Family Stories

గాలివాటం

గాలివాటం ఒత్తు అయిన కురులు. వాటిని ఆమె మోస్తోందా అన్నట్టుగా మొహం కొంచెం వెనక్కి వాలుతోంది. దాంతో అందమైన ఆమె కంఠంలో ధరించిన ఆకుపచ్చని పూసల దండ, నాలో తెలియని ఊహలకి పచ్చని చిగుళ్ళు తొడుగు తోంది. ఆమె మొహం వాలినట్టు గా ఉండడంతో ఆమె చూపులు ఈ లేత చిగుళ్ల కి పిచికారి కొడుతూ ఉన్నాయా అనిపించింది. పెద్దవి అయిన కళ్ళు అవడంతో వాలిన కనురెప్పల చాటు నుంచి కనిపిస్తున్న ఆ కను గుడ్లలో ఆమె అందం అంతా దేవుడు అక్కడే దాచాడు ఏమో అనిపిస్తోంది. ముందుకి గాలికి పడుతున్న వెంట్రుకలని తన వేళ్ళు జొప్పించి సర్దుకుంటూ ఉంటే నా గుండెల్లో వేల మైళ్ళ వేగంతో వెళ్తున్న బుల్లెట్ ట్రైన్ భావన. మా ఇద్దరిదీ గమ్యం హైదరాబాద్.. ఆమె బస్సులోకి ప్రవేశించకముందే నా హృదయంలోకి ప్రవేశించేసింది. ఆ పది నిమిషాల చూపుల పరిచయంలో నా ఊహల వాహనం ఆమెతో చాలా…
Read More

💖 కుట్టి లవ్ స్టోరీ 💖

💖 కుట్టి లవ్ స్టోరీ 💖   ఇవ్వాళ్టి చాల్లే పోయి పడుకుని రేపొద్దున్నే వచ్చి మిగిలింది పూర్తిచేద్దాం అని రూమ్ కి బయల్దేరా! రాత్రి పదకొండున్నర కావొస్తుంది. పేరుకి పెద్ద సిటీయే గానీ పది దాటితే రోడ్డు మీద పిట్ట కూడా తిరగదు. నిర్మానుష్యంగా వుంది, కంటోన్మెంట్ దాటి విక్రమ్ పురి వచ్చింది. నెక్స్ట్ వున్న ఖార్ఖానా లో రూమ్. రోడ్కు పక్కన కుక్కలు మొరుగుతూ గుమిగూడాయి. బండి స్లో చేసి చూశా, ఒక పెద్దాయన వాటిని బెదిరిస్తున్నాడు. ఇవి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉష్షో!! అని అరిచి ఆయన పక్కన బండి ఆపాను.  "ఎక్కడికి వెళ్లాలండీ?" "తిరుమలగిరి బాబూ.. స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది, ఆటోలు కూడా దొరకలేదు." "అయ్యో!! అక్కడిదాకా ఎలా వెళ్తారు? రండి నేను డ్రాప్ చేస్తా.." "చాలా థాంక్స్ బాబూ.." "ఫర్వాలేదు సర్!" ఆయన ఇల్లొచ్చింది. కొడుకు అనుకుంటా కంగారుగా బయటకి వచ్చి ఇంత…
Read More

నీ కౌగిలి లో…

నీ కౌగిలి లో... తను నన్ను చూస్తున్నాడని  నాకు తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నా, అసలు గమనించనట్టు ఉన్నా, కానీ అదేంటో మనల్ని ఎవరైనా చూస్తే ఆ చూపులు వీపు కు గుచ్చుకుంటాయి. మనసైన వారు ఎక్కడ ఉన్నా అలా తెలిసిపోతుంది. అందుకే తనను తప్పించుకుంటూ తిరుగుతున్నా లేదంటే ఊరుకుంటాడా అసలే చిలిపి. ఆపై అతని ఆశలకు, కోరికలకు హద్దే లేదు. ఇంతలో ఫోన్ లో మెసేజ్ టోన్ ఏంటా అని చూస్తే ఇంకెవరు తానే ఎంటా అని చదివి, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు కదా నీ పని చెప్తా, అందరి ముందు నిన్ను కౌగిలించుకోకపోతే నా పేరు వేరే గా పెట్టేసుకుంటా అని. అమ్మో ఏంటి అంత ధైర్యం అనుకున్నా, ఛా నిజమా అన్నాను. హా నిజమే అంటూ రిప్లై సర్లే చూద్దాం అన్నాను. హా మరి నన్ను పట్టించుకోకుండా వెళ్తవా అన్నాడు. ఏంటి నాకదే పని అనుకున్నావా అన్నాను.…
Read More

