bhavya charu

ప్రేమ

ప్రేమ నా హృదయంతరాలలో నీ పేరు చెక్కుకున్న నేను నీ మదిలో చోటు కోసం వేచి ఉన్న ప్రతి క్షణం నీ తలపుల లో బ్రతికే నేను నీకు ఎదురవ్వాలని పరితపిస్తున్నా నా కళ్లలో నిన్ను నింపుకున్న నేను నీ నవ్వు లో నేను ప్రతి క్షణం ఉండాలని కోరుకుంటున్నా నీ ప్రేమ దాసుడిగా మారాలని తపించి పోతున్నా నీ హృదయం లో చోటు కోసం ఎదురు చూస్తున్నా నీ జీవితం లో సగమవ్వాలని వేచి ఉన్నా నా ఈ చిన్ని కోరికను మన్నిస్తావా ప్రియతమా ... -భవ్య చారు
Read More

మధురం

మధురం నీ ప్రేమ మధురం నీ అధరం మధురం నీ పిలుపు మధురం నీ స్నేహం మధురం నీ కోపం మధురం నీ అలక మధురం నీ తో జీవితం మధురం నీ శ్వాస మధురం నీ ఆశ మధురం నీ లక్ష్యం మధురం నీ విరహం మధురం మధురమైన నీ ఊహా ఇంకెంతో మధురం... -భవ్య చారు
Read More

సాలెగూడు

సాలెగూడు ఎటు చూసినా సగం చినిగిన కవర్లు సగం చినిగిన బట్టలు, తిని పారేసిన కొనుక్కొచ్చిన టిఫిన్ కాగితాలు, వాడిన పువ్వులు, తాగి పారేసిన బీడీ సిగరెట్ పీకలు, ఖాళీ అయిన సీసాలు వాడి పారేసిన కండోమ్ కవర్లు, విస్పర్ ప్యాడ్స్ వేసుకుని ఉసిన గుట్కా ప్యాకెట్లు ఓ వైపు ఆకలితో ఏడ్చే పిల్లలు ఓ వైపు సగం ఆకలి తీరక విటుడి కోసం చూపులు ఓ వైపు రక్తం కారుతున్నా దెబ్బలు తింటూ పాలిచ్చే తల్లులు ఓ వైపు , ఈ గిరాకీ పోతే మళ్ళీ గిరాకీ రాదేమో అన్న తొందర ఓ వైపు , తన గిరాకీ నీ లాకున్నావన్న అరుపులు ఓ వైపు , కనిపించని తల్లి కోసం ఎదురు చూపులు ఓ వైపు మల్లెలు వాడకుండానే నలిపేసి వ్యంగపు వ్యక్తులు ఓ వైపు అలసిన శరీరానికి విశ్రాంతి కూడా ఇవ్వలేని అశక్తత ఓ వైపు, మురికి…
Read More

స్నేహం లో

స్నేహం లో నాకు స్నేహితులకన్నా ఎక్కువ ఏ భాద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది మా అమ్మ, అమ్మ కంటే స్నేహితులు ఎక్కువ కాదు, స్నేహితులు ఉన్నా కూడా, మన చిన్నప్పటి నుండి ప్రతి చిన్న విషయాన్ని మా అమ్మతో పంచుకుంటాము.... కొంచం వయసు రాగానే స్నేహితులు దొరుకుతారు. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్నేహితులు దూరం అవుతారు. అప్పుడు తెలుస్తుంది మనకి ఎవరు మంచి స్నేహితులో, దాంతో మనం మన తల్లికి మన సమస్య ని చెప్పుకుంటాం... చిన్నప్పటి నుండి మనకి ఏమి కావాలన్న మన అమ్మతోనే చెప్పుకుంటాం, అమ్మ నాన్నకి చెప్పి, మనకి కావాల్సినవి అందేలా చేస్తుంది. నాన్నతో అంతగా ఫ్రీగా ఉండలేని మనం అమ్మా చాటుగా స్నేహితులతో షికార్లు చేయడానికో, సినిమాకు వెళ్తే నాన్న మనల్ని తిడితే మనన్ని తిట్టకుండా, వాడు/అది చదువుకోవడానికి వెళ్ళింది అని అబద్ధం చెప్పి, మరీ మనల్ని…
Read More

