Month: October 2022

తళుకులీనువజ్రాలు

తళుకులీనువజ్రాలు నా అనే దిక్కులేని‌ తారకలవి వెలుగులు మరచిన మిణుగురులు దిక్కు తోచని స్థితిలో నిలిచిన తోకచుక్కలు మెరవాలని ఉన్నా అమాస నిశీధులు ముసురుకుని సంతోషమంటే తెలియని అభాగ్యులు... ఎందరో చివాట్లు వేస్తున్నా పట్టించుకోక మనసు చివుక్కుమంటున్నా శాంతం శాంతమని పేదవాని‌ కోపం పెదవికి‌చేటని పెద్దలమాట నమ్మి లేని‌నవ్వులు పెదవుల నిండా నింపుకుని ఆశలు ఆశయాలు ఎన్నున్నా చిదిమేసుకుంటూన్న చేయూతలెరుగని చిన్నారులు వాళ్ళు... కరణాలనేకాలుగా ఒంటరులైపోతే‌... బంధువులంతా రాబందులుగా మారి పొడుచుకుతింటే‌‌‌.... అనారోగ్యంతో ఐనవారు లేక అనాధైతే.... జగమంత కుటుంబమనుకుని‌ బ్రతుకీడుస్తున్న సానపట్టని తారకలెందరెందరొ మన సమాజాన... వాడ వాడలా బిచ్చగాళ్ళుగానూ.... వీధి వీధిలో అన్నార్తులుగానూ... చీదరించుకుని ఛీకొడుతున్న పెద్దమనుషుల వద్ద ఛీత్కారాల ఛీవాట్లు తింటూ.... నోరు మెదపక తెలివిని తాకట్టుపెట్టుకుని.... జాలిలేని‌ సమాజంలో రాలిపోతున్న జాతిరత్నాలు... కళ్ళు తెరువక మేధావులని విదేశాలకి పంపుకుంటున్న చదువుకున్న వివేకులం కదా మనం!!!!!! - ఉమా మహేశ్వరి
Read More

రాజరాజచోళుడి కథే పొన్నియన్ సెల్వన్

రాజరాజచోళుడి కథే పొన్నియన్ సెల్వన్ పొన్నియన్ సెల్వన్ సినిమాని బాహుబలి తో పోల్చి తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందారు కానీ అదే పేరుతో వచ్చిన (ఐదు భాగాల) నవలకు చక్కని దృశ్య రూపం సినిమా పియస్1 చోళ, పాండ్య రాజుల వైరం ఒకపక్క ఇంకోపక్క సుందరచోళుడు సామ్రాజ్యంలో అంతఃకలహాలు, కుయుక్తులు, కుట్రలు ఈ మొదటి భాగంలో కనిపిస్తాయి. తమిళ రచయిత కల్కి రచించిన ఐదుభాగాల నవలను తెరకెక్కించాలన్న మణిరత్నం రెండు దశాబ్దాల కల ఈ సినిమా. నవల రెండు భాగాలతో మొదటి భాగం సినిమా వచ్చింది తెలుగు, తమిళ సినిమా అభిమానుల మధ్య ట్విట్టర్ లో మాటల యుద్ధమే నడిచింది. మన సమీక్షకులు కూడా సినిమాను ఏకేశారు. Elevation moments లేవని వీళ్ల ఫిర్యాదు. ఈ సినిమాను నవలకు అనుగుణంగా తీశాడు దర్శకుడు. పాత్రల చిత్రణలో గందరగోళమేమీలేదు. పాత్రధారుల నటనకు వంకపెట్టలేము. గ్రాఫిక్స్, రంగాలంకరణ topnotch గా చెప్పుకోవచ్చు. కాస్త రెహమాన్…
Read More

దైవం మనుష్య రూపేణా…!

దైవం మనుష్య రూపేణా...! అప్పుడు నాకు పదిహేనేళ్లు.. పదవతరగతి పూర్తి చేసేపనిలో ఉన్నాను. ఒకరోజు నేను నా స్నేహితుడు కలిసి దగ్గర్లోని టౌన్ కి సినిమాకు వెళ్లాలని అతికష్టం మీద ఇంట్లో ఒప్పించాం.. అందులో భాగంగా నా స్నేహితుడి అమ్మకు నేను ఒక మాటిచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ లారీ ఎక్కమని.. బస్సులోనే వెళతామని.. జాగ్రత్తగా వాడిని తీసుకువస్తానని.. అప్పుడుగానీ ఆ అమ్మ మనసు కుదుటపడలేదు. ఆ వయసులోనే నా వయసులో ఉన్న మరొకరికి నేను రక్షణనివ్వడం వెనుక నా ధైర్యం‌ ఏమిటో...? నాకప్పుడు తెలీదు. చేతిలో కాసిన్ని డబ్బులతో పట్నానికి బయలుదేరాం.. పట్నానికి వెళ్లి ఓ సినిమా చూశాం. అప్పటికే బాగా ఆకలి వేస్తుండటంతో ఓ హోటల్ కి వెళ్లాం. రెండు ఇడ్లీలు తిని బిల్లు ఇస్తే ఒక రూపాయిని హోటల్ లో వెనక్కి ఇచ్చారు. నేను ఆ రూపాయిని సర్వర్ కి టిప్పుగా ఇచ్చేశాను. ఆ సమయంలో నాలో ఒక…
Read More

