Month: May 2022

కనువిప్పు తథ్యం!!

కనువిప్పు తథ్యం!! ఏకధాటిగా కారు నీ కన్నీటి బిందువులు సాగరానికి సరి ఆయెనా....! అమ్మా, నీ హృదయమందలి మహాసముద్రం ఆవిరైపోయెనా ....! నీ నేత్రాలు పొడిబారిపోవునేమో.......! ఆపుము తల్లీ, చేరనీకు నీ అశ్రు బిందువులను రక్తాశ్రువులు...........! నీ, వారసత్వము ఆడుచుండెను జలకాలు ఈ సాగరంబున. శాంతించుము జననీ, నీ బిడ్డలు సుడిగుండాల లో చిక్కి ఉక్కిరిబిక్కిరై, నీ పాదాల చేరెదరు. శాంతించుము తల్లీ ..! - వాసు
Read More

పంచాంగము 07.05.2022

పంచాంగము 07.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*  *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - శుక్ల పక్షం* తిధి : *షష్ఠి* ఉ11 08 తదుపరి సప్తమి వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం: *పునర్వసు* ఉ9.05 తదుపరి పుష్యమి యోగం: *శూలం* సా5.05 తదుపరి గండ కరణం: *తైతుల* ఉ11.08 వరకు తదుపరి *గరజి* రా11.59 వరకు వర్జ్యం: *సా5.51 - 7.36* దుర్ముహూర్తం : *ఉ5.35 - 7.16* అమృతకాలం: *ఉ6.27 - 8.13* & *తె4.22నుండి* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండ/కేతుకాలం: *మ1.30 - 3.00* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *5.35* సూర్యాస్తమయం: *6.17* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

గుణము

గుణము ఆటవెలది: గుణము లెన్ని యన్న ఘనముగా పదహారు బ్రహ్మ సుతుడు తెలిపె బోయ దొరకు రాఘవయ్య కన్న రాజేడి గుణమున? సత్యసాయి పలుకు సత్య వాక్కు తాత్పర్యం: గుణములు పదహారు అని బ్రహ్మ సుతుడు అంటే నారదుడు, బోయ రాజు అంటే వాల్మీకి కి తెలిపెను అని భావము.. రాఘవయ్య అంటే శ్రీరామ చంద్ర మూర్తి ఆయనకంటే గుణములలో రాజెవరూ లేరు అని ఘంటా పథంగా తెలుపుతూ రాసిన ఆటవెలది పద్యం..  - సత్యసాయి బృందావనం
Read More

నావికుడా…

నావికుడా... వయసు వరదలా ఉప్పొంగుతున్న నావ ప్రయాణ జీవనం తో ఆలుపన్నది లేకుండా జీవితం సాగడానికి బాధ్యతల బంధాల కోసం ఎండనక వాననక ప్రయాణికులను ఒడ్డును చేరుస్తూ కుటుంబాన్ని పోషించడానికి నీ బంధాలను  నిర్వర్తించడానికి తన వంతు కృషి చేస్తున్న ఓ నావికుడా ఎక్కడున్నది నీ సుఖం నావనే ఇల్లుగా మార్చుకుని , ఆ నావనే నీ ప్రపంచమైపోయిందా ఆ గోదారి తల్లే నీ కన్నతల్లి లాగ పుజిస్తున్నావా.. నావికుడా... - భవ్యచారు
Read More

ఒక తెలియని బంధం

ఒక తెలియని బంధం "హలో" అంటూ మెసేజ్ టోన్ ఎవరా అంటూ చూశాను ఏదో అన్నోన్ నెంబర్. ఆ నెంబర్ ఎవరిది అనుకుంటూ "హలో, హూ ఈజ్ థిస్" అని మెసేజ్ చేశా. "నా పేరు వినయ్ నేను ఒక నర్సరీ నడుపుతున్నాను మీకు ఏమైనా మొక్కలు కావాలంటే నన్ను సంప్రదించండి ఇలా నేను అందరికీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఉంటాను ఇది నా వ్యాపారం". అంటూ చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. "అవునా నాకు మొక్కలు అంటే ఇష్టమే, సరే అవసరం ఉన్నప్పుడు చెప్తాను" అన్నాను నేను. "అలాగే ఈ మెసేజ్ మీరు మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ చేయండి ప్లీజ్" అంటూ రిక్వెస్ట్ గా అడిగాడు. "సరే ఖచ్చితంగా చేస్తాను" అంటూ ఆ మెసేజ్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశాను. మా మధ్య పరిచయం మొదలైంది. హాయ్ గుడ్ మార్నింగ్ నుంచి…
Read More

గుణం

గుణం ధనం కన్నా గుణం గొప్పది అంటారు పెద్దలు సత్వ రజో తమో గుణాలకు గణాలు లేవు ఎవ్వరికి స్వభావమే స్వధర్మం అని చెప్పేదే గుణం పుట్టుకతో వచ్చే వి కొన్ని సహజ గుణాలు ప్రేమను పంచుతూ పెంచేదిప్రేమ గుణం తనకున్న దానిలో పంచేది దానగుణం తనది కూడా విడిచింది త్యాగ గుణం అర్దం కాని రీతిలో ముందుకు వెళ్ళేది మొండి గుణం తనకు గానిది వేరొకరి వంతు లేదు అంటే స్వార్థ గుణం కలివిడి మాటల మంత్రం కలుపుగోలు గుణం ఎదుటి వారి క్షేమం ఏ మాత్రం లేనిది రాక్షస గుణం అన్నింటినీ సమానంగా చేసేటి మంచిగుణం పదిమంది కోసంపాటు పడేది ఉదార గుణం ఎవ్వరు ఏమి అన్నను పట్టించు కోకపోవడం క్షమా గుణం అన్ని కష్టాలు అద్దంలో చూస్తే సున్నిత గుణం కష్టానికి ఎదురొడ్డి నిలిచేది దైర్య గుణం ఆపదలో సాయం చేసే వారు మేలు చేసే గుణం…
Read More