పండగ సిత్రాలు

పండగ సిత్రాలు ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, అమ్మాయిలు పండగ బాగా జరుపుకున్నారు కదా, అంటూ సమూహం లో అడుగుపెట్టాను వారం తర్వాత, కానీ ఎవరి ఉలుకు పలుకు లేదు. దాంతో చిరాకు వచ్చి బాగా కక్క ముక్కలు తిని,  అరగకుండా హాయిగా పడుకున్నారా, అంటూ ఇంకో సందేశం పెట్టాను. దాంతో చిర్రెత్తిన ఒక తుంటరి అబ్బో మీ ఆడవాళ్లు అలంకరణకే సగం సమయం కేటాయిస్తారు. మీకే పండుగలన్నీ, మేమేం తినలేదు అంటూ వచ్చాడు. ఆడవాళ్ళు ,అలంకరణ అనగానే నాకు చిర్రెత్తు కొచ్చింది. ఎందుకంటే అసలు అలంకరణ ఎక్కడ చేసుకుంటాం,  పండగ అంటే పనులతో సరిపోతుంది. ఇంకా ఆ తుంటరి అలా అనగానే నాకు కోపం ముంచుకు వచ్చింది. దాంతో నాయనా అసలు నీకు మేము చేసే పనులు తెలుసునా అంటూ అడిగాను. దానికా అల్లరి వాడు ఏముంది కాస్త ఉడకేసి, అలంకరణ చేసుకుంటూ కూర్చుంటారు. అంతేగా అన్నాడు. దానితో నాకు అర్దం అయింది. వీడు…
Read More

ఎగురుతుంది ఎగురుతుంది

ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది మువ్వెన్నెల జెండా దాస్య శృంఖలాలు తెంచుకున్న విహంగ జెండా ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమీ జెండా తెల్లదొరల దోపిడిని అరికట్టే మువ్వన్నెల జెండా ఎగురుతుంది ఎగురుతుంది స్వేచ్ఛా స్వాతంత్రాల జెండా... -భవ్య చారు
Read More

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం ఏం రా ఏడికి బోతున్నవ్ అంటూ అడిగాడు శీనయ్య రాజు ను, కాక బాయి కాడికి పోయేస్త అన్నాడు రాజు. గిప్పుడు బాయి కాడికి ఎందుకు రా అన్నాడు శీనయ్య. గాదె నే అడ్లు అడనే ఉన్నాయి మిల్లు కు తోల్క పోలే ఆయన్ని కల్లం కాడ నే ఉన్నాయి. ఈ దాపా దొంగలు మోపయ్యిర్రి అడ్లు ఎత్తుక పొనికి గందుకే అడ్నే కావలి ఉండని కి వోతున్న అన్నాడు రాజు. అరే అవును తమ్మి నా పొలం లో సూత అడ్లు పడి ఉన్నాయి. నువ్వు జర సస్కుంట ఉండు నేను బువ్వ తిని అస్త, అవు నువ్వు బువ్వ తిన్నావా లేవా అడిగాడు శీనయ్య. తినలేదు అన్నా, తినే అవసరం లేదు ఇగ అన్నాడు రాజు. అరే గట్ల అంటావ్ ఎంది అన్నాడు శీనయ్య. ఏంలేదన్న కడుపుల అంతా యెట్లనో ఉన్నదే అందుకే గట్ల అంటున్నా…
Read More

