Month: May 2022

నీకేమైంది….?

నీకేమైంది....? మధురమైనక్షణాలు ముందరే ఉంచి, మరిచిపోలేని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ముందర ఉన్న కొలను వైపుకు ఉలుకుపలుకు లేని చూపులు చూస్తూ.. ఎప్పుడో గడిచిన కాలం,ఇప్పుడే జరిగినట్టుగా పదేపదే ఊహిస్తూ ఉలిక్కి పడుతూ ఒంటరితనమే ఒక వారసత్వంగా భావించి ఊరి చివరన ఉత్తర దిశగా చూసే ఓమనిషీ నీకేమైంది....? - కుమార్ రాజా
Read More

స్నేహము !

స్నేహము ! అరుణ ఒక అందమైన అమ్మాయి అందము అంటే మరీ అందమైంది కాదు ఏదో కాస్త మామూలుగానే ఉంటుంది. ఒక స్కూల్లో టీచర్గా పని చేస్తోంది ఆమెకు ఒక ఫ్రెండు ఉండేది ఇద్దరూ ఒకే దగ్గర అంటే అరుణ ఫ్రెండ్ ఎక్కడికైనా వెళ్లాలంటే అరుణ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. కాబట్టి ఇద్దరు కలిసి రోజూ స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉంటారు. అరుణది ఒక చిన్న ఇల్లు ఉన్నా సొంత ఇల్లు అది. అందులో ఆమె వాళ్ళ తల్లి ఇద్దరూ ఉంటారు. తల్లి పేరు శ్యామల ఏదో బీద పరిస్థితుల్లో ఉన్నారు వారికి ఎక్కువగా ధనం లేదు. అక్క చెల్లెలు గానీ, అన్న తమ్ముళ్లు కానీ ఎవరూ లేరు తనొక్కతే. ఎవరూ లేరు చాలా రోజులకు ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఇంటిపని చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, స్కూల్ కి వెళ్ళాలి, రావాలి. ఇంట్లో తల్లి ఏదో చిన్నచిన్న…
Read More

వదిలితిని పో నీ విచక్షణకు!!

వదిలితిని పో నీ విచక్షణకు!! కడుపు నిండుగ ముద్ద, కంటి నిండుగ నిద్ర, వరములాయె మాకు బరువులయ్యే నిట్లు నిత్య పూజలు...! మావి భారమైన బ్రతుకులు కష్టమంటే మాకు మోయు ఇసుక మూటలు..........! ఎట్లొస్థిమో, అట్లనే పోదుము............! మా తలకి మించిన బరువులు నీ నగల మూటలు...............! మాది శారీరక కష్టము. నీది మానసిక నష్టము. నీ రోగాలు, రాలవు ఏ దైవ పూజలకు.......! నీ కడుపుకెక్కదు ముద్ద నీ కనుల నిండదు నిద్ర మేము వరాలై పొందినవవి, నీకు శాపాలౌను కదరా......! - వాసు
Read More

వాడే కార్మికుడు

వాడే కార్మికుడు ఎ పనైనా చేయగలిగినవాడు. పనిని చిన్న చూపు చుడనివాడు. నిత్యం పనిచేసేవాడు. పనినే దైవంగా కొలిచేవాడు. ఉల్లి దెబ్బలకి మరింత శక్తిని పెంచేవాడు. తోటివారికి బలాన్ని పంచేవాడు. కండ బలిసినవాడు. వాడే కార్మికుడు. - సంతోష్
Read More

కలలమేడలు

కలలమేడలు అల్పజీవులు బడుగుజీవులు అర్ధాయుష్కులు వారు బుక్కెడు బువ్వ జానెడు చోటుకు నోచుకోనివారు ఆకాశం నీడలో నిద్రించేవారికి స్వప్నలోకాలేముంటాయి లాఠీతోడుగా నాట్యం చేసే రక్షకభటుల కర్కశమైన మాటతో రోజు మొదలు భుక్తేలేనివారికి హక్కులేముంటాయి విసిరేసిన విస్తరిలాంటి జీవితాలు కదా నేడిక్కడ రేపెక్కడో అన్న నిట్టుర్పులే ఉంటాయి ఫ్లైఓవర్లు, పేవ్మెంట్లు,దించిన షట్టర్లు ఈ చీకటి బతుకుల కథలకు మౌనశ్రోతలు..కనిపించని దేవుడికి విన్నపాలు చేస్తాయేమో తెలీదు అసమానతల ప్రపంచంలో ఆరని మంటల్లో సమిధలై వీరంతా కాలిపోతూనే ఉంటారు 'మేడే' లు బాగుచేయని బతుకులు వీరివి మేడల్లో ఉండే మనకు ఇవేమీ కనబడని దృశ్యాలు కావు మనసు గోడలను కోరికలతో కాంక్షలతో తాపడం చేశాం కదా..ఏ దుఃఖమూ దరిచేరదు.. రాత ఆ దేవుడు రాశాడోలేదో కానీ కొందరి రాతలను మాత్రం డబ్బు ప్రపంచం రాస్తుంటుంది ఏమీచేయలేని వారేమో రాజుకున్న చైతన్యం అగ్గిలా ఎప్పుడో అంటుకోక మానదని ఇలా అక్షరాలతో కలల మేడలు కడుతుంటారు - సి.యస్.రాంబాబు
Read More

