Month: March 2022

నిప్పులాంటి మనిషి !

నిప్పులాంటి మనిషి ! ఆయన ఒక సింహం. నడకలో రాజసం. చూపులో ధీరత్వం. నిత్యం గౌరవము అనే రహదారి ఆయనని తన మార్గం వైపు ఆహ్వానిస్తూ ఉంటుంది. నవ్వు శూన్యం. కానీ ఆయన మనసు విశ్వం. తన చూపులతో బెదిరించేవాడు ఆరోజుల్లో కుర్రకారుని. ఆయన పేరు మూర్తి. ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ లెక్చరర్. క్లాసు నిశ్శబ్దంగా సాగుతోంది. పైగా అది మూర్తి గారి క్లాస్. ఇక హడలు పిల్లలందరికీ. ఆయన చాలా గొప్ప బోధకుడు. ఆయన అంకితభావం పిల్లల్ని అలా బెంచీలకి అతుక్కు పోయేలా చేసేది. ఆయన అకౌంట్స్ చెప్తుంటే గోడ చూరు లో గూడుకట్టుకున్న పిచ్చుక సైతం మౌనం వహించేది. అది ఆయన గొప్పతనం. శ్రీను కొంచెం ఆలస్యంగా కాలేజీ లో ప్రవేశం పొందాడు. చదువులో ఆణిముత్యం వాడు. అదే మొదటి రోజు వాడు క్లాస్ కి వెళ్లడం. దాంతో మూర్తి గారి గాంభీర్యత వాడికి ఇంకా…
Read More

అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ ఆమె కష్టపడుతూ ఇంకొరికి సుఖాన్నిస్తుంది తను ఏడుస్తూ మరొకరికి నవ్వునిస్తుంది ఈమె మరణిస్తూ ఒకరికి జీవితమిస్తుంది అమ్మ - శ్రావణ్
Read More

మీకు తెలియని హోళీ కథ

వసంత రుతు ఆగమనానికి సంకేతం. రాలే ఆకులు రాలుతూ ఉంటే , వచ్చే ఆకులు వస్తూ వుంటాయి. అదేవిధంగా , పాతకోరికలు మరుగున పడుతూ ఉంటే కొత్త కోరికలు చిగురులు తొడుగుతూ ఉంటాయన్నమాట. రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ. మనిషి జీవితం రాగరంజితంగా , సప్తవర్ణ శోభితంగా ఉండాలన్నది సందేశం. పురానగాథ ఏమిటంటే , లోకకల్యాణం కోసం దేవతల కోరిక మేరకు , తన స్నేహితుడైన వసంతుడిని వెంటబెట్టుకుని వెళ్లి , తపోదీక్షలో మునిగి ఉన్న పరమేశ్వరునిపై విరిబాణాలను సంధించి ఆయన మనస్సును చలింపజేసేందుకు ప్రయత్నిస్తాడు మన్మథుడు. తపోభంగం కావడంతో శివుడు తన మూడోకన్ను తెరిచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. అయితే , మన్మథుడి భార్య రతీదేవి పార్వతీ దేవికి భక్తురాలు కావడంతో , సుమంగళిగా ఉండాలన్న వరాన్ని అనుగ్రహించింది పార్వతి ఆమెకు. ఆ వరభంగం కాకుండా ఉండేందుకు…
Read More

పంచాంగం 17.03.2022

పంచాంగం 17.03.2022   *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - శిశిరఋతువు* *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం* తిధి : *చతుర్దశి* మ1.11వరకు తదుపరి పౌర్ణమి వారం : *గురువారం* (బృహస్పతివాసరే) నక్షత్రం: *పుబ్బ* రా12.40 వరకు తదుపరి ఉత్తర యోగం: *శూలం* రా1.23 వరకు కరణం: *వణిజ* మ1.11 వరకు తదుపరి *విష్ఠి* రా1.09 వరకు వర్జ్యం: *ఉ8.08 - 9.47* దుర్ముహూర్తం : *ఉ10.10 - 10.57* & *మ2.55 - 3.43* అమృతకాలం: *సా6.03 - 7.42* రాహుకాలం : *మ1.30 - 3.00* యమగండ/కేతుకాలం: *ఉ6.00 - 7.30* సూర్యరాశి: *మీనం* చంద్రరాశి: *సింహం* సూర్యోదయం: *6.13* సూర్యాస్తమయం: *6.06* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
Read More

