Month: September 2022

నీ…. నేను

నీ.... నేను నీ నయనాలలో నేనైతే, నా ఊపిరి నువ్వైతే, నీ అధరాల మెరుపు నేనైతే, నా సింధూరపు వెలుగు నువ్వైతే, ఇద్దరి మధ్యా దూరం తరిగిపోతే, కరగని కలగా మిగిలిపోవాలని కోరుకునే నీ.... నేను. - భవ్య
Read More

చదువు

చదువు ఆ.వె. రాత్రి పూట చదువు, రాతపనులు వద్దు కళ్ళు దెబ్బ తినును కష్టమగును ఆట పాట చదువు ఆరోగ్యమిచ్చును నిద్రమత్తు చదువు నిండు సున్న - కోటా
Read More

చినుకు గడుగ్గాయి

చినుకు గడుగ్గాయి చినుకు ముత్యాలు జారుతుంటే మనసంతా రుబాయిలు లిఖిస్తున్నంత సంబరం సంబరాన్ని పోగేసిన గాలి వేణుగానంలా చొరబడుతుంటుంది చొరవతీసుకున్న చిలిపిదనం యవ్వనకాంతులను పరుస్తుంది లల్లాయిపదాలన్ని పెదవులపై కొలువుతీరగా బాధ, దుఃఖం కాసేపు ప్రేక్షకులవుతాయి బతుకు తో రణం బతుకు తోరణమవుతుంది ఆనందమెపుడూ తాత్కాలికమే ఆ క్షణంలో జీవించటం నేర్పుతుంది నేర్పుంటే జీవితం కూర్పు తెలుస్తుందని చినుకు గడుగ్గాయి చెవిలో చెబుతోంది - సి.యస్.రాంబాబు
Read More

నీటిమీద రాతలు

నీటిమీద రాతలు నీటి మీదరాతలు గాలిలో మాటలు అంటారు కదా! నేటి సమాజపు బ్రతుకులు నమ్మలేని నిజాలు నిగ్గు తేలని ఆరోపణలు నిబద్ధత లేని వాక్కులు రాజకీయాల రణ రంగంలో సామాన్యుని దుస్థితి చేయలేని చేతనలో అర్థంకాని అపస్థితి లో సరితూగని సమస్యతో వ్యతిరేకపు భావనలు నేటితరం పోకడలు వాక్దానపు వనరులే మిగిలిపోయే చివరికి నీటిమీద రాతల వలె చెరిగిపోయే చెప్పిన కల్లబొల్లిమాటలు నడమంత్రపు సిరి ఒక్కటే చేసేను ఇంత మాయ మనిషిని ........? - జి జయ
Read More

మట్టి వాసన

మట్టి వాసన మట్టి వాసన గుప్పుమంది మది పులకించి పోయింది అణువణువునా ! మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది మనకిచ్చిన ప్రకృతి మాతృభూమి మట్టి వాసన మరపురాని పరిమళం మట్టితోనే మమేకమైన జీవనం అత్తరు చల్లిన ఆనందం మేఘాల గుంపుతో వర్షించేతొలకరిజల్లు కురిపించకుండానే హృదయంఉప్పొంగుతుంది భూమిపుత్రులకు సుగంధ సిరులు అదిఒకమరుపురాని మధుర జ్ఞాపకం పల్లెసొరగులోనిఆస్వాదనపు పరిమళం అన్నదాయిని అమృతపు మాధుర్యం అదే మనదేశపు మట్టిలోనే దాగిన కమ్మదనం మరి......? - జి జయ
Read More

