Month: October 2021

ఆకు + ముల్లు = అద్వైత పార్ట్ 1

  ఆకు + ముల్లు = అద్వైత పార్ట్ 1     ఏంటే ఇంతగా రెడీ అవుతున్నావు అడిగింది లత. నా కోసం జగన్ వెయిటింగ్ అక్కడ అందుకే రెడీ అవుతున్నా అంది అద్వైత. ఏంటే అద్వి ఇది? వాడేమో ఏమీ చదువుకున్న వాడు కాదు, వాడిని నమ్మి నువ్వెలా వెళ్తావు? అసలు వాడి లో ఏం చూసి ప్రేమించావు? వాడు మెకానిక్ షాప్ నడిపే వాడు. వాడికి ఎలా పడ్డావే నువ్వు అంది లత నెత్తి కొట్టుకుంటూ, దానికి అద్వైత, వాడు మెకానిక్ అయినా మంచి వాడే చాలా బాగుంటాడు. అందం చూసి ప్రేమ పుట్టదు లత, మంచి గుణాలు చూసి పుడుతుంది. అయినా నీకేం తెలుసు ప్రేమ గురించి, ఒక్కసారి ప్రేమలో పడి చూడు అర్దం అవుతుంది అంది. నీ మొహం ఇక్కడికి మనం చదువుకోవడానికి వచ్చాము కానీ, ఇలా ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి కాదు అంది లత. సరే…
Read More

ఇంకెన్నాళ్ళు

ఇంకెన్నాళ్ళు మంచి సంబంధం తల్లి అందరూ బాగా చదువుకున్న వాళ్ళే, నిన్ను బాగా చూసుకుంటారు. నీకేం కష్టాలు ఉండవు, మామగారు రిటైర్డ్ జడ్జ్, అత్తగారు ప్రొఫెసర్, ఆడపడుచు డాక్టర్, వాళ్ళ మామగారు అత్తగారు కూడా లాయర్స్ ఇక నీకు కాబోయే భర్త ఒక లాయర్, ఇంత మంచి సంబంధం నిన్ను వెతుకుతూ వచ్చిన సంబంధం ఒప్పుకో తల్లి అన్నారు నారాయణ రావు గారు. అవునమ్మ వాళ్ళు చాలా స్తితిమంతులు దేనికి కొదవలేదు. పైగా అందరూ అన్ని తెలిసిన వాళ్ళు నీకు ఏ లోటు ఉండదు. కావాలి అంటే నువ్వు పెళ్లి అయ్యాక కూడా చదువుకోవచ్చు, ఏమంటావు అంటూ కూతురు జవాబు కోసం చూడసాగింది సుజాతమ్మ. తల్లిదండ్రులు ఇంతగా చెప్తుంటే అన్ని బాగానే కనిపించసాగాయి అనూషకు. నిజమే, అందరూ చదువుకున్న వాళ్ళే అంతా బాగుంది. అతను కూడా అందంగా హీరోలా ఉన్నాడు. ఫోటో లో ఇలా ఉంటే నిజంగా ఇంకెంత బాగుంటాడు అని అనుకుంటూ…
Read More

మా ఇంటి బతుకమ్మ

మా ఇంటి బతుకమ్మ బతుకమ్మ పండుగ అంటే పువ్వుల పండుగ , పువ్వులన్నీ తీసుకొచ్చి అందంగా ముస్తాబు చేసి ఆడపిల్లలకు ఎలా అలంకరణ చేస్తారో అంతటి ముస్తాబు చేసి, ఆడపడుచు లాగా భావించి పూలను పూజించుకుంటూ వాటి చుట్టూ చేరి సంతోషంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఆమెను కొలుచుకుంటూ పసుపు కుంకుమలతో, అగరు బత్తుల తో పూజించి, గౌరమ్మను చేసి పిల్లాపాపలను తమ పసుపు కుంకుమలను కాపాడమని ప్రార్థిస్తూ చేసుకునే పండగ మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే మళ్ళీ జీవించు అని అర్థం. పూసే ప్రతి పువ్వు దేవుడి పాదాల చెంతకు వెళ్లదు. కాబట్టి అన్ని రకాల పువ్వులను అందంగా పేర్చుకుంటూ, ప్రతి ఒక్క పువ్వుకు కలిగిన విశిష్టతను తెలియజేస్తూ, సంవత్సరం మొత్తంలో ఏ పువ్వులని అయితే దూరంగా ఉంచుతామో, అలాంటి పువ్వులు అన్ని వెతికి మరీ తీసుకువచ్చి ప్రతి ఒక్క పువ్వు ప్రత్యేకత కలిగినది అని తెలియజేస్తూ బతుకమ్మ…
Read More