పరాజయం అంటే

పరాజయం అంటే పరాజయం అంటే నువ్వు చేసిన పనిని వదిలి పారిపొమ్మని కాదు. ఆ పనిని మరింత శ్రద్ధగా పట్టుదలగా చేయమని అర్ధం. - దేవ గంగుల  
Read More

సమాజం

సమాజం ఒకప్పుడు మంచి లక్షణాలు కలిగిండాలి అని చెప్పేవారు ఇప్పుడు "మనీ" ఉంటే మంచిది అని అంటున్నారు సమాజం - శ్రావణ్
Read More

జత

జత నీ జతగా నేనుండాలని ఎన్నో కలలు కన్నాను మన జత జంటను చూసి జనాలు నవ్వుకున్నా పట్టించుకోలేదు నాకు నువ్వు నీకు నేను అంటూ జత కలిసి పోయాను సమాజం ఛీదరించినా ఒక్కటై నిలిచింది మన జత నలుగురికి ఆదర్శం కావాలనుకున్నా మనసులో జత కట్టవని మురిసి పోయారు నాతో జత కలిపిన నువ్వు కొన్నాళ్ళు బాగానే ఉన్నాక నాలో లోపాలు వెతికావు మన బంధాన్ని మర్చిపోయావా ఇంకొక మంచి జతను మరిగి నా జత విడిచి వెళ్ళావు గువ్వల జంటలా ఉండాలనుకున్నాం కానీ ఇంకో గువ్వను పరిచయం చేసుకోని నన్ను నా జతను వదిలేసి పోయావు. జతకున్న అర్థాన్ని మర్చావు. జత లేని నా బతుకుని అగాధం లోకి నెట్టావు. ఈ జతలేని బతికేందుకు  ఒక పావురాయి చనిపోతే వేరొక పావురాయి ఇంకో తోడును వేతుక్కోదు. అది కూడా చనిపోతుంది ఇక ఆ జంట పావురాల జీవితం వ్యర్థం…
Read More

చివరికి మిగిలేది

చివరికి మిగిలేది మనిషి రంగుల ప్రపంచంలో చివరికి మిగిలేది ఏమంటే చివరికి మిగిలేది పాపం - పుణ్యం చివరికి మిగిలేది కోరికలు - ఆశలు చివరికి మిగిలేది తృప్తి - సంతృప్తి చివరికి మిగిలేది కాలం - గమనం చివరికి మిగిలేది విలువలు- వింతలు చివరికి మిగిలేది అనుభవం - అంతర్మథనం చివరికి మిగిలేది అర్దం - పరమార్థం చివరికి మిగిలేది మార్గం - సన్మార్గం చివరికి మిగిలేది కనుల లోని కలలు చివరికి మిగిలేది తరిమిన చీకటి చివరికి మిగిలేది నిత్యం - సత్యం చివరికి మిగిలేది సూక్ష్మం లో మోక్షం అదే బ్రహ్మానందం పరమానందం దివ్యత్వమే - జి.జయ
Read More

పీక కూతతో తప్పిన పీక కోత

పీక కూతతో తప్పిన పీక కోత కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తున్నాడు రాజు.. వేగంగా వెళ్తున్న ఒక ఇసుక లారీ అతని సైకిల్ ని గుద్దేసి ఆపకుండానే ముందుకు దూసుకొని వెళ్ళిపోయింది. అతని తలకు బలమైన గాయం అవ్వడంతో విపరీతంగా రక్తస్రావం అవుతోంది. ఇంతలో ఎవరో ఒక దయగల మహానుభావుడు ఈ విషయాన్ని ఆంబులెన్స్ నిర్వాహకులకు తెలియజేశాడు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి రాజుకి మాట్లాడడానికి శక్తి చాలటం లేదు. అక్కడ గుమిగూడిన వాళ్ళలో ఒకరికి చేతివేళ్ళు చూపుతూ దగ్గరికి పిలిచాడు. ఆ మనిషి లో ఎక్కడో మానవత్వం ఉంది.. దగ్గరికి వెళ్లి 'చెప్పండి' అన్నాడు.. రాజు తన షర్ట్ జేబులో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని బయటికి తీయ వలసినదిగా అతనిని కోరాడు. రాజు కోరిన విధంగా ఆ పుస్తకాన్ని తీసి తెరిచాడు ఆ మానవతావాది. అందులో అన్నీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. " చెప్పండి సార్ ఇందులో ఫోన్ నెంబర్లు…
Read More