శ్రామికులు

శ్రామికులు మెడలే వంచి మేము కష్టపడితే మేడాలై మీరు ఎదిగిపోతారు నడుము వంచి మేం చెమటోడిస్తే నగరాలై మీరు విస్తరిస్తారు.. అందరికి "కార్మికుల దినోత్సవ(మేడే శుభాకాంక్షలు)" - శ్రావణ్
Read More

బాల్యం మాయంః

బాల్యం మాయంః బాలుడు నేను, భీముడు కాను.. మీ జేబున లెక్కలు, మా స్వేదపు చుక్కలు.. నువు చేసిన నేరం నే చదువుకు దూరం, చెదరెను బాల్యం, నరకరు తుల్యం… మాసిన బట్టలు, మోసిన బుట్టలు, చూసెనట్టులే పనిచేయని చట్టాలు.. మారాము చేసేమా?? మార్పును కోరేము.. కావాలిక విడుదల, ఎన్నాళ్లీ బెడదల, దడ దడ లాడు భయజ్వాల? నా కలమే కాగడగా, భయమను నిశికే, గుండెను చీల్చి, నా కవనమే, నరసింగపు గోళ్ళై, అజ్ఞానపు హిరణ్యకశపులనంతరించగా! ఓ చైతన్య దీప్తి అవతరించదా? పై కవితతో పాటు ఆటవెలది పద్యం: బాల్య మెవరికైన బాగుండవలెగాని పనుల చేత మాకు పైసలేల గురుల విద్య లేక గురితప్పె భవితలు విడుదలంటు లేదు వినరె జనులు - సత్యసాయి బృందావనం  
Read More

మేడే

మేడే కదలాడే ప్రపంచంలో అందరికన్నా ముందుగా వేచి వెలుగును చూసేది శ్రామికుడే . శ్రమ జీవన గమనంలో శక్తినే పెట్టుబడిగా సాగుతున్న సైనికుడు దారిద్ర్యరేఖ ని దాటలేని సంఘజీవి శ్రామికుడు పగలు రాత్రి కి తేడా లేకుండా పనిచేసినా ఫలితం లేని కూలి హక్కులరోజులు వచ్చినా తిప్పలు తప్పని మనిషి యంత్రంలా పనిచేసినా పురోగతిని చూడని జీవనం కట్టడాల పునాది రాళ్ళు ఎత్తినా కునుకు తీసే చోటులేని వింత జీవి అభివృద్ధికి సమిధ లైనా సంపద లేని శ్రమజీవి శ్రమతో స్వేదం చిందించినా ప్రయోజనం లేని ప్రతిభావంతుడు పనిభారం తో పోరాటం ప్రమాదాల తో పయనం ప్రగతిశీల చక్రాలతో ఊహల ఊపిరితో నిరంతర సేవలో బరువైన బాటసారి శ్రామిక వెతల సహనజీవి చైతన్యపు శక్తులు శ్రామిక జనజీవులు వలస వచ్చిన కార్మికులు బతుకు భారాన్ని మోస్తూ భద్రత లేని జీవితం గడుపుతూ కష్ట నష్టాల ఖాతా లేని రోజులు చాకిరీ చేసే…
Read More

వీధి బాలలు

వీధి బాలలు ఉసూరుమనిపించే ఉషోదయాలు... ఉద్యమంలా సాగుతుంటాయి.... అక్కరలేని పెంటకుప్పల్లో... విసిరేసినా ఆకుల్లా... నడక నేర్చిన బాల్యం... నాలుగు కూడళ్ళలో కలుసుకుంటుంది... డబ్బు అనే జబ్బును భుజాన మోస్తూ అమ్మఒడిలోని వెచ్చదానన్ని... ప్లాస్టిక్ సంచుల్లో వెతుకుంటూ.... విధి వారిని విసిరేసినా... గుడ్డి దీపాల వెలుగులో నిద్దరోతుంటుంది... ప్లాస్టిక్ సీసాలా పాదరక్షలు పాదుకల కన్నా గొప్పవి... మరోతరపు బాల్యాన్ని తనపై మోస్తున్నందుకు.... కారే చెమట....ఉప్పగానే ఎందుకుంటుందో... దాహార్తిని తీర్చే... చలువ నీరైతే ఎన్ని గొంతుకలను తడపగలావో ..... ఎన్ని తరాలు మారినా తలరాతలు మారని వీధిబాలల జీవితాలలో కొత్త ఉషస్సులు వచ్చేదెన్నడో - కవనవల్లి
Read More

ప్రశ్నించిన కలం

ప్రశ్నించిన కలం ఆకాశాన్ని కాగితంలా మలుచుకుని..... నిత్యం కష్టించే పేదల కష్టాన్ని..... శ్రామికుల చెమట చుక్కలను..... ఇంకులా చేసుకుని.... పెన్నును గన్నుగా.... అక్షరాలను తూటాలా మార్చుకుని.... పేద వారిపై, కర్షకుల పై, శ్రామికుల పై..... జరుగుతున్న దోపిడీని తన కవిత్వంతో ప్రశ్నించి..... ఘోరాలను ఎదిరించగ ముందుకు అడుగేసి.... బలహీన వర్గాలలో చైతన్యం కలిగించి.... వారిని తనతో కదిలించి..... అడుగడుగునా నేనున్నానంటూ.... కదం తొక్కి... మార్పు దిశగా నిరంతరం పయనించిన అక్షర సూరీడు.... ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజాకవి... సాహిత్య లోకానికి మార్గదర్శకుడిగా నిలిచిన.... మహా కవి.... శ్రీ శ్రీ - రహీంపాషా
Read More