Year: 2022

ప్రేమ కవిత

ప్రేమ కవిత ప్రేమ వందేళ్ల వరమా... జీవించడానికి బలమా... పుట్టుకతో పొందే గుణమా... చావుని సైతం భయపెట్టే గర్వమా... పుడమిని నడిపించే ప్రాణమా.. జన్మ జన్మలకు వీడిపోని వీడ లేని నేస్తమా... అలుపెరగని సుదీర్ఘ యుద్దమా... జీవిత కాలం బంధమా... చెప్పవమ్మా ఓ కాలమా...! - భరద్వాజ్ ( BJ Writings )
Read More

ఎవరు పార్ట్ 2

ఎవరు పార్ట్ 2 అక్కడ నుండి నేను వెనక్కి తాతతో పాటు ఊరు లోకి వచ్చేసాను. తాత “బాబు.. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి?” “భూపతి రాజు గారి భవంతికి దారి చెప్పు తాత” “నేను అక్కడికే వెళ్తున్న. ఇంతకీ నువ్వు ఎవరు?” “భూపతి రాజు గారి ఎస్టేట్ కి కొత్త నిర్వాహకుడిగా వచ్చాను కానీ ఆయన చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో?” తాత “నన్ను బదిలీ చేస్తుంది నువ్వేనా?” ఒక నిముషం నాకు మాట రాలేదు. తాత నవ్వుతూ “ఏంటి మౌనంగా ఉండిపోయావు.” “ఏమి లేదు...” ఒక క్షణం ఆగి “మీ పేరు?” “మర్రిటి పోతన” “పోతన గారు, మీరు ఏమి అనుకోను అంటే ఒక ప్రశ్న?” “ఈ పిలుపు కన్నా ఇందాక వరకు నువ్వు పిల్చిన తాత అనే పిలుపే బాగుంది….” నాకు కొంచెం ఊపిరి ఆడినట్టు అనిపించింది. “ఎందుకు మిమ్మల్ని బదలీ చేసారు.” “వయసు వల్ల అవ్వచ్చు.…
Read More

క్రిస్టమస్

క్రిస్టమస్ నకిలీపురం నుండి నా చెల్లెలు "నీ కూతురిని చూడాలనిపించింది తీసుకునిరా అన్నయ్యా అని కబురుపెడితే”. నేను, నా ముద్దుల కూతురు ఇద్దరము వెళ్ళాము. బస్టాండు నుండి ఒక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళింటికి. పాపని భుజాలమీద ఎక్కించుకొని బయలుదేరాను. వీది నిండా లైట్లు, భక్తి పాటలు, ప్రార్థనలతో హోరెత్తుతోంది. పాప ఆ పండుగను చూసి ఎంతో ఆతృతగా ప్రశ్నలు అడుగుతోంది. ఎండ ఎక్కువుగా ఉండటం వల్ల నేను ఏమీ చెప్పలేక పోయా. అక్కడున్న ఐస్క్రీమ్, బాంబే మిఠాయి తింటూ శాంటాక్లాస్, క్రిస్మస్ ట్రీ, మొదలగువాటిని ఆస్వాదిస్తూ నిద్రపోయింది. ఇంటికి వచ్చి అందర్నీ పలకరించి, చుట్టాలు ఇంటికి పోయివచ్చినా గానీ పాప ఇంకా లేవలేదు. టైమ్ 5 గంటలయింది పాపని నిద్ర లేపి స్నానం చేయించి, వంటా వార్పు కార్యక్రమాలు చేసేటప్పటికి 7:30 నిమిషాలయింది మా చెల్లికి. ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేసి ఆరుబయట నులక మంచ మేసుకొనో…
Read More

