Month: June 2022

మంచితనం

మంచితనం మంచితనానికి మించిన సంపద లేదు అంటారు పెద్దలు. కాని ఈ రోజుల్లో దానిఅర్దంమారిందిఅనొచ్చు మంచితనం అంటే అడిగాను నేను కొందరిని సమాజంలో వచ్చిన సమాధానం ఏమంటే; మంచి తనం ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు మంచి మనసే మంచితనం అంటున్నారు కొందరు మంచితనంపిడికెడునెలవు అంటున్నారు కొందరు మంచితనంఅసలేపనికిరాదు అంటున్నారు కొందరు మంచి చేస్తే మనకే మంచి జరుగుతుంది అంటున్నారు కొందరు మంచి తనం నమ్మటం లేదు ఎవ్వరు అంటున్నారు కొందరు మంచితనం నాకోసం ఒక గోడ అంటున్నారు కొందరు మంచి తనం చేతకానితనం అంటున్నారు కొందరు మంచితనానికి రోజులు లేవు అంటున్నారు కొందరు మంచితనం తెలివితక్కువ అంటున్నారు కొందరు ఈ తరంవాళ్ళుఅంటున్నారు ఇది కొత్త పదమా అని మంచితనం బ్రతకడానికి పనికొస్తుందా అంటున్నారు కొందరు చిన్న పిల్లలు అంటున్నారు కొనేసుకుందాం అని ముందు తరం వాళ్ళు అంటున్నారు మేము వాడాము అని మంచితనం సహాయము పొందిన వాళ్ళు అంటున్నారు మాకు ఉపయోగమే…
Read More

తప్పదు

తప్పదు కురిసే వర్షం పుడమికి పాటై ప్రవహిస్తోంది కానీ మనస్సుకి లాలిపాట పాడే వర్షచ్ఛాయ జాడేలేదు! ఆకలికేకల ప్రకంపనలెందుకో అందరినీ తాకటంలేదో లేక ఏ మధుపాన సేవలోనో మరే మధుపం వేటలో మునిగున్నారో మనుషులు ఇందుమూలంగా తెలియచేసేదేమనగా మనసులు అమ్మేసుకున్నవారూ తాకట్టు పెట్టినవారూ మనసుకు లాలిపాట కోరుకునే హక్కును కోల్పోయారని పుడమికి చినుకు మావిచిగురు వంటిది మనిషికి కలగనటం లాంటిది ఇప్పుడు స్వప్నాలన్నీ వలసబాట వలసబాటనెంచుకున్నాయి మనిషి స్వీయాన్వేషణలో సాగక తప్పదు - సి. యస్. రాంబాబు
Read More

గొప్ప వ్యక్తిత్వాలు

గొప్ప వ్యక్తిత్వాలు 1) గొప్ప వ్యక్తిత్వాలు ఎవరిలోనూ లేవు. 2) వ్యక్తిగత లబ్ది అందరి ధ్యేయం. 3) ఫలితంగా స్వార్ధం విలయతాండవం. 4) నేను మంచి వాడిని అనుకుంటే మనస్సుకి శాంతి. 5) నువ్వు ఇతరులకి సాయం చేయాలంటే వారిలో చెడు ఇట్టే కనిపిస్తుంది. 6) ఆపాత్రదానం నీవు మెచ్చే బహు గొప్ప పదం. నీతి :- ఇతరులకి చేయి అందించలేని నువ్వు చేతకాని చవటవి. - వాసు 
Read More

అన్వేషి

అన్వేషి వెతుకుతుంటాను నిరంతరం మానవనాగరికత బాటవేసిన మనిషిని! పరిమళమై వ్యాపించిన మానవత్వాన్ని! పురాతన మనుషులు వారంతా వెక్కిరించాడొక మిత్రుడు! మారుతున్న కాలంతో మారని మనిషికి నువ్వంటు భృకుటి విరిచాడు! కాల ప్రవాహానికి కదిలిపోవటమే తెలుసు మారటం మార్చడం మనిషి చేసే పని కదాని నిట్టూర్చాను! కాలాన్ని వెనక్కి తిప్పలేనట్టే మార్పు చూపును తిప్పలేము రెండూ సాగిపోతుంటాయి! రెప్పలార్పుతు మనిషి మాత్రం అవసరాన్ని ఆసరా చేసుకుని అధికారం చెలాయిస్తాడు! నిరీశ్వరవాదంలా నీది నిరాశావాదం అన్నాడు మళ్ళీ మిత్రుడు! వెనక్కిలాగే మనసును ముందుకు నడిపించలేని మీరంతా ముందుచూపులేనివారేనంటూ దెప్పిపొడిచాడు! నిలువెల్లా కప్పేసిన సాంకేతికత యాంత్రికతను గుమ్మరించేయగా మనిషితనంతో నవనవలాడే మనిషి కనబడలేదని దిగులు మేఘమై కూలబడకని వచ్చే వాతావరణ హెచ్చరిక మనిషిని మార్చే ఋతుపవనాలను వెంటతెస్తుందన్న ఆశ నన్నో నిరంతర అన్వేషిని చేసిందని చెప్పాలని ఉన్నా చెప్పక తప్పుకున్నాను తప్పు తెలుసుకుంటాడన్న ఆశను నింపుకుంటూ! - సి. యస్. రాంబాబు
Read More

