Month: December 2022

కలగంటిని

కలగంటిని కలగంటిని ఎవరికి కానరాని నా సుందరి అందమైన నవ్వును కలగంటిని.... కలగంటిని తన కను రెప్పల కలయిక నడుమ ఏ కన్నులు చూడని అందం కలగంటిని కలగంటిని ఓ కొత్త లోకాన్ని పరిచయం చేసిన తన మాటలలో కొంగొత్త అందం కలగంటిని కలగంటిని నిశి చీకట్లలో శశి వెలుగుల అందం తన నవ్వులలో కలగంటిని - శ్రీనివాస్
Read More

కలగంటి

కలగంటి కనులారా నిదురలో కలగంటిని ఆసక్తిగా కవినై కలం కదపాలని ఏఒక్కరైనా మార్పుతేవాలని సమాజంలో అధర్మాన్ని అరికట్టాలని అశాంతి దరిచేరవని స్వేచ్చా స్వాతంత్ర్యాలు భంగం కలగదని అసమర్ధత రాజ్యమేలదని అవినీతి అంత మొందుతుందని నైతిక విలువలు నిలువునా నిలుస్తాయని నిరుద్యోగులు ఉండకూడదని అసమానతలు తొలగి పోవాలని ఆకలి కేకలు వినపడవని నిరక్షరాస్యులు ఉండకూడదని విజ్ఞానము కొనకూడదని నిరాశలు కదిలిపోవాలని నిరీక్షణ నెరవేరుతుందని అదృష్టం వరిస్తుందని కలలోనే చిగురాశ కలిగెనే ఊహల కలగంటి మెరుగుపడాలి కొంతైనా మారని సమాజం మరి...? - జి జయ
Read More

దారి

దారి కొత్త దారి అవకాశాల కోసం ఎదురుచూసే వాడికి సమయం సరి కొత్త దారి... ఆశ కోసం ఎదురుచూసేవాడికి దొరికే క్రొత్తదారి... మధ్య తరగతి బ్రతుకులకు మనస్సే మంచిదారి... చదువుల కోసం ఆరాటపడే వారికి అందెను శిఖరపు అంచు దారి... మనసు లేని మూర్ఖులను ముంచు దారి ఎడారి.... ఆలోచన తోడైతే ఆనందమే మనకు మంచిదారి... సీత అన్వేషనలో అంజనేయుడు చూపిన క్రొత్తదారి... నరకాన్ని నరికి నరకచతుర్థిగా మారిన దారి... పండగ పరవళ్ల దారి.... పేదవాడి పస్తులకు ఏది దారి?.. వారి కథ ఏ తీరం చేరిది?... కిషాన్ కి నాగాళి దారి... జవాన్ కు ఫిరంగి దారి... వైద్యుడకు స్టెతస్కోపు దారి.. ఇంజనీరికి ఇటుక దారి..... ఇలా పలు రంగాల ప్రయాణాన మానవుడి కదలికలే కొత్త దారి... రేపటి తరాలకు సరికొత్త పునాది... - తోగారపు దేవి
Read More

కొత్తదారి

కొత్తదారి అనుకోని పరిస్థితుల్లో పుడుతుందోక కొత్తదారి విసిగిన ప్రతి క్షణమున కలిగెను మరోదారి... అవసరానికో దారి అనవసరానికో దారి నీదారిన నువ్వు నాదారిన నేను అక్షరలిపిది మరోదారి... దారులు ఎన్నున్న నీకై వుంది మరోదారి ప్రతిదారిన నీవే అడుగులు.. - హనుమంత
Read More

చిగురాశ 

చిగురాశ  నాలో నిండిన నీకోసం.. నాలో లేని నాకోసం.. నన్ను తడిమే ఓ జ్ఞాపకం.. నీ చిరునవ్వే ఓ నేస్తం.. గతించిన గతంలోనే ఉందిలే మళ్ళీ నువ్వొస్తావనే చిగురాశ నాలో.. ఎదురుచూస్తూ గతంలోనే నేనిలా ఉండలేననే ఆశతో.... - గాయత్రీభాస్కర్ 
Read More