విజయ దశమి

విజయ దశమి దుర్గా దేవి మహిషరురుడుని ఎలా అంతంచేసిందో అదే విధంగా మీ కుదృష్టి ని నాశనం చెయ్యండి మీ నిస్సహాయత ను ధ్వంసం చేయండి మీ దురాలోచనలను భస్మం చేయండి మీలోని నకారత్మకథను అంతం చేయండి ప్రేమా, స్నేహం, ఆత్మవిశ్వాసాన్ని పెంచి పంచి ఆనందంతో విజయ దశమి జరుపుకోండి. - అక్షిత
Read More

పడవ ప్రయాణం!

పడవ ప్రయాణం! మనసు దోచిన మనిషి దగ్గర మమత పెరిగి లోకాన్ని మరిస్తే చిరుగాలి పలకరించే సూరీడు తొంగి చూసే సరికి పరువపు ప్రణయంలో రెండు మనసుల చెలిమి చైతన్యపు వెలుగుల మధ్య పరుగు జీవితంలో కాసేపాగి ఒంటరిగా కాకుండా జంటగా ప్రకృతి అందాలనుచూస్తూ సాగుతున్న కాలాన్ని కాసేపు ఆపైనా సరే ఆశల సవ్వడి లో అనురాగపు జడిలోతడిసి దూరాలు తగ్గిన హృదయపు కొలనులో అందాల వంతెన వరకు సాగే పడవ ప్రయాణం! - జి జయ
Read More

నీ నవ్వు

నీ నవ్వు నీ నవ్వు నామదిని ఉత్సాహంగాఉండేలా చేస్తుంది నీనవ్వు నీఉనికినితెలియచేస్తుంది నీ నవ్వు ఉప్పెననుకూడాతుడిపేస్తుంది నీ నవ్వు కనులకు హాయినిస్తుంది నీ నవ్వు మనసుకు తృప్తి నిస్తుంది నీ నవ్వు ఆకాశమంతఆనందాన్నిస్తుంది నీ నవ్వు నా ముఖచిత్రమైవెలుగుతుంది నీ నవ్వు ప్రతిబింబమై చేరుతుంది నీ నవ్వు విప్పనిభావానికిసంకేతమవుతుంది నీ నవ్వు పలకబోయే మాటకు మంత్ర మవుతుంది నీ నవ్వు కనుల సంతకమై ముద్రిస్తుంది నీ నవ్వు ఏదైనా అదృష్టపు అంచులకు చేరవేస్తుంది కదూ! - జి జయ
Read More

మనస్విని

మనస్విని హృదయ లయలు వరాలయ్ పాలపుంతల్లో వెదజల్లే పూలలా దొర్లుకు పోతుంటే విజయ రాగాల సప్పుడొస్తదా.... నిశి రాత్రి లో మూగ వేదన ఎవరికి తెలుసు దూరంగా ఉన్నా......ప్రార్ధన తో దేవునికి దెగ్గర గా ఉందాం సాదన చేయాలి విజయాలు వరదలై ఎరుగా పారేలా... మానవత్వంనే మనసులో క్రొవత్తి గా వెలిగించి... విశ్వ శాంతి కొలనులో సేద తీర్చుకొని సూర్యోదయం సృష్టిద్దామా!!! PS: నా ప్రియ గురువు గారు శ్రీ సూర్యనారాయణ గారికి సమర్పిస్తూ.... - అల్లావుద్దీన్
Read More

నా నేరమేంటి.!