ధైర్యం

ధైర్యం 1) కష్టం విలువ వెలలేనిది. ఇది నిర్వచనీయమే. దీనికి తెలుసు ఆకలి బాధ. 2) నీ అవసరం లాంటిదే ఇతరులది అనుకుంటే, నీలో వున్నది ముమ్మాటికి నిజాయితి. 3) నవ్వించడానికి నవ్వు కానీ నవ్వుతూ నవ్వులపాలు చేయడానికి నవ్వకు. 4) నీ అదృష్టానికి దేవుడి ఆశీస్సులు కారణమైతే, ఇతరులని శాపించకు. 5) నీవు నడిచే దారి ముళ్లబాటైతే అనుసరులకై చూడకు. 6) మాటపై నడుస్తే నీది పూలబాటే. నీతి:- సాహసానికి ధైర్యం అవసరం. నీలో ఇది అవసరం. - వాసు
Read More

సంతోషం

సంతోషం సంతోషం సగం బలం అంటారు సంతోషాన్ని వెతికే చోటు వుండదు చూసే మనసు మాత్రమే నిజమైనసంతోషం అనుకున్నది జరిగితే సంతోషం . మంచివిషయాన్ని పంచితే సంతోషం ఎదుటివారిని ప్రేమిస్తే సంతోషం గెలుపును చూస్తే సంతోషం మనసుతో మాట్లాడితే సంతోషం పోల్చు కోకుండా ఉండటం సంతోషం నిజాలను మాట్లాడం సంతోషం నచ్చిన పని చేయడం సంతోషం ఇష్టంతో చేసే పని సంతోషం మెచ్చిన మనుషులతో వుండటం సంతోషం ప్రశాంతంగా గడపటం సంతోషం తప్పు ఒప్పులు లెక్కలు వేయకపోవడం సంతోషం ఎదుటివారి నుండి ఏమి ఆశించక పోవడం సంతోషం మంచిని కోరుకోవడం సంతోషం ఉన్నదానితో సరిపెట్టు కోవడం సంతోషం ప్రతిపని లో సంతోషాన్ని వెతకడం సంతోషం డబ్బుకు సంతోషానికి పోటీ లేకపోవడం సంతోషం వెతక కుండా పొందేటి అనుబూతి సంతోషం "అక్షయ పాత్ర లాంటి" సంతోషాన్ని చిరునవ్వుతో ఆస్వాదిస్తూ పట్టలేని సంతోషాలను మాత్రమే మిగుల్చుకోవాలి అందరు..... - జి జయ
Read More

ప్రేమలు పెళ్లిళ్లు

ప్రేమలు పెళ్లిళ్లు   "ప్రే" అంటె ప్రేరేపింపబడిన "మ" అంటె మనసు ఆడ మగల మనసుల ప్రేరేపించు ప్రకృతి, సృష్టి చేయ ఒకరి చూపులు మరొకరివి కలిపి రెండు మనసుల,చేయు ప్రేరణ అవే " ప్రే " "మ "అను ఇద్దరి మనసుల కలుపు,రెండక్షరాలు దూరమున వున్న ఆ రెండక్షరాలు " ప్రేమ "గా మారె ఒకే మాటగ పెళ్లిగ మారె ఏడడుగులు నడవ జీవన పడవ నడచు ఒకే బాటగ, ముందే జరిగే ఈ ప్రేమ పెళ్లిళ్ళు స్వర్గాన ఎపుడో తంతు మాత్రము జరుగు భూలోకమందు - రమణ బొమ్మకంటి
Read More

