Month: May 2022

చీకట్ల కళ్లాపు!!

చీకట్ల కళ్లాపు!! మామలిద్దరాయె, నడిమిట్ల నేనైతి తరాజు. నా మొగ్గు నీవైపే మామ ఓ, నా చందురూడా.........! నా మోమును దిద్దుకుంటి. నిన్ను చూడ సరిచేసుకుంటి. రాతిరిని వేడుకుంటి, చల్లని చీకట్ల కళ్లాపు జల్ల వేగిరముగా .............! నీ చలువ చూపులు చూసి, నే చల్ల బడుట మరిచితిని రాతిరి వంట పొయ్యినెక్కక బాయె. మెడ నెత్తి చూసి మైమరిచి పోతిని, మెడ నొప్పి పుట్టంగ మెట్లెక్కి మేడనెక్క బోతె, నా మేనమామ, నాకన్నా ఎవరెక్కువే నీకని నా చేయి పట్టి లాగే...........! దోసిట నీళ్ళు నింపి కనులారా నిన్ను చూడ నిను నిల్ప నా యత్నం బొట్టు, బొట్టుగా కారి, నన్ను నీరుగార్చే............! - వాసు
Read More

చందమామ

చందమామ అందమైన చందమామ దరిచేరిన చందమున చూడ తనివి తీరునెపుడు ఈ చీర అన్నావు ఆ చీర అన్నావు అవెందుకడ్డ మనుకొంటి నీ అందములచూడ చూపుల కేముండెనడ్డు పెదవులకు ఏమి వుండె తనివి తీరగ నీ తనువు ఒంటరిగ చూడ తనువు పులకరించు తన్మయత్నమున తనివి తీరగ,చెపుదు నువు చీర కట్ట తనివి తీరునెపుడు! నే చెప్పుటెపుడు! - రమణ బొమ్మకంటి
Read More

అందరాని చందమామ

అందరాని చందమామ అందరాని చందమామే కాని అందాల చందమామే అందరికివెన్నెలపంచేహాయి అందాల చందమామ ను అద్దంలోచూపిగోరుముద్దలు పెట్టినప్పుడు ఆనందంతో చూసి ముసిరిపోయాము చూసే కళ్ళకు తెలుసు నల్లటి ఆకాశంలో చల్లని చందమామ వెలుగు నింగిలోకి తొంగిచూసి నిదుర పోయే వేళ కలలకు తెరతీసి నిన్నుచూస్తే ఆరాటం వద్దు అందిన దానితో ముద్దు అన్నట్టుగా నచ్చని నల్లని మచ్చలను కాకుండా కలువల అసలైన అందాలు చూడాలి అందితే విలువుండదు అత్యాశతో కాకుండా అద్దంలోచిక్కినచందమామ వేగం పెంచి దాటితే లోకం పరుగుతీస్తుంది అందరాని చందమామ కోసం అందే వరకు పరుగుల అడుగులు అది మానవ సహజం మరి......... - జి జయ
Read More

నీటి బొట్టు

నీటి బొట్టు ఆటవెలది: మొయిలు దాచె నంట మదిలోన మృదువుగా ధరణి పైన పంట దరికి పిలిచె పరుగు పరుగు నొచ్చె పొలముకై చిరువాన నేల తడిపె నటులె నీటి బొట్టు తేటగీతి: కలువ పైనున్న నినుచూడ కనుల పంట విలువ నీకన్న అధికము కలుగరెవరు చెలియ కన్నులో నీవుంటె చెడ్డ భయమె మునిగు ఆల్చిప్ప యదలోకి ముత్యమునుగు - కోట
Read More

అమ్మ పాట

అమ్మ పాట పల్లవి అమ్మే దైవమని నమ్మితివా కలగవింక ఆపదలు ఎన్నడూ అమ్మే సర్వమని తెలిసినచో బంధాలకు అర్థము తెలియునుగా చరణం నీవే లోకమనుచు బతుకునుగా నీ సుఖమే తనసుఖమని తలచునుగా నీ తప్పటడుగే తనకు ముద్దుగా నీ బోసినవ్వే తనకు వెన్నెల చరణం అమ్మంటే త్యాగమని తెలిసినచో జీవితానికర్థమూ తెలియునుగా తన ఆకలినే దాచుకొనునుగా నీ ఆకలికే తల్లడిల్లుగా చరణం విజయపథమునే నీవు నడిచితే మురిసిపోవునది అమ్మ ఒక్కటే అమ్మ బాటను విడువవద్దురా అమ్మ మాటను మరువవద్దురా చరణం స్వచ్చమైనది నిత్యమైనది అఖిలజగమున అమ్మ ప్రేమరా బతుకు లోగిలిలో నీకు అండరా తనకు ఎప్పుడూ గొడుగు పట్టరా - సి.యస్.రాంబాబు
Read More

