Month: July 2022

అక్షరపరిమళం

అక్షరపరిమళం విమర్శనాస్త్రాలు పదునెక్కుతుంటే అక్షరాలు అస్త్ర సన్యాసం చేస్తానంటున్నాయి భావాలు బతిమాలుతున్నాయి ఏమీ చేయలేక కవి చేరగిలబడ్డాడు నీ వంకర టింకర నడకను సరిచేసేందుకే విమర్శ జడివానై తడేపేది కొత్త దారి వేయాలంటే పదసంపద పెంచుకోమని సలహా చెబుతున్నాయి భావాలు గుమిగూడుతూ ఉప్పొంగే అలలాంటి భావాలను నియంత్రించే మనసుకు నను సరిచేసే బాధ్యత లేదా చిరుబురులాడింది అక్షరం హృదయానికి ఉద్వేగమెక్కువ ఊరికే తొందర పెడుతుంది మనసు రుసరుసలాడింది హృదయానిది నదీ పారవశ్యం తప్పు నాదంటూ తలదించుకుంది బుద్ధి అంతా శాంతించినవేళ మనసు కోయిల రాగమాలికయ్యింది మెరుగు పెట్టే బుద్ధి తోడుతో భావాలను అలంకరిస్తూ అక్షరమిప్పుడు ఆత్మవిశ్వాసపు కోట - సి. యస్. రాంబాబు
Read More

సాయిచరితము 

సాయిచరితము  పల్లవి బతుకే భారమయా ధైర్యము నీయవయా సాయము చేసేటి సాయి ఒకడేలే చరణం బాధలు భయపెడితే భయమే వెంటుంటే సాయినే తలచితివా అండ నీకు దొరుకునుగా అంధకారముంటేను ఆపద కలిగినచో నీడగ తానేమో ఉంటాడు చూడవయా చరణం తన భక్తుల కోసం పగలు రేయిని మరచి కాపాడుట కోసం వెంటే ఉండునుగా చింతే తీర్చునుగా మీరంత పిల్లలనుచు వెన్ను నిమురును తాను నీ బాధ నాదనచు ఆభయము ఇచ్చునుగా - సి. యస్. రాంబాబు
Read More

అమూర్త గానం

అమూర్త గానం రోజూ చూస్తుంటానా బల్లని అలసిన దేహాన్ని మాసిపోయిన జ్ఞాపకాల్నీ కడిగి ఆరేయమంటూ ఆహ్వానించిందా బల్ల పరికించి చూశాను ఎంతమందికి ఆశ్రయమిచ్చిందో ఎన్ని అనుభవాల నెమరువేతకు నీడనిచ్చి భుజం తట్టిందో మనతో మట్లాడుతున్నట్టే అనిపిస్తుంది నిశ్శబ్దంగా నిశ్చలంగా ధైర్యాన్ని కప్పుకునుంటుందేమో ఆ అమూర్త స్వరూపిణి నాలోని బేలతనం కొత్త ఊపిరిపోసుకుంటుంది! ఆ బల్లను చూస్తే నాకు తరలిపోయిన అమ్మ తిరిగొచ్చి భుజం నిమురుతున్న అనుభూతి! పరుగు పందెంలో ఓడిపోతున్న ప్రతిసారీ నన్ను పునస్సమీక్షించుకోమని చోటు చూపించే ఆ అమూర్త స్వరూపిణిికి రోజూ నమస్కరిస్తుంటాను! - సి. యస్. రాంబాబు
Read More

రైతు

రైతు 1) తే.గీ    గూడు లేకున్న కానల కూటి కొరకు    పోడు గొట్టుచు ముళ్ళతో పోరుసలుపు    పాడి పంటలు పెంపొంద పాటుబడుచు    మాడుచుండెడి రైతు సామాన్యుడగునె! 2) తే.గీ    ఇష్టమున్నను లేకున్న ఇలను దున్ని    కష్టపడినను రైతుపై కరుణలేదు    ముష్టి వాళ్ళను జేయుచు మురిసిపోవు    నాయకుల మాట లెవ్వరు నమ్మరాదు 3) ఆ.వె    ఆత్మ హత్య పాపమందురే గానిమా    నిత్యజీవితమున నిజము గనరు    నమ్ముకున్న పంట నానాట ధరలేక    రైతు బతుకు లిట్లు రాతలాయె 4) ఆ.వె    రైతు జన్మభూమి రాణించె నేతీరు?    కొరతలేక నీరు కోరినాము    ఊతమిత్తుమంటు ఊరించిపోయిరి    మాటలన్ని నీటి మూటలాయె 5) ఆ.వె    ఎన్ని రంగములను నెందరున్నను గాని    అన్నదాత కన్న అధికులెవరు?    అన్ని దేశములకు ఆదర్శమూర్తియై    ఆంధ్ర…
Read More

