aksharalipi poems

సువర్ణ భూమి

సువర్ణ భూమి అందమైన లోకం అందులో నువ్వొక అద్భుతం జనియించే జీవశక్తి నడయాడేను నవశక్తి ఉషోదయం కాంతులు సంద్యవెలుగు వెలుగు సవ్వడులు సిరివెన్నెల రాత్రులు సింగారపు సంపదలు వర్షించే మేఘాలు హర్షించే భూమాత కమ్మనైన ఫలాలు ఇంద్రధనుస్సు వర్ణాలు నడయాడే నదీ నదాలు పలకరించే పైరగాలులు ఆరగించు షడ్రుచులు ఆహా అనిపించు చూసుకో సువర్ణ భూమి ఆత్మానందం నీ కోసం ఇదేకదా అందమైన  లోకంలో నీ ప్రతిబింబం. - జి.జయ
Read More

అందమైన లోకం

అందమైన లోకం అంతరంగంలో మలుచుకున్న లోకమే అందం. అందం అనే భావన కలిగిన ఆలోచనే అందమైన లోకాన్ని సృష్టిస్తుంది, ఆనందమైన లోకంగా మార్చుకుంటుంది. లోకం అందంగా వుండటం కాదు, ఆలోచన అందంగా వుంచుకుంటే అందమైన లోకం కనిపిస్తుంది. ఆనందం,అందం సొంతమవుతుంది. - రాధిక.బి
Read More

అందమైన లోకం

అందమైన లోకం అందమైన లోకం... మమతల కోవెల... ఆనందాల వసంతం... ఆలోచనల సరిగమలు... మాటల కూనీరాగాలు... మౌనాల ధ్వని... కనులవిందుగా కుటుంబం... ఆప్యాయతల సందడి...   - గోగుల నారాయణ
Read More

విచ్చుకున్న ఊహలు

విచ్చుకున్న ఊహలు ఊహల్లో మనమే మరో లోకాన్ని సృష్టించి వుంటే వ్యయ ప్రయాలతో పనిలేకుండా అమ్మ పెట్టే వెన్న అయినా అద్భుతమైన అందాలైన చెడి పోని స్నేహం అయినా వెన్నెల రాత్రులు అయినా విరితోటలో పువులైన శిల్పి చెక్కిన శిల్పం అయినా విహరించే విహాంగాలైన దేదీప్య కాంతులైన నక్షత్రాల నవ్వులైనా అందని ఆకాశం అయినా వూహించని వుప్పెన అయినా నడిసంద్రపు బాటలు అయినా విధి కి అందని వింతలైన పులకరించే సరిగమలైన పుడమి తల్లి రోదన అయినా నిన్ను వరించే అదృష్టమైన అన్నీ విరబూసిన తీయనైన ఊహా లోకమే. - జి.జయ
Read More

మొగ్గని ప్రేమ

మొగ్గని ప్రేమ ఓ, మొగ్గా.......! మొగ్గ వు కదే నీవు ఆ వరకు నీ పంతం నెగ్గ! తగ్గ శీలమే నీది, ఔననుటకు నాకు సిగ్గా! బుగ్గ మాటున ఉంచితివి, పూరేకుల అందాలను విచ్చుకుంటివే చివరకు భానుడు నీకు తల ఒగ్గ. ఇప్పుడు రాజ్యాలేలే నమస్కారము నీవు నేర్పినదే నే ఆ సంస్కారము! మేము నడిమంత్రాన నేర్చినది....... నీకు అబ్బెను కదనే జన్మతః. నా చెలి వై రావే....... నీ లక్షణాలు లక్షల విలువే. నా దరికి చేర్చవే నీ వారసత్వాన్ని! నమస్కారము నీకు... నేను తగ్గను, ఒగ్గను అప్పటిదాకా. రాయి ని నేను, రవి ని కాను. -వాసు
Read More

ఊహాలు

ఊహాలు ఊహాలు విచ్చుకున్న వేళ మదిలో మెదిలిన ఒక ఊహ. ఊహా, ఊహేకాని, నిజం అనిపిస్తుంది. ఊహలో చూడటానికి ఏమిలేదు. ఎవరూలేరు. ఊహా చాలా బాగుంది. ఊహని తలిస్తే, మనసంతా ఆనందం. కళ్ళలో కోటిదీపాల కాంతి. ముసిముసి నవ్వులతో ఆధారాలు. విశాలమైన ఊహాలోకంలో, అనంతమైన అమూల్యమైన భావన, కంటికి కనిపించకుండా, శూన్యమంతా పరుచుకుంది. స్వచ్చమైన, స్వేచ్ఛ కలిగిన, ఆ భావనకు ఆకారం, అలంకారం, అశ అవసరం లేదని, ఒక ఊహలో చెప్పలేనంత అనుభూతి కలుగుతుందని అందమైన ఊహా, హృదయానికి చూపిస్తుంది. నా ఊహానందాన్ని మరిన్ని ముచ్చట్లతో పంచుకోవాలని వున్నా, మాటలు కరువయ్యాయి. - రాధికా.బడేటి
Read More

తిరుగుబాటు

తిరుగుబాటు ఓ...కాగితపు పులులారా...! మీరు వేస్తున్న వేషాలన్నీ...! మీరు చేస్తున్న మోసాలన్నీ...! సహిస్తాము కొన్నాళ్ళు...!? ఎందుకో తెలుసా...!!?? మాలా దగాపడిన.... అన్న తమ్ముళ్లను....  అక్కా చెల్లెల్లను.... కూడ కట్టుకొని మీ పై... తిరుగుబాటు చేసేందుకు...! - అంకుష్
Read More

సృష్టి

సృష్టి మధువులు చిందే మధుమాసం జలజల పారే జలపాతం పువ్వుల నిండిన మకరందం ముచ్చటగొలిపే నెమలందం మహోన్నతమౌ హిమశిఖరం భీతినిగొలిపే నడి సంద్రం హాయిని నింపే సుమగంధం అంతే తెలియని ఆకాశం పక్షులు, పశువులు, వన సంపదలు తరుణి, హరిణి, పగలు, రేయి ఊహకు చాలని అందాలెన్నో సృష్టించాడు ఆ దైవం - రవి.పీసపాటి
Read More

మా తప్పా?

మా తప్పా? స్త్రీత్వంమంతా నలుగుతుంది మగాళ్లనే మృగాలకిందా అరవిరిసిన పూలతో పోలుస్తారే మమ్ము ఇందుకేనా? స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుగుతున్నవేళ, మాబాల్యం, యవ్వనం మగాళ్ల కామకాటుకు బలి కావాల్సిందేనా! మత్తులో గమ్మత్తు అనుకునే కోడెకారు కుర్రాళ్ళు, వయస్సుతో నిమిత్తంలేదు, వావి వరుసలు అసలే లేవు ఆడది అయితే చాలు అని చూస్తూ ఉన్నరే. ఏమిటి మా ఖర్మ, ఖర్మభూమిలో పుట్టడమే మాతప్పా, - పోరండ్ల సుధాకర్
Read More

కావాలీ

కావాలీ మతోన్మాదమెంత మొరిగినా రవ్వంత బెదరని చూపులు కావాలీ లోకానికి నిషేధాజ్ఞలెంత నీల్గినా నిన్నుగా నిలబెట్టే నినాదమే కావాలీ జగానికి విద్వేషమెంత రెచ్చినా భిన్న సంస్కృతుల ప్రేమించే రాజ్యాంగమే కావాలీ దేశానికి - అమృతరాజ్
Read More