యోధ ఎపిసోడ్ 1
యోధ ఎపిసోడ్ 1 నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న నేరాలు.. ఇంకా మిస్టరీ వీడని మర్డర్ కేసులు.. ఆరు నెలలుగా తెలియని ఆ అన్నా చెల్లెళ్ళ ఆచూకీ.. ఇది పోలీసుల మరియు ప్రభుత్వ వైఫల్యమేనా?" న్యూస్ ఛానల్ లో వస్తున్న ఆ న్యూస్ ని, హాల్లో కూర్చొని పెద్ద వాల్యూంతో తీరిగ్గా వింటున్నాడు శ్రీనివాసరావు పొద్దు పొద్దునే.. "అబ్బబ్బా.. పొద్దునే ఆ న్యూస్ లు కాకుండా ఏదైనా మనసుకు కొంచెం ప్రశాంతత కలిగిన భక్తి గీతాలు ఏమైనా పెట్టరాదూ" అంటూ వంటింట్లో వంట చేసుకుంటూ అదంతా వింటూన్న అతని భార్య సులోచన విసుక్కుంది. సరిగ్గా తను అలా అందో లేదో ఈ లోపే పవర్ పోయింది. "అదిగో నీ మొర ఆ భగవంతుడు కూడా ఆలకించినట్టున్నాడోయ్!" అంటూ ఆ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అది చదవడానికి. ఈ లోపే "ఇదిగోండి కాఫీ..!" అంటూ తన చేతికి…