aksharalipi

3275 Posts

గతం

గతం గతమే గతిని నిర్దేశించేది. జ్ఞాపకంలా గుర్తుండిపోయేది. అనుభవాల సారమిది. అనుభూతులు మిగిల్చేది. వర్తమానానికి దిక్సూచిది. భవిష్యత్తుకు నిఘంటువిది. గతమనేది జీవిత కాలపు గుర్తు. గతమే లేని జీవితం లేదు. గతంలోనే జీవనం సాగిస్తే, వర్తమానానికి జీవం వుండదు. భవిష్యత్తు జీవితం వుండదు. -బి రాధిక
Read More

గతం

గతం జీవన తరంగాల సంతకం. కాలం మిగిల్చిన జ్ఞాపకం ప్రాయం పంచిన అనుభవం. నీ నేటిని నడిపే ఇంధనం. భవితను మలచే సాధనం. - శివ.KKR
Read More

పంచాంగము 05.02.2022

పంచాంగము 05.02.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: శిశిర మాసం: మాఘ పక్షం: శుక్ల-శుద్ద తిథి: చవితి ఉ.7:27 వరకు తదుపరి పంచమి వారం: శనివారం-మందవాసరే నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.07:47 వరకు తదుపరి రేవతి యోగం: సిధ్ధ రా.07:49 వరకు తదుపరి సద్య కరణం: భధ్ర ఉ‌.07:27 వరకు తదుపరి బవ రా.07:26 వరకు తదుపరి బాలవ వర్జ్యం: ఉ.పూ.05:10 - 06:47 వరకు దుర్ముహూర్తం: ఉ.06:46 - 08:14 రాహు కాలం: ఉ.09:38 - 11:04 గుళిక కాలం: ఉ.06:46 - 08:13 యమ గండం: ప‌.01:55 - 03:21 అభిజిత్: 12:08 - 12:52 సూర్యోదయం: 06:46 సూర్యాస్తమయం: 06:13 చంద్రోదయం: ఉ.09:49 చంద్రాస్తమయం: రా.10:12 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: మీనం దిశ శూల: తూర్పు చంద్ర నివాసం: ఉత్తరం 🚩…
Read More

నీ మనసు

నీ మనసు నీ మనసు బంగారం.. అది విరిగినా.. ముక్కలు అయినా కాల్చినా దాని విలువ, స్థాయి, స్థానం ఎప్పటికి తరగదు.. మన ఆలోచన విధానం మారింది అంతే... - మల్లి ఎస్ చౌదరి
Read More

గతం

గతం మనం చెప్పుకుంటే ఊరట పొందుతాం కాని అనుభవించింది మాత్రం మనమే... గతం ఎప్పటికి మరుపురాని మరచిపోని సంఘటనలు గాథ. గతం గతాన్ని గుర్తుంచుకోవాలి కానీ మాటి మాటికి గుర్తు తెచ్చుకోకూడదు.. గతం గతం తాలూకూ జ్ఞాపకాలు మధురమైనవి కొన్ని అయితే, అవి గుర్తొచ్చినప్పుడు బాధ పెంచేవి కొన్ని... గతం ఆ గతంలో గడిచిపోయిన గతరోజులు గాథ. - మళ్ళిఖార్జున్
Read More

గతం

గతం గతం నిన్ను నడిపే దిక్సూచి కావాలి గతాన్ని నెమరవేసుంటూ గమనాన్ని గుర్తుపెట్టుకొని గతం చేసిన గాయాన్ని మదిలో తలచుకొని వేసే ప్రతిఅడుగు నిర్దిష్టమైన ప్రణాళికతో గమ్యం వైపుకి వెళ్లే ప్రయాణాన్ని గట్టిగా ప్రయత్నించి చేరాలి - హిమ
Read More

గతం

గతం గమనిస్తున్నా.. పయనిస్తున్నా.. గతాన్ని ముడిపడి అడుగేస్తున్నా.. గతులు గుంతలుగ కనిపిస్తున్నా.. గమ్యం కోసం రమ్యత కోసం సాహసదారుల సాయంచేసి.. సాధన చేస్తున్నా.. మునుపటి తప్పుల ముప్పులు మరువక.. రేపటి కిరణపు కాంతుల కోసం.. ఆశయసాధన ఆంక్షల దిశగా.. పరుగెడుతున్నా.. గతం వదిలిన అనుభవాలతో తెలివిగ ముడిపెడుతున్నా..! - భాను శ్రీమేఘన
Read More

బంధం

బంధం మనిషి ,మనిషికి మధ్య వుండేది కాదు. మనసు మనసుతో కలుపునేది. మనసు, మనసును కలిపేది, సహజమైన మనసుకు, సహజంగా ముడిపడేది. నా అనే ఆలోచన నుంచి, మన అనే భావన కలిగించేది. "బంధం" - బి రాధిక
Read More

తీరం

తీరం శిశిరమైతేనేమి ఆకురాలినచోటే పూలు తలూపుతుంటాయి విప్పుకునే జ్ఞాపకాల వెనకే తప్పుకునే వ్యాపకాలుంటాయి తలపులను తడుముతుంటే మనసు తలుపులు తెరచి స్వాగతగీతాన్ని పాడుతుంది గతుకుల గతాన్ని పూడ్చమంటుంది పరుగులు తీసే కాలం కరవాలం కనుగొనాలని తాపత్రయపడతాం వేటుపడక మానదుకదా కాలంతో వేరుపడే ఆలోచనెందుకు మట్టిపరిమళం చుట్టేయాలంటే మట్టితో మమేకమవ్వాలిగా మమతలన్ని పెనవేస్తేనే మనుషులంతా అర్థమయ్యేది సుఖదుఖాలు రాగద్వేషాల వలయంలో శ్రుతిలయలు స్థిరంగా తిష్ఠవేసుకుంటే చీకట్లనుమోసే జీవితం తీరమెన్నడు చేరెనో ! - సి.యస్.రాంబాబు
Read More

పంచాంగము 04.02.2022

పంచాంగము 04.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *మాఘ మాసం - శుక్ల పక్షం* తిధి : *తదియ* ఉ7.39వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: *పూర్వాభాద్ర* రా7.21వరకు యోగం: *శివం* రా10.38 వరకు కరణం: *గరజి* ఉ7.39 & *వణిజ* రా7.24 వర్జ్యం: *తె5.04నుండి* దుర్ముహూర్తం : *ఉ8.51 - 9.36* & *మ12.37 - 1.22* అమృతకాలం: *ఉ11.23 - 12.58* రాహుకాలం : *ఉ10.30 - 12.00* యమగండ/కేతుకాలం: *మ3.00 - 4.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *కుంభం* సూర్యోదయం: *6.36* సూర్యాస్తమయం: *5.53* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More