kota

పాపం పసివాడు

పాపం పసివాడు ఆ.వె 1) అందరాని మిద్దె లాకాశ హర్మ్యాలు     ధనిక వర్గమునకు తగిన డాబు     ఆకలి కడుపులకు అన్నము లేకున్న     పెద్ద మేడ నీడ పేదలిండ్లు ఆ.వె 2) బాలకార్మికులకు బాధ్యత పెరిగెను      చట్టమేది దారి చూపదాయె      చెమట కార్చుపనికి చేదు ఫలితమిచ్చె      బాల బతుకు లెంత భారమాయె ఆ.వె 3) కోటి విద్యలన్నికూటికోసమెనని      మట్టి తట్ట చిట్టి పట్టి తెలిపె      ఉడుత సాయమల్లె ఊతమై పసివాడు      అక్కతోడు నిలిచె అన్నమునకు - కోట
Read More

ఉగాది ఊసులు

ఉగాది ఊసులు 1 ఆ.వె ఉప్పు.తీపి.కారముపకారమును చేయు   చేదు.వగరు.పులుపు చేయు మేలు   ఏవి యెక్కువైన ఇక్కట్లు వచ్చును   మితము ఎప్పుడైన హితము గూర్చు 2 తే.గీ. కలిమి లేములు సంతోష కష్టసుఖము    లన్ని అడ్డంకుల మనిషి అధిగమించి    నీరస పడిపోకుండ యెదురు నిలువ వలెను    పారిపోకుండ నిలబడు ఫలితమిచ్చు 3 తే.గీ. పుట్టి నప్పటి నుండియు గిట్టువరకు    నరుని జీవిత మంతయు నాటకమ్ము    కష్ట సుఖములే గాకయు కలిమి లేము    లన్ని కలబోసి వచ్చును అందరకును - కోట
Read More

నాలో నేను

నాలో నేను 1) వృద్ధ గురువులంత ఒకచోట చేరగా     పాత జ్ఞాపకాలు పరిమళించె     అయ్యవారలంత ఆయురారోగ్యాల     సాగవలయు శాంతి సౌఖ్యములతొ 2) ఉగ్రవాదమింత ఉగ్రరూపము దాల్చి      బడుగు వర్గములను బలిని గోరె      బడుగుజీవులనిల బాంబు పేలుళ్లతో      ప్రాణములనుదీయ పాడియగునె 3) పండుగ దినమందు పస్తులుండాలేక      కూలిడబ్బుతోటి కొట్టుకెళ్ళి      ఉప్పు.పప్పునుకొని ఉల్లిపాయడిగితే      ఆకసమునకేగి హాస్య మాడె 4) చెప్పు మాట యొకటి చేసేది వేరగు      నాయకులను నమ్మి నాశ మవకు      గొర్రెమంద రీతి గోతిలపడబోకు      ఎసరు వచ్చినంక ఏడ్చుటేల? - కోట
Read More

ఎదురు చూపులు

ఎదురు చూపులు 1)ఉన్నత చదువులకు ఉద్యోగమొచ్చునని బాధలు పడి చదివి భంగపడిరి ఏడువత్సరాలు ఎదురు చూపులెగాని కోర్కె తీరదాయె కొలువు రాక 2) చూపు కన్న ఎదురు చూపులు కష్టమౌ బంధు జనమును కన భారమగును ఎదురు చూపులంటె ఎంత చిత్రమొగద ఆశ భంగమగును అప్పు డపుడు 3)ఎండకాలమాయె ఏ సీ లు లేవాయె ఉక్కపోత పెరిగి చొక్క తడిసె చల్లగాలి లేక వల్లగాదని యెంచి విసన కర్ర చేత విసురుటాయె - కోట
Read More

మన్యం వీరులు – అల్లూరి, కొమరం

మన్యం వీరులు - అల్లూరి, కొమరం 1)మన్యవీరులందు మాతృదేశముపైన పరులపాలనింక పారనీక పెత్తనమును పూర్తి పెరికి వేయగ బూని అమ్ము చేతబట్టి అమరుడయ్యె 2)కొదమ సింగమాయె కొమరం భీముడు మన్య జనుల హక్కు మరచిపోక పోడు భూమి కొరకు పోరాటములు చేయ కొమర భీము జిల్ల కోర్కె దీర్చె - కోట
Read More

అజ్ఞాతం

అజ్ఞాతం అడవులందు గడిపిరగ్నాత వాసులై విరటు గొల్చిమారు వేశములతొ గొప్ప చెప్పుకోక గోప్యము గుండుట పాండు నందనులకు పాడియయ్యె - కోట
Read More

చెరువు -కల్పతరువు

చెరువు -కల్పతరువు మా ఊరి చెరువు -తలతల మెరయు మా బ్రతుకు తెరువు -ఈ కల్పతరువు మా చెరువు. నిండితే... సాగు భూములకు -తాగు జీవులకు జలచరాలకు -జగతి ప్రాణులకు పాడి పంటలకు -పళ్ళతోటలకు మత్స్యకారులకు -మనశ్శాంతికి ఆటపాటలకు -ఆహ్లాదానికి విహారయాత్రకు -విందులందుటకు పొద్దు పొడుపులకు-పొద్దువిడుపులకు ప్రగతి రథాలకు -పరిశ్రమలకు పంచభూతముల-ప్రపంచ శాంతికి కష్ట జీవులకు -కళ్యాణాలకు లోకంవిడిచిన -సమస్తజీవికి మా ఊరి చెరువు -మా కల్పతరువు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా - కోట
Read More

సంసార రథం

సంసార రథం శకట చక్ర కరణి సాగాలి ముందుకు పడ్డ శ్రమను సమము పంచుకుంటు భార్య వలన భర్త, భర్త వలన భార్య ఇరువురు సుఖపడుదు రిహము లోన - కోట
Read More

విశ్రాంతి ఎప్పుడంటే…

విశ్రాంతి ఎప్పుడంటే... 1) కన్న సంతు కొరకు కష్టించు తల్లికి     నిమిషమైన కాలు నిలువదెచట     భర్త సహకరించి పనికి తోడుగనుంటె     భార్య హాయిగుండు భర్త వలన 2) ఎడ్డెమంటె తెడ్డె మేజంట యుండునో     కొట్టుకొనుటకేమి కొదువరాదు     సర్దుబాటు లేని సంసార నౌకను     ముందుకెట్లు నడుపు మునుగకుండ 3) విభుడు సహకరిస్తె విశ్రాంతి దొరుకును      లేనిచో దొరకున లేశమైన      లేమ చేసుకున్న లేశ పుణ్యంబుకు      అంతులేని సుఖము ననుభవించు - కోట
Read More