కుక్క బతుకు పార్ట్ 4

కుక్క బతుకు పార్ట్  4 పొద్దున ఒక మటన్ ముక్క దొరికింది కాబట్టి ఎలాగో ఇప్పటి వరకూ ఉండగలిగాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో పన్నెండు దాటీ ఉంటుందా.. హా ఉండే ఉంటుంది లేకపోతే నా కడుపులో గొకదు కదా.. మళ్ళీ ఎక్కడ వెతుక్కోవాలో ఏమో కనీసం సగం కడుపైనా నిండుతుందో లేదో తెలియదు. ఏ మహానుభావుడూ ఇంత దయ చూపించక పోతాడా, కనీసం ఒక ముద్ద అయినా వేయకపోతాడా, ఇంతగా ఎదురు చూస్తున్నా, ఒక్కరూ కూడా వేయకుండా పోతారా ఆ మాత్రం జాలి దయ అనేవి మనుషుల్లో కరువై పోయాయా... అబ్బా ఇంకెంత దూరం నడవాలి.. అయ్యో ఆకలితో పేగులు లుంగ చుట్టుకు పోతున్నాయి. అరే అక్కడేదో బండి కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అయినా కాస్త ముద్ద పెట్టక పోతారా, వెళ్లి చూద్దాం, అయ్యో అప్పుడే సర్ధేస్తున్నాడు. వెళ్ళి అడుగుతా.. హమ్మయ్య వేస్తున్నాడు. అయ్యో చాలా ప్లేట్ లలో టిఫిన్స్…
Read More

కుక్క బతుకు పార్ట్ 3

కుక్క బతుకు పార్ట్ 3 తూ నా బతుకు, ఎన్నాళ్ళు ఇలా బతకాలి నాకు చావు అయినా రాదే, అది వచ్చినా బాగుండు , అందరిలో అయ్యో అనే జాలి అయినా ఉండేది. నాలుగు రోజులు నా గురించి మాట్లాడుకునే వారు. ఆ విధంగా అయినా అందరి నోట్లో నానే దాన్ని. ఎంత సేపూ యీ మురికి గుంటల మధ్య బతుకు ఈడుస్తూ, ఈ కంపులో ఉంటూ ఇక్కడ దొరికే నాలుగు మెతుకులు తింటూ అర్ధాకలి తో బతికే ఈ బతుకు ఒక బతుకెనా, నా ఖర్మ కొద్ది ఇక్కడ పుట్టాను. కనీసం మంచి స్థితిలో ఉన్న వారింట్లో పుట్టినా బాగుండేది. అక్కడ ఎంతో కొంత మంచి తిండి అయినా దొరికేది. ఇలా అర్ధాకలితో ఉండే స్థితి రాక పోయేది. హా అమ్మా, అబ్బా ఆకలి చంపుతుంది. అదిగో మటన్ ముక్క అబ్బా ఇది అయినా దొరికింది. నాకు ఈ మాత్రం…
Read More

ఒక చీకటి రాత్రి పార్ట్ 6

ఒక చీకటి రాత్రి పార్ట్ 6 అనుకున్నట్టుగానే తెల్లారి బాలయ్య అతని భార్య లక్ష్మి బావమరిది వెంకటేశంతో కలిసి అమరేంద్ర తల్లిదండ్రులు కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అయితే అనుకున్నట్టుగా అమరేంద్ర తల్లిదండ్రులు వాళ్లని ఆహ్వానించలేదు. అమరేంద్ర ఇంటికి వెళ్లి తలుపు తట్టారు ముగ్గురు. తలుపు తీసిన అమరేంద్ర తండ్రి చలపతి ఎవరు మీరు అని ప్రశ్నార్ధకంగా అడిగాడు. అయ్యా నా పేరు బాలయ్య ఈ ఊర్లో కిరాణాకొట్టు నడుపుతున్నాను. ఊర్లో అతిపెద్ద కొట్టు మాదే. మీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అంటూ అడిగాడు. కిరాణా కొట్టు వాడికి మాతో ఏం పని ఎందుకు మమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నావు అన్నాడు గంభీరంగా చలపతి. మీతో కొంచం మాట్లాడాలి అందుకే కలవాలని అనుకుంటున్నాను అన్నాడు బాలయ్య. నాతో మీకేం పని అని అడిగాడు చలపతి. అతని మాటలు బాలయ్యకు అంతగా నచ్చలేదు. అయినా కూతురు కోరుకుంది కాబట్టి మాట్లాడక తప్పదు అనుకుంటూ.…
Read More