Month: May 2022

కళాశాల రోజులు

కళాశాల రోజులు కళాశాల రోజులు కాదా ఎప్పటికీ మర్చిపోలేని తీపి గురుతులు బంగారంలాంటి భవిష్యత్తు రెక్కలు తొడిగిన యవ్వనం రంగు రంగుల ప్రపంచం స్నేహ బంధాల చిత్రాలు స్వేచ్ఛా శక్తుల లెక్కలు సంతోషపు నేస్తాలు ఊహల లోకాలఉయ్యాలలు గడబిడ చేసే పాఠాలు తియ్యని అల్లరి చేష్టలు ఆశల పల్లకిలో పాటలు ఆట పాటల సందడులు సరదాల చిరునవ్వులు కొత్త అనుభవ సాహసాలు ఖర్చుకు సరిపోని డబ్బులు అమ్మానాన్నలకుచెప్పే అబద్ధాలు చిలిపి కలహాల కారణాలు శక్తి యుక్తుల బేరీజు లు గైరుహాజరు గ్రూపులు దాచే మాటలు దారహాసపునవ్వులు మంచిచెడుల కు తేడా తెలియనిహృదయాలు చదవడానికి పుస్తకాలు కాని వినని మస్తకాలు గురువుల మాటలు సరిపోవు వెళ్ళే దారులు వెదుకుతూ అర్థంకాని అవగాహనలు మైలురాళ్ళ రహదారిలో మరచిపోలేనిఅనుభూతుల మళ్లీ రమ్మన్నా రాని కళాశాల రోజులు కావు అవి జీవితపు జ్ఞాపకాల కట్టలు...... - జి జయ
Read More

అందమైన చందమామ

అందమైన చందమామ అందమైన చందమామ దరిచేరిన చందమున చూడ తనివి తీరునెపుడు ఈ చీర అన్నావు ఆ చీర అన్నావు అవెందుకడ్డ మనుకొంటి నీ అందములచూడ చూపుల కేముండెనడ్డు పెదవులకు ఏమి వుండె తనివి తీరగ నీ తనువు ఒంటరిగ చూడ తనువు పులకరించు తన్మయత్నమున తనివి తీరగ,చెపుదు నువు చీర కట్ట తనివి తీరు నెపుడు! నే చెప్పుటె పుడు!   - రమణ బొమ్మకంటి
Read More

పంచాంగము 11.05.2022

పంచాంగము 11.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - శుక్ల పక్షం* తిధి : *దశమి* మ3.20 తదుపరి ఏకాదశి వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం: *పుబ్బ* మ3.50 తదుపరి ఉత్తర యోగం: *వ్యాఘాతం* సా4.16 వరకు తదుపరి హర్షణం కరణం: *గరజి* మ3.20 వరకు తదుపరి *వణిజ* తె3.16 వరకు వర్జ్యం: *రా11.11 - 12.50* దుర్ముహూర్తం : *ఉ11.30 - 12.21* అమృతకాలం: *ఉ9.10 - 10.50* రాహుకాలం : *మ12.00 - 1.30* యమగండ/కేతుకాలం: *ఉ7.30 - 9.00* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *సింహం* సూర్యోదయం: *5.34* సూర్యాస్తమయం: *6.18* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More

వరం

వరం కనులు కనులు దోచాయంటే మనసుకు రెక్కలు వచ్చాయంటే ఆశలు అలలై ఎగిరెగిరి పడితే వరమై దరిచేరిన ఆ చెలి తో గగనం లో విహంగమై విహారం చేయనా...? స్వప్నంలో మెదిలే ఆ తరుణి నిజమై దరి చేరునా...? భారమైన సరే, బాధ్యత గా స్వీకరించి వలచిన ఆ చెలిని వరంగా కొలుచునా.. - కుమార్ రాజా
Read More

కానుక

కానుక అమ్మా అమ్మా అంటూ వచ్చింది ప్రీతి. ఎంటమ్మా ఏం కావాలి ఇంకో అట్టు వేయనా అంది సుమిత్ర దోసెలు వేస్తూ... మరో పక్క కూర కలియ పెడుతూ, అవన్నీ వద్దమ్మ నాకు మన పెరట్లో ఉన్న పూలతో ఒక మాల కట్టివ్వు . అలాగే ఏదైనా వెరైటీ స్వీట్ కూడా చేయమ్మ, అలాగే నాకు నీ చీరకట్టు, హా లంచ్ లోకి చికెన్ కర్రీ చెయ్యి, తొందరగా చేయమ్మా అంటూ నోట్స్ లో ఏదో రాస్తున్న ప్రీతి దగ్గరికి తల్లి అట్టు తో వచ్చి సరే అన్ని చేస్తాగానీ ముందు నువ్వు అట్టు పూర్తిగా తిని నోట్స్ రాసుకోవాలి అంది సుమిత్ర. అమ్మా..., అబ్బా ఎప్పుడు తిను తిను అంటూ నా వెనకాలే పడతావు. ముందు నేను చెప్పినవి అన్ని తొందరగా చెయ్యి అంటూ వెనుదిరిగి వెళ్ళిపోతున్న కూతురి నోట్లో దోసె పెట్టేసింది సుమిత్ర. అబ్బా అని అనుకుంటూనే దోసె…
Read More

