Trending Now

నిర్ణయం 

నిర్ణయం  కొత్త సంవత్సరం వస్తుంది అనగానే నేను అయితే చాలా నిర్ణయాలు తీసుకుంటాను. అవేంటంటే  బట్టలు ఎక్కువ కొనొద్దు అని, డబ్బులు ఖర్చు చేయొద్దు అని, బాగా నిద్ర పోవాలని, బాగా తినాలి అని, ఇలా చిన్న చిన్నవే . మీకు అనిపించవచ్చు ఇవేం నిర్ణయాలు అని వాటికి ఒక లెక్క ఉంది (చిన్నవే కాని అనుభవం లోకి వస్తే అవెంత పెద్దవో తెలుస్తుంది) చెప్తాను వినండి.. బట్టల విషయానికి వస్తే బయట షాప్ లో కాస్త మంచిగా అనిపించిన డ్రెస్ ఏదన్నా ఉంటే వెంటనే నా కాళ్ళు, కళ్ళు అటే వెళ్తాయి. అప్పు చేసైనా సరే దాన్ని కొంటాను. ఇది తెలిసి మా అమ్మ మొత్తుకుంటుంది. వద్దే వద్దే ఉన్నవి వేసుకోవే అని కానీ మనం వింటామా వినము కదా పోనీ  అలా కొన్న డ్రెస్ వేసుకుంటానా అంటే అది లేదు. ఒక్కసారి వేసుకుని పక్కన పెట్టెస్తా, అంతే మళ్లీ…
Read More

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు మన కవి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత శ్రీ గోరేటి వెంకన్న గారికి మన అక్షరలిపి తరపున హృదయ పూర్వక శుభాకాంక్షలు.. ఇలాంటి మరెన్నో బహుమతులు అందుకోవాలని మనస్పూర్తిగా   కోరుకుంటున్నాం.💐💐💐💐💐💐
Read More

నా లక్ష్యం

నా లక్ష్యం నేను ఏడ్చితే చూసే వాళ్లు ఉన్నారు. కానీ ఒక్కలు కూడా నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించలేదు.. అయిన నాకు బాధ లేదు ఎందుకంటే ఇతరులు మన బాధనీ చూసి ఆనందంగా ఉంటారు. మనం సంతోషంగా ఉంటే వాళ్లు తట్టుకోలేరు.. ఇప్పుడు అలాంటి వాళ్ల మధ్య బ్రతుకుతున్నాము. ఏ పనికైనా పట్టుదల ముఖ్యం. ఆ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అని నా అభిప్రాయం.మన సంకల్పం కోసం ఎప్పుడు పట్టుదలతో పోరాడాలి... -మాధవి కాళ్ల
Read More

ఈరోజు అంశం:-  కొత్త సంవత్సరం

ఈరోజు అంశం:-  కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, కొత్త బట్టలు కొనడం, కేక్ తేవడం, మందు, విందు గురించి ఆలోచించడం, లేదా కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కొత్తగా గడపడం లాంటివి ఉంటాయి. కొత్త సంవత్సరం అనగానే కొందరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మందు మానెయ్యాలి అని, సిగరెట్ మానేయాలి అని, కుటుంబంతో గడపాలి అని, ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అయితే అన్ని సార్లు ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండలేక పోవచ్చు. మందు మానేయాలి అనుకున్న రోజే ఆఫీస్ లో పార్టీ జరగొచ్చు. లేదా ఇంకేదో అవ్వచ్చు. అప్పుడు తాగకుండా ఉండలేరు. ఇక సిగరెట్ కూడా అంతే ఏవో ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. ఇంకా కుటుంబంతో గడపాలి అనుకున్నప్పుడు ఏదో టూర్ కి వెళ్లాల్సి వస్తోంది. ఇలా అనుకున్న వాటిని మనం కొత్త సంవత్సరంలో చేయలేక బాధ పడిపోతూ…
Read More

