తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి

పల్లవి
గోవింద నామము చేయవే మనసా
అదియే ముక్తికి సోపానముగా
శ్రీనివాసుడే మార్గము చూపును
ఆ చిరునవ్వే చాలును మనకు

చరణం
దేవతలంతా కొలువైనారు
కొండలరాయుని దర్శించేందుకు
తిరుమల కొండను చూసెదమండి
భువిలో వెలసిన స్వర్గము అదియే

చరణం
ఇలవైకుంఠము చేరెదమండీ
గోవింద స్మరణే చేసెదమండీ
ఆకలిదప్పులు ఉండవు తథ్యము
గోవిందునికే అది సాధ్యముగా

చరణం
స్వామి సేవలో సర్వము మరచి
తరియించుటయే భాగ్యములెండీ
బాధలు తీరే క్షణముల కోసం
గోవింద నామము పలికెదమండీ

చరణం
కలలోనైనా కనిపించవుగా
కలతలు నలతలు తీరును స్వామి
మా జీవిత భారము నీదేనయ్యా
మావెంట ఉండి కాపాడవయా

సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *