Month: December 2022

పల్లవి పలికించె చరణాలు

పల్లవి పలికించె చరణాలు   ఉదయభానుని కిరణాలు హృదయాన సోక పలికె పల్లవి గిట్టారు తనంతట తానె అలవోకగ చరణములు నాలోన పలక మారె పల్లవి చరణములు మధురమైన పాటగ మధుర భావనలలు మదిలోన మెదల పాడుకొందును నేను ఎల్లపుడు నాలోన - రమణ బొమ్మకంటి
Read More

యువరాణి

యువరాణి ఒక రాజ్యం లో ఒక కోటకు ఒక యువరాణి.. ఆ యువరాణికి అన్నీ విధాల సౌకర్యములు అందుబాటులో ఉంటాయి ఎల్లపుడూ.. తను చిటికేస్తే అన్ని తన కాళ్ళ ముందు అర క్షణం లో ఉంటాయి.. కానీ ఆ యువరాణి కి మాత్రం అది కారాగారం లా ఉండేది... ఎందుకంటే తనచుట్టూ ఉన్న సైనికులు, తనకి కాపలాగ ఉండి తనని కాలు కూడా బయట పెట్టనిచ్చే వారు కాదు. ఎందుకంటే అది రాజు గారి ఆదేశం.. కానీ రాణి గారికి ఇది ఏ మాత్రం నచ్చక పోయేది... ఎప్పుడూ దిగులుగా ఉండేది... ఎవరు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా తన మనసు కుదురు గా ఉండేది కాదు.... తను ఒక రామ చిలుకని పంజరంలో బందించి దానితో కబుర్లు చెప్పేది.. మనసులు అర్దం చేసుకోలేని మనుషులు.. మధ్య ఉంటున్నాం... వీళ్లకు ఎప్పటికీ అర్దం కాదేమో ఇక నా మనసు ఎం కోరుకుంటుంది…
Read More

బయట ప్రపంచం

బయట ప్రపంచం పంజరం ఉన్న రామచిలుక కొన్ని రోజులుగా తర్వాత బయట ప్రపంచం చూడాలని తన మనసు ఎంతో ఆరాటం పడిన కొన్ని కారణాల వల్ల ఆ పంజరంలో బంది అయిపోయింది. ఒక రోజు తనకే తెలియకుండానే బయట ప్రపంచాన్ని చూడనికి వెళ్లి తనకే సంబంధం లేని ఒక సమస్యలో చిక్కుకొని అక్కడ చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి కొంచం భయంగా అనిపించింది. ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళిపోయింది. తనకి ఇష్టమైన సంగీతం పెట్టుకొని ఆ ప్రదేశాన్ని ఆస్వాదిస్తుంది. బయట ప్రపంచాన్ని చూడాలని తన కోరిక తీరింది. ⁠- మాధవి కాళ్ల
Read More

అందమైన ప్రేమ

అందమైన ప్రేమ అభినయ్ డిగ్రీ పూర్తి చేసిన గ్రాడుయేట్. అతడి తండ్రి మల్లేషు అభినయ్ తో "ఏరా! కష్టపడి ఎలాగూ డిగ్రీ పూర్తి చేశావ్, ఆ రైల్వే ఉద్యోగాలు, క్లర్క్ పోస్టులు ఏవో పడ్డాయని మన సూరి బాబాయ్ చెప్పాడు అదేదో అప్లై చేసుకోరాదూ" అన్నాడు. అభినయ్ జాబ్ అప్లైకి కావలసిన సర్టిఫికెట్స్ తోసుకొని అతని ఫ్రెండ్ తో కలసి నెట్ సెంటర్ కి వెళ్లాడు. అభినయ్ - "ఇదుగో బాబాయ్! ఏదో ఉద్యోగాలు పడ్డాయని మా నాన్నతో అన్నావంట కదా... ఇంతకీ ఏ ఉద్యోగాలు పడ్డాయేంటి?" అని హుశారు గొంతుతో అడిగాడు. "రైల్వే పోస్టులు పడ్డాయ్ రా అబ్బాయ్!" అని చెప్పాడు సూరి బాబాయ్. ఇంతకీ దానికి అప్లై చేయాలంటే ఏం చదివుండాలి అని అడిగాడు అభినయ్. నువ్వు డిగ్రీ పూర్తి చేసావ్ కదా, అది చాలు అప్లై చేసేకి అని అన్నాడు సూరి బాబాయ్. కావలసిన సర్టిఫికెట్లు ఇచ్చాడు…
Read More

ప్రకృతిలో పరవశం

ప్రకృతిలో పరవశం ప్రేమించిన పెన్నిధి సంగీతపు సాన్నిహిత్యం చేతిలోని తంత్రుల గారడీ ఏకాంతలో ఉషోదయపు కాంతుల శక్తితో నిలువెత్తు నిశ్శబ్దంలో ఉల్లాసమే ఉప్పొంగగా లయబద్దపు మంత్రాలు ఎగిరే స్వేచ్ఛా విహంగలా ఒత్తిడిని దూరం చేస్తే ప్రతి జీవి మురిసిపోతుంది కొత్తదనపు పరవశం అన్నింటినీ మించి ఆనందపు ఆస్వాదనే! ప్రకృతిలోని పరిమళాలు పంచు కుంటే పెంచుతుంది అతిశయంగా అక్కున చేర్చుకుని అందరినీ....? - జి జయ
Read More

