ఆడపిల్ల ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పసితనం.. తమపై జరిగే అన్యాయాన్ని ఎవరితో, ఎలా చెప్పాలో తెలియని అమాయకత్వం.. వెరసి ఎంతోమంది బాలికలు చిన్న వయసులోనే లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. నమ్మి, నా అనుకున్న వాళ్లు, కుటుంబీకులే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. ఇక ఆ అమ్మాయి తన గోడు ఎవరితో చెప్పుకుంటుంది? పొరపాటున నోరు జారినా తనదే తప్పంటారేమోనన్న భయం! అందుకే ఏళ్ల పాటు ఈ బాధను, మౌనాన్ని తన మనసులోనే దాచుకుందో అమ్మాయి. ఆఖరికి బయటపెట్టి నిందితుడికి శిక్ష పడేలా చేసింది.. తనలా మరే అమ్మాయీ బలికాకూడదని నిర్ణయించుకుంది. అందుకే ప్రస్తుతం లైంగిక హింసపై తనదైన రీతిలో పోరాటం చేస్తోంది. మరోవైపు బాల్యంలో తనకెదురైన చేదు సంఘటనల్ని ఉదహరిస్తూ.. ఆడపిల్లలున్న తల్లిదండ్రుల్లో అప్రమత్తతను పెంచుతోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె కథేంటో తెలుసుకుందాం రండి..! నా పేరు కార్తీక. పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే! అమ్మ, నాన్న, నేను.. హాయిగా,…