ఒంటరిగా మిగిలిపోయావు
ముళ్ల కంచెల మధ్యన ఇరుక్కొని
వాటి నుండి బయటికి ఎలా వెళ్లాలో అర్థం కాక
చుట్టూ చూస్తున్న ఎవరు కనిపించకపోతే
ఎలా రావాలి ఎలా నా గూడుకి చేరుకోవాలి
మదన పడుతున్న తరుణంలో
దూరంగా ఉన్నా ఒక చెట్టు మీద ఉన్న నా గూడు కనిపించకపోవడంతో
ఇలా ఒంటరిగా మిగిలిపోయాను…
మళ్లీ మరొక చెట్టు కోసం వెతకడానికి ప్రయత్నించగా
ఎక్కడా చెట్లు కనిపించకపోయేసరికి
నా గూడుని ఎక్కడ కట్టుకోవాలో తెలియక
ఇలా చలిలో ఒంటరిగా మిగిలిపోయాను..
ఓ పిట్ట నీ గూడు ఎక్కడ కనిపించదు
ఏ చెట్టుకి నీ గూడు కట్టుకున్నావో
ఆ చెట్టును కనిపించకుండా చేశారు ఈ మనుషులు..
ఈ ముళ్ల కంచెలో ఒంటరిగా మిగిలిపోయావు
మాధవి కాళ్ల