అమ్మ

అమ్మ కనిపించే ఆ దైవం అమ్మ కని పెంచే దాతృత్వం అమ్మ తొలి గురువు అమ్మ స్వర నాదం అమ్మ జన్మజన్మల అనుభందం అమ్మ అనుభూతుల అనురాగం అమ్మ మమతల మల్లెలు అమ్మ తియ్యని మకరందం అమ్మ కలతలులేని కంచుకోట అమ్మ కరుణ చూపేకామితం అమ్మ కమ్మని మమతల కోవెల అమ్మ గుప్పెడు ఆశల చప్పుడు అమ్మ రంగుల హరివిల్లు అమ్మ కమ్మని రుచుల కారుణ్యం అమ్మ నవరసాల నవనీతం అమ్మ మనసున్న మాణిక్యం అమ్మ విరిసిన పూతోటా అమ్మ చిరు ఆశల సుమమాల అమ్మ మంచిని చూపే మార్గదర్శి అమ్మ వెలుగునిచ్చే జ్ఞాన ధాత అమ్మ కలబోసిన కనకధారా అమ్మ నిను మెచ్చే వరమిచ్చే ఆ దైవం అమ్మ వెలలేని దీవెన అమ్మ కొనలేని గ్రంధం అమ్మా అమ్మంటే అంతులేని సంతోషం అందరికీ ...... - జి జయ
Read More

పంచాంగము 06.05.2022

పంచాంగము 06.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - శుక్ల పక్షం* తిధి : *పంచమి* ఉ9.12 వరకు తదుపరి షష్ఠి వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *ఆర్ధ్ర* ఉ6.33 తదుపరి పునర్వసు యోగం: *ధృతి* సా4.35 తదుపరి కరణం: *బాలువ* ఉ9.12 తదుపరి *కౌలువ* రా10.11వరకు వర్జ్యం: *రా7.50 - 9.36* దుర్ముహూర్తం : *ఉ8.08 - 8.58* & *మ12.21 - 1.12* అమృతకాలం: *లేదు* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *మిథునం* సూర్యోదయం: *5.36* సూర్యాస్తమయం: *6.16*  *శ్రీ శంకర జయంతి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

జంట

జంట అనగనగా ఒక ఊరు ఆ ఊర్లోని ఒక చెట్టు పై ఒక పావురాల జంట ఉండేది. ఆ పావురాల జంట ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా ఉండేవి. ప్రేమకి రూపం ఎవరంటే పావురాలను చెప్తాం. ఎందుకంటే పావురాల లో మగ పావురం చనిపోతే అడ పావురం ప్రాణ త్యాగం చేస్తుంది కాబట్టి ప్రేమకు ప్రతి రూపంగా చూపుతారు. అయితే ఆ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేది. ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళు కాదు ఎంత సేపు బయట ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్లేవారు, వచ్చేవారు. ఒక్క క్షణం కూడా వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఉండేవారు. అయితే ఒకరోజు వాళ్లు అందంగా గూడుకట్టుకున్న ఇంటికి వెళ్లాలని ఆహార అన్వేషణకు వెళ్లి ఆహారాన్ని సంపాదించుకొని తమ గూటికి చేరుతున్న పక్షులకు అక్కడ ఉన్న చెట్లు కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు ఆ చెట్టు ఏమైందో అర్థం కాక వాళ్ళు చుట్టూ…
Read More

నాకు జరిగిన అనుభవం

నాకు జరిగిన అనుభవం కొన్ని సంవత్సరాల క్రితం నా అనుభవం. అయితే ఏమైందంటే నేను అమ్మ గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. నేను హైదరాబాదులో ఉంటాను, అమ్మ వాళ్లు కామారెడ్డి లో ఉంటారు. అమ్మకు ఆరోగ్యం అంతగా బాగుండదు ప్రతి నెలలో రెండు మూడు వారాలు అక్కడికే తిరగవలసి వచ్చేది. ప్రతి నెలలో రెండు సార్లు మూడు సార్లు వెళ్ళేదాన్ని. అమ్మ ఆరోగ్యం గురించి నేను తిరగవలసి వచ్చేది అయితే ఒకరోజు ఏమైందంటే నేను తీసుకు వెళ్ళిన డబ్బులు అయిపోయాయి డబ్బులు ఎక్కువగా లేవు నా దగ్గర 500 ఉన్నాయి. అమ్మకు చెప్పి మళ్ళీ వస్తాను అని పొద్దున్నే బయలుదేరాను. బస్టాండ్ కి వచ్చేసరికి పది గంటలు అవుతుంది బస్సు కోసం నిలబడ్డాను ఇంతలో నా తమ్ముడు వచ్చి అక్క నాకు ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వు నాకు చాలా అర్జెంట్ అవసరం ఉంది అని అడగగానే నేను ఎప్పుడు…
Read More