నా ఆలోచన

నా ఆలోచన నా ఆలోచనే నాకు ఒక అందమైన శత్రువు... అమ్మ అనురాగంతో, నాన్న నడవడితో.. వాళ్ల ఇద్దరి ఆలోచన విధానంతో తొడైనా నా ఆలోచనే నాకు అందమైన శత్రువు..... మధ్యతరగతి బ్రతుకులో మంచి ఆలోచనే నా శత్రువు.... పెరిగి పెద్దై పాఠశాల పరిచయంలో పాఠాలే నా నేస్తాలు... సొంత ఆలోచనకై ఆశ తోడై - ఆనందం, ఉత్సాహమే నాకు అందమైన శత్రువులు.. చిన్నతనంలోనే చురుగ్గా, సమాజం కోసం సాగాలనే నా పరుగే నా అందమైన శత్రువు.. పరిస్థితుల ప్రయాణాన భయం నేనే, భరోసా నేనే.. బాధ నేనే బాధ్యత నేనే... నా చురుకుతనంతో నేను సాధిస్తాననే ఆశ రేకేత్తించి, నాన్నకు ఆనందంకు ఆశలు రేపి, కళాశాల కళల లోకానికి బానిస అయి.. నాన్న పెంపకంతో నమ్మకంలో ఉన్న గాని చదువు మీద శ్రద్ధ చూపక, ఆశలను హడి ఆశలు చేసి, నాన్నను బాధపెట్టా అని నన్ను నేను ద్వేషించిన ఆలోచనా…
Read More

నా అందమైన శత్రువు

నా అందమైన శత్రువు గత రెండు నెలలుగా గమనిస్తున్నాను ఆ అమ్మాయిని ఎంతో అందంగా కనిపిస్తుంది ఎంతో ముద్దుగా సాంప్రదాయానికి వన్నె తెచ్చే విధంగా ఉంటుంది. రోజూ పొద్దుటే లేచి గుమ్మానికి పసుపు రాసి మంచిగా మంచి ముగ్గులు వేస్తుంది. పక్కిల్లె కాబట్టి తొందరగానే అంటే రెండు నెలల తర్వాత పరిచయం ఏర్పడింది నెమ్మదిగా, తను మా ఇంటికి రావడం నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగేది ఇద్దరం చదివేది ఒకే తరగతి కాబట్టి నోట్స్ లు పంచుకుంటూ కలిసి చదువుకుంటూ ఉండేవాళ్ళం. అయితే తరగతిలో ఎప్పుడు ఇద్దరికీ మార్కులు సమానంగా వచ్చేవి దాంతో టీచర్లు తలలు పట్టుకునే వారు ఎవరికి ఎక్కువ వెయ్యాలి? ఎవరికి తక్కువ వేయాలి అని ఆలోచిస్తూ ఉండేవారు అంతలా చదువులో మేము పోటీ పడే వాళ్ళం అన్నమాట. అయితే అన్ని పరీక్షలు మామూలుగా జరిగిన కూడా ఇక చివరి పరీక్షలు వచ్చేసరికి ఇద్దరం శత్రువుల తయారయ్యాము.…
Read More

మోసం చేశాడు

మోసం చేశాడు నేను ఇష్టం అని చెప్పి నన్ను ప్రేమించున్నాను అని చెప్పి నేను నీ మాటలు అన్నీ నమ్మి నీ గురించి ఎవరు ఏం చెప్పినా వినకుండా నిన్నే గుడ్డిగా నమ్మిన్నాను. చివరికి అందరిని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ నీకు ఇంతకముందే పెళ్లి అయ్యిందని నేను తెలుసుకొని ఎంతో బాధ పడ్డాను. నువ్వు నన్ను మోసం చేశాడు అని తెలుసుకున్నప్పటికీ నేను వాళ్ళ దగ్గర నమ్మకం కోల్పోయాను. ఇప్పుడు నా జీవితం తెగిన గాలిపటంలా ఉంది. నీ వల్ల నా గమ్యం కూడా మర్చిపోయాను. నా వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇప్పుడు నా గమ్యానికి చేరుకున్నాను. ⁠- మాధవి కాళ్ల
Read More

అనివార్యం

అనివార్యం కనికరం లేని కాలం... కానుకగా ఇచ్చిన... శిధిల జ్ఞాపకాలు.. నిషీధి లాంటి నా హృదిని.. ముళ్ళ పొదళ్ళా చుట్టుకొని.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా.. నిరతం నీ ధ్యాసలో... నిను చేరే క్షణం కోసం.. అనుక్షణం పరితపిస్తూ... తెగిన గాలిపటంలా... అస్థిమితమైన... మోడు లాంటి జీవితాన్ని.. ముందుకు నడిపిస్తూనే ఉన్నా... ఎందుకంటే... అప్రమేయంగా అందిన.. అనివార్యమైన... ఈ బతుకు నాటకాన్ని.... చివరికంటా... అభినయించి వెళ్లాలని.... - మామిడాల శైలజ
Read More

చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు.. ఎంతో ప్రేమతో.ఆనందం తో అసలు ఒకరి మీద ఒకరికి కోపం అనేది ఎలా ఉంటుందో కూడా తెలీదు... అందరికీ వారు ఆదర్శం లా కనిపించేవారు.. ఇలా ఉండాలి భార్య భర్తలు అంటే అనేలా ఉండేవారు. అలాంటి వారి దాంపత్యం లోకి ఒక వ్యక్తి అనుకోకుండా వచ్చాడు. ఎంతో ప్రేమగా ఉన్న వారి మధ్య దూరం పెంచాలని.. ఎవరి కన్ను పడిందో కానీ.. ఏనాడు..మొహం కూడా చిన్నబుచుకోని .ఆ దంపతులు కన్నీట మునిగారు... ఆ వ్యక్తి ఎలా అంటే వీరిద్దరి మధ్య వీరికి తెలియకుండా.. ఓ అనుమానం అనే పెనుబూతన్ని సృష్టించాడు.. ఆమె అందరితో కలవిడిగా ఉండేది.. అందరూ నా వాళ్ళే అనే స్వభావం కలది.. అందరినీ సోదర భావం తో చూసి కలిసి పోయేది.. దాన్ని ఈ మూడో వ్యక్తి తన భర్తకి చెడుగా సృష్టించి చెప్పేవాడు.. ఉన్నది ఉన్నట్లు కాకుండా…
Read More

నా ప్రియమైన ప్రేమ – అందమైన శత్రువు

నా ప్రియమైన ప్రేమ - అందమైన శత్రువు ఎవరో తెలీదు ఎక్కడుంటావో తెలీదు... కానీ చాలా ప్రశాతంగా ఉన్న నా జీవితం లోకి ఓ తూఫాన్ లా వచ్చావు... ఎన్నో అలజడులు సృష్టించి నావు... నువ్వు చూపించే ప్రేమ, నా మీద నీకున్న బాధ్యత... నువ్వు కనపడకుండా నన్ను నాకు దూరం చేసి. నీ ఆలోచనలతో నింపేసావు.. నువ్వు నేను ఎప్పటికీ కలవని ఇరు ప్రేమికులం... నువ్వకడ నేనిక్కడ.. నేను నేను అందను అని తెలిసిన ఎందుకు నా మీద నీకు ఇంత ప్రేమ... ఇంత ప్రేమ చూపించే నీకు ఎందుకు దూరంగా ఉన్న అంటే? నా దగ్గర సమాధానం లేదు... నన్ను నాకు కాకుండా చేసి. నిన్నే నింపుకునేల చేసిన నువు ఎప్పటికీ అయిన "అందమైన శత్రువు"వే... అందుకే నువ్వంటే నాకిష్టం.. నా ప్రాణమే నువ్వు అయినపుడు.. నేను నాలో ఎలా ఉంటా నా పిచ్చి కాకపోతే నా ప్రియమైన…
Read More

అందమైన శత్రువు

అందమైన శత్రువు మనసును మాయ చేసి తోడై యుద్ధం చేస్తుంది అందమైన శత్రువు నీలో దాగిన అహంకార భూతం అహంకారం మనిషికి ఆభరణంగా వుండాలి కాని ఎదమాటున వదలక శత్రువుగా నిరంతరం వేటు వేస్తుంది మారని మనుషులకు స్వార్థమై వెంటాడుతుంది అహంకారంచెరలోబందీలై చెంతచేరి శత్రుత్వాన్ని పెంచుతుంది పైచేయిలా గెలవాలని పరితపిస్తుంది ఆశపడుతూ ఆశపెడుతూ అంతర్గతంగా ఆదేశిస్తుంది అహాన్ని వంచి తుంచితే బంగారు తీగై మెరుస్తుంది లేనిచో ఇనుప తుప్పుగా మారుతోంది సుమా.....? - జి జయ
Read More