గతము గంభీరమాయె

గతము గంభీరమాయె గతాన్ని నెమరు వేయ మిగిలెనాకు కమ్మని అనుభూతులు. అందని ఐరావతము అందలాలెక్కించె. వరించునేమో వయ్యారి జీవితము అని వర్తమానము వగలు పోతుండె......! వెర్రి కుంకనై విహంగ పక్షినైతి......! తల దాచ గూడు కానరాకుండె. అలసిన కాళ్ళు నిలుప భూమి చెంత లేని చింత ఆయె ...........! వర్తమానము ఇట్లు గమ్మత్తాయె! గతము గంభీరమాయె! అవ్వునా గతము నా సొంతము.....! నిలకడ వొచ్చి మళ్ళీ నిల్చుందునేమో....! - వాసు
Read More

జడివాన

జడివాన మేఘాలు కమ్ముకుని ముసుగు తీసిన వరుణుడు వద్దన్నా గుమ్మరించును జడివాన లా విరామమెరుగక వర్షించును వాగులు, వంకలు నిండగా పుడమితల్లిపరవహించును జలసిరులతోసింగారంగా ఋతువుల ఆగమనం తో అదనుఅవుతుంది జడివాన జాలులో పాడిపంటలకుసారమై ఊత మిస్తాయి పుడమికి సూరీడు దాగిఉండును మబ్బువెనుక దారులన్నీ దర్శనమిస్తాయి నీటితోనే వస్తుందో లేదో అని ఎదురు చూసిన వాన జడివానై కురుస్తుంటే వేడి వేడి కాఫీలు పకోడీలు ఎదురొస్తే స్వర్గంమెట్టు కనబడుతుంది ఎవ్వరికైనా.......? - జి జయ
Read More

స్టేటస్ ప్రపంచం

స్టేటస్ ప్రపంచం ఆలోచనల అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నామా స్టేటస్ శిఖరాలు ఎక్కాలని ఎన్ని ఎత్తులు వేస్తుంటాం కునుకు రానివ్వకుండా కళ్ళనిండా వినిమయ ప్రపంచం తారట్లాడుతుంది కపటం రెక్కలపై ఎగిరే విహంగమై ఆడంబరాల ఆకాశాన్నందుకోవాలని తపిస్తాం రంగుల ప్రపంచం మాయతెర చాటున క్రూరత్వం ప్రదర్శనలో పోటీ పడతాం కూలి పోతున్న బంధాలు పెరిగిపోతూ వ్యాపార సంబంధాలు మనిషిప్పుడు కుళ్ళిపోతున్న విలువల కూడలి వానకి వణికిపోయే చిగురుటాకులా వడలిపోతున్న మానవత్వానిదో మౌనరోదన ఆలోచనల అద్దంలో ఎన్ని ముఖాలు ఎన్ని ముసుగులు గుసగుసలాడుతుంటాయి అందుకే ఆలోచనల అద్దంలో చూసుకోవాలనుకోకు మనసు ప్రవచించే మాటలు బీడుభూములయిన వ్యక్తిత్వాలపై తొలకరి చినుకులు కావు నవ్వు మాస్క్ వేసుకున్నా నీ ఆనందాన్నెప్పుడో తస్కరించింది స్టేటస్ ప్రపంచం - సి. యస్. రాంబాబు
Read More