గుంభన

గుంభన కుడి చేత్తో ఇచ్చినది ఎడమ చేతి కి కూడా తెలియకూడదు అనే గొప్ప నైతిక సూత్రాన్ని మనం నిత్యం నెమరు వేస్తూ ఉంటాం. అయితే మనం ఏది దానం చేస్తే దాన్ని అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానమని చెప్పుతూ తృప్తిని పొందుతాము. చదువు అయితే అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పది అని, భోజనం అయితే అన్నదానం గొప్పదని, నీరైతే ఉదకదానం గొప్పదని చెప్పేస్తాము. కారణం ఆ సమయంలో మనము ఇచ్చేదానికి గొప్ప రంగును పులిమెస్తాము. అవి ప్రపంచాన్ని వణికిస్తున్న రోజులు.ఆ రోజుల్లో మీడియా ప్రచారం లేకపోయినా చీమ సైతం తల దాచుకునేది.. ఈ అలజడికి కారణం స్కైలాబ్.అది ఏ క్షణనం లో అయినా భూమండలం మీద పడవచ్చు. జనావాసాల పై పడే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే జన నష్టం తప్పదు. ఇలా జనాలు చిగురుటాకులా వణికి పోతున్నారు. ఆయన మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. సాయంత్రం 6…
Read More

మాట

మాట నారాయణ కు ముగ్గురు పిల్లలు ఇద్దరూ ఆడపిల్లలు, ఒక అబ్బాయి. నారాయణ ముగ్గుర్నీ బాగానే చదివిస్తున్నారు. ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఉన్నంతలో బాగానే ఉన్నారు. ఒకరికి అన్నం పెట్టే స్థోమత కలిగిన నారాయణ అప్పుడప్పుడు అన్నదానం లాంటివి చేస్తూ ఉంటాడు. అలాంటి ఒకరోజు గుళ్ళో అన్నదానం జరుగుతున్న సమయంలో గుడి మెట్ల పైన ఉన్న అందరినీ మండపం లోకి రమ్మని పిలవాలని వచ్చాడు. అందర్నీ బాబు నేను ఈ రోజు అన్నదానం చేస్తున్నా రండి వచ్చి భోజనం చేయండి అన్నాడు. ధర్మ ప్రభువులు అంటూ అందరూ లోపలికి వెళ్ళారు. అందరితో పాటు లోపలికి వెళ్లబోతుంటే నారాయణ కు చివరి మెట్టు పై తల పై కొంగు వేసుకుని ఉన్న ఒక నలభై ఏళ్ళ ఆవిడ అలాగే కూర్చుని ఉండడం గమనించి, ఆమెకు వినిపించ లేదేమో అనుకుంటూ, ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమెతో నారాయణ, అమ్మా మీకు వినిపించనట్లు…
Read More

కౌగిలి

కౌగిలి ఈ కరోనా ప్రపంచాన్ని ఆపింది, ఎక్కడి వారిని అక్కడే ఉండేలా చేసింది కాలాన్ని ఆపేసింది. కన్నీటికి  కారణం అయ్యింది. ఆకలి కేకలు పెట్టించింది కూలిలకు పని లేకుండా చేసింది. వేల ఉద్యోగాలను తీసింది. రైళ్ళు, బస్సులు,ప్లేన్స్ ని ఆపింది. అన్ని సరిగ్గా ఉన్నా అవిటివారిని చేసింది, కళ్ళున్నా గుడ్డి వారిని చేసింది, కూలి చేసుకుని పొట్ట పోసుకునే వారికి అది కూడా దొరక్కుండా చేసింది. ఉన్నవాడు, లేని వాడు, రాజకీయ నాయకుడు, డాక్టర్, సినిమా యాక్టర్, లాయర్, జర్నలిస్ట్, డ్రైవర్,పేద, గొప్ప అనే తేడా కనికరం ఏమి లేకుండా అందర్నీ అంటుకుని తన వారెవరో పరాయి వారెవరో తెలిసేలా చేసింది. ఎంత ఆస్తులున్నా బంగారం భూములు ఉన్నా, ఖరీదైన బట్టలు వేసుకున్నా, చినిగిన చీర కట్టుకున్నా అందరికి కావలసింది చివరికి చేరేది కాటికే అని తెలిపింది. ప్రపంచాన్ని స్థంభింప చేసింది. కాలం ఆగిపోయింది, సమయం కదలలేక పొయింది. వలస వచ్చిన…
Read More

ప్రేమ లోకం అంటే?

ప్రేమ లోకం అంటే? లోకం లో ప్రేమ అనేది ఎక్కడా లేదు. స్వార్థం తప్ప, ఎక్కడ చూసినా స్వార్థమైన ప్రేమ తప్ప మంచి మనసున్న ప్రేమ ఎక్కడా లేదు. రకరకాల ప్రేమలు రంగు పులుముకున్నాయి. ఒకవేళ నిజంగా ప్రేమ లోకం అంటే ఎలా ఉంటుందో అనే ఊహా తో రాస్తున్న.... ప్రేమ లోకం లో ఒకరిని ఒకరు దూషిoచుకోరు. ప్రేమ లోకం లో ఒకరి పై మరొకరికి అంతులేని ప్రేమ ఉంటుంది. ఆ లోకం లో ఎలాంటి భేషజాలు  ఉండవు. ఎలాంటి కక్షలు, కార్పణ్యాలు ఉండవు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆప్యాయత, అనురాగాలు కలగలిపి ఉంటుంది. డబ్బు కోసం ఒకర్ని ఒకరు చంపుకోవడం ఉండదు. సాటి మనిషిని ప్రేమ తో చూస్తారు. మనిషి మనుగడ కోసం ఎవర్నీ అణచి వేయడానికి చూడరు. అందంగా ఉంటుంది ఆ లోకం. సప్త వర్ణాల  కలయికగా, ఏడేడు లోకాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అంతటి…
Read More