నా నేరమేంటి.! నలుగురు ఆడపిల్లల‌ మధ్య ఒక్కడే కొడుకుగా అల్లారు ముద్దుగా పెరగాల్సిన నా బాల్యం, పేదరికం‌ అంటే కూడా తెలియని అమాయకంలో పొరుగింటి గేటు బయట గడిచిపోయింది.. అందరిలా మంచి బట్టలెందుకు లేవో తెలీదు.. అమ్మ పెట్టిన పచ్చడి మెతుకులు, పెరుగు అన్నం తప్ప తిండిలో ఎన్ని రకాలుంటాయో తెలీదు.. నన్ను ఏ ఫంక్షన్ కి, చుట్టాలింటికి తీసుకెళ్లట్లేదంటే చార్జీలకు డబ్బులు లేకనీ తెలీదు.. తాతయ్యతో దోమల మధ్య రాత్రంతా పొలం‌లో పడుకుని, ఏడాదంతా రెండు జతల యూనిఫాం, ఒక జత సివిల్ డ్రస్ తోనే విద్యార్థి నాయకుడినై పదోతరగతి ఎందుకు ఫెయిలయ్యానో తెలీదు.. మూడు నెలలు కేవలం ఒక పూట పచ్చడి అన్నం మాత్రమే తిని, ట్యూషన్ ఫీజు కోసం పళ్లకొట్లో ప్యాకింగ్ చేసి ఎలా చదివి అదే పదోతరగతి పాసయ్యానో తెలీదు.. రానుపోను పదిహేను కిలోమీటర్లు, రాళ్ల దారిలో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, రోజులో ఉదయం కాలేజీ,…
Read More

ఫ్యూజన్.. కన్ఫ్యూజన్ – కథానిక

ఫ్యూజన్.. కన్ఫ్యూజన్ - కథానిక కొంతమంది తప్పులు చేసినా, మళ్లీ అదే తప్పు చేయరు. మరికొంతమంది చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఈ రెండింటికి ప్రతినిధుల్లా ఉంటారు ప్రసాద్, సీతారాముళ్ళు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఆ స్నేహం పెరిగి పెద్దదయి, ఇప్పుడు రిటైరయినా కొనసాగుతోంది. ఫిజికల్ టాస్క్ కు ప్రసాద్, టెక్నాలజీ టాస్క్ కు సీతారాముడు అన్న పేరు కాస్తో, కూస్తో ఇద్దరూ సంపాదించుకున్నారు. ప్రసాద్ కి ఎప్పుడవసరమయినా ట్రైన్ టికెట్ నుంచి ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సీతారాముడు చూసుకుంటే కందిపప్పు నుంచి కరక్కాయ వరకు మార్కెట్లో ఏవస్తువు ఎక్కడ చవగ్గా దొరుకుతుందో ప్రసాద్ చెప్పేస్తాడు.. విషయమేమిటంటే ప్రసాద్ కి ట్రైన్ జర్నీ టికెట్లు రానూపోను టికెట్లు కొంటూ ఉంటాడు. ప్రసాదే కొనుక్కోవచ్చు కదా అంటే కుదరంటారు ఇద్దరూను. ప్రస్తుతం ప్రసాద్ కొడుకు దగ్గర ఉండటం తో చెన్నై నుంచి మైసూరు కి వెళ్లి రావటానికి టికెట్లు…
Read More

నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు (పాబ్లో నెరూడా: స్పానిష్ కవి) నువ్వు పర్యటించకపోతే, నువ్వు చదవకపోతే, నువ్వు జీవిత ధ్వనులను వినకపోతే, నిన్ను నువ్వు అభిమానించకపోతే, నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు చంపుకున్నప్పుడు, సహాయం చేసే చెయ్యి అందుకోనప్పుడు, నువ్వు మెల్లగా మరణించడం మొదలు పెడతావు నీ అలవాట్లకు నువ్వు బానిస అయినప్పుడు, అదే దారిలో రోజూ నడుస్తున్నప్పుడు, నువ్వు అలవాటుగా చేసే పని మార్చనప్పుడు, నువ్వు వివిధ రంగులు ధరించనప్పుడు, లేదా అపరిచయస్తులతో మాట్లాడనప్పుడు, నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు ఆవేశాన్నీ, ఆవేశం సృష్టించే అల్లకల్లోల భావాల్నీ, నీ కళ్ళను చెమ్మగిల్లేలా, నీ గుండె వేగంగా కొట్టుకునేటట్లు చేసే సంఘటనలనూ, నువ్వు తప్పించుకు తిరుగుతున్నప్పుడు, నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు నీ భద్రతను వదలి అనిశ్చితిలోకి నువ్వు అడుగు పెట్టనప్పుడు, నువ్వు ఒక కల వెనుక పరిగెట్టనప్పుడు, జీవితంలో కనీసం ఒక్కసారి, నువ్వు పరిగెట్టనప్పుడు...…
Read More