జంటగా పయనిద్దాం
జీవితమనే పడవ ప్రయాణంలో
జంటగానే మనం పయనిద్దాం.
అలలు తాకిడికి పడవ కదిలితే
భయపడకుండా కూర్చుందాం.
పౌర్ణమి రోజున చందమామని
పలకరించేందుకు పోయొద్దాం.
వెన్నెల కురిపిస్తున్న చంద్రుడి
వెండి వెలుగులో విహరిద్దాం.
అందమైన ప్రేమ ప్రయాణంలో జంటగానే మనం విహరిద్దాం.
చుక్కలని మనం చూసొద్దాం.
ఆ తేనె విందును పొందేద్దాం.
వెంకట భానుప్రసాద్ చలసాని.