ఈరోజు అంశం:- పట్టుదల

ఈరోజు అంశం:- పట్టుదల ఏదైనా లక్ష్యం చేరాలి అనుకున్నప్పుడు పట్టుదల ఎంతో ముఖ్యం. పట్టుదల లేకుండా ఏమి సాధించలేము. ఏ వ్యక్తి కి అయినా జీవిత లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదల ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి పట్టుదల లేకుండా ఏ వ్యక్తి దేన్నీ సాధించ లేడు. చిన్నప్పుడు మొదటి రాంక్ సాధించడం, లేదా పట్టుదలతో సైకిల్ నేర్చుకోవడం, స్కూల్ లో పెట్టిన పోటీ లలో మొదటి బహుమతి తెచ్చుకోవడం లాంటివి కూడా పట్టుదల తో సాధించిన విజయాలు. మీ జీవితంలో అలాంటి పట్టుదల తో సాధించిన లక్ష్యం కానీ లేదా ఏ చిన్న సంగతి అయినా మాతో పంచుకోండి. "నా విజయం" అనే శీర్షిక ద్వారా మీ అభిప్రాయం తెలుపండి 
Read More

ఒంటరి వెన్నెల

ఒంటరి వెన్నెల వెన్నెల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీతో గడిపిన రోజులు చాలా విలువైనవి నా బాధ నీతో పంచుకున్నాను నా సంతోషం నీతో గడిపాను నాకు దూరంగా ఉన్న నా ప్రేమికుడు విషయాలు నీతో చెప్పుకున్న నా ప్రేమికుడు కోసం ఎదురు చూస్తున్న నా ఎదురు చూపు నీకు బాగా తెలుసు ఈ విషయం నా ప్రేమికుడికి నువ్వు చెబుతావు  కదా.. నా ప్రియమైన నా ఒంటరి జీవితానికి అండ  నువ్వే  వెన్నెల నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నీతో గడిపిన రోజులు చాలా విలువైనవి నా బాధ నీతో పంచుకున్నాను నా సంతోషం నీతో గడిపాను నాకు దూరంగా ఉన్న నా ప్రేమికుడు విషయాలు నీతో చెప్పుకున్న నా ప్రేమికుడు కోసం ఎదురు చూస్తున్న నా ఎదురు చూపు నీకు బాగా తెలుసు ఈ విషయం నా ప్రేమికుడికి నువ్వు  చెబుతావు  కదా.. నా ప్రియమైన నా…
Read More

వెన్నెలతో నా అనుభవాలు

వెన్నెలతో నా అనుభవాలు వెన్నెల తో పెద్దగా పరిచయం లేదు 😐 కానీ, వేసవి కాలంలో మాత్రం మా ఇంటి వసారా లో మా అమ్మగారు చాప వేసి, వంట పాత్రలన్నీ తెచ్చి, అందరికీ ఒకే దగ్గర కలిపి పెట్టేది. కొత్తగా పెట్టిన అవకాయలో కాచిన నెయ్యి కానీ లేదా కాచిన నూనె కానీ వేసి, కలిపి ముద్దలుగా ఒక్కొక్కరికి పెట్టేది. మేము అమ్మ పెట్టే ముద్దలను గబుక్కున మింగేసి, మళ్లీ చేతులు చాపే వాళ్ళం. ఆవకాయ అన్నం ఎంత తిన్నా తృప్తి ఉండేది కాదు. పైగా తినే కొద్ది తినాలనిపించేది. అందుకే అంటారేమో అమ్మ, ఆవకాయ ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఎంత తిన్నా తనివి తీరదు అని 😜 ఆ తర్వాత ఏదైనా కూర కానీ లేదా పప్పు చారు కానీ కలిపి పెట్టేది. అమ్మ పెడుతూనే ఉండేది. మేము తింటూనే ఉండేవాళ్ళం. పిల్లలం కాబట్టి మాకు మా కడుపు…
Read More