చిగురాశ…

చిగురాశ... "ఒకరోజు".. పొద్దున్న లేవగానే.... నీకు ఫోన్ చేయను, మెసేజ్ చేయను... ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఏం జరిగింది అనేది కూడా చెప్పను... ఏం తింటున్నాను, ఎలా ఉంటున్నాను. అనేది కూడా చెప్పను... ఎందుకో తెలుసా ఆరోజు... పొద్దున్న లేవగానే నువ్వు నా పక్కన ఉంటావని.... ఆరోజు మొత్తం నువ్వు నాతోనే ఉంటావని... ఎన్నో మైళ్ళ దూరాన్ని... నువ్వు చెరిపేసి.. నాతోనే ఉంటావు అని... నా ప్రతి కదలికలో నాకు తోడుగా నిలుస్తావని... ఆరోజు నుండి నా ప్రయాణం నీతోనే మొదలు అని.... చిగురించేను నాలో ఒక చిన్న ఆశ - మేఘమాల
Read More

చిగురాశ

చిగురాశ ఒకరోజు... అలా సూర్యోదయం వేళ.. అటుగా నడుచుకుంటూ వెళ్తున్న నాకు ఒక్కసారిగా సూర్యుడు ఎందుకో చిన్నబోయాడు అనిపించింది... కానీ వెలుగు ఏ మాత్రం తగ్గలేదు.... ఎందుకో తెలుసా...? ఆ సూర్యుడి వెలుగు నీ మొహం లో అందంగా కనిపిస్తుంది.. నిన్ను చూసిన ఆ క్షణం ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని అలజడి... నీ నవ్వు చూడడం కోసం నా కళ్ళు ఎంతో ఆరాటపడుతున్నాయి. పదే పదె నిన్నే రూపాన్ని తలపిస్తున్నాయి.... ఎందుకో తెలీదు అడుగు ముందుకు పడటం లేదు.. బహుశా నువ్వు దూరం అవుతావు అనేమో... కను రెప్ప వేయడం లేదు నువు మాయం అవుతావు అనేమొ... కానీ ఆ రోజు ఆ క్షణం నాలో చిగురించిన ఆశ నీతో కలకలం ఉండాలని జీవితాంతం బ్రతకాలని... నేటికీ నిజం అయిన వేళ నా కళ్ళ ముందు నా ఆశ నెరవేరిన వేళ నీకే జన్మ దాసోహం అయిన వేళ ఈ…
Read More

బ్రతుకు బంధాల విలువ

బ్రతుకు బంధాల విలువ బ్రతుకు భారమైన సాగుతున్న ఈ సాంకేతిక లోకంలో.. బంధాల విలువ బారెడు దూరం పారిపోయే గుండె బరువై.... - సూర్యాక్షరాలు
Read More

చిగురాశ

చిగురాశ నా జీవితగమనం నా కుటుంబ సంక్షేమం పెద్ద విద్యలెరుగని పేదవాడిని.. చిన్న ఆశలు తీర్చుకోలేని చిరుజీవిని.. కుటుంబ భవితవ్యం కోసం బరువులు మోయుటకు సిద్ధం అయిన భువిని.. ఏనాటికి అయినా మనోసంకల్పం తిరునని చిరుఆశ... - సూర్యక్షరాలు
Read More

కలగంటి

కలగంటి నీ కోసం ఎదురు చూసే నా కళ్ళు కలగంటున్నయి.. నీతో జీవితాంతం సంతోషంగా ఉండాలని.. నీకై వేసే నా ప్రతి అడుగు.. నీతో ఏడడుగులు వేయాలని కలగంటున్నాయి... నీకోసం, నీ జత కోసం వేచి చూస్తూ ఆకాశం లోని చంద్రుడిని నేల మీద ఎప్పుడు చూస్తానా... నా చేయి పట్టుకునే రారాజు ఎప్పుడూ వస్తాడా అని నా మనసు ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగసి పడుతూ వేయి కళ్ళతో నా కనులు కలగంటున్నాయీ.. ఎక్కడ ఉన్నావు ప్రియతమా.. ఎప్పుడూ వస్తావు నా దరికి.. నేస్తమా.. నా కలలను ఎప్పుడు నిజం చేస్తావు... నా ప్రాణమా... - వనిత రెడ్డీ
Read More