Month: February 2022

బంధం

బంధం బంధం ఆప్యాయతల హరివిల్లు బంధం... మమతలకు నిలయం బంధం... ఏ బంధానికి అయినా ఆధారం నమ్మకం... ఉమ్మడి కుటుంబాలకి మొదటిమెట్టు బంధం... ఉమ్మడికుటుంబాలకు వ్యష్టి కుటుంబాలకు నెలవు బంధం... ఆ నమ్మకం ఎంత బలంగా ఉంటే బంధం అంత దృఢంగా ఉంటుంది... ఏ బంధాన్ని అయినా అస్థిర పరచేది ఓ చిన్న అపనమ్మకం... ఏ బంధం అయినా బలంగా పరిపుష్టిగా ఉండాలంటే అపనమ్మకాలకీ అపార్థాలకీ తావుండకూడదు... ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన వారికి ఎక్కువగా బంధాల విలువ తెలుస్తుంది... ఏ బంధాన్ని అయిన నిలబెట్టుకునేలా ప్రవర్తన నిర్దేశిస్తుంది... ఆ ప్రవర్తన సరైన క్రమంలో ఉంటే బంధం కూడా బలంగా ఉంటుంది...   - గోగుల నారాయణ
Read More

బంధం

బంధం సృష్టిలో ప్రతీ ప్రాణికి  ఏదో రూపంలో, ఎవరితో ఒకరితో బంధం ఏర్పడుతుంది. అన్ని ప్రాణులకన్నా, మానవ జన్మకు ఎక్కువ బంధాలు కలిగి వున్నాయి. మనిషి ప్రకృతితో, పశువులతో, పక్షులతో,  మనుషులతో, జంతువులతో, జలచరాలతో కూడా బంధం ఏర్పరచుకున్నాడు. కానీ, మనిషికి అంత్యంత అమూల్యమైన బంధమైన తనతో తాను బంధం చేసుకోవడంలో నేటి మానవుడు విఫలమవుతున్నాడు. మనిషిగా అన్నీ బంధాలతో అన్యోన్యంగా వుండే ముందు, తన అంతరంగంతో, తన ఆత్మతో బంధం ఏర్పరచుకోవాలి. అప్పుడే, మానవుడు ఎన్ని బంధాలనైనా కలుపోగలుగుతాడు. కలిసి జీవించగలుగుతాడు.  స్వార్ధానికి చోటు లేని, త్యాగానికి చిరునామాగా నిలిచి, వాస్తవంలో బతకాలనే ఆలోచనలతో, పరిస్థితులను సానుకూల దృక్పథంతో తీసుకునే బాధ్యత గలిన వ్యక్తులు, తనతో తాను బంధం కలిగిన మనసున్న మనుషులు తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. -బి రాధిక
Read More

బంధం

బంధం స్తబ్దత నిండిన మనసుని సైతం శృతిలయల సంగమంగా మార్చగలిగేది ప్రపంచం అంతా ఏకమై , నిన్ను అపహాస్యం చేసినా నీకై నీకోసమై ప్రతిఘటించగలిగేది పగవాళ్ళ చురకత్తి లాంటి మాటలను సైతం తన మాటలతో నీకు ఉపశమనం కలిగించేది నీకన్నా నీగురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ప్రేమ చూపించగలిగేది బంధం చాలా ముఖ్యమైంది, అమూల్యమైనది, అనిర్వచనీయమైనది బంధం నిలుపుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకు బంధాలను బంధంతో బంధించు.. -హిమ
Read More

కుటుంబం

కుటుంబం ఒక తోటలో పార్క్ లో ఇద్దరు ముసలి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకరు, రాముడు- “నాకు ఒక మనవరాలు, పెళ్ళికి సిద్ధంగా ఉంది. ఇంజనీరింగు చదివింది. ఉద్యోగం చేస్తున్నది. ఎత్తు 5.2. అందంగానే ఉంటుంది. ఎవరైనా తగిన పిల్లవాడు ఉంటే చెప్పండి.” మరొకరు, రంగడు- “మీ మనవరాలికి ఎటువంటి సంబంధం కావాలి?” రాముడు- “పెద్దగా ఏమీ వద్దు. అబ్బాయి M.E., లేదా M.Tech; చేసి ఉండాలి. సొంత కారు, సొంత ఇల్లుండాలి. మంచి ఎత్తు ఉండాలి. ఇల్లంటే కాస్త తోట, చెట్లు చేమలుండాలి. మంచి ఉద్యోగం, మంచి జీతం అంటే కాస్త ఓ లక్షో, రెండు లక్షలో ఉండాలి..!” రంగడు- “ఇంకేమైనా కావాలా?” అప్పుడు రాముడు- “అన్నింటి కన్నా ముఖ్యంగా, ఆ పిల్లవాడు ఒంటరి వాడై ఉండాలి. అతనికి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే, వారుంటే పెళ్ళి తరువాత పోట్లాటలు కావచ్చు కదా..” రెండవ వృద్ధుని(రంగడు)రెండు కన్నులు నిండి వచ్చాయి.…
Read More