పుడమి మోదం

పుడమి మోదం సూర్యతాపంతో వేడెక్కిన మబ్బులు కడలి‌ చెలికాని కోరి ఆవిరి సఖితో కలసి వర్షపు చినుకులని వర్షించగా పుడమి పులకిస్తుంది ప్రకృతి కాంత సంతసిస్తుంది నెమలి నాట్యమాడుతుంది చెట్టు చేమలు కాంతివంతమవుతాయి చెలమలు పరవళ్ళు తొక్కుతాయి అలుపెరుగని పక్షులు వెచ్చగా తమ జతకాని చెంత గూటికి చేరతాయి పూవులు కిలకిల నవ్వుతూ విరబూస్తాయి పిల్లలు కేరింతలతో మురిసిపోతారు వయసుతో నిమిత్తమేమి లేకుండా కుల మత బేధ భావాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తుంది అందరికీ‌ ఒకేలా ఆనందాన్ని పంచుతుంది బీటలు వారిన నేలమ్మ మామూలు స్థితికొస్తుంది పంటకాలువలు పరవళ్ళతో కళకళలాడేను రైతన్నకంట తడి పుట్టించేను అతివృష్టైనా అనావృష్టైనా కావచ్చు ఆనందభాష్పాలైనా, కన్నీరైనా కావచ్చు ఏదేమైనా ప్రకృతి పులకిస్తుంది. వర్షం మోదం పంచుతుంది. - ఉమామహేశ్వరి యాళ్ళ
Read More

తలపుల అలజడి

తలపుల అలజడి నా మనసంతా ఆక్రమించావనుకున్నా... ఆవిరులు రేపే తలపులతో రగిలిపోతుంటే‌.. తనువంతా అల్లరులు రేపుతుంటే అర్ధమైంది... నాలోనే దాగున్నావని నీవే నేనయ్యానని... పిండారపోసినట్లున్న ఆ నిండు జాబిలి వెన్నెల కుమ్మరిస్తూంటే.... పెరట్లోని మల్లె పందిరి గుబాళించే పరిమళిస్తూంటే.... నిశీధిలా కమ్ముకున్న నల్లని నీ కురుల సంపెంగ నూనె మత్తెక్కిస్తూంటే... నీకెలా ఎడంగా ఉండగలను సఖియా ... నీ సౌందర్యాన్ని ఆరాధిస్తూ కాలమంతా గడిపేయనా... నాజూకైన నడుఒంపులో పుట్టుమచ్చనై దాగుండిపోనా... నుదుట సింధూరమై కలకాలం అలరారనా... ముంగురులలో చేరి నీ బుగ్గల నిగ్గులని తాకనా.... పెదవంచున దాగిన చిరునవ్వునై మెరిసిపోనా... కర్ణాభరణమై నీ చెక్కిలి మీటి సరసమాడనా.... మెడలో తాళినై మెరిసిపోతూ పైయ్యెదని తాకనా... వేడి నిట్టూర్పుల ఉచ్ఛ్వాస నిశ్వాసనవ్వనా... చేతుల స్పర్శలోని అనురాగాన్ని పొందుతూ... చుంబనాల మధురిమల అనుభవంలో... అలరించే నీ సౌకుమార్యపు హక్కుదారునై దాగుతూ.. నీవు నేనైపోయిన తలపుల అలజడినై మురియనా.... - ఉమామహేశ్వరి యాళ్ళ  
Read More

విధ్వంసం

విధ్వంసం నిన్నటిదాకా ఆ చెట్టు నిత్యచైతన్యపు ప్రతీక భూపాలరాగాన్ని భువికి వినిపించే పక్షుల ఆవాసం ఆ నివాసమిప్పుడు నేలరాలింది విలవిలలాడే ఆకుల సందుల్లోంచి గొల్లుమంటున్న గూళ్ళను ఓదార్చలేక నేల కన్నీటిని కుక్కుకుంది బలవంతులు తప్పించుకుంటారు బలహీనులకే లోకంలో కష్టాలు దేక్కుంటు పాక్కుంటూ పక్షులు కూడా కాందిశీకులై ఆశ్రయాన్ని అర్ధిస్తుంటాయి అభివృద్ధి శకటమంతే అడ్డనిపిస్తే ఎవరి రెక్కలైనా విరిచేస్తుంది బహుళ అంతస్తు భవనమో బడా బాబుల విల్లాయో వెలుస్తుందక్కడ పగబట్టిన ప్రకృతి ఊరుకుంటుందా ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ రుచి చూపిస్తుంది విలయమై ప్రళయమై చుట్టేస్తుంది నీటిమడుగులో జీవితం తేలుతూ ఉంటుంటే దిక్కులేని స్థితిలో సాయంకోసం దిక్కులు చూసేలా చేస్తుంది విధ్వంసం ఊరికే ఉండదు అందరిని కబళించక ఊరుకోదు నాగరికత ముసుగులో నాట్యమాడే మనిషీ నిజాలు తెలుసుకోక తప్పదు - సి. యస్.రాంబాబు
Read More