తేడా

తేడా సృష్టికి జీవం పోసినది రెండక్షరాల పదం అమ్మ అంటూ పెద్ద పదాలు కాకుండా అమ్మ అని పిలిస్తే ఎంత రాత్రి అయినా ఏమైంది బిడ్డా అంటూ లేచి వచ్చేది తల్లి మాత్రమే. ప్రతి అమ్మాయి పెళ్ళి అయ్యాక తల్లిగా మారిన క్షణం నుండి బాధ్యతను పెంచుకుంటూ, బిడ్డను కాపాడుతూ చెడు దార్లో వెళ్లకుండా మంచి మార్గాన్ని సూచిస్తుంది. కానీ తల్లి బిడ్డను కనగలదు కానీ వారి రతాను కనలేదు. బిడ్డ కు అన్ని మంచి మాటలే చెప్తుంది. కానీ పుట్టిన ప్రతి బిడ్డ. మంచి దార్లో వెళ్ళాలని లేదు. స్నేహాల వళ్ళో, వేరే విషయాల వల్ల లెడ్ a చెడు అలవాట్లు వల్లనో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి రాత ను రాసుకోవడం  జరుగుతుంది అని అనుకుని వుంటే  దానికి ఆ  తల్లెం చేయదు . కానీ ఎవడో ఒకడు తప్పు చేయగానే తల్లి పెంపకం బాగా లేదంటూ నిందలు…
Read More

మాతృ దినోత్సవము

మాతృ దినోత్సవము 1) చిన్న నాట అమ్మ చీదరించుకొనక      కడిగి.ముత్యము వలె కాటుకెట్టి      దిష్టి తగలకుండ దిష్టి చుక్కను బెట్టి      ఊయలందు వేసి ఊపుచుండు 2) అమ్మ చెంతనున్న ఆటాడుకుందును      అమ్మ ఒడిన నున్న అంత హాయి      అమ్మ పెట్టు బువ్వ కమ్మగా ఉండును      అమ్మ కన్న నాకు అధికులెవరు 3) అమ్మ గోరుముద్ద అమృత సమముండు      అమ్మ ముద్దులన్ని కమ్మగుండు      అమ్మ హత్తుకొనిన బొమ్మ లక్కరలేదు      అమ్మ దేవతగద అవనియందు 4) అలసటెరుగకుండ అన్ని పనులు చేయు      విశ్రమించనట్టి విమల మనసు      అమ్మ సేవలందు అణువంత చేయము      అమ్మ ఋణము దీర్చ నలవిగాదు 5) స్వార్థ మెరుగనట్టి సేవలు చేసెడి      తల్లి ఋణము…
Read More

బహుమతి

బహుమతి అమ్మా నీ ఋణాన్ని తీర్చకపోతే ఈ జన్మకు సార్థకత లేదు. నీ ఆశయం నీ కోరిక తప్పక నెరవేరుస్తామని నీ కల మా కలగా నీ కళ్ళు మా కళ్లుగా చేసుకుని ఈ లోకానికి మెమెంటో చూపించి తీరుతాం దాని కోసం మా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధ పడతాం. అమ్మ తొందర్లోనే నీ కలను నీకు బహుమతిగా ఇస్తానని హామీ ఇస్తూ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు... - భవ్య
Read More

అమ్మంటే…..

అమ్మంటే..... యాడాదికి ఒక్కరోజు నువ్వు గుర్తుచేసుకునే పదం కాదు... సంవత్సరమంతా కనీసం పట్టించుకోకుండా మథర్స్ డే అంటూ ఒక్క రోజు నువ్వు స్టేటస్ లో చూపెట్టే ప్రేమ కాదు.. అమ్మంటే.. వృద్ధాశ్రమాలలో ఉంచే బరువు కాదు.. ఉన్నపుడు పట్టించుకోకుండా పోయాక బలవంతగా కార్చే రెండు కన్నీటి చుక్కలు కాదు.. అమ్మంటే... నువ్వెంత దూరం పెట్టిన ప్రతి రోజు నీ కోసం తల్చుకునేది..నువ్వు పిండమై కడుపులో పడ్డ కాడి నుండి తను చచ్చే దాకా బిడ్డలే సర్వస్వం గా బతికే ప్రేమ జీవి... నిజంగా నీకు అమ్మ మీద ప్రేముంటే... నిన్ను కన్నందుకు అమ్మ కోసం అమ్మను అమ్మలా ప్రేమించు...అమ్మ కు ప్రేమను పంచు... - ప్రవీణ్
Read More

పంచాంగము 09.05.2022

పంచాంగము 09.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - శుక్ల పక్షం* తిధి : *అష్టమి* మ2.07 తదుపరి నవమి వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం: *ఆశ్రేష* మ1.19 తదుపరి మఖ యోగం: *వృద్ధి* సా5.22 తదుపరి ధృవం కరణం: *బవ* మ2.07 వరకు తదుపరి *బాలువ* రా2.33 వరకు వర్జ్యం: *రా2.04 - 3.46* దుర్ముహూర్తం : *మ12.20 - 1.11* & *మ2.53 - 3.44* అమృతకాలం: *ఉ11.35 - 1.19* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం: *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *మేషం* చంద్రరాశి: *కర్కాటకం* సూర్యోదయం: *5.34* సూర్యాస్తమయం: *6.17* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 
Read More