Month: December 2022

ఎదురు చూపు

ఎదురు చూపు నిర్మల నిశీది వ్యాపించుసమయాన నిఖిల లోకమెల్ల నిద్రించు సమయాన మా గుడిసెల్లో మా శయణంలో మా స్వప్నంలో కొడుకు రాకకై ఒక పేద తల్లి ఎదురు చూపు చెమట పట్టిన శరీరంతో కందిన కండరాలతో ఇల్లు చేరే భర్త కై ఇల్లాలి ఎదురుచూపు శ్రమ చేసే శ్రామికుడు నెలమొదలుకై ఎదరు చూపు కూలి చేసే కార్మికుడు కష్ట ఫలానికై ఎదురు చూపు వయసు మళ్ళిన ముసలివాడు ఫించనికై ఎదురు చూపు బ్రతుకు మీద ఆశ చచ్చి చావుకోసం ఎదురు చూపు మా పనకలు పంచల నుండి మెత్తటి పరుపులకు చేరుతాయేమో అని మా కడుపు మంటకు చూసి మా కుండ మూడు పూటలా ఉడుకుతుందేమో అని ఎదురు చూపు మూడు పూట్ల కాకపోయినా రెండు పూట్ల నాలుగు వేళ్ళు నోట్లోకి పోకపోతాయా అని ఎదురు చూపు మా కారే పాకలు కప్పుకునేం దుకు మబ్బులకై ఆకాశానికి మా ఎదురు…
Read More

వ్యధ

వ్యధ కలగంటినే.... బడుగుజీవుల రాత మారెనని అనాధ బతుకులు చెదిరెనని రైతుల పాలిట ప్రభుత్వం దైవమని కార్మికుల శ్రమ వృథాకాదని స్త్రీమూర్తి కిర్తింప బడునని ఆలయమున దైవం కలదని నరపీడిత సమాజం నలిగేనని భువిపై స్వర్గం కొలువైనదని సంద్రమునైనా ఈదేదనని చీకట్లో వెలుగు నింపేనని తెగిన రెక్కలు కూర్చేదనని నింగినినైనా తాకేదనని కలమున సిరానై పారేదనని కవిత్వమున కవిత్రయమని కళలు వెలుగొందే నలువైపులని అజ్ఞానమనే అందకారం తోలిగేనని కరిగెనే కలలు కన్నీటి కార్చిచ్చుకు కలలు కంటినే కార్యము తలపెట్టక. - హనుమంత
Read More

గమ్యం

గమ్యం నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి. ఎత్తి చూపే వేళ్ళుంటాయి. వ్యంగంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో... నీ గమ్యం చేరలేవు. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు.   - సూర్యాక్షరాలు              
Read More

వెలుగు గీతం

వెలుగు గీతం నారింజ రంగు ఆకాశం నారాయణ మంత్రం జపిస్తున్నట్టుంది చీకటి స్వప్నాలను తరిమేద్దామని వెలుగు గీతాన్ని లిఖించేందుకు ఆకాశం శూన్యం అనంతమని పేర్లు తగిలిస్తాం ఆకాశం వేర్లు మాత్రం మనిషి మనసులో దాగుంటాయేమో ఉదయాస్తమయాలలో రంగులద్దుకుని హంగులను తగిలించుకున్నా తన తీరని ఆరాటం తెలియని తీరం వెతుకుతుంటుందేమో కుతకుతలాడే జనజీవనం విలవిలలాడే నిసర్గసంపద విషాదమోహనాన్నద్దుతుంటే బావురుమంటున్న భూమిని జాలిగా చూసే ఆకాశం మాత్రం 'జాలీ' గా ఉంటుందెప్పుడు - సి. యస్. రాంబాబు
Read More

కలగంటే సరిపోదు.!

కలగంటే సరిపోదు.! పచ్చని ప్రకృతి నడుమ చిరిగిన నిక్కరు మెడలో కండువా వేసుకుని పశువులను మేపుతున్న ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు.. ఒకరోజు పొలంలో ఆకాశం వైపు చూస్తూ పరిగెడుతున్నాడు.. గుట్టలు ఎక్కుతూ గట్లను దాటుతూ.. పడుతూ, లేస్తూ, ముందు ఏముందో చూడకుండా పరిగెట్టడానికి కారణం ఆ పిల్లాడికి నింగిలో శబ్దం చేస్తూ పక్షిలా దూసుకుపోతున్న ఓ విమానం... వాడికి ఎందుకో దానిని చూస్తే పట్టరాని ఆనందం. అది ఆకాశంలో మబ్బుల మాటున దాగి ముందుకు పోతుంటే సాధ్యమైనంత దూరం పరిగెడుతూ దాన్ని సాగనంపడం వాడికి ఓ సరదా... ఎప్పుడో ఒకసారి ఆకాశంలో అలా చిన్నగా కనిపించే విమానాన్ని చూడడం ఎంతో గొప్పగా భావిస్తుంటాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.. తండ్రి సంపాదనపైనే ఇంటిల్లపాది గడపాల్సిన పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆ పిల్లాడికి అంతకన్నా పెద్దపెద్ద ఆశలు ఏముంటాయిలే అనుకోవడం సహజం.... కానీ వాడలా అనుకోలేదు.…
Read More