సంధ్యా సమీరం

సంధ్యా సమీరం శీతాకాలాన సంధ్యా సమీరంలో.. సరిగమలు ఆలపిస్తూ.. ఏకాంతాన విరిసే మల్లె పువ్వుల సువాసనను ఆస్వాదిస్తూ.. వేడి వేడి కాఫీని పెదాల మీదుగా.. నోటికి అందిస్తూ.. చల్లని ఈ సాయంత్రం కోరే.. నీ కబురులతో గడిపే సమయం కోసం....! - గాయత్రీభాస్కర్ 
Read More

నేలవిడిచి సాము

నేలవిడిచి సాము ఆశ సహజం అత్యాశ అసహజం. అందని దానికై అర్రులు చాచుటెందుకు బోర్లపడుటెందుకు. నక్క అందని ద్రాక్ష పండ్లకై ఎగిరి ఎగిరి అందక పులుపు అనుకొన్న చందమున నేలవిడిచి సాము చేయు టెందుకు ఉన్నదానితో తృప్తి పడక పొట్టకూటికై తాడుమీద నేలవిడిచి కర్రపట్టుకు సాము చేయువారితో పోల్చుకొను టెందుకు. - రమణ బొమ్మకంటి
Read More

శ్రీనివాస

శ్రీనివాస ఏడుకొండల్లోన వెలసిన శ్రీలక్ష్మిసమేతుడ వైన నా మొర నీవు వినవ నా భాద నీవు ఎరగవ నీ సేవయే నా ఊపిరి నీ దర్శనమే నా ఆఖరి కాలినడకన నీ కొండకి మార్గముంటే సూపవ వడ్డికాసుల లెక్కలేనా లక్ష్మితోడై ఉయ్యాలలేనా… శేష పాన్పుపై నిధురెనా ఇరుబార్యలతో కబురులేనా…. గుండె గుడిలోన కొలువైన నిన్ను గుండె ఆగే వరకు కొలిచేదము పంచభక్ష్యములతో ఆరాధిం చేదము ఆదుకోవయ్యా శ్రీ శ్రీనివాస - హనుమంత
Read More

ఉద్యమం

ఉద్యమం ఉద్యమం మెరుపు వంటిది ఎక్కడో ఆకాశాన మొదలై భూమండలమంతా ఉలిక్కిపడేలా గర్జిస్తుంది. అది ఎవరికి వెలుగునిస్తుందో ఎవరికి నిశను మిగుల్చుతుందో పిడుగుపాటు కన్నా అత్యంత ప్రమాదకరమైంది ఉద్యమం. అయినా గొప్ప సంకల్పం కలది, భహుషా మనుషుల్ని మెల్కొల్పేది ఉద్యమమే నేమో.... ఉద్యమభావాలు రగల్చని హృదయం అంటూ ఉండదేమో...! సమస్త భూమండలంలో రగిలిన ఉద్యమాలెన్నో, ఉద్యమకారులెందరో? ఉద్యమాల దాహం ఎప్పటికీ తిరదేమో! అపుడపుడు ఉపవాసం ఉంటుంది అంతే బలహీనుల భలమే ఉద్యమం ఎంతటి సామ్రాజ్యాన్నైనా కూల్చగల బలగం ఉద్యమం. ఉద్యమకారులకు నినాదాలే ఆయువు నినాదాలున్నంత వరకు ఉద్యమకారులుంటారు ఉద్యమం గెలుస్తుందని చెప్పలేం గానీ తన ఉనికిని కచ్చితంగా తెలుపుతుంది. రాజ్యాలకోసం జరిగేవి యుద్ధాలు కానీ రాజ్యంలోని బలమైన శక్తిపై జరిపే పోరాటమే ఉద్యమం - హనుమంత
Read More

కల.. ఇక కలేనా???

కల.. ఇక కలేనా??? ఎవరో చెబితేనో వచ్చేది కాదు కల.. ఏదో చూస్తేనో వచ్చేది కాదు కల.. అందమైన కల ప్రతి మనసు కనాల్సిందే.. ప్రతి మనిషిని కదిలించాలి చేసిందే. జీవితం పై కల.. దాని సాధనకై శ్రమ కావాలి.. గమ్యం కై కల.. అది చేరడానికి పట్టుదల కావాలి.. ప్రేమ కై కల .. ‌స్పందించే హృదయాన్ని గెలవాలి.. కలలలో ఎన్నో ఆశలు మరెన్నో ఆశయాలు.. అందుకే అంటున్నా... కల... కలగా మిగలరాదు.. కలను గ్రహించు. దానిని జయించు.. కార్యసాధకునిగా జీవించు.. - కిరీటి పుత్ర రామకూరి  
Read More