సంఘర్షణ పార్ట్ 2

సంఘర్షణ పార్ట్ 2 మనలోని బాధ ను పంచుకుంటూ , తోచిన సలహాలు, సూచనలు ఇస్తూ , వెన్నంటి నడిచే వాడే మిత్రుడు. వాడికి డబ్బుందా, లేదా, పేద గొప్ప , చిన్న , పెద్ద అనే తేడాలు ఏవి ఉండవు , స్నేహానికి వయసుతో పనిలేదు , అనుభవం తో పని లేదు , ఆడ మగ అనే తారతమ్యం లేదు. మంచి స్నేహితుడు మంచి పుస్తకం తో సమానం అని పెద్దలు ఉరికే అనలేదు. మన స్నేహితుణ్ణి చూసి మనల్ని అంచనా వేయొచ్చు అని కూడా అంటారు. ******** ఒరేయి.. ఎంటా మాటలు నీకేమన్నా మతి పోయిందా ? చస్త అంటే ఎలా ? ఇంత చిన్న విషయం కోసం నువ్వు నీ జీవితాన్ని ఎందుకు చాలించాలి రా, తెలివి తేటలు బాగానే ఉన్నాయి లే , అందుకే ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ,  అరేయి అరుణ్…
Read More

సంఘర్షణ పార్ట్ 1

సంఘర్షణ పార్ట్ 1 మనసుకు నచ్చిన పని చేయడం వల్ల మనం చాలా సంతోషంగా ఉండొచ్చు, అయితే కొన్ని కారణాల వలన మనం మన మనసుకు నచ్చిన పనులు కాకుండా, నచ్చని పనులు ఎన్నో చేస్తుంటాం, అలాంటి ఒక పని వల్ల రెండు జీవితాలు ఎంత మానసిక సంఘర్షణలో కొట్టుకుపోయాయి. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ******** అమ్మ నాకు ఈ పెళ్లి వద్దమ్మ అన్నాడు అరుణ్. తల్లి దగ్గరికి వెళ్లి బతిమాలుతూ , ఏంట్రా ఇది అన్ని రెడి అయ్యాక ఆ మాటలేంటి ? నాన్నగారు విన్నారంటే చంపేస్తారు . నోరు మూసుకుని చేసుకో, ఇన్ని రోజులు మౌనంగా ఉండి , ఇప్పుడు వద్దు అని అంటే ఎలా ? అయినా నాన్నగారు మూర్తి అంకుల్ కు మాట ఇచ్చారు అంట . నువ్వు కాదంటే బాగుండదు . వారం రోజుల లో పెళ్లి పెట్టుకుని నువ్వు ఇలా అంటే…
Read More

ధరణి మొదటి భాగం

ధరణి మొదటి భాగం మల్లెల వాన , మల్లెల వాన , నాలోనా అంటూ చెట్టుకు పూసిన పువ్వుని తన బుగ్గ మీద కొట్టుకుంటూ , సంతోషపడుతున్న మనవరాలిని చూస్తూ , ఒసే పిచ్చి మొఖమా పాడింది చాల్లే , కానీ వచ్చి ఇంత ఉడకేసి చావు , అంది నాయనమ్మ  అనసూయ. అబ్బా ఒక్క నిమిషం కూడా సంతోషంగా ఉండనివ్వదు, ఈ ముసలిది అంటూ వస్తున్నా , అని లోపలికి నడిచింది ధరణి. ఏంటి ముసలమ్మ ఆకలి బాగా వేస్తోందా నీకు, అయినా ఇప్పుడే కదే చెంబు నిండా పాలు తాగావు , అప్పుడే మళ్ళి ఆకలి వేస్తుందా నాన్నమ్మ  ,అంటూ అమయాకంగా అడిగింది ధరణి .. ఓ  యబ్బో  మరి చిక్కటి పాలా, ఏమన్నన్నా, పాలు ఇచ్చావు, నేనది తాగి అరగక ఆపసోపాలు పడుతున్నా... నీ బాబు నాకు మంచి పండ్లు, పాలు తెస్తే ఇంకేం అనేదానివో, అయినా…
Read More

కథలు రాయడం

కథలు రాయడం ప్రతి ఒక్కరూ తమ జీవిత అనుభవాలను అందరితో పంచుకోవాలని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఒక దశకు చేరుకుని ఉంటారు, తాము పడిన కష్టాలు, ఎలా ఒక మంచి స్థితికి చేరుకున్నాము అనే అనుభవాలు, నలుగురికి చెప్తూ, తమ మనసులో రేగిన సంఘర్షణలు జీవితంలో జరిగిన ఆటుపోట్లు, సహాయం చేసిన వారిని, చేయని వారిని గుర్తు చేసుకుంటూ తమ లాగా ఎవరు చేయకూడదు అని అలా కాదు ఇలా చేయండి అంటూ సలహాలు ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. అయితే కథలు రాయాలంటే మంచి భాష రావాలి, దాన్ని రాయడం రావాలి అని భావాన్ని వ్యక్తం చేయడం రావాలి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అదో పెద్ద తలనొప్పి గా భావించి ఆ ఎవరు రాస్తారు లే అని అనుకుంటారు కానీ అదే తప్పు ఎందుకంటే, మీ జీవిత పాఠాలు ఈ తరం వారికి…
Read More