స్వార్థం

స్వార్థం "ఒకవైపు ఎక్కడ చూసినా అన్యాయాలు, అరాచకాలు ఇంకోవైపు అణగారిన వర్గాల ఆక్రందనలు...... ఈ సృష్టిలో మనిషిగా పుట్టాం అని సంతోషపడే క్షణాల ఎక్కడా...? ధనవంతులు సంపద కోసం పేదవాడు ఆకలి కోసం తీసే పరుగులకు నేలసైతం చిన్నదైపోయింది... లేనివాడి ఆకలి ఏడుపులు వినలేక పుడమి తల్లి బోరుమంటుంది.. ఆది నుంచి నేటి వరకు మిగిలిన ప్రాణులన్నీ బలమైనవర్గాల చక్రాల కింద పడి నలిగే ప్రాణాలెన్ని.. అభివృద్ది అంటూ ఆరులు తీస్తూ, అవసరాలకి అడ్డదారులు... అయినవాళ్ళు లేరు, కానీ వాళ్లు లేరు ఉన్నదొకటే స్వార్థం...! డబ్బుతో సావాసం, సంపదకై పోరాటం.. కలిమి లేదు, చెలిమి లేదు కాలంతో ప్రయాణం.. ముసుగుతో మాట్లాడే మనుషులు ఈరోజొకటి రేపోకటి... మన బ్రతుకు చాలు ఎవడెం అయితే నాకేంటి.. అన్ని ఉన్నా ఎదో దానికై ఆరాటం... మంచి లేదు, మానవత్వం లేదు రంగులు మార్చుకుంటూ పోదాం... ఎక్కడున్నామ్ మనం, ఎటు పోతున్నాం మనం"...?? - కుమార్…
Read More

నీటిబొట్టు

నీటిబొట్టు ఆటవెలదులు 1) పట్టు నీటి బొట్టు ప్రాణాలు నిలబెట్టు     ఇంకుగుంట ఉంటె జంకులేదు     ఊరికొక్క చెరువు ఊరంతకందము     నీరు లేక ఎవరు నీల్గవలదు 2) నాగరికతలన్ని నగరాలలో వెలిగె      నాటి వైభవమ్ము నేడు కరువు      వేల యేళ్ళనుండి వెలిగిన నరుడిలా      నీరు లేక నేడు నీల్గుచుండె 3) వాననీరు మిగుల వరదలై పోకుండ      ఇంకుగుంటయందు యిమడ జేయి      పుచ్చకాయ రీతి పుడమిలో జలమున్న      నీల్గు ప్రాణి జీవి నిలుచు నిజము 4) పుడమి గర్భమందు బుడగ నీరుండిన      హరితదనము అవని నావహించు      నింగి నేల వాలి నీరంత మడుగులై      పాడి. పంట తోడ పల్లవించు 5) వేదకాలమందు విలసిల్లు జలముల      పరిమితముగ వాడి…
Read More

కలలు కనకు

కలలు కనకు కులాల గోడల్ని దూకావో జీవితాల్ని కూల్చేస్తారు మతాల సరిహద్దుల్ని దాటావో మాడిపోతావు! ఇది ఆధునిక భారతం సౌశీల్యం సౌహార్ద్రతలు ఇంకిపోతున్న ఎడారిలో మానవతా ఒయాసిస్సులకు దిక్కెక్కడ! మనుషులు ద్వీపాలై మనసులు కొడిగట్టిన దీపాలవుతుంటే ప్రేమానురాగాలన్ని ఘనీభవిస్తున్నాయి భక్తి పన్ను కట్టేశామా పాపాల భయముండదు కోరికలు,కాంక్షల కళ్ళకు కన్నీటి కరుణ తెలియదు అక్షరాలు దిద్దిన చేతులకు ఆత్మీయ స్పర్శ తెలియదు ప్రవహించే కాలం ప్రవక్తలా మారి బోధిస్తే బావుండు బండబారిన సమాజానికి బాధ్యత తెలుస్తుందని కలలు కనటమే మిగిలిందిక - సి.యస్.రాంబాబు
Read More

జిహ్వ రుచి

జిహ్వ రుచి   అమ్మ అన్నము పెట్టెను కమ్మ గాను నిమ్మ పిండెను కొంచెమునందు లోను ఆవ కాయనే మరువకూ ఆకులోన జిహ్వ రుచికి తాళగనే వహ్వ యనదె?   - సత్యసాయి బృందావనం
Read More

నీటిబొట్టు

నీటిబొట్టు నీటిబొట్టు గురించి చెప్పాలంటే నీతిగా నీరును పొదుపు చెయ్యాలి మనం ఎందుకంటే ప్రతినీటిబొట్టు ప్రాణాధారమైన బిందువు ఒక్కొక్క చుక్క నీటి బొట్టే జీవనానికి ఆధారం. ఒక్క నీటిచుక్కే జలసంపదగా మనకు జీవామృతం అవుతుంది కాబట్టి "జలమే మన శక్తి" భూమి , నీరు ఎంత శాతం విశ్వంలో వుందో మా శరీరంలో కూడా అదే రీతిలో వుంది . శరీరంలో నీటిశాతం తగ్గితే మనం నిస్సహాయంగా అవుతాం జీవక్రియలు జరగడానికి నీటి బొట్టువిలువ ఎంతవుందో చూడండి. ప్రకృతిలో ఆహారం, నీరు ప్రతి జీవరాశికి ప్రాణాధారం ఆహారము భూమి నుండి రావడానికి నీటి అవసరం కదాఅందుకే సహజ వనరులు కరిగిపోకండా కాపాడుకోవాలి అదే మన ముందున్న తక్షణ కర్తవ్యం ప్రకృతి సమతుల్యంగా వుండి సస్యశ్యామలంగా వున్నంత వరకు జీవనా దారమైన నీటిని "పొదుపు" గా వాడటటం ఆచరణలో కి తెచ్చి వర్షపు నీటిని భూమి లోకి వెళ్లేలా చేస్తే జల సంపద…
Read More