నా చెట్టేది.
ఆహారం కోసం వెతుకుతూ
నేను గూడు విడిచి వెళ్ళాను.
సాయంత్రం తిరిగివచ్చి చూస్తే
నా గూడు లేదు, చెట్టూ లేదు.
కరెంటు పోల్స్ వెయ్యాలని
నా గూడున్న చెట్టు కొట్టేసారు.
అంతకు ముందు కూడా మెట్రో
రైలుకోసం వేలచెట్లు కొట్టేసారు.
మంజీరా పైపులైన్ల కోసం మళ్ళీ
ఎన్నో లక్షల చెట్లు కొట్టేసారు.
అపార్ట్మెంట్లు కట్టేందుకు ఎన్నో
చెట్లను కొట్టి పడేస్తున్నారు.
ఓ మనిషీ, నీ గూడు కోసం
నా గూడుని నాశనం చేస్తావా?
నీ సౌకర్యాలు కోసం నన్ను
గూడు వదిలి పొమ్మంటావా?
కొంచెం కనికరం చూపు.
వెంకట భానుప్రసాద్ చలసాని