Month: March 2022

హోలీ

హోలీ ప్రతీ సంవత్సరం యావద్భారత దేశంలో "ఫాల్గుణ మాసం పూర్ణిమ" తిథినాడు అత్యంత ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ వసంతఋతువు ఆగమనాన్ని తెలుయజేస్తూ ఉంటుంది. పూర్వం రఘు మహారాజు "హొలిక" అనే రాక్షసిని చంపిన దినంగా ఈ "హోలీ" పండుగ చేసుకుంటారట. దీనినే ఇంకా కాముని పున్నమిగా, డోలికోత్సవముగా, ఫాల్గుణోత్సవముగా, వివిధ నామాలతో వ్యవహరిస్తూ ఉంటారు. "హోలీ" అంటే ముందుగా అందరికి రంగులే గుర్తుకు వస్తాయి.  ఈ హోలీ పండుగ గూర్చి విభిన్నమైన గాథలు కనిపిస్తున్నాయి. "శ్రీ బలరామ కృష్ణుని" ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు శాస్త్రవచనం. అందువల్ల బెంగాలు రాష్ట్రమందు ఈ రోజు శ్రీకృష్ణుని ప్రతిమను డోలికలోవేసి ఊపుచూ "డోలికోత్సవాన్ని" జరుపుకుంటారు. 'దక్షయజ్ఞ' సమయమందు అగ్నికి ఆత్మాహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు వారు పార్వతి అను నామధేయముచేస్తారు. ఇలా ఉండగా! సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర…
Read More

నవ్వుతూ…

నవ్వుతూ... బ్రతికితే నలుగురు మెచ్చేలా... చనిపోతే నలుగురు వచ్చేలా నవ్విస్తూ ఆ నవ్వుల్లో బ్రతకాలి. - శ్రావణ్ 
Read More

వ్యక్తిత్వం

వ్యక్తిత్వం మన అవసరం వేరే వారికి అవకాశం కావచ్చు అది వారి వ్యక్తిత్వం వేరే వారి అవసరం మనకు అవకాశం కాకూడదు అది మన వ్యక్తిత్వం కావాలి.. - శివరామ్ శంకర్ నాయుడు
Read More

జాజిరి పాట-2

జాజిరి పాట-2 జాజిరి జాజిరి జాజిరి జాదా జాజిరి జాజిరి జాజిరి జాదా జాజిరాడ బోతే ఏమేమి దొరికే జిల్లెడు చెట్లల్ల బెల్లమే దొరికేనాకు బెట్టంటె నక్కకు బెట్టే నక్క ముక్కుల నారింజ పుల్ల పీకుంట పీకుంట బీమారం పాయె బీమారం కోమట్లు మా మంచి వారు సాదుకొమ్మని రెండు మామిండ్లు ఇచ్చే మామిండ్ల దర్వాన పూత పూసే పూత దర్వాన కాత కాసే కాత దర్వాన పండు పండే పండు తీసుకొని బల్లెకు పోతే బల్లె కుక్కలన్ని బౌబౌ మనే అప్పుడే నా ఒల్లు జల్లుమనే జల్లుమన్న కాడ మల్లెలు పూసే.. - కిరణ్
Read More

జాజిరి పాట

జాజిరి పాట నాకు గుర్తున్న ఒక జాజిరి పాట:- రింగుడు బిల్లా రూపాయి దండా దండ కాదురో దామెర మొగ్గ మొగ్గ కాదురో మోదుగు నీడ నీడ కాదురో నిమ్మల బావి బావి కాదురో బసంత కూర కూర కాదురో గుమ్మడి పండు పండు కాదురో పాపర మీసం మీసం కాదురో మిరియాల పొడి పొడి కాదురో పొరిమెల కట్ట కట్ట కాదురో చీపురు కట్ట కట్ట తీసి నీ నెత్తిన కొట్టా.. - కిరణ్
Read More

సాగించాలి…

సాగించాలి... కోడి కూసింది మొదలు.. లేడి లేసింది పరుగు.. మన బ్రతుకు బండికి తెర తీసింది.. జీవనయానం సాగించాలి.. జీవితాలు పండించాలి..  - పలుకూరి
Read More

హోళీ పండుగ శుభాకాంక్షలతో…

హోళీ పండుగ శుభాకాంక్షలతో... రంగురంగుల హోళీ నింపేను మీ ఇంట సంబురం... రంగురంగుల హోళీ చేసేను మీ ఇంట ఆనందమయం... రంగురంగుల హోళీ సరికొత్త సరిగమల కేళీ... రంగురంగుల హోళీ నవజీవన ప్రారంభ కేళీ... - నారాయణ
Read More

మాటల గారడి 

మాటల గారడి         సమాధానం లేని ప్రశ్న ప్రశ్న: అంతకు ముందు నేనడిగిన ప్రశ్నల్లో ఆ              ప్రశ్నకు నీ సమాధానం ఏమిటని             ఇప్పుడునేనడుగు తున్న ప్రశ్న? సమాధానం : అంతకు ముందు నీవడిగిన                         ప్రశ్నల్లో ఆ ప్రశ్నకు సమాధానం                         చెప్పే ప్రశ్నే లేదని ఇప్పుడు                         నీ వడుగు తున్న ప్రశ్నకు                             …
Read More