కలలు కన్న ప్రపంచం
ఈ ప్రపంచంలో..
నీకు నేను నాకు నువ్వు..
అనుకున్నారు …
ఆ చందమామ సాక్షిగా!
బాసలు చేసుకున్నారు..
ఒట్లు వేసుకున్నారు..
కబుర్లు చెప్పుకున్నారు!!
అవేమెా కలలే అని నిరూపించారు..
ఇరు వర్గాల పెద్దలు..
కలలు కలలుగానే మిగిలి పోయాయి…
జీవితాలు వేరైపోయాయి..
కలలు కన్న ప్రపంచం మాత్రం..
అలాగే ఉంది!!
ఉమాదేవి ఎర్రం