డీకోడింగ్

డీకోడింగ్ నిజాలు దాచుకున్నట్టున్న నల్లమబ్బులు నిశీధి నీడల దుఃఖాశ్రువులను రాలుస్తుంటాయని జీవితం వర్తమానం పంపుతోంది తన మాట వింటున్నానో లేదో అని! భుజంతాకిన బిందువును స్పర్శించాను ఎన్నో జ్ఞాపకాల వలయాలు విలయాలను గుర్తుచేస్తుంటే గతం గాయాలన్నీ ఉప్పొంగుతుంటే గుర్తొచ్చానా అంటూ జీవితం నవ్వింది! అర్థమయ్యి అవ్వక జీవితం తికమకపెడుతూ చలిగాలిలా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది ఆలోచనల నిప్పు రాజేసి జీవితాన్ని చలిమంట చేసేశాను తప్పించుకోవటానికి! ఆకాశంలో పక్షుల గిరికీలు నేలపై మనుషుల సాముగరిడీలు ఒకరిది ఆనందం ఒకరిది ప్రదర్శన మళ్లీ జీవితమే ఏదో చెప్పాలని ప్రయత్నంలో ఉంది! అనంతమై ఆలోచనల పరుగులో నల్లమబ్బై జీవితం నాపై ఒరిగింది కాలం కడలిలో జారిపోవటమే ప్రకృతి ధర్మమైనవేళ అధర్మబాటలో నడిచేమి ప్రయోజనం నన్ను నిష్ప్రయోజకురాలను చేయకంది తన దుఃఖాశ్రువులను డీకోడ్ చేయగలిగాను! - సి. యస్.రాంబాబు
Read More

అతివృష్టి – వరదబాధలు

అతివృష్టి - వరదబాధలు 1) నిన్న మొన్న తాగనీరు లేకనుమాడి    జీవరాసులెన్నొ జీవమిడిచె    మిగిలినట్టి పసులు మున్నీట వరదల్లొ    దీనముగ దివిజనె దిక్కు లేక 2) ఉగ్రరూపగంగ ఉరకలెత్తి పొంగె    కంటనీరు నింపి.పంటముంచి    కట్టుకున్న యిండ్ల కనుల ముందే కూల్చి    ప్రాణములను దీసి పాతరేసె 3) నిలువ నీడ లేదు.నీరు తాగనులేము    ఆదుకొనెడి బంధువండ లేరు    మనసు చెదరి పోయె.మార్గాలువెదకగా    దారులన్నిజూడ ధారుణమ్ము 4) ఇండ్లు కూలిపోయె ఇక్కట్లు మొదలాయె    పంటచేలు అన్ని కుంట మునిగె    అడవి జంతువులకు ఆలంబనే లేదు    సాదుజంతువులకు పాదులేదు 5) మంచినీరు లేదు మాత్రలు లేవాయె    రోగమొచ్చెనంటె మూగనోము    ప్రాణమున్న చాలు బతుకు బరోసకు    అన్నపానమేది అందకున్న 6) కాశ్మిరమ్మునుండి కన్యాకుమారికి    వరద వెల్లువెత్తె వరుసగాను    నదులు పొంగిపొర్లి నాశనమొనరించె  …
Read More

వాన దృశ్యం

వాన దృశ్యం మేఘాల సామూహిక గానం నగరాన్ని హర్షంతో తడిపేసింది ముడుచుకున్న నగరం బద్దకాన్ని కప్పుకుంది మినుకుమనే వాహనాలన్నీ తొందరపడటం లేదు చినుకులను చప్పరిస్తూ రీఛార్జ్ అవుతున్నాయి అడపాదడపా రాలే చినుకులు చిత్తడినేలతో చిలిపి ముచ్చట్లను చెబుతున్నాయి మూలనున్న మందార చెట్టు ఆకుపై చినుకు ముత్యం మెరుస్తోంది దాచుకున్న జ్ఞాపకాల్లా నేలపై నీటి అద్దాలు తళతళమంటున్నాయి! పాలపేకెట్ కుర్రాడు యాంత్రికంగా కదిలాడు కునుకు వదలిన బైరాగి బీడీ ముట్టించాడు తోకాడిస్తూ కుక్కపిల్ల ఏదో చెబుతోంది ముట్టడించిన వాన మందగించేదెప్పుడనా! చుట్టపు చూపులాంటి వర్షపుగాలి వచ్చిందంటే చాలు వేడి కాఫీతో మనసుని వెలిగించి గతం రోడ్డుని సాఫు చేస్తుంది వర్షపు చినుకు ఊరికే ఉండనివ్వదు అనుభూతులను ,అనుభవాలను కలిపేసి మనుషులతోపాటు పాటు నగరాన్ని కూడా ఏకాంత మందిరం చేస్తుంది! - సి. యస్. రాంబాబు
Read More