మనుషులమేనా
మనుషులమేనా ఆమె నడుస్తోంది పైన ఎర్రగా మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా పిల్లాడితో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఎటు వెళ్తున్నాను తెలియని స్థితిలో నడుస్తూ ఉంది రోడ్డుమీద. ఆమె భర్త మొన్ననే చనిపోయాడు ఉన్న అత్తగారు మాత్రం మా కొడుకే చనిపోయిన తర్వాత ఇక నీతో మాకు అవసరం లేదు అంటూ ఇంటి నుంచి గెంటి వేశారు. ఇప్పుడు ఆమెకు నిలువ నీడ లేకుండా పోయింది తను ఎక్కడికి వెళుతున్నాను తెలియని స్థితిలో పిల్లాడితో పాటు ముందుకు కదులుతోంది. మొన్నటి వరకు భర్త కొడుకుతో సంతోషంగా గడిపిన జీవితం కాకపోతే మొగుడు మందుకు బానిస అనుకోకుండా చనిపోయాడు అంతటితో ఆమె జీవితం అగాధంలోకి జారిపోయింది. తాగి చనిపోయిన వాడి భార్య అంటూ చుట్టుపక్కల వాళ్ళు భరించలేక అత్తగారి ఆశ్రయం కోరింది అయినా అత్తగారు మామగారు ఆమెను పట్టించుకోకుండా నా కొడుకును నువ్వే చంపేసావు అంటూ నింద వేసి మరీ వెళ్లగొట్టారు.…