ఈరోజు అంశం:- వెన్నెల

ఈరోజు అంశం:- వెన్నెల వెన్నెల ఈ పదం వినగానే ఆకాశంలో విరగకాసే వెన్నెల, చుట్టూ చుక్కల నడుమ రేరాజులా వెలిగిపోతూ, చల్లని వెన్నెల ప్రసరించే నెలరాజు చూపులు తట్టుకోలేక కొంగు జార్చే పడతులు ఎందరో... వెన్నెలను చూపుతూ గోరు ముద్దలు తినిపించే తల్లులు, వెన్నెల్లో గోదావరి అందాలు, ఆ ఇసుకు తిన్నెల పై ఆడుకునే ఆటలు, చుక్కలను లెక్క బెడుతూ ఆరుబయట నులక మంచం పైన ఉన్న పిల్లలకు వెన్నెల గురించి కథలు చెప్పే తండ్రులు, అదే వెన్నెల్లో కూర్చుని పాత విషయాలను గుర్తు చేసుకునే అవ్వ తాతలు, ప్రియుడి రాక కోసం ఎదురు చూస్తూన్న ప్రేయసి విరహతాపాలు.... అబ్బో ఎన్నని చెప్పగలము, ఏమని వర్ణించగలము. వెన్నెలతో ఎన్నో అనుభవాలు, అనుభూతులు. అలాంటి వెన్నెల గురించి మీ అందమైన అనుభవాన్ని కవిత గానీ, కథ గా గానీ రాసి పంపండి. వెన్నెలతో నా అనుభవాలు అనే శీర్షిక ద్వారా మీ అభిప్రాయం…
Read More

గోత్రం అంటే ఏమిటి?

గోత్రం అంటే ఏమిటి? సైన్సు ప్రకారము మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. మీరు పూజలో కూర్చున్న ప్రతిసారీ, పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా? మీకు తెలీదు కాబట్టి అది చాదస్తం అనుకుంటున్నారు?? గోత్రం వెనుక ఉన్న శాస్త్రం మరేమిటో కాదు- *జీన్-మ్యాపింగ్* అని ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన అధునాతన శాస్త్రమే! గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ? మనకు ఈ వ్యవస్థ ఎందుకు ఉంది? వివాహాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా మనము ఎందుకు భావిస్తాము? కొడుకులకు ఈ గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది మరి కుమార్తెలు ఎందుకు రాదు? వివాహం తర్వాత కుమార్తె గోత్రం ఎలా / ఎందుకు మారాలి? తర్కం ఏమిటి? ఇది మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. మన గోత్ర వ్యవస్థ వెనుక జన్యుశాస్త్ర వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం! గోత్రమ్ అనే…
Read More

అనుభవం

అనుభవం ఈరోజు అక్షరలిపి వాళ్లు ఇచ్చిన అంశానికి నా కథ అనుభవం. అవి నేను కొత్తగా ఉద్యోగం లో చేరిన రోజులు. కొన్ని విషయాలను మర్చిపోవాలంటే ఇంకో పని వెతుక్కోవాలి అని పని వెతికాను. అప్పుడు నాకు పేపర్ లో ఉద్యోగం గురించి తెలిసి అప్లై చేశాను. వెంటనే రమ్మని అన్నారు. దాంతో వెళ్ళాను. ఆఫీస్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో పొద్దున్నే బస్ కి వెళ్ళాం మా నాన్నగారు కూడా తోడు గా వచ్చారు. మొదటి రోజు కాబట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళు పది రోజులు ట్రైనింగ్ ఉంటుంది అన్నారు. రోజూ రావాలని అది కూడా పది గంటల లోపు రావాలని అన్నారు. సరే అని చెప్పి తిరిగి వచ్చేశాము. ఇక తెల్లారి నుండి నా పాట్లు మొదలు అయ్యాయి. అయిదు గంటలకు లేచి వంట చేసుకుని, టిఫిన్ కట్టుకుని ఏడు గంటల వరకు బస్ స్టాండ్ లోకి వచ్చాను.…
Read More