ఆత్మ

ఆత్మ అమ్మా రెడీ నా అంటూ వచ్చాడు ప్రణవ్. హా రెఢీ రా అన్నాను, సరే పద పద అసలే నువ్వు మొదటి నుండి సినిమా చూడాలి అంటావు, ఆలస్యం అయితే మళ్లీ నన్నే తిడతావు అన్నాడు. అబ్బో సర్లేరా ఆటో వచ్చిందా అన్నాను. అంత లేదు. బైక్ ఉండగా ఆటో ఎందుకే, అంటూ ముందుకు కదిలాడు. ఇద్దరం కలిసి బైక్ పైన సినిమా హల్ కు వెళ్ళాము. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాం. కాబట్టి అవి ఫోన్ లో చూపించి లోపలికి వెళ్ళాము. సీట్లలో కూర్చున్న తర్వాత నాకు అందులో ఎవరో ఉన్నట్టు అనిపించింది. లేచి చూసాను, కానీ ఎవరు లేరు. మళ్ళీ కూర్చున్నా... ఒకరి పై మనం కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు, మళ్లీ లేచి చూసాను. ఎవరు కనిపించలేదు. నేను అలా రెండు సార్లు లేవడం చూస్తున్న ప్రణవ్, ఏంటమ్మా, ఏమైంది నల్లులా అన్నాడు.…
Read More

ఆత్మ నా?

ఆత్మ నా? అవి బతుకమ్మ పండగ రోజులు... నేను, నా స్నేహితులు కలిసి చిన్న బతుకమ్మలు చేస్తూ, రోజూ ఆడుకుంటూ కాలువలో నిమజ్జనం చేసేవాళ్ళం. అలా రోజు బతుకమ్మను పేర్చుకుంటూ సంతోషంగా సాయంత్రం కాగానే ఇంటి ముందు ముగ్గులు వేసుకుని కాసేపు అడుకుని కాలువకు ప్రసాదాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం. అమ్మ రోజు ఏదో ఒక ప్రసాదం చేసి ఇచ్చేది. నా స్నేహితులకు అమ్మ చేసే ప్రసాదం అంటే చాలా ఇష్టం. బతుకమ్మ వేయడం ఆలస్యం నా ప్రసాదం మొత్తం వాళ్ళే లాక్కుని మరి తినేవాళ్ళు. నాకు మిగల్చకుండా.. అలా ఒకరోజు బతుకమ్మ ఆడుకుని కాలువలో నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు, మా వెనకాలే ఎవరో వస్తున్నట్టు అనిపించింది. కానీ మేము వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. మామూలుగా కాలువ సైడ్ సాయంత్రం పూట ఎవరు ఉండరు. దూరంగా పశువులను ఇళ్లకు తోలుకొస్తూ ఎవరో ఒకరు కనిపిస్తారు. కాని దగ్గరగా రారు. అక్కడ…
Read More

ఆత్మ పరిశీలన

ఆత్మ పరిశీలన సీత గారు ఎదో ఆలోచిస్తున్నారు. మిశ్రమ భావాలు ఆవిడ మొహం లో ప్రస్ఫూటం గా కనిపిస్తున్నాయి. ఉదయాన్నే 4 గంటలకి లేచేసి కూర్చుంది. 'అవుతుంది' అనుకున్నప్పుడు ఆవిడ కళ్ళు వికసిస్తున్నాయి. 'కాదేమో' అనిపించినప్పుడు కనుబొమ్మలు చిట్లించుకుంటున్నాయి. ఇలా, సంతోషం, అసంతృప్తి రెండు ఆవిడ మోహంలో నటించేస్తున్నాయి. ఇంతలో అంతపొద్దున్నే ఏంటో హడావుడి పక్కింటి రాధ గారు తలుపులు తోసుకుని మరీ లోనికి దూసుకుని వచ్చేసింది. సీత మొహంలో మిశ్రమ కళ చూసి, రాధ గారు ఇట్టే పసిగట్టింది. ఎలా ఐనా సీత గారిని ఒకే వైపు ఆలోచింపజేయాలి అని ఆ క్షణం లో కంకణం కట్టేసుకుంది. అలా చేయాలి అంటే ఆమె దేనికి బాధ పడుతోందో దాన్ని ఆమె మనస్సు లోంచి తొలగించాలి. సీతా, ఏంటి... అలా కూర్చున్నావు? పో, వెళ్లి లోపలనుంచి కూరలు తీసుకు రా! తరుగుతూ మాట్లాడుకుందాం! కాఫీ గట్రా తాగావా? వుండు కలుపుకొని వొస్తా. …
Read More