగావలెనంద్రు      అన్నమింత దిన్న అధికమంద్రు      అన్నమన్ననేమి బ్రహ్మ స్వరూపంబు      వ్యర్థపుచ్చరాదు వేదవాక్కు - కోట
Read More

డైరీ

డైరీ ఆ.వె. 1) నిద్ర లేచి తిరిగి నిద్రించు దినములో     చేసినట్టి పనులు చెదరకుండ     దినదినమున రాయు దీర్ఘమైపోకుండ     చేయు కార్యము దినచర్య "డైరి" ఆ.వె. 2) సమయము సరిపోక సతమతమవుతుంటె      పొదుపుగా నడిపెడి పాదుడైరి      ఆనవాళ్ళు దెలుపు ఆయవ్యయమ్ముల     పనులు అన్ని సర్దుబాటు "డైరి" - కోట
Read More

చిత్రం

చిత్రం 1) లోకమందు ఎన్ని లొసుగులున్నను గాని రాజ్యముల చరితలు,రణములన్ని చరిత కానవాళ్ళు చిత్రమే(మై) చూపును రాతిపైన చరిత రాసియున్న 2) చిత్రము కథచెప్పు జీవిత గాథల ప్రకృతి నడకలన్ని పారజూపు కష్టసుఖములన్ని కనులముందుంచును చిత్రమేగ మనిషి జీవితమ్ము - కోట
Read More

పందెం

పందెం పందెమంటె నాకు పడదు ముమ్మాటికీ ఆత్మ నిబ్బరమ్ము అసలు గెలుపు పందెమాడువాడు పరువు తీసికొనును పరువు పోయెనంటు పయనమాపు - కోట
Read More

ఎడారిలో భాణోదయం

ఎడారిలో భాణోదయం కలుగు లోనవున్న కనిపెట్టి తీరును భాణుడున్నచోట బతుకుజీవి అరుణకిరణములతొ ఆదరించీతీరు లోకబాంధవుడతి లోచనుండు - కోట
Read More

అనుకోకుండా

అనుకోకుండా డాక్టరవ్వబోయి యాక్టరయ్యానని లోకమనెడి మాట లోకువయ్యె బ్రహ్మ రాసినట్లు బతుకులు మారును మనిషి చేతిలోని మహిమ వలన (గాదు) - కోట
Read More

చిత్ర పద్యం

చిత్ర పద్యం ఏడుగడగ తనను ఏలెడి నాథుడు ఎడముకాగ బెదరి ఏడ్పు నాపి ధైర్యమూని.తిరిగి దరిచేరు నాశతో ఎదురు చూచుచుండె ఏలుననుచు - కోట
Read More