కులం – వర్ణం

కులం - వర్ణం ఇవి మన దేశంలో ఎప్పుడో వేల సంవత్సరాల ముందు జరిగిన కాలం, చదివిన వేదం(ఋగ్వేదం) లో మొదలయి ఇప్పటికీ పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య... పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించిన మన దేశం లో కుల వివక్ష తను అదికమించడం లో మాత్రం చాలా వెనకబడిపోయాం... ఈ కులం అనేది రాజకీయాలను శాసిస్తుంది.. విద్యాలయాలను ప్రాభావితం చేస్తుంది.. మానవత్వాన్ని చంపేస్తుంది.. విలువలను కాల రాస్తుంది.. మనిషిని సంస్కరించే మరే ఇతర నైపుణ్యాన్ని ఎదగనివ్వలేదు.. వైజ్ఞానిక సాంకేతిక పురోగతి సాధించే ఎన్నో రకాల పనులకు అడ్డంకి గాను మారుతుంది... కారణం ఇప్పటికీ కులం కొమ్ములు పట్టుకుని కూర్చునే ఎంతో మంది ఇలా చెప్పుకుంటూ పోతే ... ఈ కులం పేరిట జరిగిన అక్రమాలు దేవాలయాల నుండి వెలివేత, విద్యాలయం నుండి బహిష్కరణ ఇలా సమాజం తో పాటు కలిసి జీవించడానికి వీలులేని మరెన్నో హక్కులను దారిద్ర్యపు…
Read More

ఘటన

ఘటన నిజ జీవితంలో జరిగిన ప్రతి ఘటన కథలుగా మారిపోతున్నాయి ఎంతలా అంటే నిజం కూడా కట్టుకథగా తలపించేలా ...! నడి సముద్రంలో ప్రయాణించే నావ లాగా మారిపోయాయి రోజులు.. ఎవరికి వారే భవిషత్ తరాలకి ఎదో ఇవ్వాలని ఆరాటం మాత్రం కాదు... తమ స్వార్థం కోసం తీసే పరుగులు మాత్రమే... అయినవాళ్ళు లేరు, ఉన్నవాళ్లు అయినవాళ్ళు కారు... సమాజం కోసం తపనపడి జివించేవాళ్ళు ఒకప్పుడు ఉన్నారు అని చెప్పుకోడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి ఆ రోజు భోజనం చేసి పడుకోవడమే ఆనవాయితీ అభివృద్ది పేరుతో ఇప్పటికే మన ఆయు ప్రమాణం తగ్గటమే కాకుండా ముందు తరాలకి బ్రతికే స్వేచ్ఛని కూడా హరించేశాం.... కాంతి వేగం పుంజుకుంది కాలప్రమాణం దిశ మార్చుకుని తిరుగుతుంది, ఋతువులు కొత్త రూపాన్ని ధరించి వస్తున్నాయి... దిక్కులు పిక్కటిల్లేలా ధరణి ఘోష వినిపిస్తుంది... సాగరం ఎదురు చూస్తుంది పుడమిని మ్రింగుటకు... మృత్యువు కౌగిట్లోకి ఆహ్వానిస్తుంది....…
Read More

కుల వివక్ష

కుల వివక్ష కులవివక్ష అనే విషయం చెప్తే చేంతాడంత వింటే భారతం అంత అన్నట్టు రావణకాష్టంలా కాల్తూవుంది. సాధారణంగా ప్రజలు జీవనోపాధికి చేసే పనులను ఆధారంగా కులం అనేది రూపొందింది . కాలక్రమేణ అదిఒకసమాజాన్నివిచ్ఛిన్నం చేసే ఆయుధంగా మారింది. భారతీయ వ్యవస్థలోకులాల మతాలప్రాధాన్యం ,ప్రభావం ఎక్కువే అని చెప్ప వచ్చు . ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఎలా వుంటుందో అలాగే ఏ వృత్తి లో నైనా రాణించి జీవనోపాధి పొందవచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చట్టాలు, శిక్షలు ప్రజాస్వామ్య విలువలు ఎన్నో మార్పులు వచ్చినా కుల వ్యవస్థలో మాత్రం మార్పు చోటుచేసుకున్నది తక్కువే. అదీ కాకుండా వివక్షకు దారి తీసి" వేధింపులు, అఘాయిత్యాలు,అనుమానాలు ,శిక్షలు కనబడటం బాధాకరమైన విషయం. ఎంతో మంది సంఘ సంస్కర్తలు, మహనీయులు కృషి చేశారు. జీవితాలను ధారపోసి పోరాడారు. కులవివక్షఎన్నోకష్టనష్టాలను తెచ్చి పెడుతుంది. అయినా సమానత్వంస్వేచ్ఛమూలాల్లో పనిచేయడం లేదు. నిరక్షాస్యత, పేదరికం, ప్రజల అసహాయతలు, వివక్షకు…
Read More