సఖీ

సఖీ అతని యద పై ఎర్ర గులాబీగా అతని మోము పై చిరునవ్వులా యాతని యదలోతుల్లోని భావం లా అతని కళ్ళలోని కావ్య నాయికలా నండూరి యెంకిలా నవ జవ్వనిలా లతలా మారిన నవతలా, నవ రాగ మల్లికలా రతి నై కావ్య కన్యకనై, ముగ్ధ మనోహర రూపం లో కలిసి పోవాలని, కదలి పోవాలని, ఆత్మ లో ఆత్మలా నీడలో నీడనై, యదలో నీ గానమై, అణువణువు నిండాలని, జీవితమంతా పండాలని కలగంటినే సఖి... కానీ.... అపోహ అనుమానాలతో, అవమానించి అనుక్షణం మాటల తూటాలతో గుండెల్లో గాయాలెన్నో చేసి గునపాలతో గుచ్చీ గుచ్చీ, చేతలతో రక్కేసి, కట్టేసి గిల్లేసి, మర్లేసి, చిత్రవధ చేసేనే చెలీ, ఇక నా కలలన్నీ కల్లలాయేనే మరీ... - భవ్యచారు
Read More

కలగంటినోయి

కలగంటినోయి కలగంటినోయి నేను సమ సమాజ అభివృద్ధికై నిరంతరం శ్రమించాలని.. కలగంటినోయి నేను నిత్యం మన కోసం పాటుపడే రైతన్న కలల సాకారానికి సాయపడాలని.. కలగంటినోయి నేను మద్యపాన నిషేధానికి అందరి వంతు సాయం కావాలని.. కలగంటినోయి నేను.. మనుషుల్లో మానవత్వం మెరుగుకావాలని.. కలగంటి కలగంటినోయి నేను ఆడకూతుళ్ళ కన్నీటిని చూడని లోకాన్ని చూస్తానేమో అని.. కలగంటి కలగంటినోయి నేను ఆకలి చావులను మన దేశంలో అరికట్టాలని.. కలగంటి కలగంటినోయి నేను మనిషిగా మనసును పెట్టి.. అందరితో కలిసిపోవాలని.. - గాయత్రీభాస్కర్    
Read More

కలగంటి

కలగంటి నిను దరిచేర నిదురించితిని నయనజాక్ష.. నీ నయనంబు చూసి అశ్రుధారలాయే నారాయణా.. నీ చిద్విలాస రూపంబు చూడ కలగంటి... నీ రూపు నిలిచే మదిలోన కలత నిదురలో కలగంటి కమలనయన.. - సూర్యక్షరాలు
Read More

కలగంటి

కలగంటి అవును ఆమెతో ఆమె కలగనింది నిజమే ఆమెకు ఆమె మాత్రమే తెల్సు ఇపుడు నువ్వు తెల్సు తనలో నీతో బ్రతకడం తెల్సు కొన్ని చీకట్లు తనని చుట్టేసినప్పుడు నీలో వెలుగుని చూసిందేమో అది ఆమెకు సంతోషం.. కానీ కాలం కదా కరిగిపోతుంది కొవ్వొత్తిలా ఏ దారి కనిపించదు ఒక్కోసారి అడుగు అదుపు తప్పి ఎక్కడో చిక్కుకుపోతుంది అపుడు నిన్ను చూస్తే ఆమెకు వెలుగు కనిపించదు ఎందుకంటే ఎంత వెలుగైనా ఆరిపోతుంది కదా ఆమె కూడా అంతే చీకటిలో నడక అదే ఆమెకు తోడు కూడా ఇది కలలాంటి నిజం... - సీత
Read More

అనురాగ సంగమం

అనురాగ సంగమం నీ ఒక చిరునవ్వు తో రాని ఆనందం..! నలుగురు చిరునవ్వులు చిందిస్తే వచ్చే ఆనందమే..! మా అక్షర లిపి కుటుంబ సమూహ సమావేశ అనురాగ సంగమ ఆనంద హేళ...!! - సూర్యక్షరాలు
Read More