కల్లైన బాసలు

కల్లైన బాసలు   ఏమి సమాజమో అర్ధమవకున్నది.. ఏ శతాబ్ధమో ఆగమాగమవుతున్నది... నాగరికత మోజున మసికాబడుతున్నది... ఆలోచన చేయకుండ ఆగమాగమవుతున్నది.... అరచేతిన వైకుంఠపు తీరులెక్కగున్నది.... సాయమంటె చాటేసే బంధాలే ఎక్కువాయె... బంధాలకి బలమెక్కడ లేకుండా పోయెనాయె.. అనురాగం ఆప్యాయత కల్లబొల్లి మాటలాయె... ప్రేమ నిండా అవసరాలు నిండిపాయె... సెల్ ఫోనులు రాజ్యములో అందరున్న ఒంటరులమాయె.. స్నేహంలో స్వార్ధమనే చీకట్లు దాగిపోయె... సంపదకే ఓటేస్తూ చూపులన్ని అటు సాగిపోయె... బీదవాడు కంటికి కానకుండా మాయమాయె.. మధ్యతరగతి జీవితాలు కానరాని నిశీధులాయె... ఆశయాల భవితవ్యం మత్తుకి బానిసాయె... ఐదేండ్లకి ఒకసారి మీకెందుకు మేమున్నామన్న నాయకులు.. ఓటు వేసి గెలిచాక ఎవరుమీరు ఎవరికెరుకంటరు... నీటిమీద రాతలాయె చేసిన బాసలన్ని.... జీవితాలు గుదిబండలాయె ఓటరుగా ఓడిపోయి... భారమంత పీకకి చుట్టె చెత్తకి కూడ పన్నులేయబట్టి... ఏమవుతున్నది ఎటుపోతున్నది... చదువుకున్న ఓటరులూ చదువురాని ఓటరులూ... ఓటుని అమ్ముకోక హక్కుగా దాచుకోండి... నచ్చని వాడికి అమ్ముడుపోయి కాలమంత ఏడవకండి‌‌‌... తెలివిగ…
Read More

మట్టి వాసన

మట్టి వాసన మట్టి విలువ తెలిసిన మనిషికి మనిషి విలువ గొప్పగా తెలుస్తుంది అని పెద్దల మాట! మట్టి వాసన మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది! సాటిలేని పరిమళం ప్రకృతి మనకిచ్చిన వరం! అన్నదాయిని అమృత ప్రదాయిని పంచభూత మయo ! మరపురాని మాధుర్యం అన్నదాతకు అత్తరు చల్లిన ఆనందం! తొలకరిజల్లుల కమ్మదనపుo తెలియని అనుభూతుల సిరులు! వర్షించే మేఘానికి పరిచిన ఆహ్లాదమయ మట్టితివాచీ! ఉప్పింగిన ఉత్సాహానికి మట్టి వాసన గుప్పుమన్న వర్ణన లేని సుగంధం! పల్లె సొరగులో పరిమళ భరితం ఆ మట్టి అంతరంగం ! మట్టి వాసనలో మమేకమై జీవనంగడిపేఅదృష్టవంతుడే వ్యవసాయ దారుడే కదా మరి .....? - జి జయ
Read More