బంధం

బంధం బంధం ఏదైనా నమ్మకం ముఖ్యం నమ్మకం లేని బంధం ఏదైనా వృధానే... ఒరేయ్ అన్నయ్య నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది నువ్వు నాతో వస్తావా అంటూ అడిగింది లత. నేను ఎందుకే నీతో అవసరం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్లిరా, నేను రావడం ఎందుకు? అయినా నా బాబాయ్ ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఎగ్జామ్ రాయడం ఎందుకే మరోసారి రాసుకోవచ్చులే ఎంత చదివినా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళే దానివి కదా ఇప్పుడు చదువు అవసరమా అన్నాడు నిష్టూరంగా మురళి. ఇదిగో చూడు అన్నయ్య నువ్వు ఇలా అంటే నాకు ఎక్కడో మండుతుంది. ఎంత వేరే ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్ళేవాళ్ళం అయినా మా కాళ్ళ మీద మేము నిలబడాలని మాకు మాత్రం ఉంటుంది. చదువుకుంటే తప్పేంటి ఆయన నీ సన్నిధిలో తీసుకు వెళ్తున్నట్టు ఆ మాటలు ఏంటి నేను నాకు వచ్చిన స్కాలర్షిప్ తోనే చదువుకుంటున్నాను నాకు…
Read More

ప్రేమ

ప్రేమ నా హృదయంతరాలలో నీ పేరు చెక్కుకున్న నేను నీ మదిలో చోటు కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపుల లో బ్రతికే నేను నీకు ఎదురవ్వాలని పరితపిస్తున్నా నా కళ్లలో నిన్ను నింపుకున్న నేను నీ నవ్వు లో నేను ప్రతి క్షణం ఉండాలని కోరుకుంటున్నా నీ ప్రేమ దాసుడిగా మారాలని తపించి పోతున్నా నీ హృదయం లో చోటు కోసం ఎదురు చూస్తున్నా నీ జీవితం లో సగమవ్వాలని వేచి ఉన్నా నా ఈ చిన్ని కోరికను మన్నిస్తావా ప్రియతమా ... -భవ్య చారు
Read More

నిలదీత

నిలదీత అన్యాయాలు, అక్రమాలు దినదినాభివృద్ది చెందుతున్న నా దేశంలో, చట్టం చేసేవారే , చట్టాన్ని చుట్టంగా వాడుకుంటూ ఉంటే, కలం ఝుళిపించాల్సిన కవులు కారణాలు వెదుక్కుంటూ ఉంటే, గొంతెత్తే గళాలు మూగబోయి నాట్యమాడుతుంటే, నిలదీయలేని మేధావి వర్గం జీవాచ్ఛవంలా పడివుంటే, ఉడుకు రక్తంతో పిడికిలి బిగించాల్సిన యువత,  జీవచ్చంలా చచ్చుబడివుంటే, నాటి నాయకుల త్యాగఫలితం  వృధా అవుతుందని భయంలేదా? యువత మేలుకో, కదన రంగం లోకి కదులు....నీలో కదలిక లేకపోతే మరో స్వాతంత్ర ఉద్యమం అవసరం అవుతుందేమో ఆలోచించు... -పోరండ్ల సుధాకర్
Read More

ఓయ్

ఓయ్ ఓయ్!!! నువ్వలా నవ్వి నా గుండెను కవిస్తే నాలోని అణువణువు నిను ఆకర్షించే నా పెదాలు దాటే పదాలు మొదలు పాదాలు సైతం నీ వైపే పయనమాయే అల్లుకోవా నీ వాడిలా నీ వెన్నెల కౌగిట్లో ! ఓయ్!!! ఎప్పుడో రాసిపెట్టుకున్నా అడగ్గానే నన్ను నీకిద్దామని హ్మ్మ్! నీకో సంగతి తెలుసా నాలోని వెలుగు నువు పంచిన భానుతేజమే నీకెలా ఉందో గానీ నాకు మాత్రం నీ ఊపిరి ఊయల్లో ఊగుతున్న సంబరమే నను మురిపిస్తున్నది అందుకేనోయ్... నా పెదాల నీ పెదాలకిచ్చి నీకై నేనెప్పుడో పయనమయ్యా నీవే నా లోకమని నీతో ఏకమవ హత్తుకో...నీ వెచ్చని కౌగిట్లో -అమృతరాజ్
Read More

స్నేహం

స్నేహం   స్నేహమనేది ఓ మధురభావన... స్నేహానికి అవధులు ఉండవు... లింగ బేధాలు అసలే ఉండవు... వెలకట్టలేని బంధం స్నేహం... సృష్టిలో స్వచ్ఛమైనది... భావనల పరంపరకీ ఓ నిధి వంటిది... దేవుడు సృష్టించిన గొప్ప బంధాల్లో స్నేహం ఒకటి... స్నేహం అనిర్వచనీయమైనది... నమ్మిన వ్యక్తికీ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే గొప్ప బంధం స్నేహం... ఓ వ్యక్తి స్నేహం దొరకడం ఓ గొప్ప వరంలాంటిది... అనుభవిస్తేగానీ తెలియదు స్నేహం యొక్క విలువ... నమ్మకానికి స్నేహం అమ్మవంటిది... ౼ గోగుల నారాయణ
Read More

పంచాంగము 01.02.2022

పంచాంగము 01.02.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - హేమంతఋతువు* *పుష్య మాసం - బహళ పక్షం* తిధి : 🌚 *అమావాస్య* ఉ11.48వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం: *శ్రవణం* రా8.58వరకు యోగం: *సిద్ధి* ఉ7.30 వరకు *వ్యతీపాతం* తె4.53 కరణం: *నాగవం* ఉ11.48 & *కింస్తుఘ్నం* రా10.56 వర్జ్యం: *మ12.48 - 2.21* దుర్ముహూర్తం : *ఉ8.51 - 9.36* & *రా10.57 - 11.48* అమృతకాలం: *ఉ11.05 - 12.36* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం: *మ9.00 - 10.30* సూర్యరాశి: *మకరం* చంద్రరాశి: *మకరం* సూర్యోదయం: *6.36* సూర్యాస్తమయం: *5.51* 👉 *చొల్లంగి అమావాస్య* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More